విడాకుల కోసం లాయర్ను కలసిన నటి | Malaika Arora Khan meets divorce lawyer, wants custody of son | Sakshi
Sakshi News home page

విడాకుల కోసం లాయర్ను కలసిన నటి

Mar 23 2016 5:18 PM | Updated on Apr 3 2019 6:23 PM

విడాకుల కోసం లాయర్ను కలసిన నటి - Sakshi

విడాకుల కోసం లాయర్ను కలసిన నటి

బాలీవుడ్ జంట అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా ఖాన్ల 17 ఏళ్ల వివాహ బంధం ముగింపు దశకు వచ్చింది.?

బాలీవుడ్ జంట అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా ఖాన్ల 17 ఏళ్ల వివాహ బంధం ముగింపు దశకు వచ్చింది.? అర్బాజ్తో విడాకులు తీసుకోవాలని మలైకా నిర్ణయించినట్టు సమాచారం. విడాకుల కోసం మలైకా ఇటీవల లాయర్ వందన్ షాను సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి.

అర్బాజ్, మలైకా విడిపోనున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. దీంతో అర్బాజ్ సోదరుడు, బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ జోక్యం చేసుకుని మలైకాకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు. ఇటీవల ఓ ఫంక్షన్లో అర్బాజ్, మలైకా కనిపించడంతో ఈ జంట రాజీపడ్డారని బాలీవుడ్ వర్గాలు భావించాయి. అయితే సల్మాన్ రాజీ ప్రయత్నాలు ఫలించలేదని, అర్బాజ్తో కలసి జీవించేందుకు మలైకా సుముఖంగా లేదని తెలుస్తోంది. అర్బాజ్తో వేరుగా ఉంటున్న మలైకా.. తన కొడుకు అర్హాన్ (14)ను తన వద్దకు పంపాలని కోరుతోంది. వివాహ బంధం తనకు ఆర్థిక స్థిరత్వం ఇవ్వలేదని, అర్బాజ్ కుటుంబం తాను గృహిణిగా ఉండాలని భావిస్తోందని, ఇది తనకు ఇష్టంలేదని మలైకా చెప్పినట్టు ఓ వెబ్సైట్ పేర్కొంది. మలైకా ఇంకా విడాకులకు దరఖాస్తు చేయకున్నా, ఏ రోజైనా నోటీసులు పంపే అవకాశముందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement