'అవును మేమిద్దరూ విడిపోతున్నాం' | Arbaaz Khan – Malaika Arora Khan confirm their split | Sakshi
Sakshi News home page

'అవును మేమిద్దరూ విడిపోతున్నాం'

Published Mon, Mar 28 2016 3:29 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'అవును మేమిద్దరూ విడిపోతున్నాం' - Sakshi

'అవును మేమిద్దరూ విడిపోతున్నాం'

బాలీవుడ్ జంట అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా ఖాన్ల 17 ఏళ్ల వివాహ బంధం ముగిసింది. విడిపోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. 'అవును, మేమిద్దరమూ విడిపోతున్నాం' అంటూ మలైకా, అర్బాజ్ సంయుక్త ప్రకటనలో వెల్లడించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

అర్బాజ్, మలైకా విడిపోనున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అర్బాజ్ సోదరుడు, బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ జోక్యం చేసుకుని మలైకాకు నచ్చజెప్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అర్బాజ్తో విడిపోవాలని నిర్ణయించుకుంది. విడాకుల కోసం మలైకా ఇటీవల లాయర్ వందన్ షాను సంప్రదించింది. అర్బాజ్తో వేరుగా ఉంటున్న మలైకా.. తన కొడుకు అర్హాన్ (14)ను తన వద్దకు పంపాలని కోరింది.

మలైకా, అర్బాజ్ విడిపోవడానికి పలు కారణాలున్నట్టు సమాచారం. మలైకా లైఫ్ స్టయిల్ ఖాన్ ఫ్యామిలీకి నచ్చలేదని, ఓ బిజినెస్మన్తో ఆమెకు ఎఫైర్ ఉందని పుకార్లు షికార్లు చేశాయి. అయితే వీటిని మలైకా, అర్బాజ్ తోసిపుచ్చారు. తమపై వచ్చే రూమర్లను నమ్మవద్దని విన్నవించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement