'ఆమెతో కలిసి రియాల్టీ షో చేస్తున్నా' | Arbaaz Khan excited to host TV show with Malaika | Sakshi
Sakshi News home page

'ఆమెతో కలిసి రియాల్టీ షో చేస్తున్నా'

Published Thu, Oct 1 2015 7:22 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'ఆమెతో కలిసి రియాల్టీ షో చేస్తున్నా' - Sakshi

'ఆమెతో కలిసి రియాల్టీ షో చేస్తున్నా'

ముంబయి : భార్య మలైకా అరోరా ఖాన్తో కలిసి ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు బాలీవుడ్ నటుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్ తెలిపారు. 'పవర్ కపుల్' అనే రియాల్టీ షోలో మలైకాతో కలిసి పాల్గొనుండటంతో తాను చాలా సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. తాను నిర్వహించనున్న ఈ షో షూటింగ్ త్వరలోనే ప్రారంభిస్తామనన్న అర్బాజ్ తెలిపాడు. ఐటమ్ సాంగ్స్తో కుర్రకారును హుషారెత్తించే మలైకా టాలీవుడ్ మూవీ 'గబ్బర్ సింగ్'లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన స్టెప్పులేసిన విషయం విదితమే.

సోనీ ఎంటర్టైన్మెంట్ టీవీ వారు ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారు. ఇజ్రాయెల్లో చేసిన కార్యక్రమానికి ఇది భారతీయ వర్షన్ అని అదే పేరుతోనే షో చేస్తున్నట్లు అర్బాజ్ చెప్పుకొచ్చాడు. భార్యాభర్తలు ఏ మేరకు ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు.. ఒకరి గురించి మరొకరికి ఏమేరకు తెలుసు అనే విషయంపై ఈ షో ఉంటుంది. పది జంటలు ఈ షోలో పాల్గొంటాయని, ఈ మేరకు కొన్ని లవ్లీ కపూల్స్ ను తాను కలుసుకున్నట్లు తెలిపాడు. భార్య మలైకాతో కలిసి ఈవెంట్ చేయనుండటం తనను చాలా థ్రిల్లింగ్ అవుతున్నట్లు అర్బాజ్ అంటున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement