Reality TV Show
-
'ఆమెతో కలిసి రియాల్టీ షో చేస్తున్నా'
ముంబయి : భార్య మలైకా అరోరా ఖాన్‌తో కలిసి ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు బాలీవుడ్ నటుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్ తెలిపారు. 'పవర్ కపుల్' అనే రియాల్టీ షోలో మలైకాతో కలిసి పాల్గొనుండటంతో తాను చాలా సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. తాను నిర్వహించనున్న ఈ షో షూటింగ్ త్వరలోనే ప్రారంభిస్తామనన్న అర్బాజ్ తెలిపాడు. ఐటమ్ సాంగ్స్‌తో కుర్రకారును హుషారెత్తించే మలైకా టాలీవుడ్ మూవీ 'గబ్బర్ సింగ్'లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన స్టెప్పులేసిన విషయం విదితమే. సోనీ ఎంటర్టైన్మెంట్ టీవీ వారు ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారు. ఇజ్రాయెల్‌లో చేసిన కార్యక్రమానికి ఇది భారతీయ వర్షన్ అని అదే పేరుతోనే షో చేస్తున్నట్లు అర్బాజ్ చెప్పుకొచ్చాడు. భార్యాభర్తలు ఏ మేరకు ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు.. ఒకరి గురించి మరొకరికి ఏమేరకు తెలుసు అనే విషయంపై ఈ షో ఉంటుంది. పది జంటలు ఈ షోలో పాల్గొంటాయని, ఈ మేరకు కొన్ని లవ్లీ కపూల్స్ ను తాను కలుసుకున్నట్లు తెలిపాడు. భార్య మలైకాతో కలిసి ఈవెంట్ చేయనుండటం తనను చాలా థ్రిల్లింగ్ అవుతున్నట్లు అర్బాజ్ అంటున్నాడు. -
స్త్రీగా మారిన పురుషుడి అంతరంగ వేదన
ప్రపంచంలోని అత్యుత్తమ అథ్లెట్లలో ఒకడిగా పేరు తెచ్చుకొని, ఆనక సినిమాల్లో, అటుపైన రియాలిటీ టీవీ షోలలో ప్రసిద్ధ తార అయిన అమెరికన్ - బ్రూస్ జెన్నర్. ఇన్నాళ్ళూ పురుషుడిగా జీవిస్తున్నప్పటికీ తన అంతరాంతరాళాల్లో స్త్రీత్వ భావనే గూడుకట్టుకొని ఉందని ఆ మధ్య ప్రకటించి, సంచలనం రేపారు బ్రూస్. ఇప్పుడు తన ఈ లైంగిక పరిణామ క్రమాన్ని ఎనిమిది భాగాల రియాలిటీ షోగా అందిస్తున్నారాయన. ఈ టీవీ సిరీస్‌లో బ్రూస్ తన చిన్నప్పటి మనోభావాల మొదలు, పెళ్ళయి, పిల్లలు కూడా పుట్టాక తన లైంగిక పరిణామ క్రమం వల్ల భార్యాపిల్లలతో అనుబంధాల్లో వచ్చిన మార్పుల దాకా అన్నీ మనసు విప్పిచెప్పనున్నారు. టీవీలో చూపించనున్నారు. పూర్తిగా వ్యక్తిగతమైనప్పటికీ, మనిషి అంతరంగ వేదనకు అద్దం పట్టే ఈ కీలకమైన అంశాలను కుండబద్దలు కొట్టినట్లుగా బ్రూస్ చెప్పాలనుకుంటున్నారు. ఒక వ్యక్తి ధైర్యంగా చెబుతున్న ఈ లైంగిక పరిణామక్రమ కథనాన్ని యథాతథంగా చూపించాలని టీవీలు ఉత్సాహపడుతున్నాయి. ఈ విభిన్నమైన టీవీ సిరీస్ ఎన్ని సంచలనాలు రేపుతుందో వేచి చూడాలి.