మేషం...
ఆర్థిక పరిస్థితి గతం కంటే కాస్త మెరుగుపడుతుంది. కొన్ని వ్యవహారాలు నెమ్మదిగా కొనసాగుతాయి. సోదరులు, సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. శుభకార్యాల నిర్వహణపై బంధువులతో చర్చిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. కళారంగం వారికి అవార్డులు రావచ్చు. వారం ప్రారంభంలో ధనవ్యయం. మానసిక అశాంతి. నేరేడు,పసుపు రంగులు. అన్నపూర్ణాష్టకం పఠించండి.
వృషభం...
వ్యవహారాలు కొంత పుంజుకుంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. భూములు, వాహనాలు కొంటారు. అందరిలోనూ గుర్తింపు పొందుతారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. నూతన వ్యక్తులు పరిచయం కాగలరు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభాలబాటలో నడుస్తాయి.. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో కుటుంబంలో చికాకులు. శ్రమ పెరుగుతుంది. నీలం, ఆకుపచ్చ రంగులు. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
మిథునం...
ముఖ్యమైన వ్యవహారాలు క్రమేపీ అనుకూలిస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి మాటసహకారం అందుతుంది. విద్యార్థులు, నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. మీ కృషి కొన్ని విషయాలలో ఫలిస్తుంది. వివాహయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. విదేశాలకు పయనమవుతారు. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో కలహాలు. పసుపు, నేరేడు రంగులు. శివాష్టకం పఠించండి.
కర్కాటకం..
వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలలో సమస్యలు తీరతాయి. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. కళారంగం వారికి సత్కారాలు జరుగుతాయి. వారం ప్రారంభంలో కుటుంబసమస్యలు. ఆరోగ్యభంగం. తెలుపు, నేరేడు రంగులు. గణేశాష్టకం పఠించండి.
సింహం....
కొత్త పనులు సమయానికి పూర్తి కాగలవు.. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు. ముఖ్య విషయాలపై చర్చలు సాగిస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థులకు పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు. వాహనయోగం. బంధువుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాలలో చిక్కులు తొలగి ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు సంభవం. కళాకారులు, టెక్నికల్ రంగాల వారికి శ్రమ ఫలిస్తుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి సమస్యలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. సుబ్రహ్మణ్యస్తుతి మంచిది.
కన్య...
అనుకున్న ఆదాయం సమకూరుతుంది. పనులు చకచకా పూర్తి చేస్తారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. పరపతి పెరుగుతుంది. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు లాభాలబాట పడతాయి. ఉద్యోగాలు ప్రగతిపథంలో సాగుతాయి. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. పసుపు, గులాబీ రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
తుల...
కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా కొనసాగుతాయి. ఆప్తులు మరింత దగ్గరవుతారు. వ్యూహప్రతివ్యూహాలతో ఎదుటవారిని విస్మయపరుస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి వృద్ధి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని రుణాలు సైతం తీరుస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు అందుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో కుటుంబంలో సమస్యలు. మిత్రులతో కలహాలు. ఎరుపు, నేరేడు రంగులు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.
వృశ్చికం...
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆసక్తికర సమాచారం అందుతుంది. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. అందరిలోనూ విశేష గౌరవం పొందుతారు. ఆస్తి వ్యవహారాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. గృహ నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఉత్సవాలకు హాజరవుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళారంగం వారి ఆశయాలు నెరవేరతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. కుటుంబంలో సమస్యలు. గులాబీ, నేరేడు రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.
ధనుస్సు...
ఆర్థికంగా మరింతæ మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ముఖ్య విషయాలపై చర్చలు. పాత అనుభవాల రీత్యా నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరిస్తారు. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కళారంగం వారి ఆశయాలు నెరవేరతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. గులాబీ, తెలుపు రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
మకరం...
ఉత్సాహంతో అనుకున్న వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. యుక్తితో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం. వేడుకల్లో పాల్గొంటారు. స్థిరాస్తిపై వివాదాలు కొలిక్కి వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో గతం నుంచి నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి. వైద్యులు, పారిశ్రామికవేత్తలకు ఊహించని అవకాశాలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. గులాబీ, లేత ఎరుపు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
కుంభం...
ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు రావచ్చు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. కుటుంబసభ్యులతో విభేదాలు నెలకొంటాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమాధిక్యం. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది. ఆరోగ్యం మందగిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాల యత్నాలు ముందుకు సాగవు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఎరుపు, లేత గులాబీ రంగులు. కనకధారాస్తోత్రం పఠించండి.
మీనం....
కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు.. ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధల నుంచి బయటపడతారు. మీలో దాగిన నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కోరుకున్న కోర్సులు దక్కించుకుంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. వారం చివరిలో బంధువిరోధాలు. అనారోగ్యం. పసుపు, ఆకుపచ్చరంగులు. ఆదిత్య హృదయం పఠించండి.
Comments
Please login to add a commentAdd a comment