విడిపోయిన భార్యకు ఓ సందేశం!! | Arbaaz shares emotional post after divorce, fans support Makkhi bhaiya | Sakshi
Sakshi News home page

విడిపోయిన భార్యకు ఓ సందేశం!!

Published Sun, May 8 2016 6:06 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

విడిపోయిన భార్యకు ఓ సందేశం!! - Sakshi

విడిపోయిన భార్యకు ఓ సందేశం!!

17 ఏళ్ల వైవాహిక బంధానికి తెరదించుతూ చెరో దారి చూసుకున్నారు బాలీవుడ్ జంట అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా. బాలీవుడ్‌లో అన్యోన్యమైన దంపతులుగా పేరొందిన వీరు గత ఏప్రిల్‌లో వేరయ్యారు. ఈ నేపథ్యంలో ఒంటరిగా మగ్గుతున్న అర్బాజ్‌ ఖాన్ తాజాగా సోషల్‌ మీడియాలో ఓ తాత్వికమైన వ్యాఖ్య పోస్టు చేశాడు.

'కొన్ని రోజులు పోయిన తర్వాత నువ్వు వెనుదిరిగి చూసుకుంటే.. ఇదంతా ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్నది నీకే అర్థమవుతుంది' అంటూ ఓ తాత్వికమైన సందేశాన్ని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్టు చేశాడు. భార్యతో వీడిపోయిన బాధలో ఆయన కామెంట్ పెట్టి ఉంటారని అభిమానులు భావించారు. 'మీ మాటల వెనుక దాగున్న బాధను మేం అర్థం చేసుకోగలం.. మక్కీ భయ్యా మేం మీ వెంట ఉన్నాం' అంటూ ఓ అభిమాని ఈ పోస్టుపై కామెంట్ చేశాడు. ఇంతటి తాత్వికమైన కామెంట్‌ను సడన్‌గా అర్బాజ్‌ పోస్టు చేయడం వెనుక స్పష్టమైన కారణాలు బయటకు తెలియనప్పటికీ, భార్య మలైకతో ఇటీవల బ్రేకప్‌ అయిన నేపథ్యంలోనే దీనిని పెట్టి ఉంటాడని భావిస్తున్నారు.

తాము వీడిపోతున్నామని ఈ జంట సంయుక్తంగా గత ఏప్రిల్‌ నెలలో సంయుక్తంగా ఓ ప్రకటన చేసింది. మలైక లైఫ్‌స్టైల్‌ అర్బాజ్ కుటుంబానికి నచ్చకపోవడం, మలైకకు ఓ వ్యాపారవేత్తతో ఎఫైర్ ఉందని వదంతులు రావడం తదితర పరిణామాల వల్లే వీరి వైవాహిక బంధానికి బీటలు పడినట్టు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ సోదరుడైన అర్బాజ్‌ ఖాన్ ప్రస్తుతం 'దబాంగ్-3' దర్శకత్వం వహించేందుకు సిద్ధమవుతున్నాడు. 'దబాంగ్‌' సీరిస్ సినిమాలకు అతను గతంలో నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement