
మూడో ‘దబాంగ్’
‘దబాంగ్’ సిరీస్‌లో వచ్చిన రెండు చిత్రాల్లో చుల్‌బుల్ పాండేగా సల్మాన్ ఖాన్ చేసిన సందడిని ప్రేక్షకులు ఇంకా మర్చిపోలేదు. మూడో ‘దబాంగ్ ’ కిక్‌ను బాక్సాఫీస్‌కు రుచి చూపించడానికి మళ్లీ సిద్ధమవుతున్నారు ఈ కండల వీరుడు. ఈ విషయాన్ని అతని సోదరుడు ఆర్భాజ్ ఖాన్ ధ్రువీకరించారు.ఈ చిత్రాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా తెరకెక్కిస్తామని ఆయన తెలిపారు. సల్మాన్ ప్రస్తుతం ‘ప్రేమ్ రతన్ ధాన్ పాయో’, ‘భజరంగీ భాయ్‌జాన్’ చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ తరువాతే ఈ చిత్రం సెట్స్ పైకి వెళుతుందని సమాచారం.