సినీ ఇండస్ట్రీలో ప్రేమ- విడాకులు చాలా కామన్ అయిపోయింది. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోతున్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ బ్రేకప్ కహానీలు ఎక్కువ. తాజాగా సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహైల్ ఖాన్ విడాకుల విషయం ఇప్పుడు బీటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఎంతో అన్యోన్యంగా కలిసున్న సోహైల్- సీమా ఖాన్‌లు 24ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ కోర్టు మెట్లు ఎక్కారు.
ఇప్పటికే సల్మాన్ ఖాన్ పెద్ద తమ్ముడు అర్భాజ్ ఖాన్ హీరోయిన్ మలైకా అరోరాతో విడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో తమ్ముడు సోహైల్ ఖాన్ సైతం విడాకుల లిస్ట్‌లో చేరిపోయాడు.
మరోవైపు ఎంతో మంది హీరోయిన్స్‌తో ప్రేమాయణం సాగించిన సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోకుండానే మిగిలిపోయాడు. అటు చాన్నాళ్ల కిందటే పెళిళ్లు చేసుకున్న ఆయన తమ్ముళ్లు విడాకులు తీసుకున్నారు. దీంతో సల్మాన్ ఫ్యామిలీకి పెళ్లి అచ్చి రాలేదేమో అంటూ నెట్టింట పోస్టులు వైరల్ అవుతున్నాయి. చదవండి: విడాకులు తీసుకోనున్న స్టార్ కపుల్
Comments
Please login to add a commentAdd a comment