malaika arora
-
‘పర్ఫెక్ట్ సెట్టింగ్’: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన బాలీవుడ్ బ్యూటీ
-
ప్రియుడికి టాటా చెప్పేశాక..సర్ప్రైజ్ న్యూస్ చెప్పిన బాలీవుడ్ బ్యూటీ
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా గురించి పెద్దగా పరిచయం అసవరం లేదు. బాలీవుడ్లో ఐటమ్ సాంగ్స్, తనదైన లుక్స్, నటనతో ఆకట్టుకుంది. 19 ఏళ్ల వివాహ జీవితం, కుమారుడు తర్వాత భర్త అర్బాజ్ ఖాన్‌నుంచి విడిపోయింది. ఆ తరువాత 2018 నుంచి అర్జున్ కపూర్‌తో రిలేషన్షిప్లో ఉంది. 2024లో విడిపోతున్నట్టు ఇద్దరూ ప్రకటించారు. ఇటీవలే మలైకా తండ్రి కన్నుమూశారు. ప్రస్తుతం కుమారుడు అర్హాన్‌తో కలిసి జీవిస్తోంది. మలైకా అరోరా ఒక కొత్త రెస్టారెంట్ ప్రారంభించింన సంగతి తెలిసిందే. ప్రియుడితో బ్రేకప్ ప్రకటించిన తరువాత ఇపుడు అధికారికంగా ఈ రెస్టారెంట్ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పంచుకుంది. ఫుడ్ విశేషాలను ఇందులో షేర్ చేసింది. సర్ప్రైజ్ కూడా ఉంది అంటూఫ్యాన్స్ను ఊరిస్తోంది. మలైకా లేటెస్ట్ వీడియో నెట్టింట సందడి చేస్తోంది. దీంతో ముంబైలో రెస్టారెంట్‌ను ప్రారంభించిన తాజా సెలబ్రిటీగా మలైకా అరోరా నిలిచింది. View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) ‘స్కార్లెట్ హౌస్‌కి స్వాగతం. సరే, ఇది మా రిటైల్ రూం. ,ఇది రాత్రికి వైన్, టేస్టింగ్ కమ్యూనిటీ బార్గా మారుతుంది. ఇది పర్ఫెక్ట్ సెట్టింగ్.. ఇక్కడ ఎప్పుడూ ఏదో ఒకటి తయారవుతూనే ఉంటుంది... అంటూ మలైకా తన పోస్ట్‌లో తెలిపింది.దీపికా స్టైలిష్ డ్రెస్, చూడ్డానికి చాలా సింపుల్ : కానీ ధర తెలిస్తే షాక్! ముంబైలోని బాంద్రాలో కొలువుదీరిన ఈ రెస్టారెంట్‌కు స్కార్లెట్ హౌస్ అని పేరు పెట్టారు. 90 ఏళ్ల క్రితం నాటి పోర్చుగీస్ బంగ్లాను వింటేజ్ లుక్ తీసుకొచ్చి రెస్టారెంట్గాతీర్చిద్దింది. . తన చిన్ననాటి స్నేహితుడు మలయ నాగ్‌పాల్, రెస్టారెంట్ నడిపే ధవల్ ఉదేషితో కలిసి ఈ ఫుడ్ బిజినెస్‌ను మొదలు పెట్టింది. స్కార్లెట్ హౌస్ అద్భుతమైన ఇంటీరియర్స్ , విలాసవంతమైన ఆర్కిటెక్చరల్ డిజైన్‌తో దీన్ని రూపొందించారట. ఇదీ చదవండి: ఎప్పటినుంచో ఐఏఎస్ కల..కానీ 13 ఏళ్లకే అనూహ్య నిర్ణయం -
ధర్మాటిక్ ఫ్యాషన్ ఫండ్ ఈవెంట్ లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
రైలు ప్రయాణం హాయిగా సాగిపోవాలంటే..!
రైలు ప్రయాణం అంటే ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. స్లీపర్ క్లాస్‌లో వెళ్లితే ప్రశాంతత మాట దేవుడెరుగు..ఒకటే గజిబిజి గందరగోళంలా ఉంటుంది వాతావరణం. ఏదో ఫోన్లో తలదూర్చి లేదా పేపర్‌తోనే కాలక్షేపం చేస్తూ ఎప్పుడు దిగిపోతాం రా బాబు అనుకుంటుంటాం. అలాంటి విసుగు, ఇబ్బంది కలగకుండా హాయిగా ట్రైన్ జర్నీ సాగిపోవాలంటే బాలీవుడ్ నటి మలైకా అరోరా చెప్పే జర్నీ చిట్కాలను ప్రయత్నించి చూడండి. ఆమె తన రైలు ప్రయాణాన్ని వీడియో తీసి మరీ నెట్టింట్ షేర్ చేశారు. ఆ వీడియోలో మలైకా మీరు బుక్ చేసుకున్న క్లాస్‌ని బట్టి జర్నీ ఎంజాయ్ చేయడం అనేది ఆధారపడి ఉంటుందన్నారు. "తక్కవ బడ్జెట్లో వెళ్లాలనుకుంటే స్లీపర్, సెకండ్ క్లాస్‌లు అనువైనవి. అలాకాకుండా తన వ్యక్తిగత గోప్యత కోరుకునే ప్రయాణికులకు ఫస్ట్-క్లాస్ ఏసీ కంపార్ట్మెంట్లు అనుకూలం. రైల్లో ఎక్కువసేపు ప్రయాణించేవాళ్లు తప్పనిసరిగి పిల్లో, దుప్పటిని తప్పనిసరిగా తీసుకెళ్లడం ఉత్తమం. ఇది ఇంటిలో ఉన్న అనుభూతిని ఇస్తుంది. దీంతోపాటు సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం మంచిది. తేలికగా జీర్ణమయ్యే తినుబండరాలను కూడా తీసుకువెళ్లండి. అలాగే రాత్రి సమయాల్లో నిద్రపట్టనప్పుడు కాలక్షేపమయ్యేలా మంచి పుస్తకాలను, లేదా మ్యూజిక్, సినిమా చూసేలా ఏర్పాట్లు చేసుకోండి. ఇలాంటి సింపుల్ చిట్కాలతో ట్రైన్ జర్నీని హాయిగా ఎంజాయ చేస్తే సరి." అని మలైకా వీడియోలో వివరించారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) (చదవండి: చర్మతత్వాన్ని బట్టి మాయిశ్చరైజర్లు రాసుకోవాలి..!) -
మలైకా అరోరా కొత్త రెస్టారెంట్.. లోపల ఎలా ఉందో చూశారా? (ఫోటోలు)
-
కొత్త బిజినెస్ మొదలుపెట్టిన మలైకా అరోరా
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా కొత్త రెస్టారెంట్ ప్రారంభించింది. కుమారుడు అర్హాన్ ఖాన్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ రెస్టారెంట్ బిజినెస్ గురించి వెల్లడించింది. తన చిన్ననాటి స్నేహితుడు మలయ నాగ్‌పాల్, రెస్టారెంట్ నడిపే ధవల్ ఉదేషితో కలిసి ఈ ఫుడ్ బిజినెస్‌లో దిగింది. ముంబైలోని బాంద్రాలో కొలువుదీరిన ఈ రెస్టారెంట్‌కు స్కార్లెట్ హౌస్ అని నామకరణం చేశారు.మలైకా డ్రీమ్ ప్రాజెక్ట్90 ఏళ్ల క్రితం నాటి పోర్చుగీస్ ఇంటికి వింటేజ్ లుక్ తీసుకొచ్చి రెస్టారెంట్‌గా మార్చేశారు. ఈ న్యూస్ వినగానే అభిమానులు, సెలబ్రిటీలు మలైకా అరోరాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అక్కడికి వచ్చి భోజనం రుచి చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటూ కామెంట్లు పెడుతున్నారు. మలైకా సోదరి అమృత అరోరా.. నా డార్లింగ్ సిస్టర్.. మొత్తానికి నీ డ్రీమ్ ప్రాజెక్ట్‌ను అమల్లో పెట్టేశావు అంటూ ప్రశంసలు కురిపించింది.ఏదైనా వంటకం నచ్చిందంటే వదిలిపెట్టంతన కుమారుడితో కలిసి రెస్టారెంట్‌ను ప్రమోట్ చేయడానికి గల కారణాన్ని మలైకా చెప్తూ.. మా ఇద్దరికీ భోజనం అంటే ఇష్టం. ఎక్కడికి వెళ్లినా ఫుడ్ ఆస్వాదిస్తాం. విదేశీ టూర్లో ఏదైనా వంటకం నచ్చిందంటే కచ్చితంగా దాన్ని ఇంట్లో ట్రై చేస్తాం.. కాబట్టి రెస్టారెంట్ ప్రారంభించడమనేది నా మనసుకు నచ్చిన పని చేస్తున్నట్లుగా ఉంది అని పేర్కొంది. View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) చదవండి: తాళి, గాజులు.. అన్నీ తనకే! అందుకే పెళ్లిలో అలా చేశా..: హీరో -
ఫార్మల్ వేర్లో మతిపోగొట్టే ఫోజులతో బాలీవుడ్ బ్యూటీ మలైక అరోరా (ఫోటోలు)
-
మన జీవితంలో ఆ ఒక్క సెకన్ చాలు : మలైకా అరోరా
బాలీవుడ్ భామ మలైకా అరోరా బీటౌన్‌లో అందరికీ సుపరిచితమే. అయితే ఇటీవల ఆమె తండ్రి మరణం తర్వాత ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. కారణం ఆమె మాజీ భర్త అర్బాజ్ ఖాన్, బాయ్‌ఫ్రెండ్ అర్జున్ కపూర్ ఆమెను పరామర్శించేందుకు వచ్చారు. అంతకుముందే 2018 నుంచి అర్జున్ కపూర్‌తో డేటింగ్లో ఉందంటూ చాలాసార్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత తమ రిలేషన్‌పై వీరిద్దరు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు.అయితే తాజాగా ముంబయిలోని దివాళీ బాష్‌కు అర్జున్ కపూర్ హజరయ్యారు. ఈ సందర్భంగా మలైకా అరోరా గురించి కొందరు ఆరా తీశారు. దీంతో తాను ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చారు. అర్జున్ కామెంట్స్‌తో ఈ జంట విడిపోయినట్లు తెలుస్తోంది. అతని మాటలు విన్న మలైకా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. హృదయం, ఆత్మ అంటూ మలైకా రాసుకొచ్చారు. మన హృదయాన్ని ఒక్క సెకను తాకడం వల్ల.. జీవితాంతం మన ఆత్మను తాకవచ్చంటూ మనసులో మాటను బయటపెట్టింది.బాలీవుడ్ ఐటమ్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న మలైకా.. సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ని 1998లోనే పెళ్లి చేసుకుంది. కానీ మనస్పర్థల కారణంగా 2017లో విడాకులు తీసుకుంది. ఇది జరిగిన ఏడాదికే హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ మొదలుపెట్టింది. వీళ్లిద్దరూ కలిసే ఉన్నారు. చాలా ఫారెన్ టూర్స్‌కి వెళ్లారు. అప్పట్లో వీరి ఫొటోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. -
హాట్ బ్యూటీతో విడిపోవడంపై క్లారిటీ ఇచ్చిన హీరో
ప్రేమలో పడటం, రిలేషన్షిప్లో ఉండటం, కొన్నాళ్లకు బ్రేకప్ చెప్పడం.. ఇలాంటివి బాలీవుడ్లో ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. కొన్ని బయటపడతాయి. కొన్ని బయటపడవ్ అంతే! తాజాగా హీరో అర్జున్ కపూర్ తన బ్రేకప్ గురించి క్లారిటీ ఇచ్చేశాడు. మలైకా అరోరాతో విడిపోవడం గురించి బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)ఐటమ్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న మలైకా అరోరా.. సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ని 1998లోనే పెళ్లి చేసుకుంది. కానీ మనస్పర్థల కారణంగా 2017లో విడాకులు తీసుకుంది. ఇది జరిగిన ఏడాదికే హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ మొదలుపెట్టింది. వీళ్లిద్దరూ కలిసే ఉన్నారు. చాలా ఫారెన్ టూర్స్‌కి వెళ్లారు. ఆయా ఫొటోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి.మరి ఏమైందో ఏమో గానీ కొన్నాళ్ల క్రితం ఇద్దరూ ఎవరికీ వాళ్లు దూరం పాటించారు. దీంతో బ్రేకప్ అనే రూమర్స్ వచ్చాయి. కొన్నిరోజుల క్రితం మలైకా తండ్రి చనిపోతే ఆమెకు అర్జున్ అండగా నిలిచాడు. ఈ క్రమంలోనే మళ్లీ కలిసిపోయారని అందరూ అనుకున్నారు. తాజాగా దీపావళి ఈవెంట్లో పాల్గొన్న అర్జున్ కపూర్.. మైక్‌లో మాట్లాడుతున్న టైంలో 'మలైకా ఎలా ఉంది?' అని ఒకరు అడిగారు. దీంతో తాను ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నానని బదులిచ్చాడు. అంటే బ్రేకప్‌ని కన్ఫర్మ్ చేసినట్లే.(ఇదీ చదవండి: తెలుగు నిర్మాత.. హైదరాబాద్‌లోని చెరువులో దూకేశాడు: శ్రియ) View this post on Instagram A post shared by Movie Talkies (@movietalkies) -
25 ఏళ్లకే పెళ్లి.. 20 ఏళ్లకే విడాకులు.. మరదలి బాయ్‌ప్రెండ్‌తో హీరోయిన్ డేటింగ్! (ఫొటోలు)
-
ఐదుపదుల వయసులోనూ స్లిమ్‌గా మలైకా..శరీరాకృతి కోసం..!
బాలీవుడ్ నటి, మోడల్ మలైకా అరోరా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆమె హీరోయిన్గా నటించిన సినిమాల కంటే స్పెషల్ సాంగ్‌లతోనే అభిమానులకు చేరవయ్యిందని చెప్పొచ్చు. తెలుగులో గబ్బర్ సింగ్ మూవీలో కెవ్వు కేక అంటూ ఓ రేంజ్లో టాలీవుడ్‌ని కేకపెట్టించింది. అలాంటి మలైకా వయసును అంచనా వేయలేం. ఎందుకుంటే ఆమె అంతలా యువ హీరోయిన్లకి పోటీ ఇచ్చే రేంజ్లో గ్లామరస్‌గా ఉంటుంది. ఆమె శరీరాకృతి చూస్తే జస్ట్ 20 అనేలా ఉంటుంది. ఇవాళ మలైకా 51వ పుట్టిన రోజు సందర్భంగా ఐదు పదుల వయసులోనూ ఇంతలా మంచి ఫిట్నెస్తో బాడీని ఎలా మెయింటైన్ చేస్తుంది, ఎలాంటి ఆహారం తీసుకుంటుంది సవివరంగా తెలుసుకుందామా..!.మలైకా అరోరా ఫినెస్కి మంచి ప్రేరణ అని చెప్పొచ్చు. మంచి టోన్డ్ ఫిజిక్‌తో ప్రేక్షకులను అలరిస్తుంది. ఆమె తన శరీరాకృతి కోసం ఒక్క రోజు కూడా జిమ్ సెషన్‌ని స్కిప్ చెయ్యదట. అందువల్లనే ఏమో 1998లో షారఖ్ ఖాన్‌తో చేసి ఛైయా ఛైయా అంటూ స్టెప్పులేస్తు కనిపించిన నాటి మలైకాలానే ఇప్పటికీ కనిపిస్తుంది. ఏ మాత్రం ఫిగర్‌ని కోల్పోకుండా అత్యంత ఆకర్షణీయంగా ఉండేలా ఫిజిక్‌ని మెయింటెయిన్ చేస్తుంది. అంతేగాదు శరీరాకృతిని కాపాడుకోవడానికి డంబెల్స్, కెటిల్‌బెల్స్, చీలమండల బరువులకు సంబంధించిన కఠిన వ్యాయామాలన్నింటిని చేస్తుంది. సోషల్ మీడియాలో సైతం తరచుగా తన వ్యాయామాలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ..అభిమానులకు ఆరోగ్య స్ప్రుహని కూడా కలిగిస్తుంది. ఆమె స్క్వాట్లు, జంపింగ్ జాక్‌లు, హై-కిక్స్, కార్డియో వంటి వ్యాయామాలతో కేలరీలు బర్న్ అయ్యేలా చూసుకుంటుంది. ఎలాగైనా శరీరాన్ని విల్లులా వంచేలా అన్ని రకాల వ్యాయామాలను తప్పనిసరిగా చేస్తుంది. అలాగే ఆమె రోజుని డిటాక్స్ వాటర్‌తో ప్రారంభిస్తుంది. తాగే నీటిలో తప్పనిసరిగా నిమ్మకాయ, జీరా, సోంపు, అజ్వైన్, తేనె, అల్లం, నిమ్మకాయ వంటివి జోడిస్తుంది. బ్రేక్‌ఫాస్ట్‌గా ఆకుపచ్చ స్మూతీ, గుడ్లు, అవోకాడోతో చేసిన బ్రెడ్ శాండ్విచ్లు తీసుకుంటుంది. లంచ్‌లో తప్పనిసరిగా భారీ భోజనమే తీసుకుంటుందట. వాటిలో తప్పనిసరిగా పప్పు, కూరగాయలు, సలాడ్, మాంసం, చేపలు, చికెన్ వంటివి ఉంటాయి. దీంతోపాటు అడపాదడపా ఉపవాసాన్ని కూడా పాటిస్తుంది. తప్పనిసరిగా సాయంత్రం 6.30 కల్లా డిన్నర్ పూర్తి చేసేలా చూసుకుంటుంది. ప్రోటీన్ కోసం మాంసం, పిండి పదార్థాల కోసం చిక్కుళ్లు, ఫైబర్‌తో కూడిన కూరగాయాలతో సమతుల్యంగా ఉండేలా చూసుకుంటుంది. ఇంతలా తినే ఫుడ్ నుంచి చేసే వ్యాయమాలు వరకు ప్రతి విషయంలోనూ చాలా కేర్ తీసుకుంటే మంచి శరీరాకృతి కలిగిన బాడీని మెయింటైన్ చేయడం సాధ్యమవుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇంకెందుకు ఆలస్యం మంచి నాజుకైనా బాడీ కావాలంటే మలైకాలా కేర్ తీసుకునేందుకు ప్రయత్నించండి మరీ..!. (చదవండి: ఆఫీస్‌లో తక్కువ స్థాయి పనైతే ఏం చేయాలి..?) -
మలైకా తండ్రిది ఆత్మహత్యా? ప్రమాదమా? తల్లి ఏమన్నారంటే?
బాలీవుడ్లో నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా హఠాన్మరణం కలకలం రేపింది. ఏడంతస్తుల భవనం నుంచి కిండి పడి మరణించడం విషాదాన్ని నింపింది. బుధవారం మధ్యాహ్నం ముంబైలోని బాంద్రాలోని తన ఇంటి బాల్కనీ నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు ముంబై పోలీసులు ధృవీకరించినట్టు తెలుస్తోంది.బాలీవుడ్నటీమణులు మలైకా అరోరా, అమృతా అరోరా తండ్రే అనిల్ అరోరా. ఆయన భార్య జాయిస్ పాలికార్ప్. కాగా విషాదానికి ఒక రోజు ముందు మలైకా అరోరా తల్లిదండ్రుల వద్దకి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషాద ఘటనపై కుటుంబ సభ్యులు ఇంకా ప్రకటన విడుదల చేయలేదు. మలైకా తల్లి జాయిస్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అనిల్ అరోరాకు రోజూ ఉదయం బాల్కనీలో కూర్చుని వార్తాపత్రికలు చదివే అలవాటుంది. గదిలో భర్త చెప్పులు చూసి బాల్కనీలో అతని కోసం వెతకడానికి వెళ్లగా, అక్కడ కనిపించక పోవడంతో కిందకి వంగి చూడగా అప్పటికే అయన కింద పడిపోయారు. బిల్డింగ్ వాచ్మెన్ సహాయం కోసం అరుస్తున్నాడు. అనిల్ అరోరాకు మోకాళ్ల నొప్పులు ఎలాంటి అనారోగ్యం లేదని కూడా తెలిపారు. గతంలో తాము విడాకులు తీసుకున్నామని, అయితే గత కొన్నేళ్లుగా మళ్లీ సహజీవనం ప్రారంభించామని పోలీసులతో చెప్పారు. విషాద వార్త విన్న తర్వాత ఆమె పూణె నుంచి ఇంటికి చేరుకుంది. కన్నీటి పర్యంతమవుతూఇంట్లోకి వెళుతున్న వీడియో వైరల్ గా మారింది. మరోవైపు మలైకా మాజీ భర్త, నటుడు-నిర్మాత అర్బాజ్ ఖాన్ కూడా అక్కడికి చేరుకుని పోలీసు అధికారులతో మాట్లాడుతూ కనిపించారు. ఇంటి చుట్టూ భారీగా పోలీసు మోహరించారు. అనిల్ అరోరా హఠాన్మరణం వార్త తెలియగానే మలైకా స్నేహితులు ఆమెను కలిసి ఓదార్చారు. ఇందులో బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ ,ఆమె మాజీ భర్త కుటుంబీకులు ఉన్నారు -
శోకసంద్రంలో మలైకా అరోరా, తరలి వచ్చిన బీటౌన్ పెద్దలు (ఫొటోలు)
-
బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య
బాలీవుడ్ నటి మలైకా అరోరా ఇంట్లో తీవ్రమైన విషాదం చోటుచేసుకుంది. కొంత సమయం క్రితం ఆమె తండ్రి అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకున్నారు. ముంబయిలోని తన నివాసంలో ఆరో అంతస్తు నుంచి దూకారు. అయితే, ఆయన ఆత్మహత్యకు సంబంధించి కారణాలు తెలియలేదు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలుపుతున్నారు. కానీ, మలైకా తండ్రి చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి: ఉచితంగానే త్రిప్తి డిమ్రీ 'బ్యాడ్ న్యూజ్' చూసేయండిగత కొంతకాలంగా మలైకా తండ్రి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఉంటున్న ఇంట్లోనే ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన బిల్డింగ్ మీది నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మలైకా అరోరాకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. మలైకాకు ఒక సోదరి కూడా ఉంది. అయితే, విడాకుల అనంతరం వారిద్దరూ తన తల్లి సోదరి అమృత వద్దే పెరిగారు. కానీ, ఆమె సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత తండ్రితో కూడా కనిపించేది. తండ్రి అనిల్ అరోరా మర్చంట్ నావీలో పనిచేశారు. -
Malaika Arora: బాలీవుడ్ బ్యూటీ అవుట్ ఫిట్ పిక్స్ వైరల్ (ఫోటోలు)
-
ప్రెగ్నెన్సీతోనే హీరోయిన్ డ్యాన్స్.. చీరలో రీతూ అలా!
చీరలో అందాలన్నీ చూపించేస్తున్న రీతూ చౌదరినాభి అందాలతో మైమరిపిస్తున్న పూనమ్ బజ్వాబేబీ బంప్‌తో డ్యాన్సులు చేస్తున్న అమలా పాల్క్యూట్ యోగాసనాలతో కేక పుట్టిస్తున్న బిగ్ బాస్ దివిబ్లాక్ డ్రస్‌లో మెంటలెక్కిస్తున్న సీరియల్ బ్యూటీ జ్యోతిరాయ్పొట్టి స్కర్ట్‌లో చూపు తిప్పుకోనివ్వని తమిళ బ్యూటీ దివ్య View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Ishita Dutta Sheth (@ishidutta) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Sakshi Chaudharry (@isakshi_chaudhary) View this post on Instagram A post shared by Pavithralakshmi (@pavithralakshmioffl) View this post on Instagram A post shared by Sayani G (@sayanigupta) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Sharvari 🐯 (@sharvari) View this post on Instagram A post shared by Sapthami Gowda 🧿 (@sapthami_gowda) View this post on Instagram A post shared by Dhivya Duraisamy (@dhivya__duraisamy) View this post on Instagram A post shared by Reeshma Nanaiah 🎀 (@reeshma_nanaiah) View this post on Instagram A post shared by Ivana (@i__ivana_) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj) -
బంధం ముగిసింది.. విడిపోయిన బాలీవుడ్ స్టార్ జంట!
బాలీవుడ్లో ఓ స్టార్ జంట బ్రేకప్ చెప్పుకుందని వార్తలు గుప్పుమంటున్నాయి. ఏళ్ల తరబడి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న మలైకా అరోరా- అర్జున్ కపూర్ ఎవరి దారి వారు చూసుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఈ లవ్ బర్డ్స్ ఇంతవరకు స్పందించలేదు. వారి బంధానికి కాలపరిమితి ముగిసిందని, అందుకే విడిపోయారని పలువురూ భావిస్తున్నారు. మనసులో స్థానం అలాగే..జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఇండస్ట్రీలోని ఓ వ్యక్తి ఈ బ్రేకప్‌పై స్పందిస్తూ.. మలైకా, అర్జున్‌ల మధ్య ఎంతో అనుబంధం ఉంది. బ్రేకప్ తర్వాత కూడా వారు దాన్ని కొనసాగిస్తారు. ఒకరి మనసులో ఒకరికి ప్రత్యేక స్థానం అలాగే ఉంటుంది. బ్రేకప్ గురించి మాట్లాడేందుకు వారు సుముఖత చూపడం లేదు. దీని గురించి చర్చ జరగడం కూడా వారికి ఇష్టం లేదు అని తెలిపారు.ఐదేళ్లుగా ప్రేమాయణంకాగా మలైకా అరోరా, అర్జున్ కపూర్ 2019లో తాము డేటింగ్లో ఉన్న విషయాన్ని బయటపెట్టారు. పార్టీలు, ఫంక్షన్స్‌కు సైతం కలిసి వెళ్లేవారు. కలిసున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండేవారు. అయితే గతేడాది.. వీరి ప్రేమ బంధం ముగిసిందంటూ వార్తలు రాగా వాటిని మలైకా కొట్టిపారేసింది. తనకంటే చిన్నవాడితో లవ్అలాగే తనకంటే 12 ఏళ్లు చిన్నవాడిని ప్రేమించిందని విమర్శలు రాగా దానికి కూడా గట్టి కౌంటరిచ్చింది. ప్రేమకు వయసుతో పనేంటని ప్రశ్నించింది. ఇంతలా ఒకరికొకరు తోడునీడుగా ఉన్న వీళ్లు విడిపోయారని మరోసారి వార్తలు వస్తుండటంతో అభిమానులు కంగారుపడుతున్నారు. మలైకా- అర్జున్ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారనుకుంటే ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.చదవండి: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ -
మలైకా అరోరా అపార్ట్మెంట్ అద్దెకు.. రెంట్ ఎంతంటే?
ప్రముఖ నటి 'మలైకా అరోరా' ముంబైలోని బాంద్రా వెస్ట్‌లోని తన అపార్ట్‌మెంట్‌ను కాస్ట్యూమ్ డిజైనర్ కాశిష్ హన్స్‌కి మూడు సంవత్సరాల పాటు అద్దెకు ఇచ్చినట్లు సమాచారం. ఈ అపార్ట్మెంట్ నెలవారీ రెంట్ రూ. 1.57 లక్షలు. అయితే ఓ ఒప్పందం ప్రకారం ప్రతి ఏటా అద్దె 5 శాతం పెరుగుతుంది.అద్దెదారు మొదటి సంవత్సరంలో నెలకు రూ. 1.5 లక్షలు, రెండవ సంవత్సరంలో నెలకు రూ. 1.57 లక్షలు, మూడవ సంవత్సరంలో నెలకు రూ. 1.65 లక్షలు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అయితే అద్దెదారు కాశిష్ హన్స్ 4.5 లక్షల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించిన తర్వాత అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. ఈ ఒప్పందం ఏప్రిల్ 29న జరిగినట్లు తెలుస్తోంది.మలైకా అరోరా తన అపార్ట్మెంట్లను అద్దెకు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఈమె తన బాంద్రా అపార్ట్‌మెంట్‌ను ది జెఫ్ గోల్డెన్‌బర్గ్ స్టూడియో యజమాని జెఫ్రీ గోల్డెన్బర్గ్కు నెలకు రూ.1.2 లక్షలకు అద్దెకు ఇచ్చింది. ఇప్పుడు మరోమారు తన అపార్ట్‌మెంట్‌ను అద్దెకు ఇచ్చింది. -
నువ్వు వర్జినా? కుమారుడిని ప్రశ్నించిన హీరోయిన్
హీరోయిన్, ఐటం గర్ల్ మలైకా అరోరా కుమారుడు అర్హాన్ ఖాన్ యూట్యూబ్‌లో దంబ్ బిర్యానీ పేరిట పాడ్‌కాస్ట్ ప్రారంభించాడు. బిర్యానీ అనే పేరుకు తగ్గట్లే మాస్ మసాలా ప్రశ్నలతో అతిథులను ముప్పతిప్పలు పెడుతున్నాడు. ఫస్ట్ ఎపిసోడ్లో తండ్రి అర్బాజ్ ఖాన్ ఉండగా రెండో ఎపిసోడ్లో తల్లి మలైకా అరోరా ఉంది. రెండో ఎపిసోడ్‌కు సంబంధించిన టీజర్ రిలీజ్ చేశాడు అర్హాన్. అమ్మను ఇరకాటంలో పడేసిన కుమారుడు అయితే వీడియో ప్రారంభంలో మలైకానే హోస్ట్‌గా మారిపోయినట్లు కనిపిస్తోంది. నువ్వు వర్జినిటీ ఎప్పుడు కోల్పోయావ్? అని కుమారుడిని ప్రశ్నించింది. దానికతడు బిగుసుకుపోగా, నాకు సరైన సమాధానం కావాలని పట్టుబట్టింది. దీంతో అర్హాన్.. అమ్మా, ముందు నాకీ విషయం చెప్పు.. నువ్వెప్పుడు పెళ్లి చేసుకోబోతున్నావ్? అని అడిగాడు. టీజర్లో మలైకా ఏమని సమాధానం చెప్పిందో చూపించలేదు. 19 ఏళ్లకు విడాకులు కాగా మలైకా, అర్బాజ్ ఖాన్.. 1998లో పెళ్లి చేసుకున్నారు. 2002లో వీరికి అర్హాన్ జన్మించాడు. 2008లో ఈమె తన భర్త అర్బాజ్ ఖాన్‌తో కలిసి అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ కూడా ప్రారంభించింది. ఈ నిర్మాణ సంస్థలోనే దబాంగ్ వంటి పలు సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. కొన్నేళ్లపాటు అన్యోన్యంగా ఉన్న వీరు 2016లో విడిపోయారు. 2017లో విడాకులు తీసుకున్నారు. అర్బాజ్ ఇటీవలే మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్‌ను నిఖా చేసుకున్నాడు. అటు మలైకా.. నటుడు అర్జున్ కపూర్‌తో కొన్నేళ్లుగా డేటింగ్లో ఉంది. View this post on Instagram A post shared by dumb biryani (@dumbbbiryani) Read this article in English చదవండి: ఓటీటీకి టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ అప్పుడేనా? -
పెళ్లి ప్రపోజల్ పై అర్జున్ కపూర్ కు ఫ్యూజులెగిరిపోయే సమాధానమిచ్చిన మలైకా..!
-
లాక్మే ఫ్యాషన్ వీక్ 2024: వయ్యారి భామల సందడి, ఫోటోలు
-
నటి మలైకా అరోరా ఇష్టపడే బ్రేక్‌ఫాస్ట్‌లు ఇవే..!
బాలీవుడ్ నటి మలైకా అరోరా ఐదు పదుల వయసు దాటినా యువ హిరోయిన్లకు దీటుగా అందంగా ఉంటుంది. ఇప్పటికి వయసు 20 అనేలా ఉంటుంది. ఎప్పటికప్పుడూ సరిక్తొత ఫ్యాషన్ డ్రెస్‌లతో తన స్టన్నింగ్ లుక్‌తో మిస్మరైజ్ చేస్తూనే ఉంటుంది. ఇంత వయసొచ్చిన ఎక్కడ వృధాప్య ఛాయలు కనపడను కూడా కనపడవు. ఈ ముద్దుగమ్మ ఇంతలా గ్లామర్ మెయింటైన్ చేసేందుకు ఎలాంటి తాను ఎలాంటి డైట్ ఫాలో అవుతుందో షేర్ చేసింది. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్‌లు ఇలాంటివి తీసుకుంటే ఆరోగ్యం తోపాటు అందం మీ సొంతం అని చెబతోంది. ఇంతకీ ఆమె ఇష్టంగా తీసుకునే బ్రేక్ఫాస్లు ఏంటంటే..అవకాడోతో చేసిన బ్రేక్ ఫాస్ట్‌లు తీసుకుంటుంది. ఆ అవకాడోతో నిమిషాల వ్యవధిలా ఎలా బ్రేక్‌ఫాస్ట్‌లు చేసుకోవచ్చో కూడా సవివరంగా తెలిపింది. అవేంటంటే.. క్లాసిక్ అవోకాడో టోస్ట్ : ఇది కేవల పది నిమిషాల్లో రెడీ అయిపోతుందట. కావల్సిందల్లా కేవలం అవకాడో, బ్రెడ్, ఆలివ్ ఆయిల్, మసాల ఉంటే చాలు. చక్కడగా బ్రేడ్ని వేయించి అవకాడో చిన్నచిన్న ముక్కలుగా కోసి పెట్టి దానిపై మసాల వేసి తింటే టేస్ట్ అదుర్స్ అని అంటోంది. చాలా ఈజీ రెసీపీ, త్వరితగతిన చేసుకోవచ్చు అని చెబుతోంది మలైకా అరోరా అవోకాడో ఫెటా చీజ్ టోస్ట్ దీనికి అవకాడో ముక్కలు, పుల్లని పిండి, ఫెటా చీజ్, వేయించిన గుడ్లు ఉంటే చాలు. కేఫ్ స్టైల్ అవకాడో టోస్ట్ సిద్దమయ్యిపోతుంది. అవోకాడో చియా టోస్ట్ అత్యంత పోషకమైన వంటకాల్లో ఇది ఒకటి. జస్ట్ పదినిమిషాల్లో చేసుకోవచ్చు. నిమిషాల్లో తయారయ్యే వంటకం. కేవలం అవకాడో చియా గింజలు ఉంటే చాలు. రెసిపీ రెడీ అయ్యిపోతుంది. తురిమిన గుడ్డు అవోకాడో టోస్ట్ ఇక్కడ అవకాడో తురుము, గుడ్లు తురుముతో చేసే రెసిపీ. ఇది మంచి రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పొచ్చు. వీట్ ఆవకాడో టోస్ట్ గోధుమ పిండి, అవకాడోలతో చేసే వంటకం. అయితే ఇది చేయడానకి 20 నిమిషాల సమయం పడుతుంది. ఇది కూడా మంచి ఆరోగ్య కరమైన అల్పాహారం అని చెబుతోంది. మలైకా. అంతేగాదు మన రోజువారీ డైట్లో బలవర్ధకమైన ఆహారం ఉంటే ఆరోగ్యవంతంగా ఉండటమే గాక మంచి గ్లామర్‌ని కూడా పొందగలుగుతామని చెబుతోంది మలైకా అరోరా. (చదవండి: ఇంట్లోనే ఈజీగా నేచురల్ హెయిర్ డై చేసుకోండిలా..!) -
Malaika Arora Pics: 50 ఏళ్ల వయసులో కూడా మలైక అదిరిపోయే అందాలు.. రోజురోజుకూ గ్లామర్ డోస్ పెంచేస్తోందిగా!
-
మాజీ భర్త రెండో పెళ్లి.. 50 ఏళ్ల వయసులో హీరోయిన్ బ్రేకప్!
సినీ ఇండస్ట్రీలో లవ్, డేటింగ్, బ్రేకప్‌లు ఎక్కడో ఒకచోట వింటూనే ఉంటాం. బాలీవుడ్లో అయితే కాస్తా ఎక్కువగానే ఇలాంటి వార్తలు తరచుగా వస్తుంటాయి. అయితే తాజాగా మరో స్టార్ హీరోయిన్ బ్రేకప్ చెప్పుకున్నట్లు బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. ఓ యంగ్ హీరోకు స్టార్ హీరోయిన్ దూరంగా ఉంటున్నట్లు లేటెస్ట్ టాక్. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ భామ మలైకా అరోరా. ప్రస్తుతం ఈ టాపిక్ బీటౌన్‌లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం 50 ఏళ్ల వయసులో ఉన్న మలైకా.. ఇప్పటికే తన మొదటి భర్తతో అర్బాజ్ ఖాన్‌తో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ కొనసాగిస్తోంది. కొన్నేళ్ల పాటు సీక్రెట్ రిలేషన్లో ఉన్న భామ.. 2019లో తమ రిలేషన్‌ను బయటపెట్టారు. గతంలో చాలాసార్లు ఈవెంట్లలో ఈ జంట కనిపించి సందడి చేశారు. తాజాగా వీరిద్దరు బ్రేకప్ చెప్పుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కొద్ది రోజులుగా ఈ జంట సోషల్ మీడియాలో ఎక్కడా కనిపించలేదు. ఇటీవలే మలైకా తన స్నేహితులతో కలిసి క్రిస్మస్ వేడుకలు చేసుకుంది. అలాగే న్యూ ఇయర్ వేడుకల్లోనూ అర్జున్ కపూర్, మలైకా దూరంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో బ్రేకప్ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంత అనే దానిపై బాలీవుడ్ భామ క్లారిటీ ఇస్తేనే తెలుస్తుంది. ఇటీవలే మలైకా మొదటి భర్త అర్బాజ్ ఖాన్ 57 ఏళ్ల వయస్సులో రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మలైకా అరోరాకు నటుడు అర్బాజ్ ఖాన్ 1998 సంవత్సరంలో పెళ్లి జరిగింది. అయితే పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత అర్బాజ్, మలైకా విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికి ఓ కుమారుడు కూడా ఉన్నారు. -
ఆమెకు 50, అతడికి 38.. లవ్‌పై ట్రోలింగ్.. హీరో ఏమన్నాడంటే?
సెలబ్రిటీలను ఇష్టపడేవాళ్లుంటారు.. ఉత్తి పుణ్యానికే వాళ్లపై విమర్శలు గుప్పించేవాళ్లూ ఉంటారు. వారు ఏదైనా ఫోటో షేర్ చేసినా, బయటకు వెళ్లినా, ఖరీదైన వస్తువులు కొన్నా, బ్రాండెడ్ అండ్ వెరైటీ డ్రెస్సులు వేసుకున్నా, ఎవరినైనా ప్రేమించినా, ప్రియురాలికి బ్రేకప్ చెప్పినా, భార్యకు విడాకులిచ్చినా.. ఏం చేసినా సరే తిట్లదండకం అందుకోవడానికి రెడీగా ఉంటారు. ఆమెకు 50 అతడికి 38.. అలా సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రోలింగ్ బారిన పడేవారిలో హీరో అర్జున్ కపూర్ ఒకరు. ఈయన వయసు 38 ఏళ్లు. ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇతడికో ప్రియురాలు ఉంది. ఆవిడే ఐటం సాంగ్ డ్యాన్సర్, బాలీవుడ్ నటి మలైకా అరోరా. ఈమె వయసు 50. గతంలో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకోగా వీరికి ఒక బాబు జన్మించాడు. కానీ భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు రావడంతో 2017లో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి అర్జున్ కపూర్‌కు మరింత దగ్గరైంది మలైకా. వయసు వ్యత్యాసంపై ట్రోలింగ్ అయితే కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకును తీసుకొచ్చే అమ్మాయిని పార్ట్నర్గా ఎంచుకోవడమేంటి? నీకంటే 12 ఏళ్లు పెద్ద.. అలాంటి ఆంటీతో లవ్వేంటి? అని నెటిజన్లు తరచూ సూటిపోటి మాటలతో అర్జున్ను వేధిస్తూనే ఉన్నారు. తాజాగా హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న కాఫీ విత్ కరణ్ 8వ సీజన్లో పాల్గొన్న అర్జున్ ఈ ట్రోలింగ్‌పై స్పందించాడు. 'ట్రోలింగ్ వల్ల ఎప్పుడో ఒకసారైనా బాధపడని వ్యక్తి అంటూ ఎవరూ ఉండరు. కానీ దాన్ని ఎలా డీల్ చేస్తామనేది ముఖ్యం. లైకుల కోసం చిల్లరపనులు.. ఈ ట్రోలింగ్ వల్ల.. తప్పుడు కామెంట్లు చేసేవారి పద్ధతులు, వక్రబుద్ధి బయటపడుతుంది. ఏదిపడితే అది కామెంట్లు చేసి మన దృష్టిని ఎలాగోలా ఆకర్షించాలనుకుంటారు. మొదట్లో నేను కూడా వారి కామెంట్లకు స్పందించాలనుకున్నాను. కానీ వారికి నేను అటెన్షన్ ఇవ్వడమేంటని తర్వాత లైట్ తీసుకున్నాను. లైకుల కోసం ఇలాంటి చిల్లరపనులు చేస్తుంటారు. మళ్లీ ఇలాంటివారే మనం కనిపించగానే సెల్ఫీల కోసం ఎగబడుతారు' అని అర్జున్ కపూర్ చెప్పుకొచ్చాడు. చదవండి: వీరప్పన్ స్వయంగా చెప్పిన సంఘటనలతో డాక్యుమెంటరీ సిరీస్.. అక్కడే స్ట్రీమింగ్