బాలీవుడ్‌లో ఓ స్టార్ జంట బ్రేకప్ చెప్పుకుందని వార్తలు గుప్పుమంటున్నాయి. ఏళ్ల తరబడి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న మలైకా అరోరా- అర్జున్ కపూర్ ఎవరి దారి వారు చూసుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఈ లవ్ బర్డ్స్ ఇంతవరకు స్పందించలేదు. వారి బంధానికి కాలపరిమితి ముగిసిందని, అందుకే విడిపోయారని పలువురూ భావిస్తున్నారు.
మనసులో స్థానం అలాగే..
జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఇండస్ట్రీలోని ఓ వ్యక్తి ఈ బ్రేకప్‌పై స్పందిస్తూ.. మలైకా, అర్జున్‌ల మధ్య ఎంతో అనుబంధం ఉంది. బ్రేకప్ తర్వాత కూడా వారు దాన్ని కొనసాగిస్తారు. ఒకరి మనసులో ఒకరికి ప్రత్యేక స్థానం అలాగే ఉంటుంది. బ్రేకప్ గురించి మాట్లాడేందుకు వారు సుముఖత చూపడం లేదు. దీని గురించి చర్చ జరగడం కూడా వారికి ఇష్టం లేదు అని తెలిపారు.
ఐదేళ్లుగా ప్రేమాయణం
కాగా మలైకా అరోరా, అర్జున్ కపూర్ 2019లో తాము డేటింగ్‌లో ఉన్న విషయాన్ని బయటపెట్టారు. పార్టీలు, ఫంక్షన్స్‌కు సైతం కలిసి వెళ్లేవారు. కలిసున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండేవారు. అయితే గతేడాది.. వీరి ప్రేమ బంధం ముగిసిందంటూ వార్తలు రాగా వాటిని మలైకా కొట్టిపారేసింది.
తనకంటే చిన్నవాడితో లవ్
అలాగే తనకంటే 12 ఏళ్లు చిన్నవాడిని ప్రేమించిందని విమర్శలు రాగా దానికి కూడా గట్టి కౌంటరిచ్చింది. ప్రేమకు వయసుతో పనేంటని ప్రశ్నించింది. ఇంతలా ఒకరికొకరు తోడునీడుగా ఉన్న వీళ్లు విడిపోయారని మరోసారి వార్తలు వస్తుండటంతో అభిమానులు కంగారుపడుతున్నారు. మలైకా- అర్జున్ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారనుకుంటే ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment