బాలీవుడ్ భామ మలైకా అరోరా బీటౌన్‌లో అందరికీ సుపరిచితమే. అయితే ఇటీవల ఆమె తండ్రి మరణం తర్వాత ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. కారణం ఆమె మాజీ భర్త అర్బాజ్ ఖాన్, బాయ్‌ఫ్రెండ్ అర్జున్ కపూర్ ఆమెను పరామర్శించేందుకు వచ్చారు. అంతకుముందే 2018 నుంచి అర్జున్ కపూర్‌తో డేటింగ్‌లో ఉందంటూ చాలాసార్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత తమ రిలేషన్‌పై వీరిద్దరు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు.
అయితే తాజాగా ముంబయిలోని దివాళీ బాష్‌కు అర్జున్ కపూర్ హజరయ్యారు. ఈ సందర్భంగా మలైకా అరోరా గురించి కొందరు ఆరా తీశారు. దీంతో తాను ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చారు. అర్జున్ కామెంట్స్‌తో ఈ జంట విడిపోయినట్లు తెలుస్తోంది. అతని మాటలు విన్న మలైకా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. హృదయం, ఆత్మ అంటూ మలైకా రాసుకొచ్చారు. మన హృదయాన్ని ఒక్క సెకను తాకడం వల్ల.. జీవితాంతం మన ఆత్మను తాకవచ్చంటూ మనసులో మాటను బయటపెట్టింది.
బాలీవుడ్ ఐటమ్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న మలైకా.. సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్‌ని 1998లోనే పెళ్లి చేసుకుంది. కానీ మనస్పర్థల కారణంగా 2017లో విడాకులు తీసుకుంది. ఇది జరిగిన ఏడాదికే హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ మొదలుపెట్టింది. వీళ్లిద్దరూ కలిసే ఉన్నారు. చాలా ఫారెన్ టూర్స్‌కి వెళ్లారు. అప్పట్లో వీరి ఫొటోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment