హీరో రామ్‌చరణ్ (Ram Charan) మరోసారి బిగ్‌బాస్ షోకి వెళ్లనున్నాడు. మొన్న తెలుగు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా వచ్చి సందడి చేశాడు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ (Game Changer Movie) చిత్ర ప్రమోషన్స్ కోసం హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్‌కు వెళ్లనున్నాడట! వీకెండ్ కా వార్ ఎపిసోడ్‌లో చరణ్ స్టేజీపై కనిపించనున్నాడంటూ ప్రచారం ఊపందుకుంది.
గేమ్ ఛేంజర్ చిత్రాన్ని హిందీలోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి వారికి హైప్ ఎక్కించడం కోసం చరణ్ బిగ్‌బాస్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. హోస్ట్, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)తో ముచ్చటించి తన సినిమా ట్రైలర్‌ను చూపించనున్నారట! కాగా సల్మాన్- చరణ్ మధ్య ఇదివరకే స్నేహం ఉంది.
(చదవండి: Game Changer: తగ్గిన రామ్ చరణ్ రెమ్యునరేషన్!)
సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలోని ఏంటమ్మా పాటలో చరణ్, వెంకటేశ్ స్టెప్పులతో అదరగొట్టారు. సల్లూభాయ్ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు చరణ్ ఇంటికి పిలిచి ఆతిథ్యమిస్తుంటాడు. అటు చరణ్ ముంబై వెళ్లినప్పుడు కూడా సల్మాన్ తనను ఇంటికి ఆహ్వానిస్తుంటాడు. వీరిద్దరి కలయిక కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
గేమ్ ఛేంజర్ విషయానికి వస్తే శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటించారు. అంజలి కీలక పాత్ర పోషించింది. ఎస్‌జే సూర్య విలన్‌గా నటించాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జనవరి 10న విడుదల కానుంది.
చదవండి: 'కలెక్టర్‌కి ఆకలేస్తోంది అంటా'... 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ చూసేయండి
Comments
Please login to add a commentAdd a comment