బిగ్‌బాస్‌ షోలోకి టాలీవుడ్‌ బ్యూటీ.. ఈసారి పక్కాగా..! | Is Sameera Reddy Participate In Bigg Boss Show? Check Out The Details Of Starting Date | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ షోలోకి టాలీవుడ్‌ హీరోయిన్‌.. ఈసారైనా పక్కాగా..

Published Wed, Aug 7 2024 4:36 PM | Last Updated on Wed, Aug 7 2024 6:08 PM

Is Sameera Reddy Participate in Bigg Boss Show?

మరికొద్ది రోజుల్లో బిగ్‌బాస్‌ షో ప్రారంభం కానుంది. తెలుగులో, తమిళంలో బిగ్‌బాస్‌ 8వ సీజన్‌ మొదలు కానుండగా హిందీలో 18వ సీజన్‌ షురూ కానుంది. ఇప్పటికే ఈ మూడు సీజన్ల కోసం కంటెస్టెంట్ల వేట మొదలుపెట్టారు. ఈపాటికే కొందర్ని ఫైనల్‌ చేయగా మరికొందరు పారితోషికం దగ్గర బేరాలాడుతున్నారు.

బ్యూటీకి ఆహ్వానం..
ఇదిలా ఉంటే హీరోయిన్‌ సమీరా రెడ్డి సైతం రియాలిటీ షోలో భాగం కానుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలోనూ ఆమె షో మేకర్స్‌ నుంచి ఆహ్వానం అందింది. కానీ పలు కారణాల వల్ల ఆ ఆఫర్‌ను వదులుకుంది. అయితే ఈసారి మాత్రం సమీరా రావడం పక్కా అంటున్నారు.

తెలుగులో..
కాగా హిందీ బిగ్‌బాస్‌ 18వ సీజన్‌ అక్టోబర్‌ 5న ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియను బట్టి ఈ తేదీలో మార్పుచేర్పులు ఉండవచ్చు. సమీరా విషయానికి వస్తే ఈమె తెలుగులో నరసింహుడు, అశోక్‌ చిత్రాల్లో నటించింది. 2012లో వచ్చిన కృష్ణం వందే జగద్గురుం సినిమాలో స్పెషల్‌ సాంగ్‌లో ఆడిపాడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement