
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కొద్దిరోజుల క్రితం గాయపడ్డాడు. షూటింగ్‌లో అతడి పక్కటెముకలకు గాయమైందని తెలిసింది. అయినప్పటికీ ఆ బాధను భరిస్తూనే తన పనులు చక్కబెట్టుకుంటున్నాడు. నడవడానికి, కూర్చోవడానికి ఇబ్బందిగా ఉన్నా సరే విశ్రాంతి తీసుకోకుండా ఈవెంట్స్‌లో హాజరవుతున్నాడు.
బిగ్‌బాస్ షో..
ప్రస్తుతం సికిందర్ సినిమా చేస్తున్న సల్లూభాయ్ మరోవైపు హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్‌ను షురూ చేసే పనిలో పడ్డాడు. ఈ బిగ్‌బాస్ ఈవెంట్‌లోనే తన ఇబ్బందిని బయటపెట్టాడు. తనకు రెండు పక్కటెముకలు విరిగాయని, ఈ గాయం తాను అనుకున్నదానికంటే కూడా సీరియస్‌గా ఉందని పేర్కొన్నాడు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అంటూ ఫోటో, వీడియో జర్నలిస్టులకు సూచించాడు. సల్మాన్ ఇబ్బందిని గమనించిన అభిమానులు అంత కష్టంలోనూ పనిధ్యాసే అని పొగుడుతున్నారు.
థీమ్ ఏంటంటే?
బిగ్‌బాస్ విషయానికి వస్తే.. హిందీలో ఇప్పటివరకు ఈ రియాలిటీ షో 17 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. 18వ సీజన్ త్వరలోనే రాబోతుందని తెలియజేస్తూ సల్మాన్‌తో ఓ ప్రోమో కూడా షూట్ చేశారు. ఈసారి గతం-వర్తమానం-భవిష్యత్తు అనే థీమ్‌తో బిగ్‌బాస్ షోను నడిపించనున్నారట! మరి ఈ థీమ్ ఏంటి? అది ఎలా వర్కవుట్ అవుతుందనేది రానున్న రోజుల్లో తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment