'మా అమ్మాయి నిప్పు'.. నటి బండారం బయటపెట్టిన సల్మాన్‌ | Bigg Boss 18: Salman Khan Exposes Chahat Pandey Exposed Personal Life, Deets Inside | Sakshi
Sakshi News home page

'నా కూతురికి బాయ్‌ఫ్రెండ్‌ లేడు, రాడు!' నటి బండారం బట్టబయలు చేసిన సల్మాన్‌

Published Sat, Jan 4 2025 9:17 PM | Last Updated on Sun, Jan 5 2025 5:57 PM

Bigg Boss 18: Salman Khan Exposes Chahat Pandey Exposed Personal Life

'మా అమ్మాయి నిప్పు.. తనకు బాయ్‌ఫ్రెండ్‌ అంటూ ఎవరూ లేరు. అబ్బాయిలతో అంత సన్నిహితంగా ఉన్నదే లేదు. భవిష్యత్తులో కూడా తను ఎవరినీ ప్రేమించదు. నేను చూపించిన అబ్బాయిని తప్ప ఇంకెవర్నీ పెళ్లి చేసుకోదు. అనవసరంగా తన గురించి లేనిపోనివి మాట్లాడితే బాగోదు' అంటూ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చింది నటి (Chahat Pandey) చాహత్‌ పాండే తల్లి భావన పాండే. బుల్లితెర నటి చాహత్‌ ప్రస్తుతం హిందీ బిగ్‌బాస్‌ 18 (Bigg Boss 18)వ సీజన్‌లో పాల్గొంది. 

ఉతికారేసిన చాహత్‌ తల్లి
ఇటీవల ఫ్యామిలీ వీక్‌లో భాగంగా చాహత్‌ తల్లి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టింది. ఆ సమయంలోనే తన కూతురితో కయ్యం పెట్టుకుంటున్న అవినాష్‌ మిశ్రాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పై కామెంట్స్‌ చేసింది. ఈ వ్యవహారం అంతటితో ముగిసిపోలేదు. నిజంగానే చాహత్‌ సింగిలా? అని బిగ్‌బాస్‌ టీమ్‌కు డౌట్‌ వచ్చింది. తనకు ప్రియుడు ఉండొచ్చన్న అనుమానంతో సోషల్‌ మీడియా అంతా జల్లెడపట్టారు. ఈ క్రమంలో ఓ ఫోటో దొరికింది. అందులో ప్రియుడు లేడు కానీ ప్రేమలో ఉన్నట్లు యానివర్సరీ సెలబ్రేట్‌ చేసుకుంది.

(చదవండి: గేమ్‌ ఛేంజర్‌ ఈవెంట్‌కు హీరోయిన్‌ డుమ్మా.. ఎందుకంటే?)

మీ అమ్మ సర్టిఫికెట్‌ ఇచ్చింది!
ఇంకేముంది, దాన్ని పట్టేసుకున్నారు. తాజా ప్రోమోలో సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan).. అమ్మాయిల వెంటపడే అబ్బాయిలంటే నీకస్సలు ఇష్టముండదని మీ అమ్మ చెప్పింది. అంటే నువ్వు ఎలాంటిదానివో చెప్తూ మంచి సర్టిఫికెట్‌ ఇచ్చి వెళ్లిపోయింది. మా టీమ్‌ ఇది నిజమేనా? అని నిర్ధారించుకునే క్రమంలో ఒకటి కనుగొన్నారు. అదేంటో మీరూ చూసేయండి అంటూ ఫోటో చూపించాడు. 

యానివర్సరీ ఫోటో.. మరి ఇదేంటి?
ఆ ఫోటోలో 'ఐదేళ్లు పూర్తయ్యాయి. హ్యాపీ యానివర్సరీ మై లవ్‌' అని కేక్‌పై రాసి ఉంది. ఆ కేక్‌ పక్కనే చాహత్‌ కూర్చుని ఉంది. అది చూసి చాహత్‌ కంగారుపడగా.. తనతో పాటు సీరియల్స్‌ చేసిన అవినాష్‌.. ఇప్పటికైనా నిజం ఒప్పుకో, సెట్‌లో అందరికీ ఆ విషయం తెలుసు అని చెప్పాడు. కానీ చాహత్‌ ఒప్పుకోలేదు.

ఇంత దిగజారుతారా?
అయితే ఈ వ్యవహారంలో పలువురు నెటిజన్లు బిగ్‌బాస్‌ టీమ్‌నే తప్పుపడుతున్నారు. తన పర్సనల్‌ లైఫ్‌లో ఏం జరిగిందో తెలుసుకుని మరీ అందరి ముందు దోషిగా నిలబెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. అది తన వ్యక్తిగతమని, దానివల్ల మిగతావారికేంటి సమస్య? అని నిలదీస్తున్నారు. బిగ్‌బాస్‌ టీమ్‌ ఇంత దిగజారుతుందనుకోలేదంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: 'దేవర'కు 100 రోజులు.. ఎన్ని కేంద్రాలు, ఎక్కడెక్కడ..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement