ఇక్కడ కూడా మనశ్శాంతి లేదా?.. హౌస్‌లో భార్యభర్తల పంచాయతీ! | Netizens slam Vicky Jain for disrespecting wife Ankita Lokhande In Bigg Boss | Sakshi
Sakshi News home page

Bigg Boss: ఇంత నీచంగా ఎప్పుడు చూడలేదు?.. విక్కీ తీరుపై నెటిజన్స్‌ ఫైర్!

Published Fri, Oct 27 2023 12:54 PM | Last Updated on Fri, Oct 27 2023 1:31 PM

Netizens slam Vicky Jain for disrespecting wife Ankita Lokhande In Bigg Boss  - Sakshi

హిందీ బిగ్‌ బాస్ సీజన్ -17 విజయవంతంగా కొనసాగుతోంది. అయితే ఈ షోకు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహహరిస్తున్నారు. ఈ సీజన్‌లో భార్యా భర్తలైన బుల్లితెర నటీ అంకితా లోఖాండే, విక్కీ జైన్ కంటెస్టెంట్స్‌గా హౌస్‌లో అడుగుపెట్టారు. హౌస్‌లోకి ప్రవేశించినప్పటి నుండి వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కనిపించింది. దీంతో ఆమె భర్త విక్కీ జైన్‌ తీరుపై నెటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.  తాజా ఎపిసోడ్‌లో విక్కీ.. అంకితను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తనను చూసి ముఖం చాటేస్తోందని ఆరోపించారు. 

(ఇది చదవండి: పిచ్చోడంటూ తిట్టిన శోభ.. ఉగ్రరూపం దాల్చిన ప్రిన్స్‌)

విక్కీ మాట్లాడుతూ.. "నువ్వు నీలోని నీచమైన బుద్ధిని చూపిస్తున్నావు. అది నాకు ఇష్టం లేదు. నీ చుట్టూ ఉన్నవాళ్లంటే కనీస గౌరవం కూడా లేదు. ఈ ఇంట్లో కనీసం ఒకరితోనైనా మీరు మంచిగా ఉన్నావా? ఎవరినీ లెక్కచేయవు. ఇంత వరస్ట్‌గా నిన్ను ఎప్పుడూ చూడలేదు. కనీసం నన్ను ఇక్కడైన కాస్తా మనశ్శాంతిగా ఉండనివ్వండి. నీ ప్రవర్తన చూస్తుంటే నాకు సిగ్గుగా అనిపిస్తోంది." అని అంకితతో అన్నాడు. అయితే విక్కీ తీరుపై నెటిజన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హౌస్‌లో అంకిత పట్ల అతని తీరు ఏం బాగాలేదని కామెంట్స్ చేస్తున్నారు. .

ఓ నెటిజన్ రాస్తూ.. అంకితకు ఇంత చెడ్డ భర్త ఉన్నాడా? ఆమెతో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఏది ఏమైనా ఇతరుల ముందు ఆమెపై అరవవడం ఏంటి? అని పోస్ట్ చేశారు. మరో నెటిజన్ రాస్తూ.. “ఆమెలాంటి భర్త విక్కీని ఎవరూ కోరుకోరు. నేను అతనిని ద్వేషిస్తున్నాను అంటూ రాసుకొచ్చింది.  ఏది ఏమైనా బిగ్‌బాస్ హోస్‌లో భార్య పట్ల విక్కీ జైన్ అలా వ్యవహరించడం సరికాదని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

(ఇది చదవండి: రూ.1000 కోట్ల కల.. డిసెంబర్‌ వరకు వెయిట్‌ చేయాల్సిందే!)

#AnkitaLokhande and her spat with #VickyJain! I think both are very strong headed about their perceptions! Vicky believes his game to be right and wants her to be cordial to the housemates while ankita doesn’t seem on the same page!#BB17#BiggBoss17

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement