
బిగ్‌బాస్ షోలో వారం రోజులు కంటెస్టెంట పర్ఫామెన్స్ చూస్తే వీకెండ్‌లో హోస్ట్ వారికి ఎలా కోటింగ్ ఇస్తారు? ఎవరిని మెచ్చుకుంటారు? అని ఎదురుచూస్తుంటారు ఆడియన్స్. అందుకే వీకెండ్‌లో రేటింగ్ కూడా ఎక్కువే ఉంటుంది. కొందరు హీరోలు బిగ్‌బాస్ బాధ్యతను ఏళ్ల తరబడి భుజాలపై మోస్తున్నారు.
బిగ్‌బాస్ షోకు డుమ్మా
వారిలో సల్మాన్ ఖాన్ ముందు వరుసలో ఉంటాడు. దాదాపు 15 ఏళ్లుగా ఆయన హిందీ బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం 18వ సీజన్‌కు హోస్టింగ్ చేస్తున్నాడు. అయితే ఈ వారం అతడు షూటింగ్‌కు డుమ్మా కొట్టనున్నాడట! ప్రస్తుతం అతడు సికిందర్ సినిమా చేస్తున్నాడు. హైదరాబాద్‌లో సినిమా షెడ్యూల్ ఉండటంతో బిగ్‌బాస్ షో నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నాడు.

సల్మాన్ స్థానంలో ఆ సెలబ్రిటీలు
దీంతో ఈ వారం వీకెండ్ కా వార్ ఎపిసోడ్‌లో సల్మాన్ స్థానంలో సెలబ్రిటీలు ఏక్తా కపూర్, రోహిత్ శెట్టి రానున్నారు. వీళ్ల స్పెషల్ ఎంట్రీ గురించి షో నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు. ఇక సికిందర్ సినిమా విషయానికి వస్తే.. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. సాజిద్ నదియావాలా నిర్మిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment