Bigg Boss 15 Finale Highlights: Tejasswi Prakash Is The Winner - Sakshi
Sakshi News home page

Bigg Boss 15 Finale Highlights: టాప్‌-3లో లవ్‌బర్డ్స్‌.. చివరికి టైటిల్‌ ఎవరికంటే..

Published Mon, Jan 31 2022 4:38 PM | Last Updated on Mon, Jan 31 2022 5:51 PM

Bigg Boss 15 Finale Highlights: Tejasswi Prakash Is The Winner - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా వ్యవమరించిన హిందీ  బిగ్‌బాస్‌ సీజన్‌ 15 ముగిసింది.  24మంది సెలబ్రిటీలతో సుమారు 120 రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. విన్నర్‌గా ఎవరు నిలుస్తారనే ఉత్కంఠకు తెరపడింది. ప్రతీక్‌ సెహజ్‌ పాల్‌- తేజస్విని మధ్య సాగిన టైటిల్‌ రేసులో చివరికి సీరియల్‌ నటి తేజస్విని ప్రకాశ్‌ విజయం సాధించింది.

బిగ్‌బాస్‌ సీజన్‌-15 ట్రోఫీతో పాటు  రూ.40 లక్షల నగదు బహుమతిని అందుకుంది. అంతేకాకుండా  పాపులర్‌ నాగిని సీరియల్‌ తర్వాతి సీక్వెల్‌ (నాగిని-6)లో నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది.

కాగా 2015లో వచ్చిన 'స్వరాగిణి' సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయిన తేజస్విని ఆ సీరియల్‌తో ఎంతోమంది అభిమానాన్ని సం‍పాదించుకుంది. బిగ్‌బాస్‌ రియాలిటీ షోతో ఇప్పుడు మరింత పాపులర్‌ అయ్యింది. ఇక ఈ సీజన్‌లో ప్రతీక్‌ రన్నరప్‌గా నిలవగా, కరణ్‌ కుంద్రా, షమితా శెట్టి మూడు, నాలుగో స్థానంలో నిలిచారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement