మనిషి ఎప్పుడూ ఒకేలా ఉండడు. కాలం మారేకొద్దీ తను ఎంతోకొంత మారుతూ ఉంటాడు. అలా తాను కూడా చాలా మారానంటున్నాడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్. హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆయన వీకెండ్ కా వార్ ఎపిసోడ్‌లో పాల్గొన్నాడు. రజత్ అనే కంటెస్టెంట్ ప్రవర్తన తప్పని వారించాడు.
ఒకప్పుడు నాదీ అదే యాటిట్యూడ్
ఎవరైనా ఉన్నప్పుడు టేబుల్‌పై దర్జాగా కాలుపెట్టి మాట్లాడటం తప్పని, ఆ యాటిట్యూడ్ మార్చుకోవాలని హితవు పలికాడు. తాను కూడా ఒకప్పుడు రూడ్‌గా ఉండేవాడినంటూ అందుకు సంబంధించిన ఓ ఉదాహరణను చెప్పుకొచ్చాడు. టేబుల్‌కు కాళ్లు అనించే అలవాటు నాక్కూడా ఉంది. గతంలో ఓ పోలీస్ స్టేషన్‌లో కాళ్లు టేబుల్‌కు ఆనించి ఠీవీగా కూర్చున్నాను. నేను ఏ తప్పూ చేయనప్పుడు ఎందుకు భయపడాలి? అన్నట్లుండేది నా వాలకం.
పొగరుగా..
కానీ ఎవరైనా సీనియర్ అధికారులు బ్యాడ్జ్ ధరించి వచ్చినప్పుడు లేచి గౌరవించాలి. ఆ పాత క్లిప్పింగ్స్ చూసినప్పుడు నేనేమీ గర్వంగా ఫీలవను. అంత పొగరుగా కూర్చోవాల్సిన అవసరమేముంది? అనుకునేవాడిని. పోలీసులను అగౌరవపర్చేలా అంత అహంకారంగా ఎందుకు ప్రవర్తించాననుకున్నాను. ఎంత అనుకున్నా.. దాన్నిప్పుడు మార్చలేను కదా!
నీ కంటే పెద్ద గొంతు
ఇప్పుడు నీపై కూడా అంతే రూడ్‌గా మాట్లాడొచ్చు. నీ కంటే నా గొంతు పెద్దది. కానీ నేనలా గొంతు పెంచి అరవాలనుకోవడం లేదు అని చెప్పాడు. తన తప్పు అందరి ముందు ఒప్పుకోవాలంటే గుండె ధైర్యం కావాలి.. నువ్వు రియల్ హీరో అంటూ సల్మాన్‌ను పొగుడుతూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment