
బిగ్ బాస్ సీజన్- 17తో ఫేమస్ అయిన జంట సమర్థ్ జురెల్- ఇషా మాల్వియా. గతేడాది జరిగిన షోలో వీరిద్దరు మరింత రెచ్చిపోయారు. ఏకంగా ఓకే బెడ్‌పై నిద్రించిన వీడియో అప్పట్లో తెగ వైరలైంది. హౌస్‌లో సమర్థ్ జురెల్, ఇషా తీరు దారుణంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. 19 ఏళ్ల వయసులో ఇలా చేయడమేంటి? అంటూ ఇషాను ట్రోల్ చేశారు. అంతే కాకుండా ఇది బిగ్‌బాస్ షోనా.. అడల్ట్ షోగా మార్చేశారా అంటూ మండిపడ్డారు. అదే హౌస్‌లో ఇషా మాజీ భాయ్ ఫ్రెండ్ అభిషేక్ కుమార్ కూడా ఉన్నారు.
అయితే ఈ జంటపై గతంలో చాలాసార్లు డేటింగ్ రూమర్స్ వచ్చాయి. ఉదరియన్ అనే సీరియల్‌లో నటించే సమయంలో వీరి మధ్య రిలేషన్ మొదలైనట్లు తెలుస్తోంది. దీంతో బిగ్‌బాస్ షో ద్వారా తమ రిలేషన్ నిజమేనని ధృవీకరించారు. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక వీరిద్దరు తమ బంధానికి ముగింపు పలకనున్నట్లు టాక్ వినిపించింది. ఈ జంట త్వరలోనే బ్రేకప్ కానుందని నెట్టింట తెగ వైరలైంది. కానీ ఈ రూమర్స్‌పై ఇషా కానీ, సమర్థ్ కానీ స్పందించలేదు.
(ఇది చదవండి: 'పెళ్లికి ముందు సహజీవనం'.. ఉచిత సలహాపై మండిపడ్డ నటి!)
తాజాగా ఈ జంట బ్రేకప్ చెప్పుకున్నట్లు అర్థమవుతోంది. వీరిద్దరూ తమ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తమ అభిమాను జంట బ్రేకప్ కావడంపై ఫ్యాన్స్ షాకవుతున్నారు. అయితే ఈ జంట బ్రేకప్‌కు గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఈ విషయంపై మాత్రం బుల్లితెర జంట నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా.. ఇషా మాల్వియా ఇటీవల పలు మ్యూజిక్ వీడియోలలో కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment