ప్రియుడితో బిగ్‌బాస్‌ బ్యూటీ బ్రేకప్.. అందుకే అలా చేశారా? | Tejasswi Prakash and Karan Kundrra To Not Announce Breakup Anytime Soon | Sakshi
Sakshi News home page

Tejasswi Prakash: ప్రియుడితో బుల్లితెర నటి బ్రేకప్‌.. చెక్‌ పెట్టేశారా?

Published Wed, Jun 26 2024 4:16 PM | Last Updated on Wed, Jun 26 2024 4:22 PM

Tejasswi Prakash and Karan Kundrra To Not Announce Breakup Anytime Soon

బిగ్ బాస్ బ్యూటీ  తేజస్వీ ప్రకాశ్ బాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. బిగ్ బాస్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న నటి హిందీలో పలు సీరియల్స్‌లో నటిస్తోంది. ఆమె ప్రస్తుతం ఏక్తా కపూర్ సూపర్ నేచురల్ టీవీ షో నాగిన్- 6లో నటిస్తోంది. అంతేకాదు తేజస్వి ప్రకాష్ బిగ్‏బాస్-15 సీజన్‌ విజేతగా నిలిచింది. అయితే బిగ్‌బాస్‌ షోలో ఉన్న సమయంలోనే నటుడు కరణ్ కుంద్రాను ప్రేమించింది. గత మూడేళ్లుగా ఈ జంట డేటింగ్‌లో ఉన్నారు.

తాజాగా వీరిద్దరు తమ ప్రేమ బంధానికి గుడ్‌ బై చెప్పినట్లు తెలుస్తోంది. కరణ్, తేజస్వీ దాదాపు నెల రోజుల క్రితమే బ్రేకప్‌ చెప్పుకున్నట్లు సమాచారం. కొంతకాలంగా వీరి మధ్య చిన్న చిన్న అభిప్రాయభేదాలు తలెత్తాయని.. దీంతో బ్రేకప్‌ నిర్ణయానికి వచ్చారని వారి సన్నిహితులు తెలిపారు. అయితే విడిపోయినట్లు వస్తున్న వార్తలపై తేజస్వీ ప్రకాశ్, కరణ్ కుంద్రా ఇప్పటివరకు స్పందించలేదు.

అయితే ఇటీవలే కొద్ది రోజుల క్రితమే కరణ్, తేజస్వి ముంబయిలోని జంటగా కనిపించారు. నగరంలోని ప్రముఖ రెస్టారెంట్ వెలుపల ఫోటోగ్రాఫర్‌లకు పోజులిచ్చారు. బ్రేకప్ రూమర్స్‌ నేపథ్యంలో ఇద్దరు జంటగా కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తాము విడిపోతున్నట్లు వార్తలు రావడంతో వాటికి చెక్‌ పెట్టేందుకే జంటగా కనిపించారా? అన్నది తెలియాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement