'అది చూసి నేనే షాకయ్యా'.. తనికెళ్ల భరణి వీడియో రిలీజ్ | Tanikella Bharani Comments On Present Social Media Over Misleading Thumbnails And Fake Claims On Him, Video Went Viral | Sakshi
Sakshi News home page

Tanikella Bharani: 'ఇష్టమొచ్చిన‍ట్లు రాసేస్తున్నారు'.. తనికెళ్ల భరణి వీడియో రిలీజ్

Mar 3 2026 4:05 AM | Updated on Mar 3 2026 11:18 AM

Tanikella Bharani comments on present social media

సోషల్ మీడియా గురించి టాలీవుడ్ నటుడు తనికెళ్ల భరణి మాట్లాడారు. తనికెళ్ల భరణి ఆస్తులు చూస్తే మీరంతా షాక్ అని ఒకరు థంబ్‌నెయిల్ రాసుకొచ్చారు. నిజంగా అది చూశాకా నేనే షాకయ్యా.. ఇంటిముందు అరడజన్ కార్లు కూడా ఉన్నాయని చూపించాడు. అదంతా చూసి మేము నవ్వుకున్నామని తెలిపారు.

ఇప్పుడు ఒకదేశంపై యుద్ధం జరుగుతోంది.. నేను ఒక దేశానికి సపోర్ట్ చేస్తున్నట్లు.. ఒక వర్గానికి మద్దతుగా చేస్తున్నట్లు ఇష్టమొచ్చినట్లు పెట్టేస్తున్నారని తనికెళ్ల భరణి అన్నారు. నేను అన్ని వర్గాలు, మతాలను గౌరవిస్తానని.. ఎవరికీ వ్యతిరేకం కాదని అన్నారు. నేను ఎప్పుడు ఇలాంటివి చేయలేదని.. భవిష్యత్తులో చేయనని తెలిపారు. ఇవీ చూసి నా మిత్రులు, శ్రేయోభిలాషులు బాధపడి ఉంటారని వెల్లడించారు. దయచేసి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు.. స్పందించవద్దని తనికెళ్ల భరణి కోరారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement