
హీరోయిన్, ఐటమ్ సాంగ్స్ చేసి గుర్తింపు తెచ్చుతున్న నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్. తెలుగులోనూ ప్రభాస్ సాహో మూవీలో నటించింది. కెరీర్ పరంగా ఎప్పుడూ ఏదో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉండే ఈమె.. సడన్ గా ఆస్పత్రిలో కనిపించింది. ఈమె తల్లి ఐసీయూలో ఉండటమే దీనికి కారణం.
(ఇదీ చదవండి: పరువు పోతుందని భయపడ్డాను.. ఒకప్పటి హీరోయిన్ సుహాసిని)
శ్రీలంకకు చెందిన జాక్వెలిన్.. చాన్నాళ్ల క్రితమే మన దేశానికి వచ్చేసింది. హిందీ మూవీస్ చేస్తూ ముంబైలో సెటిలైపోయింది. తెలుగు, కన్నడ, తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె తల్లితో పాటు కలిసుంటోంది. అయితే జాక్వెలిన్ తల్లి కిమ్ కి సోమవారం గుండెపోటు రావడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇంకా ఆమె ఐసీయూలోనే ఉన్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ కూడా పరామర్శించి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఐపీఎల్ లో గౌహతి వేదికగా గురువారం కోల్ కతా-రాజస్థాన్ మ్యాచ్ జరగనుంది. దీనికి ముందు ప్రారంభోత్సవ వేడుకలకు జాక్వెలిన్ హాజరై ఫెర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంది. కానీ తల్లి ఐసీయూలో ఉండటంతో దీనికి నో చెప్పేసింది. ప్రస్తుతాకైతే ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: మిలియన్ డాలర్ 'కోర్ట్'.. నానికి ఇది చాలా స్పెషల్)
Comments
Please login to add a commentAdd a comment