
మలైకా అరోరా పేరు చెప్పగానే ఐటమ్ సాంగ్స్ గుర్తొస్తాయి. తర్వాత డేటింగ్ వ్యవహారం గుర్తొస్తుంది. ఎందుకంటే హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ పెళ్లి చేసుకున్న ఈమె.. దాదాపు 19 ఏళ్ల తర్వాత విడాకులు ఇచ్చేసింది. కొన్నాళ్లకు తన కంటే చిన్నవాడైన అర్జున్ కపూర్ తో ప్రేమలో పడింది.
(ఇదీ చదవండి: మోనాలిసాకి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ అరెస్ట్)
మూడు నాలుగేళ్ల పాటు అర్జున్-మలైకా తెగ తిరిగారు. టూర్లకు కూడా కలిసి వెళ్లారు. పెళ్లి ఏమైనా చేసుకుంటారేమో అని అందరూ అనుకుంటున్న టైంలో విడిపోయి షాకిచ్చారు. ప్రస్తుతానికైతే మలైకా ఒంటరిగానే ఉంటోంది. అలాంటిది ఇప్పుడు ఈమె మరోసారి ప్రేమలో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
చెన్నై-రాజస్థాన్ జట్ల మధ్య ఆదివారం రాత్రి గౌహతిలో ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. దీనికి హాజరైన మలైకా.. లంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర పక్కన కూర్చుని కనిపించింది. దీంతో వీళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారా అంటూ బాలీవుడ్ మీడియా ఉదయం నుంచి తెగ ఉదరగొట్టేస్తుంది. మరోవైపు మలైకా సన్నిహితులు మాత్రం.. అనుకోకుండా పక్కన కూర్చున్నంత మాత్రం డేటింగ్ అనేస్తారా అని అంటున్నారు. అంటే డేటింగ్ కామెంట్స్ అన్ని గాసిప్స్ అనమాట.
(ఇదీ చదవండి: 'సికిందర్' తొలిరోజు కలెక్షన్స్.. మరీ ఇంత తక్కువా?)