kumara sangakkara
-
అతన్ని ఓపెనర్‌గా పంపండి.. సెహ్వాగ్‌లా సక్సెస్ అవుతాడు..!
ఐపీఎల్ 2022 సీజన్లో పరుగుల వరద (863 పరుగులు) పారించి, ఆతర్వాత నెదర్లాండ్తో జరిగిన వన్డే సిరీస్‌లో అంతకుమించిన బీభత్సం (162, 86 నాటౌట్) సృష్టించిన ఇంగ్లండ్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ జోస్ బట్లర్ గురించి శ్రీలంక లెజెండరీ ఆటగాడు, రాజస్థాన్ రాయల్స్ కోచ్ కుమార సంగక్కర ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బట్లర్‌ను టెస్ట్‌ల్లో 6, 7 స్థానాల్లో కాకుండా ఓపెనర్‌గా పంపిస్తే సెహ్వాగ్‌లా సూపర్ సక్సెస్ అవుతాడని సంగక్కర అభిప్రాయపడ్డాడు. బట్లర్ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓపెనర్‌గా వచ్చి వేగంగా పరుగులు రాబట్టడంతో పాటు సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడిన వైనాన్ని ఇందుకు ఉదహరించాడు. సెహ్వాగ్ టీమిండియలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో అతన్ని కూడా లోయర్ ఆర్డర్లో పంపారని, ఆతర్వాత ఓపెనర్‌గా ప్రమోషన్ వచ్చాక సెహ్వాగ్ ఏం చేశాడో ప్రపంచమంతా చూసిందని అన్నాడు. ఈతరంలో బట్లర్ అంత విధ్వంసకర ఆటగాడిని చేడలేదని, అతన్ని టెస్ట్‌ల్లో కూడా ఓపెనర్‌గా ప్రమోట్ చేస్తే రెడ్ బాల్ క్రికెట్లోనూ రికార్డులు తిరగరాస్తాడని జోస్యం చెప్పాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో రెచ్చిపోయి ఆడే బట్లర్ టెస్ట్‌ల్లో తేలిపోతున్న నేపథ్యంలో సంగక్కర్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు 57 టెస్ట్‌లు ఆడిన బట్లర్.. 2 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీల సాయంతో 31.92 సగటున 2907 పరుగులు మాత్రమే చేశాడు. ఇంగ్లండ్ గతేడాది యాషెస్‌లో దారుణ పరాభవం ఎదుర్కొన్న అనంతరం బట్లర్ టెస్ట్ జట్టులో చోటు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే లిమిటెడ్ ఓవర్స్‌లో అతని భీకర ఫామ్ తిరిగి టెస్ట్ జట్టులో చోటు సంపాదించిపెడుతుందని అంతా అనుకున్నారు. అయితే టీమిండియాతో జరిగే ఐదో టెస్ట్‌కు బట్లర్‌కు పిలుపు రాకపోవడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, కొత్త కెప్టెన్ (స్టోక్స్), కొత్త కోచ్ (మెక్కల్లమ్) ఆధ్వర్యంలో ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌పై హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి టీమిండియాకు ఛాలెంజ్ విసురుతుంది. భారత్‌తో జరిగే 5వ టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ ఫోక్స్, జాక్ లీచ్, అలెక్స్ లీస్, క్రెయిగ్ ఓవర్టన్, జామీ ఓవర్టన్, మాథ్యూ పాట్స్, ఓలీ పోప్, జో రూట్ చదవండి: టీమిండియాతో ఐదో టెస్టు.. జట్టును ప్రకటించిన ఇంగ్లండ్..! -
లంక ఆర్థిక సంక్షోభం.. తరలివస్తున్న మాజీ క్రికెటర్లు
శ్రీలంక ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఆర్థిక సంక్షోభం కారణంగా లంక రూపాయి విలువ దారుణంగా పడిపోడవడంతో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజుకు 12 గంటల పాటు కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నారు. ఈ సంక్షోభానికి ప్రధాన కారణమైన ఆ దేశ అధ్యక్షుడు గొటబోయ రాజపక్స గద్దె నుంచి దిగిపోవాలంటూ వారం రోజుల నుంచి ప్రజలు సెక్రటరియట్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రజలు చేస్తున్న పోరాటానికి లంక మాజీ దిగ్గజ క్రికెటర్.. రాజకీయ నేత అర్జున రణతుంగ తన మద్దతు ఇచ్చారు. క్రికెట్ రిత్యా వేరే దేశాల్లో ఉన్న లంక క్రికెటర్లు కూడా ఆటను వదిలి వారం పాటు లంకకు వచ్చి ప్రజల పోరాటానికి మద్దతు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కాగా రణతుంగ వ్యాఖ్యలు పలువురు మాజీ క్రికెటర్లను కదిలించాయి. సహచర మాజీ క్రికెటర్.. సనత్ జయసూర్య ఇప్పటికే రణతుంగతో కలిసి గొటబయ రాజపక్సకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశాడు. ''ఈరోజు బయట మా అభిమానులు తినడానికి తిండి లేక అల్లాడిపోతున్నారు. ఇంకా అధికారిక ప్రభుత్వానికి భజన చేస్తూ కూర్చోలేం.. ప్రజలకు మా అవసరం ఉంది.. అందుకే ప్రత్యక్ష పోరాటానికి దిగాం.. క్రీడాకారులైనా సరే.. దేశం కష్టాల్లో ఉందంటే చూస్తూ ఊరుకోరు.'' అంటూ రణతుంగ పేర్కొన్నాడు. కాగా జయసూర్య నినాదాలు చేస్తూనే రాజపక్స ఇంటి ముందు ఏర్పాటు చేసిన బారికేడ్లు దూకే ప్రయత్నం చేయడం ఆసక్తి కలిగించింది. అయితే పోలీసులు అడ్డుకోవడంతో జయసూర్య లోపలికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. కాగా వీరిద్దరికి తాజాగా మరికొందరు మాజీ క్రికెటర్లు పరోక్షంగా తమ మద్దతు తెలిపారు. రాజకీయపరంగా నిరకుంశ పాలనతో దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని.. గొటబయ రాజపక్స గద్దె దిగాలని మాజీ క్రికెటర్ మహేళ జయవర్దనే అభిప్రాయపడ్డాడు. మరో మాజీ క్రికెటర్ కుమార సంగక్కర కూడా ట్విటర్ వేదికగా తన నిరసనను వ్యక్తం చేశాడు. ఇక మాజీ టెస్టు క్రికెటర్.. ఐసీసీ మ్యాచ్ రిఫరీ రోషన్ మహనామా శ్రీలంక ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని గతంలో జింబాబ్వే ఎదుర్కొన్న సంక్షోభంతో పోల్చాడు. అప్పుడు రాబర్ట్ ముగాబే.. ఇప్పుడు గొటబయ రాజపక్స ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ''కొన్ని సంవత్సరాల క్రితం నేను జింబాబ్వే వెళ్లినప్పుడు.. అక్కడి ప్రజలు రాబర్ట్ ముగాబే ప్రభుత్వంపై త్రీవ నిరసన వ్యక్తం చేశారు. నా కారు డ్రైవర్ డీజిల్ తేవడానికి గంటల పాటు క్యూలైన్లో నిల్చోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి నా దేశంలో రావద్దని కోరుకున్నా. కానీ నా అంచనా తలకిందులైంది. ఒకప్పుడు జింబాబ్వే ఎదుర్కొన్న సంక్షోభాన్ని ఇప్పుడు లంక ప్రజలు అనుభవిస్తున్నారు'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Dhammika Prasad: నిరాహారదీక్షకు దిగిన శ్రీలంక మాజీ క్రికెటర్ Arjuna Ranatunga: దేశం తగలబడిపోతుంటే ఐపీఎల్ ముఖ్యమా.. వదిలి రండి! -
శ్రీలంకలో ఎమర్జెన్సీ.. నిరసనకారులకు మద్దతు తెలుపుతున్న క్రికెటర్లు
Top Sri Lanka Cricketers Back Anti Government Protests: ఆర్ధిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంకలో విధించిన అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)పై ఆ దేశ దిగ్గజ క్రికెటర్లు, ఐపీఎల్ 2022 సీజన్లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టార్ ఆటగాళ్లు, హెడ్ కోచ్‌లు గళం విప్పారు. తమ దేశం ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకోవడానికి, దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కడానికి శ్రీలంక ప్రభుత్వ తీరే కారణమని వారు ఆరోపించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా దేశంలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతు తెలిపారు. లంక ఆర్థిక వ్యవస్థను కొందరు వ్యక్తులు తమ గుప్పిట్లో ఉంచుకుని ఈ దుర్భర పరిస్థితులకు కారణమయ్యారని ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేళ జయవర్దనే ట్విటర్ వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. లంకలో ఎమర్జెన్సీ విధించడం.. కఠినమైన కర్ఫ్యూ చట్టాలను అమలుచేయడం చూస్తుంటే చాలా బాధగా ఉందని వాపోయాడు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం.. వారి బాగోగులను గాలికొదిలేసి, నిరంకుశంగా వ్యవహరించడం బాధాకరమని అన్నాడు. ఈ పరిస్థితుల్లో ప్రజల తరఫున పోరాడుతున్న న్యాయవాదులు, విద్యార్థులకు మద్దతు తెలుపుతున్నానని పేర్కొన్నాడు. జయవర్ధనేతో పాటు రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగక్కర, పంజాబ్ కింగ్స్ ఆటగాడు భానుక రాజపక్సలు నిరసనకారులకు మద్దతు తెలిపారు. తాను భారత్‌లో ఐపీఎల్ ఆడుతున్నప్పటికీ తన మనసంతా అక్కడే (శ్రీలంక) ఉందని రాజపక్స ఆవేదన వ్యక్తం చేయగా, నా దేశ ప్రజల దుస్థితి చూస్తుంటే కడుపు తరుక్కు పోతుందంటూ సంగక్కర వాపోయాడు. సోమవారం కొలొంబోలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో సంగక్కర భార్య యహేలి కూడా పాల్గొన్నారు. కాగా, శ్రీలంకలో ఆర్థిక ఎమర్జెన్సీకి తోడు ద్రవ్యోల్బణం కూడా అదుపు తప్పడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. కిలో బియ్యం రూ. 220, గోధుమలు రూ. 190, చక్కెర రూ. 240, పాల పౌడర్ రూ. 1,900, కోడి గుడ్డు రూ. 30 వరకు పలుకుతుంది. చదవండి: IPL 2022: ప్లే ఆఫ్స్‌కు లక్నో, గుజరాత్..! -
‘అత్యుత్తమ స్పిన్నర్లతో జట్టు రాత మారుస్తాం’
గత మూడు సీజన్లలో 7, 8, 7 స్థానాలకే పరిమితమైన రాజస్తాన్ రాయల్స్ ఈసారి మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందని జట్టు హెడ్ కోచ్ కుమార సంగక్కర విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘ప్రపంచ క్రికెట్లోని ఇద్దరు అత్యుత్తమ, వైవిధ్యమైన స్పిన్నర్లు అశ్విన్, చహల్ మా జట్టులో ఉన్నారు. బౌల్ట్ తదితర ఆటగాళ్లు కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. గతంలో చేసిన కొన్ని తప్పులను పునరావృతం చేయకుండా ప్రయత్నిస్తాం’ అని సంగక్కర అభిప్రాయ పడ్డాడు. -
IPL 2022: సంగక్కర తొండాట.. అమాంతం పెరిగిపోయిన ఆర్చర్ ధర..!
ఐపీఎల్ 2022 మెగా వేలం రెండో రోజు(ఫిబ్రవరి 13) సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ డైరెక్టర్ కుమార సంగక్కర వింత ప్రవర్తన పలు అనుమానాలకు తావిచ్చింది. ఇంగ్లండ్ ఆటగాడు జోఫ్రా అర్చర్‌కు సంబంధించి లైవ్ అక్షన్ జరుగుతుండగా సంగక్కర ప్రవర్తించిన తీరుపై ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రత్యర్ధి జట్లకు సైగలు చేస్తూ.. ఆర్చర్ ధర అమాంతంగా పెరిగిపోయేలా చేసిన సంగక్కర చీటింగ్‌కు పాల్పడ్డాడని సోషల్‌మీడియా కోడై కుస్తుంది. ఇందుకు తగిన ఆధారాలు కూడా లభించడంతో అభిమానులు సంగక్కరపై విమర్శలు గుప్పిస్తున్నారు. దిగ్గజ ఆటగాడిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా ప్రవర్తించడమేంటని ప్రశ్నిస్తున్నారు. Sanga was trying to convince other teams to increase the bid 😏 pic.twitter.com/H6GRKU1Myk — ᧁꪖꪊ᥅ꪖꪜ (@ImGS_08) February 13, 2022 వివరాల్లోకి వెళితే.. ఐపీఎల్ మెగా వేలం రెండో రోజు ఆసక్తికరంగా సాగుతుండగా, ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ 2 కోట్ల రూపాయల బేస్ ప్రైజ్ విభాగంలో వేలంలోకి వచ్చాడు. అయితే, ఆర్చర్ ఈ సీజన్లో ఆడడని తెలిసి కూడా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు అతని కోసం పోటీ పడటం మొదలెట్టాయి. వేలంలో ఆర్చర్ ధర 6 కోట్ల వద్దకు రాగానే రాజస్థాన్ పాకెట్లో డబ్బులు అయిపోవడంతో ఆ ఫ్రాంచైజీ డైరెక్టర్ కుమార సంగక్కర చీటింగ్‌కు పాల్పడ్డాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమకు దక్కని ఆర్చర్‌కు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ముంబై ఇండియన్స్‌తో పోటీ పడాలని సన్ రైజర్స్‌కు సైగలు చేశాడు సంగక్కర. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో సంగక్కరపై ముప్పేట దాడి మొదలైంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి చీటింగ్ పాల్పడటానికి సిగ్గు లేదా అంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. సంగక్కరపై ఐపీఎల్ పాలక మండలి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా, అర్చర్ విషయంలో పట్టువదలని ముంబై ఇండియన్స్ అతన్ని 8 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. అతడు ఐపీఎల్ 2022 సీజన్‌కు అందుబాటులో ఉండడని తమకు తెలుసని, బుమ్రా- ఆర్చర్ కాంబినేషన్ అద్భుతంగా ఉంటుందని భావించి, వచ్చే ఏడాది కోసమే ఆర్చర్‌ను సొంతం చేసుకున్నామని ముంబై యాజమాన్యం వివరణ ఇవ్వడం కొసమెరుపు. చదవండి: IPL 2022: మిశీ భాయ్, నీ సేవలకు సలాం.. ఢిల్లీ జట్టు ఎప్పటికీ నీదే..! -
‘సింగిల్’ కాంట్రవర్సీపై సంగక్కార
ముంబై: పంజాబ్ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతిని సిక్స్ కొట్టడంలో విఫలమై ఔటైన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ సామ్సన్‌కు ఆ జట్టు డైరెక్టర్ కుమార సంగక్కార మద్దతుగా నిలిచాడు. ప్రధానంగా ఆఖరి ఓవర్ ఐదో బంతికి సింగిల్ తీసే అవకాశం ఉన్నా దాన్ని వద్దని తనే స్టైకింగ్ తీసుకోవడంపై విమర్శలు వవ్చాయి. క్రిస్ మోరిస్‌కు కూడా బ్యాటింగ్ చేయగలడు కదా.. ఆ బంతికి సింగిల్ తీసి ఉంటే ఆఖరి బంతిని మోరిస్ ఫోర్ కొడితే రాజస్తాన్ రాయల్స్ గెలిచేది కదా అంటూ చాలా మంది పెదవి విరిచారు. సామ్సన్ సింగిల్‌కు యత్నించకపోవడాన్ని కామెంటరీ బాక్స్‌లో ఉన్న సైమన్ డౌల్ కూడా తప్పుబట్టాడు. ‘నేను చూసింది నమ్మలేకపోతున్నా. కనీసం సింగిల్ తీసుంటే పరిస్థితి మరోలా ఉండేది. చివరి బంతిని మోరిస్ ఫోర్ కొడితే సరిపోయేది’ అంటూ కాస్త సెటైరిక్‌గా మాట్లాడాడు. దానిని అక్కడే ఉన్న సునీల్ గావస్కర్ ఖండించాడు. ‘మోరిస్ చేయగలడు. కానీ అప్పటివరకూ అతని స్టైక్‌రేట్ 50 ఉందనే విషయం గ్రహించాలి. నాలుగు బంతులు ఆడి రెండు పరుగులే తీశాడు’ అని సంజూ నిర్ణయానికి మద్దతుగా నిలిచాడు. ఇప్పుడు అదే విషయంపై రాజస్తాన్ రాయల్స్ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ కుమార సంగక్కార మాట్లాడుతూ.. సామ్సన్ చేసిన పనిని ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నాడు. ‘సంజూ తనపై ఉన్న ఆత్మవిశ్వాసంతో అలా చేశాడు. అతను చేయాల్సిందంతా చేశాడు. అతను ఆఖరి బంతికి కొట్టిన షాట్ 5-6 యార్డ్ల బౌండరీకి ముందు పడింది. నువ్వు ఫామ్‌లో ఉన్నప్పుడు ఆ పని నేను చేయగలను అనే నమ్ముతారు. అందుకే ఆ బాధ్యతను సామ్సన్ భుజాన వేసుకున్నాడు. ఇక్కడ సంజూ తీసుకున్న నిర్ణయాన్ని నేను సమర్ధిస్తా. ఆ సింగిల్ ఎందుకు తీయలేదనే మనం మాట్లాడుకుంటున్నాం. అది కేవలం ఒక కమిట్మెంట్తో తీసుకున్న నిర్ణయం. ఎవరి బలం ఏమిటో వారికి కచ్చితంగా తెలుస్తుంది. ఆ షార్ట్ సిక్స్‌కు వెళ్లుంటే పరిస్థితి మరోలా ఉండేది. బౌండరీలైన్‌కు కొద్ది దూరంలోనే సామ్సన్ ఔటయ్యాడు. వచ్చే మ్యాచ్‌ల్లో సామ్సన్ ఏమిటో చూపిస్తాడు. ఇప్పుడు ఎలా అయితే ఔటయ్యాడో దాన్ని సరిచేసుకుని 10 యార్డ్ల అవతలి పడేలా చేస్తాడు. నాకు సామ్సన్‌పై నమ్మకం ఉంది.. రాజస్తాన్‌కు విజయాలు అందించే సత్తా సామ్సన్లో ఉంది’ అని సంగక్కార పేర్కొన్నాడు. -
గంగూలీ తగిన వ్యక్తి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా వ్యవహరించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తగిన వ్యక్తి అని శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర అభిప్రాయ పడ్డాడు. గంగూలీ తెలివితేటలు క్రికెట్ పరిపాలనలో ఉపయోగపడతాయని అతను అన్నాడు. ‘నా దృష్టిలో గంగూలీ ఎంతో సూక్ష్మబుద్ధి కలవాడు. క్రికెటర్‌గా అతని ఘనతలు చూసి మాత్రమే కాకుండా గంగూలీ బుర్రను చూసి నేను అభిమానినయ్యా. ఐసీసీ పదవిలో ఉన్నవారు ఒక దేశపు బోర్డు గురించి కాకుండా అందరి గురించి, క్రికెట్ మేలు గురించి మాత్రమే ఆలోచించాలి. అది గంగూలీ చేయగలడని నా నమ్మకం. అతని ఆలోచనా దృక్పథం అలాంటిది. బీసీసీఐ అధ్యక్షుడిగా ఎంపిక కాకముందే, పరిపాలనలో, కోచింగ్‌లో రాకముందే గంగూలీ ఏమిటో నేను చూశాను. ఎంసీసీ క్రికెట్ కమిటీలో సభ్యుడిగా ఆటగాళ్లందరితో అతను సత్సంబంధాలు నెరపడం అతని సమర్థతను సూచిస్తోంది’ అని సంగక్కర వివరించాడు. త్వరలోనే ఐసీసీ చైర్మన్ ఎంపిక జరగనున్న నేపథ్యంలో గంగూలీ పేరుపై కూడా తీవ్ర చర్చ జరుగుతోంది. -
జాతి వివక్షపై లంక మాజీ స్టార్ కీలక వ్యాఖ్యలు
కొలంబో : వర్ణ, జాతి వివక్షను రూపుమాపాలంటే చిన్నప్పటినుంచే పిల్లలకు దానిపై అవగాహన పెంచాలని మాజీ క్రికెటర్ కుమార సంగక్కర అభిప్రాయ పడ్డాడు. అందుకు వాస్తవ చరిత్రను వారు చదివేలా చూడాలని, వడబోసిన చరిత్రను కాదని అతను అన్నాడు. విలువల గురించి నేర్పించకుండా ఎంత పెద్ద చదువులు చదివినా వివక్షను తొలగించలేమని ఈ లంక మాజీ స్టార్ వ్యాఖ్యానించాడు. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’పై స్పందిస్తూ సంగక్కర... ఎంతో పెద్ద చదువులు చదివినవారు కూడా ఘోరంగా ప్రవర్తించడాన్ని తాను చూశానని, వివక్షను రూపుమాపడం ఒక్క రోజులో సాధ్యం కాదని స్పష్టం చేశాడు. మరో వైపు ఇకపై పుట్టబోయే పిల్లల బర్త్ సర్టిఫికెట్లో మతం, జాతి వివరాలు నమోదు చేయమని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. (సెప్టెంబర్ 19నుంచి ఐపీఎల్!) -
సమాధానం లేని ప్రశ్నలెన్నో?
ముంబై: ప్రస్తుత పరిస్థితుల మధ్య టి20 ప్రపంచ కప్ నిర్వహణ విషయంలో కచ్చితమైన నిర్ణయం తీసుకోవడం కష్టంగా మారిందని శ్రీలంక మాజీ కెప్టెన్ సంగక్కర అన్నాడు. కోవిడ్–19 నేపథ్యంలో ప్రతీ రోజు కొత్త సమస్యలు ముందుకు వస్తున్నాయని అతను అన్నాడు. క్రికెట్ నిబంధనలు రూపొందించే ప్రతిష్టాత్మక మెరిలిబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)కి అధ్యక్షుడిగా కూడా సంగక్కర వ్యవహరిస్తున్నాడు. ‘ప్రపంచ కప్ నిర్వహణ గురించి అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను చూస్తే ఈ ఏడాదికి టోర్నీని రద్దు చేయడం, వాయిదా వేయడం వంటివి ఉన్నాయి. మనకు ఇంకా సమాధానం లభించని ప్రశ్నలు చాలా ఉన్నాయి. కరోనా వైరస్ ఎప్పటి వరకు ఉంటుంది? దానితో కలిసి బతకడం అలవాటు చేసుకోవాలా? అదే జరిగితే మున్ముందు చాలా మార్పులు వస్తాయి. వీటన్నింటిపై ఇప్పుడు మనకు ఎవరు స్పష్టతనిస్తారు. ఐసీసీ కూడా నిపుణుల అభిప్రాయం తీసుకోవాల్సిందే’ అని సంగక్కర వ్యాఖ్యానించాడు. -
సంగక్కర పదవీకాలం పొడిగింపు
లండన్: ప్రతిష్టాత్మక మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) అధ్యక్షుడిగా కుమార సంగక్కర మరో ఏడాది పాటు కొనసాగనున్నాడు. అతని పదవీ కాలాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగించేందుకు ఎంసీసీ సిద్ధమైంది. ఈ మేరకు జూన్ 24న జరుగనున్న వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించి దీనిపై ఆమోదముద్ర వేయనున్నట్లు ఎంసీసీ ప్రకటించింది. ‘కరోనా నేపథ్యంలో సంగక్కర పదవీ కాలాన్ని పొడిగించాలని కమిటీ నిర్ణయించింది. ఇలా జరగడం ఇదేం మొదటిసారి కాదు. మామూలుగానైతే అధ్యక్షుని పదవీ కాలం 12 నెలలు మాత్రమే. కానీ అనుకోని పరిస్థితుల్లో దీన్ని పొడిగించే వెసులుబాటు ఉంది’ అని క్లబ్ పేర్కొంది. గతేడాది అక్టోబర్ 1న ఎంసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఈ శ్రీలంక మాజీ ప్లేయర్... ఈ పీఠాన్ని అధిష్టించిన తొలి బ్రిటిషేతర వ్యక్తిగా ఘనత సాధించాడు. -
పాకిస్తాన్లో పర్యటించండి: సంగక్కర
లండన్: పాకిస్తాన్లో అంతర్జాతీయ క్రికెట్ పునరుద్ధరణకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలు ముందుకు రావాలని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) అధ్యక్షుడు, శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర అన్నాడు. సరైన భద్రతా చర్యల నడుమ పాక్‌లో పర్యటించడం కష్టమేం కాదన్నాడు. ‘ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లేదా దక్షిణాఫ్రికా జట్లు పాక్‌లో పర్యటించాలి. భద్రత పరంగా అన్ని చర్యలు తీసుకుంటాం అని హామీ ఇస్తున్నప్పుడు ఒక్కసారి అక్కడ ఆడటం గురించి అందరూ ఆలోచించాలి. ఇలా చేస్తే ప్రపంచ క్రికెట్‌కు మరింత మేలు కలుగుతుంది’ అని సంగక్కర పేర్కొన్నాడు. -
రెండో టెస్టు:ముగిసిన రెండో రోజు ఆట
-
వీడ్కోలు టెస్టులో నిరాశపర్చిన సంగక్కర!
కొలంబో: మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక వెటరన్ ఆటగాడు కుమార సంగక్కర నిరాశపరిచాడు. తన వీడ్కోలు టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో సంగక్కర(32) స్వల్ప స్కోరుకే పెవిలియన్ కు చేరాడు. టీమిండియా స్పిన్నర్ అశ్విన్ వేసిన బంతి సంగా బ్యాట్ ను ముద్దాడి స్లిప్ లో ఉన్న రహానే కు దొరికింది. దీంతో సంగా 'చివరి' తొలి ఇన్నింగ్స్ కు తెరపడింది. అంతకుముందు ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య స్టేడియంలోకి వచ్చిన సంగాక్కరకు టీమిండియా ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ హానర్ తెలిపారు. సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడిన సంగాకు చివరి మ్యాచ్ ఘనంగా ఉంటే బావుంటుందని సగటు క్రీడాభిమాని భావించాడు. అయితే తొలి ఇన్నింగ్స్ లో ఆ అవకాశం చేజార్చుకున్న సంగా.. రెండో ఇన్నింగ్స్ లో రాణిస్తాడో?లేదో?వేచి చూడాల్సిందే. ముగిసిన రెండో రోజు ఆట టీమిండియా 349 పరుగుల వద్ద తన తొలి ఇన్నింగ్స్ ను ముగించడంతో బ్యాటింగ్ కు దిగిన ఓపెనర్ కరుణ రత్నే(1) వికెట్ ను ఆదిలోనే చేజార్చుకుంది.మరో ఓపెనర్ కౌశల్ సిల్వా(51)రాణించడంతో శ్రీలంక కాస్త కుదుట పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక మూడు వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. ఇంకా 253 పరుగులు వెనుకబడివున్న శ్రీలంకను తిరుమన్నే(28*), మాథ్యూస్(19*)లు ఆదుకునే యత్నం చేస్తున్నారు. -
కుమార సంగక్కర అరుదైన రికార్డు!
నాలుగు పదుల వయసు దగ్గర పడుతున్నా.. రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ పోతున్నాడు శ్రీలంక బ్యాట్స్‌మన్ కుమార సంగక్కర. తాజాగా స్కాట్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ కొట్టడంతో కెరీర్ చివరి అంకంలో కూడా మరో కొత్త రికార్డు నెలకొల్పాడు. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇప్పటివరకు ఎవరూ సాధించనట్లుగా.. వరుసగా నాలుగు మ్యాచ్‌లలో నాలుగు సెంచరీలు కొట్టాడు. ఇప్పటివరకు ఎవరూ ఈ ఫీట్ సాధించలేదు. స్కాట్లండ్‌పై 124 పరుగులు బాదడంతో ఈ రికార్డు సంగక్కర పేరుమీద నమోదైపోయింది. ఇంతకుముందు ఆస్ట్రేలియాపై 104, ఇంగ్లండ్‌పై 117 నాటౌట్, బంగ్లాదేశ్‌పై 105 నాటౌట్.. ఇలా వరుసపెట్టి నాలుగు మ్యాచ్లలోను నాలుగు సెంచరీలు కొట్టాడు. అలాగే ప్రపంచకప్‌లో కూడా ఏ బ్యాట్స్‌మన్ అయినా ఈ ఫీట్ సాధించడం ఇదే తొలిసారి. సంగక్కరకు ముందు ఆరుగురు బ్యాట్స్‌మన్ వరుసగా మూడేసి మ్యాచ్‌లలో సెంచరీలు కొట్టారు గానీ నాలుగో మ్యాచ్‌లో కొట్టలేకపోయారు. వాళ్లు.. జహీర్ అబ్బాస్, సయీద్ అన్వర్ (పాక్), హెర్ష్లీ గిబ్స్, ఏబీ డివీలియర్స్, క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా), రాస్ టేలర్ (న్యూజిలాండ్). ఇక ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్‌తో సంగక్కర 14వేల పరుగులు కూడా పూర్తిచేశాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్ కూడా సంగక్కరే. -
శ్రీలంకదే వన్డే సిరీస్
పల్లెకెలె: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే శ్రీలంక 4-2తో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఆరో వన్డేలో శ్రీలంక 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 50 ఓవర్లలో 7 వికెట్లకు 292 పరుగులు చేసింది. సం గక్కర (112 బంతుల్లో 112; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేయగా... దిల్షాన్ (68) రాణించాడు. ఇంగ్లండ్ 41.3 ఓవర్లలో 202 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. రూట్ (55), వోక్స్ (41) మినహా అందరూ విఫలమయ్యారు. లంక బౌలర్లలో లక్మల్ నాలుగు, సేనానాయకే మూడు వికెట్లు తీశారు. -
సంగక్కర, మాథ్యూస్ అర్థ సెంచరీలు
అహ్మదాబాద్: భారత్ తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక ఆటగాళ్లు కుమార సంగక్కర, మాథ్యూస్ అర్థ సెంచరీలు సాధించారు. ముందుగా సంగక్కర హాఫ్ సెంచరీ చేశాడు. 73 బంతుల్లో 3 ఫోర్లతో అర్థ సెంచరీ పూర్తిచేశాడు. వన్డేల్లో అతకిది 87వ హాఫ్ సెంచరీ. నాలుగు పరుగులకే వికెట్ పడిన తరుణంలో క్రీజ్ లోకి వచ్చిన సంగక్కర... దిల్షాన్, మాథ్యూస్ తో కలిసి విలువైనభాగస్వామ్యాలు నెలకొల్పాడు. చక్కటి సమన్వయంతో ఆచితూచి ఆడాడు. మాథ్యూస్ తో కలిసి జట్టు స్కోరును పెంచాడు. 86 బంతుల్లో 61 పరుగులు చేసి సంగక్కర నాలుగో వికెట్ గా అవుటయ్యాడు. మాథ్యూస్ 63 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ తో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో మాథ్యూస్ కు ఇది 23వ హాఫ్ సెంచరీ. -
సంగక్కర అజేయ సెంచరీ
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 252/2 పాక్‌తో తొలి టెస్టు గాలే: సీనియర్ బ్యాట్స్‌మన్ కుమార సంగక్కర సూపర్ ఫామ్‌తో అదరగొడుతున్నాడు. తన చివరి 11 ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలు, ఆరు అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్న ఈ 36 ఏళ్ల బ్యాట్స్‌మన్ తాజాగా పాక్‌తో జరుగుతున్న తొలి టెస్టులోనూ అజేయ శతకం (218 బంతుల్లో 102 బ్యాటింగ్; 13 ఫోర్లు)తో తన సత్తాను చాటుకున్నాడు. ఇది అతడి కెరీర్లో 37వ శతకం కాగా పాక్‌పై 10వది. టెస్ట్ క్రికెట్లో అత్యధిక సెంచరీల జాబితాలో సచిన్ (51), కలిస్ (45), పాంటింగ్ (41) మాత్రమే సంగకు ముందు ఉన్నారు. మరోవైపు ఈ సిరీస్‌తో టెస్టు కెరీర్‌కు ముగింపు పలుకనున్న మహేల జయవర్ధనే (109 బంతుల్లో 55 బ్యాటింగ్; 6 ఫోర్లు) చక్కటి అర్ధ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి ఆటతీరుతో పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రెండో రోజు లంక 80 ఓవర్లలో రెండు వికెట్లకు 252 పరుగులు చేసింది. ఇంకా 199 పరుగులు వెనుకబడి ఉండగా చేతిలో ఎనిమిది వికెట్లున్నాయి. ఆటకు మరో పది ఓవర్లు మిగిలి ఉండగా భారీ వర్షం కురవడంతో మ్యాచ్ సాధ్యం కాలేదు. ఓపెనర్ సిల్వా (140 బంతుల్లో 64; 11 ఫోర్లు) రాణించాడు. అంతకుముందు 99/1 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం ఆటను ప్రారంభించిన ఆతిథ్య జట్టును కట్టడి చేయడంలో పాక్ బౌలర్లు విఫలమయ్యారు. జయవర్ధనే బ్యాటింగ్‌కు దిగిన సమయంలో పాఠశాల విద్యార్థులచే గార్డ్ ఆఫ్ ఆనర్ లభించింది. 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అంపైర్ ఎల్బీ నిర్ణయాన్ని సవాల్ చేసిన మహేల లాభపడ్డాడు. మూడో వికెట్‌కు వీరిప్పటికే 108 పరుగులు జోడించారు. -
260 పరుగులు... 9 వికెట్లు
రసవత్తరంగా శ్రీలంక, దక్షిణాఫ్రికా టెస్టు గాలే: విజయంపై ధీమాతో తమ రెండో ఇన్నింగ్స్‌ను 206/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన దక్షిణాఫ్రికా ఇప్పుడు చిక్కుల్లో పడింది. 370 పరుగుల ఆధిక్యం సాధించడంతో పాటు మ్యాచ్‌కు ఇంకా ఒకటిన్నర రోజుల సమయం ఉండడంతో శ్రీలంకను సులువుగానే ఆలౌట్ చేయవచ్చని సఫారీ జట్టు భావించింది. అయితే లంక ఆటగాళ్లు అంత సులువుగా లొంగలేదు. శనివారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 32 ఓవర్లలో వికెట్ నష్టానికి 110 పరుగులతో దీటైన జవాబిచ్చారు. ఇక చివరి రోజు ఆదివారం మరో 260 పరుగులు చేస్తే చాలు అద్భుత విజయాన్ని అందుకోవచ్చు. అందుకు తగ్గట్టుగానే లంక చేతిలో ఇంకా తొమ్మిది వికెట్లు ఉండగా క్రీజులో సూపర్ ఫామ్‌లో ఉన్న సంగక్కర (89 బంతుల్లో 58 బ్యాటింగ్; 7 ఫోర్లు; 1 సిక్స్)తో పాటు ఓపెనర్ సిల్వ (90 బంతుల్లో 37 బ్యాటింగ్; 5 ఫోర్లు) ఉన్నాడు. మూడో ఓవర్లోనే తరంగ (13 బంతుల్లో 14; 2 ఫోర్లు) అవుట్ కావడంతో సఫారీల నిర్ణయం సరైనదే అనిపించినా సంగ, సిల్వ జోడి రెండో వికెట్‌కు అజేయంగా 96 పరుగులు జోడించింది. అంతకుముందు దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో వీలైనంత త్వరగా పరుగులు సాధించి ప్రత్యర్థి ముందు భారీ ఆధిక్యం ఉంచాలనే భావనతో ఆడింది. 50.2 ఓవర్లలో 206/6 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తూ కెప్టెన్ ఆమ్లా సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు.