సంగక్కర, మాథ్యూస్ అర్థ సెంచరీలు | kumara sangakkara, Mathews beats half century in ahmedabad ODI | Sakshi
Sakshi News home page

సంగక్కర, మాథ్యూస్ అర్థ సెంచరీలు

Published Thu, Nov 6 2014 3:49 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

సంగక్కర, మాథ్యూస్ అర్థ సెంచరీలు - Sakshi

సంగక్కర, మాథ్యూస్ అర్థ సెంచరీలు

అహ్మదాబాద్: భారత్ తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక ఆటగాళ్లు కుమార సంగక్కర, మాథ్యూస్ అర్థ సెంచరీలు సాధించారు. ముందుగా సంగక్కర హాఫ్ సెంచరీ చేశాడు. 73 బంతుల్లో 3 ఫోర్లతో అర్థ సెంచరీ పూర్తిచేశాడు. వన్డేల్లో అతకిది 87వ హాఫ్ సెంచరీ.

నాలుగు పరుగులకే వికెట్ పడిన తరుణంలో క్రీజ్ లోకి వచ్చిన సంగక్కర... దిల్షాన్, మాథ్యూస్ తో కలిసి విలువైనభాగస్వామ్యాలు నెలకొల్పాడు. చక్కటి సమన్వయంతో ఆచితూచి ఆడాడు. మాథ్యూస్ తో కలిసి జట్టు స్కోరును పెంచాడు. 86 బంతుల్లో 61 పరుగులు చేసి సంగక్కర నాలుగో వికెట్ గా అవుటయ్యాడు.

మాథ్యూస్ 63 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ తో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో మాథ్యూస్ కు ఇది 23వ హాఫ్ సెంచరీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement