కొలంబో : వర్ణ, జాతి వివక్షను రూపుమాపాలంటే చిన్నప్పటినుంచే పిల్లలకు దానిపై అవగాహన పెంచాలని మాజీ క్రికెటర్ కుమార సంగక్కర అభిప్రాయ పడ్డాడు. అందుకు వాస్తవ చరిత్రను వారు చదివేలా చూడాలని, వడబోసిన చరిత్రను కాదని అతను అన్నాడు. విలువల గురించి నేర్పించకుండా ఎంత పెద్ద చదువులు చదివినా వివక్షను తొలగించలేమని ఈ లంక మాజీ స్టార్ వ్యాఖ్యానించాడు. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’పై స్పందిస్తూ సంగక్కర... ఎంతో పెద్ద చదువులు చదివినవారు కూడా ఘోరంగా ప్రవర్తించడాన్ని తాను చూశానని, వివక్షను రూపుమాపడం ఒక్క రోజులో సాధ్యం కాదని స్పష్టం చేశాడు. మరో వైపు ఇకపై పుట్టబోయే పిల్లల బర్త్ సర్టిఫికెట్‌లో మతం, జాతి వివరాలు నమోదు చేయమని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. (సెప్టెంబర్ 19నుంచి ఐపీఎల్!)
Comments
Please login to add a commentAdd a comment