![International Masters League: India And Sri Lanka Masters Squads Unveiled](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/iml.jpg.webp?itok=fOpylpOV)
ఫిబ్రవరి 22 నుంచి భారత్‌లో జరుగనున్న ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (International Masters League) అరంభ ఎడిషన్ (2025) కోసం భారత్ (Indian Masters), శ్రీలంక (Sri Lanka Masters) జట్లను ఇవాళ (ఫిబ్రవరి 14) ప్రకటించారు. ఈ టోర్నీలో భారత మాస్టర్స్ జట్టుకు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) నాయకత్వం వహించనుండగా.. శ్రీలంక మాస్టర్స్‌కు కుమార సంగక్కర (Kumara Sangakkar) సారధిగా ఉంటాడు.
భారత మాస్టర్స్ జట్టులో సచిన్‌తో పాటు యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, అంబటి రాయుడు తదితర మాజీ స్టార్ ఆటగాళ్లు పాల్గొననున్నారు. శ్రీలంక మాస్టర్స్ జట్టులో సంగక్కర, కలువితరణ, ఉపుల్ తరంగ తదితర స్టార్లు పాల్గొంటున్నారు.
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లకు చెందిన మాజీలు, దిగ్గజాలు ఈ టోర్నీలో పాల్గొంటారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లను ప్రకటించాల్సి ఉంది. వెస్టిండీస్‌కు బ్రియాన్ లారా, ఆస్ట్రేలియాకు షేన్ వాట్సన్, సౌతాఫ్రికాకు జాక్ కల్లిస్, ఇంగ్లండ్‌కు ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహించనున్నారు.
ఈ టోర్నీలో వెస్టిండీస్ తరఫున క్రిస్ గేల్, సౌతాఫ్రికా తరఫున మఖాయ ఎన్తిని, ఇంగ్లండ్ తరఫున మాంటి పనేసర్ లాంటి మాజీ స్టార్లు పాల్గొంటున్నారు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ మొత్తం మూడు వేదికల్లో నిర్వహించబడుతుంది. మొదటి ఐదు మ్యాచ్‌లు నవీ ముంబైలో జరుగనుండగా.. ఆతర్వాతి ఆరు మ్యాచ్‌లకు రాజ్‌కోట్ వేదిక కానుంది. చివరి ఏడు మ్యాచ్‌లతో పాటు నాకౌట్ మ్యాచ్‌లు రాయ్‌పూర్‌లో జరుగనున్నాయి.
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఆరంభ ఎడిషన్ రౌండ్ రాబిన్ పద్దతిలో జరుగనుంది. ఈ దశలో ప్రతి జట్టు మిగతా ఐదు జట్లతో తలో మ్యాచ్ ఆడుతుంది. రౌండ్ రాబిన్ దశ అనంతరం మొదటి నాలుగు స్థానాల్లో ఉండే జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. సెమీస్‌లో విజేతలు మార్చి 16న రాయ్‌పూర్‌లో జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.
ఈ టోర్నీలోని మ్యాచ్‌లన్నీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ అవుతాయి. కలర్స్ సినీప్లెక్స్ (SD & HD), కలర్స్ సినీప్లెక్స్ సూపర్‌హిట్స్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. మ్యాచ్‌లన్నీ రాత్రి 7:30 గంటలకు మొదలవుతాయి. టోర్నీ తొలి మ్యాచ్‌లో శ్రీలంక.. భారత జట్టుతో తలపడుతుంది.
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో భారత మాస్టర్స్ జట్టు: సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, అంబటి రాయుడు, రాహుల్ శర్మ, షాబాజ్ నదీమ్, నమన్ ఓఝా (వికెట్‌కీపర్), స్టువర్ట్ బిన్నీ, వినయ్ కుమార్, ధవల్ కులకర్ణి, పవన్ నేగి, గురుకీరత్ మాన్, అభిమన్యు మిధున్
శ్రీలంక మాస్టర్స్ జట్టు: కుమార సంగక్కర (కెప్టెన్), రొమేశ్ కలువితరణ (వికెట్‌కీపర్), అషాన్ ప్రియరంజన్, ఉపుల్ తరంగ, లహీరు తిరుమన్నే, చింతక జయసింఘే, సీక్కుగే ప్రసన్న, జీవన్ మెండిస్, ఇసురు ఉడాన, దిల్‌రువన్ పెరీరా, చతురంగ డిసిల్వ, సురంగ లక్మల్, నువాన్ ప్రదీప్, దమ్మిక ప్రసాద్, అసేల గణరత్నే
Comments
Please login to add a commentAdd a comment