
లండన్: పాకిస్తాన్‌లో అంతర్జాతీయ క్రికెట్ పునరుద్ధరణకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలు ముందుకు రావాలని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) అధ్యక్షుడు, శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర అన్నాడు. సరైన భద్రతా చర్యల నడుమ పాక్‌లో పర్యటించడం కష్టమేం కాదన్నాడు. ‘ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లేదా దక్షిణాఫ్రికా జట్లు పాక్‌లో పర్యటించాలి. భద్రత పరంగా అన్ని చర్యలు తీసుకుంటాం అని హామీ ఇస్తున్నప్పుడు ఒక్కసారి అక్కడ ఆడటం గురించి అందరూ ఆలోచించాలి. ఇలా చేస్తే ప్రపంచ క్రికెట్‌కు మరింత మేలు కలుగుతుంది’ అని సంగక్కర పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment