హోబర్ట్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టీ20లో ఆస్ట్రేలియా బౌలర్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్.. ఆసీస్ బౌలర్లు ఆరోన్ హార్డీ (4-1-21-3), ఆడమ్ జంపా (4-0-11-2), స్పెన్సర్ జాన్సన్ (3.1-0-24-2), జేవియర్ బార్ట్‌లెట్ (3-0-25-1), నాథన్ ఇల్లిస్ (3-0-20-1) ధాటికి 18.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది.
పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (41) ఒక్కడే ఓ మోస్తరు స్కోర్‌తో రాణించాడు. హసీబుల్లా ఖాన్ (24), షాహీన్ అఫ్రిది (16), ఇర్ఫాన్ ఖాన్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. సాహిబా్‌జాదా ఫర్హాన్ 9, ఉస్మాన్ ఖాన్ 3, అఘా సల్మాన్ 1, అబ్బాస్ అఫ్రిది 1, జహందాద్ ఖాన్ 5, సూఫియాన్ ముఖీమ్ 1 పరుగు చేశారు.
కాగా, మూడు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న మూడో టీ20 నామమాత్రంగా సాగుతుంది. వర్షం కారణంగా 7 ఓవర్లకు కుదించిన తొలి గేమ్‌లో 29 పరుగుల తేడాతో గెలుపొందిన ఆసీస్.. రెండో టీ20లో 13 పరుగుల తేడాతో నెగ్గింది.
టీ20 సిరీస్‌కు ముందు పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌ను పాక్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌ల కోసం పాకిస్తాన్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment