హెల్మెట్‌, గ్లోవ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన వార్నర్‌! | David Warner Gifts His Helmet And Gloves To Fans | Sakshi
Sakshi News home page

హెల్మెట్‌, గ్లోవ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన వార్నర్‌!

Published Sat, Nov 30 2019 8:34 PM | Last Updated on Sat, Nov 30 2019 8:48 PM

David Warner Gifts His Helmet And Gloves To Fans - Sakshi

అడిలైడ్‌: ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ శనివారం చారిత్రాత్మక రికార్డును సొంతం చేసుకొన్న అనంతరం ప్రేక్షకుల కరతాళ ధ్వనుల నడుమ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళుతూ తన ఫ్యాన్స్‌కు హెల్మెట్, గ్లోవ్స్‌ కానుకగా అందించాడు. దానిని అందుకున్న చిన్నారులు ఒక్కసారిగా నాది అని పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. డే అండ్‌ నైట్‌ టెస్టు ఫార్మాట్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులతో రికార్డు సాధించిన తర్వాత వార్నర్.. తన అభిమానులకు సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. అడిలైడ్ ఓవల్‌లో 2వ టెస్టులో పాకిస్తాన్‌పై ట్రిపుల్ సెంచరీ సాధించిన అనంతరం ఫీల్డ్‌ నుంచి బయటకు వెళుతూ.. ఇలా తన అభిమానులకు తాను ధరించిన హెల్మెట్, గ్లోవ్స్‌ వారికి గిఫ్ట్‌గా ఇచ్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement