అంతర్జాతీయ క్రికెట్‌లో పాక్ చాలా రోజుల తర్వాత తమ స్థాయి మేరకు రాణించింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పాక్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. పాక్.. ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై మట్టికరిపించడం విశేషం. 22 ఏళ్లలో ఆస్ట్రేలియాలో పాకిస్తాన్‌ను ఇది తొలి వన్డే సిరీస్ విజయం.
ఇవాళ (నవంబర్ 10) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో పాక్ ఆసీస్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 31.5 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. పాక్ పేసర్లు షాహీన్ అఫ్రిది (3/32), నసీం షా (3/54), హరీస్ రౌఫ్ (2/24), మొహమ్మద్ హస్నైన్ (1/24) ఆసీస్ పతనాన్ని శాశించారు.
ఆసీస్ ఇన్నింగ్స్‌లో సీన్ అబాట్ (30) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మాథ్యూ షార్ట్ (22), ఆరోన్ హార్డీ (12), ఆడమ్ జంపా (13), స్పెన్సర్ జాన్సన్ (12 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (7), కెప్టెన్ జోస్ ఇంగ్లిస్ (7), కూపర్ కన్నోలీ (7), మార్కస్ స్టోయినిస్ (8), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (0), లాన్స్ మోరిస్ (0) దారుణంగా విఫలమయ్యారు.
అనంతరం 141 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. 26.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. పాక్ ఇన్నింగ్స్‌లో సైమ్ అయూబ్ (42), అబ్దుల్లా షఫీక్ (37) రాణించగా.. బాబర్ ఆజమ్ (28), మొహమ్మద్ రిజ్వాన్ (30) అజేయంగా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో లాన్స్ మోరిస్‌కు రెండు వికెట్లు దక్కాయి. కాగా, ఈ సిరీస్‌లో తొలి వన్డేలో ఆసీస్ గెలుపొందగా.. పాక్ వరుసగా రెండు, మూడు వన్డేల్లో జయకేతనం ఎగురవేసింది.
Comments
Please login to add a commentAdd a comment