ఆస్ట్రేలియా, జింబాబ్వే పర్యటనలకు పాక్‌ జట్ల ప్రకటన | Pakistan Squad Announced For Australia And Zimbabwe Tour | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా, జింబాబ్వే పర్యటనలకు పాక్‌ జట్ల ప్రకటన

Published Sun, Oct 27 2024 2:44 PM | Last Updated on Sun, Oct 27 2024 5:52 PM

Pakistan Squad Announced For Australia And Zimbabwe Tour

నవంబర్‌ 4 నుంచి మొదలుకానున్న ఆస్ట్రేలియా, జింబాబ్వే పర్యటనల కోసం వేర్వేరు పాకిస్తాన్‌ జట్లను ఇవాళ (అక్టోబర్‌ 27) ప్రకటించారు. ఈ జట్లకు కెప్టెన్‌ను ఇంకా ప్రకటించలేదు. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌ మొహిసిన్‌ నఖ్వి ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ప్రెస్‌ మీట్ పెట్టి కెప్టెన్‌ను అనౌన్స్‌ చేస్తాడు.

ఆస్ట్రేలియా పర్యటన నవంబర్‌ 4 నుంచి 18 వరకు జరుగనుంది.

ఇందులో మూడు వన్డేలు, మూడు టీ20లు జరుగుతాయి.

జింబాబ్వే పర్యటన నవంబర్‌ 24 నుంచి డిసెంబర్‌ 5 వరకు జరుగుతుంది.

ఈ పర్యటనలోనూ మూడు వన్డేలు, మూడు టీ20లు జరుగుతాయి.

ఇంగ్లండ్‌తో చివరి రెండు టెస్ట్‌లకు రెస్ట్‌ ఇచ్చిన బాబర్‌ ఆజమ్‌, నసీం షా, షాహీన్‌ అఫ్రిదిలను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేశారు.

వీరికి తిరిగి జింబాబ్వేతో సిరీస్‌లకు విశ్రాంతినిచ్చారు.

స్టార్‌ ప్లేయర్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌ జింబాబ్వేతో టీ20లకు మినహా మిగతా మ్యాచ్‌లకు అన్నింటికీ అందుబాటులో ఉంటాడు.

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు పాకిస్తాన్‌ జట్టు..
అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అరాఫత్ మిన్హాస్, బాబర్ ఆజమ్‌, ఫైసల్ అక్రమ్, హరీస్ రవూఫ్, హసీబుల్లా (వికెట్‌కీపర్‌), కమ్రాన్ గులామ్, మహ్మద్ హస్నైన్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్‌), ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సైమ్‌ అయూబ్‌, సల్మాన్ అఘా, షాహీన్ షా అఫ్రిది

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు పాకిస్తాన్‌ జట్టు..
అరాఫత్ మిన్హాస్, బాబర్ ఆజమ్‌, హరీస్ రవూఫ్, హసీబుల్లా, జహందాద్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్‌), ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, ఒమైర్ బిన్ యూసుఫ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అలీ అఘా, షాహీన్‌ అఫ్రిది, సుఫ్యాన్‌ మొకిమ్, ఉస్మాన్ ఖాన్

జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు పాక్‌ జట్టు..
అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, అహ్మద్ డానియాల్, ఫైసల్ అక్రమ్, హరీస్ రవూఫ్, హసీబుల్లా (వికెట్‌కీపర్‌), కమ్రాన్ గులామ్, మహ్మద్ హస్నైన్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్‌), ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా, షానవాజ్‌ దహానీ, తయ్యబ్ తాహిర్

జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు పాక్‌ జట్టు..
అహ్మద్ డానియాల్, అరాఫత్ మిన్హాస్, హరీస్ రవూఫ్, హసీబుల్లా (వికెట్‌కీపర్‌), జహందాద్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ హస్నైన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, ఒమైర్ బిన్ యూసుఫ్, ఖాసిం అక్రమ్, సాహిబ్జాదా ఫర్హాన్‌, సల్మాన్‌ అఘా, సుఫ్యాన్‌ మొఖిమ్‌, ఉస్మాన్ ఖాన్

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement