కోహ్లి రిటైర్మెంట్‌పై స్పందించిన వైఎస్‌ జగన్‌ | YS Jagan Paid Tribute To Indian Cricket Legend Virat Kohli, After His Test Cricket Retirement | Sakshi

కోహ్లి రిటైర్మెంట్‌పై స్పందించిన వైఎస్‌ జగన్‌

May 12 2025 5:22 PM | Updated on May 12 2025 5:31 PM

YS Jagan Paid Tribute To Indian Cricket Legend Virat Kohli, After His Test Cricket Retirement

టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. విరాట్‌ భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకరని ప్రశంసించారు. విరాట్‌ ఆట చూడటం ఎల్లప్పుడూ ఆసక్తికరంగా ఉంటుందని అన్నారు.

క్రికెట్‌ పట్ల విరాట్‌కు ఉన్న అభిరుచి, ఆటలో అతని స్థిరత్వం, అత్యుత్తమ ప్రదర్శన కోసం అతని దాహం సాటిలేనివని కొనియాడారు. విరాట్‌ రికార్డులు మాటల కంటే బిగ్గరగా మాట్లాడతాయని అన్నారు. విరాట్‌ వారసత్వం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని తెలిపారు. విరాట్‌ తన భవిష్యత్ ప్రయత్నాల్లో విజయవంతకావాలని ఎక్స్‌ వేదికగా తన సందేశాన్ని పంపారు.

కాగా, 36 ఏళ్ల విరాట్‌ కోహ్లి ఇవాళ (మే 12) ఉదయం టెస్ట్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. 2011లో టెస్ట్‌ అరంగేట్రం చేసిన విరాట్‌.. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 123 టెస్ట్‌లు (210 ఇన్నింగ్స్‌లు) ఆడి 46.9 సగటున 9230 పరుగులు చేశాడు. ఇందులో 7 డబుల్‌ సెంచరీలు, 23 సెంచరీలు, 31 అర్ద సెంచరీలు ఉన్నాయి.

టీమిండియా టెస్ట్‌ కెప్టెన్‌గానూ కోహ్లికి ఘనమైన రికార్డు ఉంది. అతని సారథ్యంలో టీమిండియా 68 మ్యాచ్‌ల్లో 40 మ్యాచ్‌లు గెలిచింది. భారత టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఇంత విజయవంతమైన కెప్టెన్‌ ఎవరూ లేరు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement