జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20లో పాకిస్తాన్ జట్టు నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఒమైర్ యూసఫ్ 16, సైమ్ అయూబ్ 24, ఉస్మాన్ ఖాన్ 39, సల్మాన్ అఘా 13 పరుగులు చేసి ఔటయ్యారు.
ఆఖర్లో తయ్యబ్ తాహిర్ (39), ఇర్ఫాన్ ఖాన్ (27) వేగంగా పరుగులు రాబట్టి అజేయంగా నిలిచారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ, సికందర్ రజా, వెల్లింగ్టన్ మసకద్జ, ర్యాన్ బర్ల్ తలో వికెట్ పడగొట్టారు.
కాగా, మూడు వన్డేలు, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం పాకిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. సిరీస్‌లో భాగంగా తొలి టీ20 ఇవాళ (డిసెంబర్ 1) బులవాయోలో జరుగుతుంది. తొలి టీ20కు ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పాక్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి వన్డే గెలిచి సంచనలం సృష్టించిన జింబాబ్వే ఆతర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి సిరీస్ కోల్పోయింది.
Comments
Please login to add a commentAdd a comment