పాకిస్తాన్ క్రికెట్ జట్టు టీమిండియా బాటలో అడుగులేస్తుంది. ఆర్దికంగా వెనుకబడిన జింబాబ్వే క్రికెట్ బోర్డుకు చేయూతనిచ్చేందుకు పాక్ జింబాబ్వేలో పర్యటిస్తుంది. పెద్ద జట్లు స్వదేశంలో మ్యాచ్‌లు ఆడితే జింబాబ్వే క్రికెట్ బోర్డును లబ్ది చేకూరుతుంది. అందుకే భారత్ జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడేందుకు ముందుకువచ్చింది. రేపటి నుంచే (జులై 6) భారత్-జింబాబ్వే మధ్య టీ20 సిరీస్ మొదలవుతుంది.
ఈ సిరీస్‌లో మొత్తం ఐదు టీ20లు జరుగనున్నాయి. హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్‌లు జరుతాయి. ఈ పర్యటన కోసం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువ జట్టును ఎంపిక చేశారు. జింబాబ్వే పర్యటనలో యంగ్ ఇండియాకు శుభ్‌మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు.
పాక్ షెడ్యూల్ ఇలా..
పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ మాసాల్లో జరిగే ఈ పర్యటనలో పాకిస్తాన్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. తొలుత వన్డే సిరీస్ (నవంబర్ 24, 26, 28).. అనంతరం టీ20 సిరీస్ (డిసెంబర్ 1, 3, 5) జరుగనున్నాయి. మ్యాచ్‌లన్నీ బులవయోలోని క్లీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరుగతాయి. కాగా, పాక్ స్వదేశంలో వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా జింబాబ్వే సిరీస్‌ను భావిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment