జింబాబ్వేతో జరుగుతున్న నామమాత్రపు మూడో టీ20లో పాకిస్తాన్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముజరబానీ (4-0-25-2), మసకద్జ (4-0-24-1), నగరవ (3-0-27-1), మపోసా (1-0-12-1), ర్యాన్ బర్ల్ (3-0-15-1) సమిష్టిగా బౌలింగ్ చేసి పాక్‌ను కట్టడి చేశారు.
పాక్ ఇన్నింగ్స్‌లో సల్మాన్ అఘా (32) టాప్ స్కోరర్‌గా నిలువగా.. తయ్యబ్ తాహిర్ (21), ఖాసిమ్ అక్రమ్ (20), అరాఫత్ మిన్హాస్ (22 నాటౌట్), అబ్బాస్ అఫ్రిది (15) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ టాపార్డర్ బ్యాటర్లు సాహిబ్‌జాదా ఫర్హాన్ (4), ఒమైర్ యూసఫ్ (0), ఉస్మాన్ ఖాన్ (5) విఫలమయ్యారు.
కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌ల కోసం పాకిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో గెలిచిన పాక్ ఇదివరకే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న మూడో టీ20 నామమాత్రంగా సాగుతుంది. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌ను సైతం పాక్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లలో జింబాబ్వే తొలి వన్డేలో మాత్రమే గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment