
టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని మరోసారి ముద్దాడింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్‌గా నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఫైనల్ మ్యాచ్‌లో నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో భారత స్టార్ క్రికెటర్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ మరోసారి క్లాస్ ఇన్నింగ్స్ ఆడారు. చివరి వరకు క్రీజ్‌లో ఉండి టీమిండియాను ఛాంపియన్‌గా నిలిపాడు. ఒక వైపు వికెట్స్ పడుతున్నా 34 పరుగుతులతో నాటౌట్‌గా నిలిచి విజయ తీరాలకు చేర్చాడు. దీంతో పాకిస్తాన్ హోస్ట్ చేసిన ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా నిలిచింది.
అయితే ఈ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా గెలవడంపై బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తన అల్లుడు కేఎల్ రాహుల్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు రాహుల్ ఫోటోను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇండియాకి విష్.. రాహుల్ కమాండ్ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్స్ సునీల్ శెట్టిని ప్రశంసిస్తున్నారు. అల్లుడికి మామ సపోర్ట్ చేయడాన్ని చూసి నెటిజన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ అన్నా రాక్‌స్టార్.. టీమిండియాకు కాబోయే కెప్టెన్ అంటూ ఓ నెటిజన్ రిప్లై ఇచ్చాడు. 2027లో కేఎల్ కెప్టెన్సీలో వన్డే వరల్డ్ కప్ గెలుస్తామంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు. అల్లుడికి మామ సపోర్ట్ చేయడం గొప్ప విషయం.. మా నాన్న కూడా నాకు సపోర్ట్ చేయడు అంటూ ఓ నెటిజన్ ఫన్నీగా సునీల్ శెట్టి ట్వీట్‌కు స్పందించాడు.
అతియాను పెళ్లాడిన కేఎల్ రాహుల్..
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టిని కేఎల్ రాహుల్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు ఆ తర్వాత వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం అతియా శెట్టి గర్భంతో ఉన్నారు. త్వరలోనే వీరిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నారు. సునీల్ శెట్టి తాతగా ప్రమోట్ కానున్నారు. ఏప్రిల్‌లో అతియా శెట్టి, కేఎల్ రాహుల్ తమ బిడ్డకు స్వాగతం పలకనున్నారు.
🇮🇳 INDIA’S WISH !!!! Rahul’s COMMAND …… pic.twitter.com/SbllRkbUgP
— Suniel Shetty (@SunielVShetty) March 9, 2025
Comments
Please login to add a commentAdd a comment