Suniel Shetty
-
షూటింగ్ సెట్లో ప్రమాదం.. స్టార్ నటుడికి గాయాలు!
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న హంటర్ వెబ్ సిరీస్ సెట్స్‌లో గాయపడినట్లు సమాచారం. ఓ ఫైట్ సీక్వెన్స్ చేస్తుండగా ఈ సంఘటన జరిగినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. ఈ సన్నివేశంలో ఒక చెక్క లాగ్ అనుకోకుండా ఆయన పక్కటెముకలకు తగిలిందని తెలిపారు. ఈ సంఘటనతో ముంబయిలో జరుగుతున్న షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది.అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే సునీల్ శెట్టికి వైద్యచికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని సునీల్ శెట్టి సైతం ట్విటర్ ద్వారా పంచుకున్నారు. నాకు చిన్న గాయం మాత్రమే తగిలిందని.. ప్రస్తుతం బాగానే ఉన్నానని పోస్ట్ చేశారు. దయచేసి ఎవరూ కూడా ఆందోళనకు గురికావద్దని అభిమానులను కోరారు. మీ అందరి ప్రేమ, అభిమానాలకు కృతజ్ఞతలు అంటూ రాసుకొచ్చారు.కాగా.. హంటర్ వెబ్ సిరీస్‌ను ముంబయిలోని అండర్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్‌లో ఆయన పోలీసు పాత్రలో కనిపించనున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో ఈషా డియోల్, బర్ఖా బిష్త్, కరణ్వీర్ శర్మ, రాహుల్ దేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆ తర్వాత వెల్కమ్ టు ది జంగిల్ అనే చిత్రంలో నటించనున్నారు. ఇందులో అక్షయ్ కుమార్, దిశా పటానీ, సంజయ్ దత్లాంటి స్టార్స్ కూడా ఉన్నారు. అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది.Minor injury, nothing serious! I'm absolutely fine and ready for the next shot. Grateful for all the love & care 🙏❤️ #OnSet— Suniel Shetty (@SunielVShetty) November 7, 2024 -
అతియా శెట్టి ప్రెగ్నెంట్? హింటిచ్చిన తండ్రి!
బాలీవుడ్ నటి అతియా శెట్టి, క్రికెటర్ కేఎల్ రాహుల్ పెళ్లి చేసుకుని ఏడాది కావస్తోంది. ఉన్నపళంగా అతియా త్వరలో తల్లి కాబోతోందంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పటికిప్పుడు ఈ ప్రెగ్నెన్సీ రూమర్స్ ఎలా పుట్టుకొచ్చాయనుకుంటున్నారా? దానికి కారణం అతియా తండ్రి, నటుడు సునీల్ శెట్టి! నెక్స్ట్ సీజన్‌కు తాతయ్యగా.. సునీల్ శెట్టి డ్యాన్స్ దీవానె డ్యాన్స్ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఓ ఎపిసోడ్‌కు గ్రాండ్ మస్తి విత్ గ్రాండ్ పేరెంట్స్ అనే థీమ్ పెట్టారు. ఈ షోలో కమెడియన్ భారతీ సింగ్.. సునీల్ సర్.. మీకు మనవడో, మనవరాలో పుట్టి తాతయ్యవి అయిపోయాక ఎలా ఉంటావ్? అని అడిగింది. అందుకు నటుడు.. నెక్స్ట్ సీజన్లో నేను తాతయ్యనయ్యాక ఇదే స్టేజీపై నడుస్తాను అని చెప్పాడు. త్వరలోనే గుడ్‌న్యూస్! ఆయన సరదాగా అన్నారో, సీరియస్‌గా అన్నారో కానీ చాలామంది నిజంగానే ఈ నటుడు తాతగా ప్రమోషన్ పొందబోతున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. త్వరలోనే అతియా- రాహుల్ గుడ్‌న్యూస్ చెప్పనున్నారని, ఆరోజు కోసం కోసం వెయిటింగ్ అంటూ ఎవరికి తోచినట్లు వారు ఊహించేసుకుంటున్నారు. ప్రస్తుతం అతియా ప్రెగ్నెంట్ కావచ్చని భావిస్తున్నారు. కాగా అతియా- రాహుల్ గతేడాది జనవరి 23న పెళ్లి చేసుకున్నారు. చదవండి: మాజీ గర్ల్‌ఫ్రెండ్స్‌కు అమ్మ నగలు గిఫ్టిచ్చేవాడిని.. పెళ్లిలో.. -
నా సినిమాలు చూస్తే మా ఇంట్లోవాళ్లకు తలనొప్పి..: నటుడు
సునీల్ శెట్టి.. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలు చేశాడు. 90వ దశకంలో ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అందులో కొన్ని విజయం సాధించినా మరికొన్ని బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచాయి. తాజాగా బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తన యాక్షన్ సినిమాల గురించి మాట్లాడాడు. సినిమా చూస్తే తలనొప్పి 'బాక్సాఫీస్ దగ్గర నా సినిమాలకు రిజల్ట్ బాగానే ఉన్నా ఇంట్లో మాత్రం నా సినిమాలు ఆడేవి కావు. నా తల్లిదండ్రులు, భార్య, కూతురికి నేను నటించిన సినిమాలు చూపిస్తూ ఉండేవాడిని. వాళ్లు సినిమా చూసి బాగుందంటూనే.. నీ దగ్గర తలనొప్పికి ఏదైనా జండూభామ్ లాంటిది ఉంటే ఇవ్వు అని అడిగేవారు. అంటే నా సినిమా చూసి వాళ్లకు తలనొప్పి వస్తుందని చెప్పకనే చెప్పేవారు' అని తెలిపాడు. ట్రోలింగ్.. చాలా బాధేస్తుంది అల్లుడు, క్రికెటర్ కేఎల్ రాహుల్ గురించి ఓ పాడ్‌క్యాస్ట్‌లో మాట్లాడుతూ.. 'రాహుల్‌పై ట్రోలింగ్ జరిగితే నేను తట్టుకోలేకపోయేవాడిని. చాలా బాధపడేవాడిని. కానీ అతడు మాత్రం ఆ ట్రోలింగ్‌ను పెద్దగా పట్టించుకునేవాడు కాదు. తన బ్యాట్‌తోనే సరైన సమాధానం చెప్పేవాడు. కానీ ఈ ట్రోలింగ్ వల్ల అతియా-రాహుల్ కంటే కూడా నేను 100 రెట్లు ఎక్కువ బాధపడేవాడిని' అని చెప్పుకొచ్చాడు. సినిమాల సంగతి.. కాగా సునీల్.. మోహ్ర, గోపి కిషన్, రక్షక్, భాయ్ వంటి పలు యాక్షన్ సినిమాలతో ఎన్నో హిట్లు కొట్టాడు. తెలుగులో మోసగాళ్లు, గని సినిమాల్లో నటించాడు. ఇటీవల ఆయన హంటర్ తూటేగా నహీ తోడేగ అనే వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేశాడు. నిర్మాతగానూ పలు సినిమాలు తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈయన ఆపరేషన్ ఫ్రైడే అనే మూవీలో నటిస్తున్నాడు. చదవండి: హీరోలనే ఎక్కువ మోస్తున్నారు.. హీరోయిన్ల పరిస్థితి ఏం కావాలి? -
అల్లుడు కాదు!.. కోహ్లినే నా ఫేవరెట్ అంటున్న బాలీవుడ్ స్టార్! ఎందుకంటే..
Virat Kohli- ICC WC 2023: టీమిండియా స్టార్, రన్‌మెషీన్ విరాట్ కోహ్లికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతర్జాతీయ క్రికెట్లో 78 సెంచరీలు పూర్తి చేసుకున్న ఈ రికార్డుల రారాజు ఆట అంటే ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఛేజింగ్‌లో కింగ్‌లా కోహ్లి పరుగుల వరద పారిస్తుంటే చూడటానికి రెండు కళ్లు చాలవంటారు ఫ్యాన్స్. ఆ జాబితాలో తానూ ఉన్నానంటున్నాడు బాలీవుడ్ సీనియర్ నటుడు సునిల్ శెట్టి. ఫేవరెట్ క్రికెటర్‌గా అల్లుడిని కాదని.. విరాట్ కోహ్లికే ఓటు వేశాడు. అయితే.. ఇందుకు గల కారణాన్ని కూడా వెల్లడించాడు. కాగా కర్ణాటకకు చెందిన సునిల్ శెట్టి బాలీవుడ్లో నటుడిగా నిలదొక్కుకున్నాడు. బల్వాన్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. దిల్వాలే, బార్డర్, భాయ్, ఆఘాజ్ వంటి చిత్రాల్లో నటించాడు. ముంబైలో స్థిరపడ్డ సునిల్ ఈ క్రమంలో ముంబైలో సెటిల్ అయిన సునిల్ శెట్టి తన 30 ఏళ్ల కెరీర్లో వందకు పైగా సినిమాల్లో నటించాడు. వ్యాపారవేత్తగానూ కొనసాగుతున్న ఈ వెటరన్ యాక్టర్ మనా శెట్టిని వివాహమాడగా.. వీరికి కూతురు అతియా శెట్టి, కుమారుడు అహాన్ శెట్టి జన్మించారు. వీరిద్దరు నటులుగా తమ ప్రతిభను నిరూపించుకునే పనిలో ఉన్నారు. అయితే, సునిల్ గారాల పట్టి అతియా శెట్టి హీరోయిన్గా ఎదిగే క్రమంలో టీమిండియా స్టార్, కర్ణాటక బ్యాటర్ కేఎల్ రాహుల్‌తో ప్రేమలో పడింది. సునిల్‌కు అల్లుడిగా స్టార్ క్రికెటర్ ఇరు కుటుంబాల అంగీకారంతో రాహుల్-అతియా ఈ ఏడాది వివాహ బంధంలో అడుగుపెట్టారు. సునిల్ శెట్టికి చెందిన ఫామ్‌హౌజ్‌లో అత్యంత సన్నిహితుల నడుమ వీరి పెళ్లి వేడుక జరిగింది. కాగా సునిల్.. రాహుల్‌ను అల్లుడిలా కాకుండా కొడుకుగా చూసుకుంటాడని ఇప్పటికే చాలా సందర్భాల్లో నిరూపితమైంది. రాహుల్ కుమారుడు కదా! ఈ క్రమంలో తాజాగా మనీకంట్రోల్ సమ్మిట్‌లో మాట్లాడిన సునిల్ శెట్టి తన అభిమాన క్రికెటర్‌గా విరాట్ కోహ్లి పేరు చెప్తూనే.. రాహుల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ప్రస్తుతం నా ఫేవరెట్ క్రికెటర్ ఎవరంటే కచ్చితంగా విరాట్ కోహ్లి పేరే చెప్తాను. కేఎల్ రాహుల్ నా కుమారుడు. నా కుటుంబ సభ్యుడి గురించి నేను పొగిడితే బాగుండదు కదా! నిజానికి నేను జాతీయ జట్టుకు ఆడాలనుకున్నాను. నా అల్లుడి రూపంలో ఆ కోరిక నెరవేరింది. ఏదేమైనా.. ఛేజింగ్ మాస్టర్ కాబట్టే కోహ్లి నా అభిమాన క్రికెటర్ అయ్యాడు’’ అని సునిల్ శెట్టి చెప్పుకొచ్చాడు. కాగా ప్రపంచకప్-2023 ఆరంభ మ్యాచ్‌లో కోహ్లి(85), రాహుల్(97- నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ కారణంగానే టీమిండియా ఆస్ట్రేలియాపై గెలుపొందిన విషయం తెలిసిందే. అదే విధంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కోహ్లి తన అంతర్జాతీయ కెరీర్లో 78వ సెంచరీ చేసేందుకు రాహుల్ సహకారం అందించి ఫ్యాన్స్ మనసులు గెలుచుకున్నాడు. చదవండి: WC 2023: అయ్యో.. ఇదేంటి ఇలా అయిపోయింది?.. రోహిత్ శర్మ పోస్ట్ వైరల్ -
స్విగ్గీ జొమాటోలకు మరో షాక్:‘ వాయు’ వేగంతో వచ్చేసింది!
సాక్షి, ముంబై: ఫుడ్ డెలివరీ సంస్థలకు మరోషాక్ తగిలింది. ఇప్పటికే ప్రభుత్వానికి చెందిన, తక్కువ ధరల ఫుడ్ డెలివరీ యాప్ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) యూజర్ల ఆదరణతో దూసుకుపోతోంది. తాజాగా దేశీయ మార్కెట్లోకి మరో సరికొత్త ఫుడ్ డెలివరీ యాప్ ఎంట్రీ ఇచ్చింది. ఫుడ్ డెలివరీ కోసం ముంబై హోటల్స్ తమ సొంత ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌ను లాంచ్ చేశాయి. వాయు (Waayu) పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. బాలీవుడ్ నటుడు, బిజినెస్‌మేన్ సునీల్ శెట్టి కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా దీన్ని ప్రారంభించారు. ఈ యాప్‌లో అతనికి వాటా కూడా ఉంది. అంతేకాదు ఓఎన్డీసీతో ఇంటిగ్రేట్ చేయాలని కూడా చూస్తోంది. ఫుడ్ డెలివరీకి బిజినెస్‌కు ఫుల్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వాయు యాప్ మార్కెట్లోకి దూసుకొచ్చింది. ఇతర అగ్రిగేటర్లతో పోలిస్తే 15 నుంచి 20 శాతం తక్కువ ధరలకే అందిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. దీంతో కమీషన్లు, ఫేక్ ర్యాంకింగ్,పెయిడ్ రివ్యూలు, నాణ్యత లేకపోవడం లాంటి సమస్యలకు చెక్‌పడుతుందని అంచనా. (ఇదీ చదవండి: పర్ఫెక్ట్ బిజినెస్ లేడీ నీతా అంబానీ బ్యూటీ సీక్రెట్ తెలుసా మీకు!) టెక్ ఫౌండర్స్ అనిరుధ కోట్‌గిరే, మందార్ లాండే స్థాపించిన డెస్టెక్ HORECA ప్రొడక్ట్స్‌లో వాయు యాప్ ఒకటి. ముంబైకి చెందిన ఇండియన్ హోటల్, రెస్టారెంట్ అసోసియేషన్ (AHAR), ఇతర పరిశ్రమ సంస్థల సపోర్టుతో మార్కెట్లోకి ఎంట్రీ వచ్చింది. సాఫ్ట్వేర్ యాజ్ఏ సర్వీస్ (SaaS) అనే ప్లాట్‌ఫారమ్ ద్వారా భగత్ తారాచంద్, మహేష్ లంచ్ హోమ్, బనానా లీఫ్, శివ్ సాగర్, గురు కృపా, కీర్తిమహల్, పర్షియన్ దర్బార్, లడు సామ్రాట్‌లతో ఇతర ముంబై రెస్టారెంట్లతో కస్టమర్లను కనెక్ట్ చేస్తుంది. రెస్టారెంట్ల నుంచి ఎలాంటి కమీషన్ రుసుములను వసూలు చేయదు. (ONDC తక్కువ రేట్లతో దూకుడు: స్విగ్గీ, జొమాటోకు దబిడి దిబిడే!) కానీ ఒక్కో అవుట్లెట్కు నెలకు రూ. 1,000 ప్రారంభ ధరతో నిర్ణీత రుసుము. తరువాత ఇది రూ. రెండు వేలుగా నిర్ణయిస్తుంది. ఈ యాప్‌లో ప్రస్తుతం 1,000కి పైగా రెస్టారెంట్ లిస్టింగ్‌లు ఉన్నాయి. ముంబై మరియు పూణేలో వచ్చే మూడు నెలల్లో 10,000కి పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం ముంబైలో అందుబాటులో ఉన్న ఈ సర్వీస్ భారతదేశంలోని ఇతర మెట్రో , నాన్-మెట్రో నగరాలకు విస్తరించాలని చూస్తోంది. ఈ వాయు యాప్ వినియోగదారులకు అత్యంత సరసమైన ధరకే ఫుడ్ డెలివరీ చేయనుంది. కమీషన్-రహిత మోడల్ ద్వారా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ఇండస్ట్రీలో కొత్త మార్పులు తీసుకురానుందని ఫౌండర్ అనిరుధ కోట్‌గిరే చెప్పారు. అంతేకాదు సకాలంలో, పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుందనీ, డెలివరీ విషయంలో ఎలాంటి ఆలస్యం లేకుండా క్లీన్ ఫుడ్, క్వాలిటీతో ఉంటుందనీ తమకు 16 ఆదాయ మార్గాలు ఉన్నాయని అనిరుధ తెలిపారు. What a Entry ❤️❤️ Super Cool and Handsome Brand Ambassador @SunielVShetty Sir at the Waayu App launch...❤️❤️@WAAYU_App#sunielshetty #waayu #waayuapp pic.twitter.com/KeNULJBjAI — Suniel Shetty FC (@SunielShetty_FC) May 10, 2023 సునీల్ శెట్టి ఏమన్నారంటే చాలా కాలంగా రెస్టారెంట్, హోటల్ పరిశ్రమలో భాగస్వామిగా వాయు యాప్ ఒక గొప్ప అవకాశంగా భావించానని, అలాగే హోటల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫుడ్ టెక్నాలజీలో కూడా ప్రావీణ్యం సంపాదించానని శెట్టి చెప్పారు. ఫుడ్ డెలివరీ యాప్‌లు వసూలు చేసే అధిక కమీషన్లు రెస్టారెంట్లు, కస్టమర్లను ప్రభావితం చేస్తున్నాయని, దీనికి పరిష్కారాని టైం వచ్చిందన్నారు. అలాగే రెస్టారెంట్లు వారి స్వంత డెలివరీ భాగస్వాములను కలిగి ఉండేలా ప్రోత్సహిస్తున్నామనీ, డబ్బావాలాలు (ముంబై) డెలివరీ భాగస్వాములుగా రావాలనేది తన కల అని శెట్టి చెప్పారు. (‘ముసలోళ్లం.. చూసి నేర్చుకోండి..లేదంటే’! ఇన్ఫీ నారాయణమూర్తి దంపతుల వ్యాఖ్యలు) వాయు యాప్‌ను ఎలా వాడాలి? ♦ఇందులో యాప్‌లో రెండు వెర్షన్లు ఉన్నాయి. డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ల కోసం వాయు డెలివరీ పార్టనర్, కస్టమర్ల కోసం వాయు యాప్ వినియోగించుకోవచ్చు. ♦ గూగుల్ ప్లేస్టోర్‌లో నుంచి ‘వాయు’ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.లేదా వెబ్సైట్ కూడా ఉంది. ♦ ఫోన్ నంబర్ లేదా ఇమెయిల్ అడ్రస్‌తో సైన్ ఇన్, లాగిన్ చేయాలి. ♦ లొకేషన్ ఎంటర్ చేసి,యాక్సెస్‌కు అంగీకరించాలి ♦ మీ లొకేషన్ డెలివరీ చేసే రెస్టారెంట్లు, మెనూల బ్రౌజ్ చేయండి. ♦ ఆర్డర్ చేయాలనుకుంటున్న వంటకాలను ఎంచుకుని, కార్ట్‌కు జోడించాలి. ♦ ఆర్డర్‌ని మరోసారి చెక్ చేసుకుని, చెక్అవుట్ పై క్లిక్ చేయాలి. ♦ ఆర్డర్‌ను ప్రాధాన్యతలు లేదా ప్రత్యేక సూచనలతో కస్టమైజ్ చేసుకోవచ్చు ♦ వంటకాలు, రేటింగ్, ధర లేదా ఆఫర్ల ద్వారా కూడా ఫిల్టర్ చేయవచ్చు. ♦ ఆన్లైన్లో లేదా క్యాష్ ఆన్ డెలివరీయా సెలెక్ట్ చేసుకోవాలి ♦ అందుబాటులో ఉంటే మీరు ఏవైనా కూపన్ కోడ్లు లేదా డిస్కౌంట్లను కూడా వాడుకోవచ్చు ♦ ఆర్డర్ కంప్లీట్ అయ్యాక రెస్టారెంట్ నుండి నిర్ధారణ మెసేజ్ వస్తుంది. ♦ యాప్ లేదా వెబ్సైట్లో ఆర్డర్‌ను ట్రాక్ చేయవచ్చు కూడా ♦ డెలివరీ ఎగ్జిక్యూటివ్ నుంచి మీ ఆర్డర్‌ను స్వీకరించండి. మీ ఆహారాన్ని ఆస్వాదించండి. మీ అనుభవం ఆధారంగా రేటింగ్ రివ్యూ కూడా ఇవ్వొచ్చు. -
నా కూతురిపై దారుణమైన కామెంట్స్ చేశారు: స్టార్ నటుడు
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి గురించి బీటౌన్‌లో పరిచయం అక్కర్లేదు. 1992 నుంచి సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సునీల్ శెట్టి ప్రస్తుతం అక్షయ్ కుమార్, పరేష్ రావల్‌తో కలిసి హేరా ఫేరి- 3లో నటిస్తున్నారు. తాజాగా ది రణవీర్ షోకు హాజరైన ఆయన సోషల్ మీడియాపై సంచలన కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాతో సెలబ్రిటీల జీవితాలు నాశనం అవుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంటర్నెట్లో కొంతమంది తన కుటుంబం గురించి చేసిన కామెంట్స్ చూసి చాలా బాధపడ్డానని తెలిపారు. నటీనటులపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ విపరీతంగా పెరిగిపోయాయని సునీల్ శెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా సెలబ్రిటీల జీవితాన్ని నాశనం చేసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం కాలంలో వ్యక్తిగత గోప్యత లేదని ఆయన అన్నారు. సెలబ్రిటీల జీవితాలను నాశనం చేస్తున్న సోషల్ మీడియాలో ఉండటం అసాధ్యమని సునీల్ శెట్టి వెల్లడించారు. సునీల్ శెట్టి మాట్లాడుతూ..' నాకు సోషల్ మీడియా అంటే భయం. అందుకే మాట్లాడటానికి భయపడుతున్నా. సోషల్ మీడియాలో నా కుమార్తె, తల్లిపై అసభ్యంగా కామెంట్స్ చేశారు. అలాంటి ట్రోల్స్‌తో చాలా బాధపడ్డా. ఇలాంటి చర్యలు దేనికి దారితీస్తాయో కూడా వారికి తెలియదు. తెర వెనుక ఉన్న వ్యక్తులు నా కుటుంబం గురించి అసభ్యంగా మాట్లాడటం బాధ కలిగించింది. ఇలాంటి వాటిపై తాను నిశ్శబ్దంగా ఉండనని' అని తేల్చి చెప్పారు. కాగా.. సునీల్ శెట్టి గారాల కూతురు అతియా శెట్టికి క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో ఈ ఏడాది వివాహామైన సంగతి తెలిసిందే. సునీల్ శెట్టి చివరిసారిగా అమెజాన్ మిని టీవీ కొత్త వెబ్ సిరీస్ హంటర్లో కనిపించాడు. ధారవి బ్యాంక్‌తో తర్వాత రెండోసారి వెబ్ సిరీస్‌లో నటించారు. -
తొమ్మిదేళ్ల ప్రేమ.. నా పేరెంట్స్ కుదరదన్నారు: సునీల్ శెట్టి
ప్రముఖ నటుడు సునీల్ శెట్టి పుట్టింది సౌత్‌లో అయినా ఎక్కువ సినిమాలు చేసింది మాత్రమే నార్త్‌లోనే. కర్ణాటకలోని మంగళూరులో జన్మించిన ఆయన హిందీలో ఎక్కువ చిత్రాలు చేశాడు. 90స్లో బాలీవుడ్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుల్లో ఒకరిగా నిలిచాడు. ఆ తర్వాత మల్టీస్టారర్ చిత్రాలకే ఎక్కువగా మొగ్గు చూపాడు. విలన్‌గానే ఎక్కువగా ప్రేక్షకులకు దగ్గరైన అతడు 1991లో వ్యాపారవేత్త, డిజైనర్ మన శెట్టిని పెళ్లాడాడు. వీరికి అతియా శెట్టి, అహాన్ శెట్టి అని ఇద్దరు పిల్లలు సంతానం. అయితే వీరి పెళ్లి అంత ఈజీగా జరగలేదట! తాజాగా ఓ షోకి హాజరైన సునీల్ శెట్టి తన ప్రేమ, పెళ్లి సంగతులను పంచుకున్నాడు. 'తొలిచూపుకే మనతో ప్రేమలో పడిపోయా. కానీ ఆ సమయానికి నేను గూండాగానే అందరికీ తెలుసు. నా బాడీ, గడ్డం, బైక్‌పై తిరగడం చూసి అందరూ రౌడీ అనే భావించేవారు. అదృష్టం కొద్దీ తను అలా ఫీలవలేదు. క్రిస్మస్, న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు ఆరోజు ఉదయం నాలుగు గంటలకే ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యేవాడిని. అయినా ఆమె ఎప్పుడూ ఇబ్బందిపడలేదు. తన కళ్లలోకి చూస్తే ప్రేమ, కేరింగ్ కనిపించేది. కానీ నా పేరెంట్స్ మా ప్రేమను ఒప్పుకోలేదు. అలా ఒకటీ, రెండు, మూడు.. తొమ్మిదేళ్లు గడిచిపోయాయి. అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం నన్ను మొదటిరోజు నుంచే ఇష్టపడ్డారు. మా ప్రేమను అంగీకరించారు. కొన్నిసార్లయితే మేమంతా దెబ్బలాడుకునేవాళ్లం కూడా! నన్ను వేరొకరికిచ్చి పెళ్లి చేయాలనుకుంటే అది అన్యాయం అవుతుందని, ఆ బంధం నిలబడదని ఇంట్లో హెచ్చరించాను. పెళ్లంటూ చేసుకుంటూ మనను మాత్రమే చేసుకుంటానని తెగేసి చెప్పాను. అనవసరంగా మా జీవితాలతో ఆడుకోవద్దన్నాను. మా పేరెంట్స్‌కు కోడలిని కాకుండా కూతురిలాంటి అమ్మాయిని తేవాలనుకున్నాను. ఆ విషయంలో నేను విజయం సాధించాను' అని చెప్పుకొచ్చాడు సునీల్ శెట్టి. -
చెత్త సినిమాలకు జనాలు డబ్బులు పెట్టరు, అందుకే మానేశా: నటుడు
బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి హిందీలో ఫుల్ లెంగ్త్ పాత్రల్లో కనిపించి చాలాకాలమే అయింది. గెస్ట్ రోల్లో లేదంటే ఏదైనా కీలక పాత్రల్లో కనిపిస్తున్నాడే తప్ప హీరోగా మాత్రం నటించడం లేదు. అదే సమయంలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ముఖ్య పాత్రలు పోషిస్తూ దక్షిణాదికి దగ్గరయ్యాన్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సునీల్ శెట్టి తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'ఎక్కువ నిడివి ఉండే పాత్రలు చేసి చాలాకాలమైంది. దీంతో నాకసలు క్రాఫ్ట్స్ గుర్తున్నాయా? మర్చిపోయానా? నాకంటూ అభిమానులున్నారా? అన్న సందేహాలు వస్తుంటాయి. కానీ ఎక్కడికెళ్లినా ప్రజలు నన్ను ఎంతగానో ఆదరిస్తుంటారనుకోండి. నా పిల్లలు కూడా మెయిన్ లీడ్‌లో సినిమాలెందుకు చేయట్లేదు? అని అడుగుతుంటారు. నేను గతంలో సినిమాల ఎంపికలో కొన్ని తప్పులు చేశాను. అయినా సరే ఏం పర్లేదని ఆ చెత్త చూద్దామని ఎవరూ డబ్బులు పెట్టి టికెట్ కొనరు కదా! ప్రేక్షకుల దాకా ఎందుకు? యాక్షన్ సీన్స్ లేకపోతే డిస్ట్రిబ్యూటర్లే నా సినిమాను పక్కన పడేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలు, వర్షంలో డ్యాన్సులు లాంటివి ఉంటేనే సినిమా తీసుకుంటామని డిమాండ్ చేస్తున్నారు. అందుకే నేను మెయిన్ లీడ్‌లో సినిమాలు చేయడం మానేశా' అని చెప్పుకొచ్చాడు. కాగా 1992లో వచ్చిన బల్వాన్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు సునీల్ శెట్టి. ఎన్నో సినిమాలతో అలరించిన ఆయన హిందీలో చివరగా ఎ జెంటిల్మెన్(2017) అనే సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాత్రలో నటించారు. ఇటీవలే ధారావి బ్యాంక్ అనే వెబ్‌సిరీస్‌తో ఓటీటీ ఆడియన్స్‌ను పలకరించాడు. ప్రస్తుతం హిందీలో నాలుగు చిత్రాలు చేస్తున్నాడు చదవండి: వారీసు వర్సెస్ తునివు.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే? తండ్రి చనిపోయినా సెట్‌కు వచ్చేశాడు: చిరంజీవి -
Ghani Movie Review: ‘గని’ పంచ్ అదిరిందా?
-
‘గని’ మూవీ రివ్యూ
టైటిల్ : గని జానర్ : స్పోర్ట్స్ డ్రామా నటీనటులు : వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్, ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, నదియ, నవీన్ చంద్ర, నరేశ్ తదితరులు నిర్మాతలు : అల్లు బాబీ, సిద్దు ముద్ద దర్శకత్వం : కిరణ్ కొర్రపాటి సంగీతం : తమన్ ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్ సినిమాటోగ్రఫీ : జార్జ్ సి. విలియమ్స్ విడుదల తేది : ఏప్రిల్ 8, 2022 మెగా కుటుంబం నుంచి వచ్చి తనదైన స్టైల్లో నటిస్తూ..టాలీవుడ్లో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు యంగ్ హీరో వరుణ్ తేజ్. కెరీర్ స్టార్టింగ్‌లో కథల ఎంపిక విషయంలో కాస్త తడపడినా.. ఆ తర్వాత ఢిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా వరుణ్ చేసిన మరో ప్రయోగం ‘గని’. ఇందులో తొలిసారి బాక్సర్‌గా తెరపై కనించబోతున్నాడీ హీరో. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య శుక్రవారం (ఏప్రిల్ 8) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. ‘గని’ కథేంటంటే ‘గని’(వరుణ్ తేజ్)కి చిన్నప్పటి నుంచి బాక్సింగ్ అంటే చాలా ఇష్టం. వాళ్ల నాన్న విక్రమాదిత్య(ఉపేంద్ర) విషయంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ వల్ల ‘గని’ బాక్సింగ్‌కు దూరమవుతాడు. దీంతో గనికి తండ్రి మీద విపరీతమైన ద్వేషం ఏర్పడుతుంది. మరోవైపు జీవితంలో ఎప్పుడూ బాక్సింగ్ జోలికి వెళ్లొద్దని గని అమ్మ(నదియ) ఒట్టు వేయించుకుంటుంది. గని మాత్రం తల్లికి తెలియకుండా బాక్సింగ్ పోటీల్లో పాల్గొంటూనే ఉంటాడు. ఎప్పటికైనా నేషనల్ చాంపియన్‌గా నిలవాలనేదే అతని ఆశయం. అసలు గని బాక్సింగ్‌లో నేషనల్ చాంపియన్ కావాలని ఎందుకు అనుకుంటున్నాడు? వాళ్ల నాన్న విషయంలో జరిగిన ఆ ఇన్సిడెంట్ ఏంటి? తండ్రి గురించి అసలు విషయం తెలుసుకున్న తర్వాత గని ఏం చేశాడు? తన తండ్రికి ఈశ్వర్(జగపతి బాబు)చేసిన అన్యాయం ఏంటి? ఈశ్వర్ అసలు రూపాన్ని గని ఎలా బయటపెట్టాడు? గని చివరకు నేషనల్ చాంపియన్‌గా నిలిచాడా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. సాధారణంగా స్పోర్ట్స్ డ్రామా సినిమాల్లో జీరోలో ఉన్న ఓ వ్యక్తి హీరో కావడం అన్నట్లుగా కథ ఉంటుంది. ‘గని’ చిత్రంలోనూ ఇదే పాయింట్. కానీ ‘గని’ క్యారెక్టర్ ఏంటి? అతని ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? అనే అంశాలను చూపిస్తూ కథను ముందుకు నడిపించాడు దర్శకుడు కిరణ్ కొర్రపాటి. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ.. తెరపై చూపించడంలో తడబడ్డాడు. ఫస్టాఫ్ అంతా సాదాసీదాగా నడిపించి, అసలు కథను సెకండాఫ్‌లో చూపించాడు. ఫస్టాఫ్‌లో వచ్చే కాలేజీ సీన్స్, తల్లి కొడుకుల సెంటిమెంట్ అంతగా వర్కౌట్ కాలేదు. ఇక హీరోయిన్‌తో ప్రేమాయాణం అయితే అతికినట్లే ఉంది తప్ప వారి లవ్‌కి ప్రేక్షకుడు ఎక్కడా కనెక్ట్ కాలేడు. కమర్షియల్ సినిమా అన్నాక ఓ హీరోయిన్ ఉండాలి అనే కోణంలో ఆమె క్యారెక్ట్‌ని సృష్టించారు తప్ప.. ఈ కథకి అసలు ఆ పాత్రే అవసరం లేదనిపిస్తుంది. ఇక తల్లి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా అంతగా పండలేదు. నవీన్‌చంద్ర, వరుణ్‌ల మధ్య వచ్చే ఫైట్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఎలాంటి సర్ప్రైజ్ లేకుండా ఫస్టాఫ్ అంతా చాలా చప్పగా సాగినప్పటికీ.. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఉపేంద్ర ప్లాష్‌బ్యాక్ సీన్‌తో సెకండాఫ్ స్టార్ట్ అవుతుంది. అది కాస్త ఆసక్తిగా అనిపిస్తుంది. ఆ తర్వాత కథంతా మళ్లీ రొటీన్‌గానే సాగుతుంది. తండ్రికి అన్యాయం చేసిన ఈశ్వర్ ఇండియన్ బాక్సింగ్ లీగ్(ఐబీఎల్) నెలకొల్పడం.. ఆ ముసుగులో కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించడం..దానిని గని అరికట్టడంతో కథ ముగుస్తుంది. అయితే ఇక్కడ వచ్చే ప్రతి సీన్ గతంలో స్టోర్ట్స్ నేపథ్యంలో వచ్చిన చిత్రాలను గుర్తుకు చేస్తాయి. ప్రేక్షకుడి ఊహకి తగ్గట్టుగా కథనం సాగుతుంది. అన్ని స్పోర్ట్స్ డ్రామాల్లో ఎలాంటి క్లైమాక్స్ ఉంటుందో, గనిలోనూ అదే ఉంది. కాకపోతే ఎమోషన్ మిస్సయిందనిపిస్తుంది. ప్రతి పాత్రకు పేరున్న నటులను తీసుకోవడం సినిమాకు కలిసొచ్చింది. ఎవరెలా చేశారంటే.. బాక్సర్ గనిగా వరుణ్ తేజ్ మెప్పించాడు. ఈ పాత్ర కోసం వరుణ్ పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. రింగ్‌లోకి దిగే నిజమైన బాక్సర్లాగే కనిపించాడు. మాయ పాత్రలో సాయీ మంజ్రేకర్ పర్వాలేదనిపించింది. ఆమె పాత్ర నిడివి చాలా తక్కువే అయినా.. ఉన్నంతలో బాగానే నటించింది. ఇక హీరో తండ్రి విక్రమాదిత్యగా ఉపేంద్ర తన అనుభవాన్ని మరోసారి తెరపై చూపించాడు. కథను మలుపు తిప్పే పాత్ర అతనిది. గని కోచ్ పాత్రకు సునీల్ శెట్టి న్యాయం చేశాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఈశ్వర్ పాత్రలో జగపతిబాబు పరకాయ ప్రవేశం చేశాడు. హీరో తల్లిగా నదియా, బాక్సర్‌గా నవీన్ చంద్రతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం తమన్ సంగీతం. పాటలు యావరేజ్‌గానే ఉన్నప్పటికీ.. నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. స్పోర్ట్స్ డ్రామా చిత్రంలో ప్రేక్షకుడిని విలీనం చేయడంలో నేపథ్య సంగీతానిది కీలక పాత్ర.. ఆ విషయంలో తమన్‌కి నూటికి నూరు మార్కులు ఇవ్వొచ్చు. జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో చాలా సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. బాక్సాఫీస్‌పై ‘గని’ పంచ్ ఎలా ఉంటుందో ఈ వీకెండ్లో తెలిసిపోతుంది. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
విశాఖలో ‘గని’ ప్రీరిలీజ్ ఈవెంట్ .. భారీగా తరలివచ్చిన అభిమానులు
-
బాలీవుడ్ హీరోకి కరోనా సెగ : బిల్డింగ్‌కు సీల్
సాక్షి, ముంబై: బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి ఊహించని పరిణామం ఎదురైంది. ముంబైలో ఆయన నివాసం ఉంటున్న భవనాన్ని ముంబై మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. కరోనా నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీఎంసీ అధికారులు సోమవారం ప్రకటించారు. దక్షిణ ముంబై, ఆల్టమౌంట్ రోడ్‌లోని పృథ్వీ అపార్ట్మెంట్స్లోని 18వ అంతస్తులో సునీల్ శెట్టి నివసిస్తున్నారు. అయితే ఇక్కడ కరోనా వైరస్ కేసులు పెరగడంతో ఆ భవనానికి అధికారులు శనివారం సీల్ చేశారు. ఈ విషయాన్ని బీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ ప్రశాంత్ గైక్వాడ్ (డీవార్డ్) ధృవీకరించారు. కేసుల విస్తరణను అడ్డుకునే క్రమంలో ఇక్కడ రాక పోకలపై ఆంక్షలున్నాయని తెలిపారు. అలాగే భవనం వెలుపల పోలీసులను మోహరిస్తామని కూడా వెల్లడించారు. అయితే సునీల్ శెట్టి, ఆయన కుటుంబం మొత్తం ప్రస్తుతం సురక్షితంగా ఉందన్నారు. కాగా బీఎంసీ నిబంధనల ప్రకారం ఏదైనా బిల్డింగ్‌లో 5 లేదా అంతకుమించి కోవిడ్ కేసులు నమోదైతే, ఆ బిల్డింగ్‌ను కంటోన్మెంట్ ఏరియాగా పరిగణిస్తారు. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. -
డబ్బావాలాలకు సాయం
ముంబైలో చాలామంది డబ్బావాలాల మీద ఆధారపడతారు. వేడి వేడి ఆహారం నింపిన డబ్బాలను కరెక్ట్ టైమ్‌కి సంబంధిత వ్యక్తులకు అందజేస్తుంటారు ఈ డబ్బావాలాలు. ముంబైలో దాదాపు 2 లక్షలమంది డబ్బావాలాల మీద ఆధారపడి ఉన్నారు. 2013లో ఇర్ఫాన్ ఖాన్ ముఖ్యపాత్రలో డబ్బావాలాల నేపథ్యంలో ‘లంచ్‌బాక్స్’ అనే సినిమా కూడా వచ్చింది. ఇక ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా డబ్బావాలాల జీవితాలను ఇరకాటంలో పడేసింది. ఈ విషయాన్ని గమనించిన నటుడు సంజయ్ దత్ అస్లాం షేక్ అనే మంత్రితో కలిసి దాదాపు 5000 మంది డబ్బావాలాలకు ఆహారం అందజేసే బాధ్యతను తీసుకున్నారు. సంజయ్ దత్‌ని ఆదర్శంగా తీసుకుని డబ్బావాలాలను ఆదుకోవడానికి నటుడు సునీల్ శెట్టి కూడా ముందుకొచ్చారు. పుణేలోని ఒక క్యాంప్‌లో ఉంటున్న 800మంది డబ్బావాలాలకు అవసరమైన నిత్యావసరాలను స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి అందజేశారు సునీల్ శెట్టి. మరో మూడు నెలలపాటు డబ్బావాలాలకు సహాయం చేయాలనుకుంటున్నామని సంజయ్ దత్, సునీల్ శెట్టి పేర్కొన్నారు. -
రాహుల్ ఫొటోకు అతియా తండ్రి ఫన్నీ రిప్లై
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. బ్యాటు పట్టినంత ఈజీగా బాలీవుడ్ భామలతో డేటింగ్ చేస్తాడని పలువురు ఆయనను బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటో ఈ ప్రచారానికి మరింత ఊతమిస్తుంది. గత కొంత కాలంగా రాహుల్ బాలీవుడ్ హీరోయిన్ అతియాశెట్టితో ప్రేమలో ఉన్నాడని వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ డిన్నర్‌కు వెళ్లడం, కలిసి దిగిన ఫొటోలను షేర్ చేయడం, వీళ్లపై వస్తున్న రూమర్స్‌ను ఖండించకపోవడంతో వారిమధ్య ఏదో ఉందని దాదాపు అందరూ ఫిక్సయిపోయపారు. ఈ క్రమంలో రాహుల్ అతియాతో కలిసి దిగిన ఫన్నీ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీనికి ‘హేరా ఫేరీ’ సినిమాలోని ‘హలో దేవీప్రసాద్’ అనే పాపులర్ డైలాగ్‌ను జోడించాడు. ఈ ఫొటోలో రాహుల్ ఫోన్ పట్టుకుని గంభీరంగా కనిపిస్తుండగా అతియా మాత్రం నవ్వులు చిందిస్తోంది. ఇక ఈ ఫొటోకు అతియా తండ్రి సునీల్ శెట్టి అదే సినిమాలోని ‘ఓకే హంద్’ అనే సరదా డైలాగుతో రిప్లై ఇచ్చాడు. ‘క్యూట్‌గా ఉన్నార’ని టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, ‘చాలా బాగున్నారు’ అంటూ మరో క్రికెటర్ శిఖర్ ధావన్ కామెంట్ చేశారు. కాగా రాహుల్ ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా ఎన్నికైన సంగతి తెలిసిందే. View this post on Instagram Hello, devi prasad....? A post shared by KL Rahul👑 (@rahulkl) on Dec 27, 2019 at 10:15pm PST -
ఫొటోలో ఉంటే అంతేనా!
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తనయ అతియా శెట్టి- టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో ప్రేమలో ఉందంటూ బీ-టౌన్లో వార్తలు వినిపిస్తున్నాయి. అతియా బెస్టీ, మోడల్, సోషల్ మీడియా ఫేమ్ ఆకాంక్ష రంజన్‌కపూర్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫొటోనే ఇందుకు కారణం. రాహుల్, అతియాలతో కలిసి తీసుకున్నట్లుగా ఫొటోను షేర్ చేసిన ఆకాంక్ష.. ‘ఆ ప్రేమతో నేనెంతో సంతోషంగా ఉన్నాను’ అంటూ క్యాప్షన్ జత చేసింది. దీంతో అతియా, రాహుల్ ప్రేమలో ఉన్నారంటూ బాలీవుడ్లో ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో అతియా, రాహుల్‌ల మధ్య గత ఫిబ్రవరిలో స్నేహం చిగురించిందని.. అప్పటి నుంచి వీరిద్దరు కలిసి బయటకు వెళ్తున్నారని అతియా సన్నిహితులు తెలిపారు. అంతేకాకుండా ఈ రిలేషన్షిప్ పట్ల ఇద్దరు చాలా సీరియస్‌గా ఉన్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ బాలీవుడ్ సైట్ కథనం ప్రచురించింది. అయితే ఈ విషయంపై వీరిద్దరి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కాగా రాహుల్ ప్రస్తుతం ప్రపంచకప్‌తో బిజీగా ఉండగా.. అతియా తన అప్‌కమింగ్ మూవీ మెతీచూర్ చక్నాచూర్ షూటింగ్లో పాల్గొంటున్నారు. 2015లో ‘హీరో’ సినిమాతో తెరంగేట్రం చేసిన అతియా ప్రస్తుతం హీరోయిన్గా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక హీరోయిన్లతో కలిసి రాహుల్ పేరు వినిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలో నిధి అగర్వాల్, సోనాల్ చౌహాన్, ఆకాంక్ష రంజన్‌తో రాహుల్ ప్రేమలో ఉన్నాడంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే వీరంతా ఈ విషయాన్ని ఖండించారు. అయినా కలిసి ఫొటో దిగినంత మాత్రాన రాహుల్‌పై అసత్యాలు ప్రచారం చేస్తారా అంటూ అతడి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్‌ను ప్రశాంతంగా ఆడుకోవినవ్వండి అంటూ మండిపడుతున్నారు. View this post on Instagram ...n i’m so good with that 💛 A post shared by 🦋Kanch (@akansharanjankapoor) on Apr 25, 2019 at 7:01am PDT -
ఎవరిపై లేని నెగిటివిటి..వీళ్లపైనే ఎందుకు?!
ఒక ఐఏఎస్ పిల్లలు ఐఏఎస్‌లుగా అవ్వగా లేని అభ్యంతరం.. నటుల పిల్లలు సినిమాల్లోకి వస్తే మాత్రం ఎందుకు ఉంటుందని బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ప్రశ్నించాడు. భాష ఏదైనా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ మొత్తంలో నటుల వారసులు తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సునీల్ శెట్టి కూతురు అతియా ఇప్పటికే హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వగా.. కొడుకు అహాన్ శెట్టి కూడా త్వరలోనే బిగ్స్క్రీన్పై కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక కాఫీ విత్ కరణ్ షోలో నెపోటిజమ్(బంధుప్రీతి) గురించి ఫైర్‌బ్రాండ్ కంగనా ప్రస్తావించిన నాటి నుంచి సోషల్ మీడియాలో రచ్చ అవుతున్న సంగతి తెలిసిందే. స్టార్ కిడ్స్ లక్ష్యంగా కొంతమంది ట్రోలింగ్‌కు దిగుతున్నారు. ఈ విషయం గురించి సునీల్ శెట్టి మాట్లాడుతూ.. ‘ ఓ ఐఏఎస్ ఆఫీసర్ తన పిల్లలను తనలాగే అవ్వాలని కోరుకుంటాడు. దానిని ఎవరూ తప్పు పట్టరు. కానీ ఒక నటుడు, నటి పిల్లలు మాత్రం తల్లిదండ్రుల బాటలో నడవాలనుకుంటే మాత్రం ఎక్కడా లేని నెగిటివిటి చూపిస్తారు. నిజానికి వారసులకు ఎంట్రీ సులభంగా ఉంటుందేమో గానీ, మొదటి శుక్రవారం తర్వాత వాళ్ల ప్రతిభను నిరూపించుకుంటేనే కెరీర్లో నిలదొక్కుకుంటారు. కానీ కొంతమంది మాత్రం వారసులంటూ స్టార్ కిడ్స్‌పై అకారణ ద్వేషం పెంచుకుంటారు. ఇక జీవితంపై విరక్తి చెందిన వారు, సంతోషం లేని వారు తమ విసుగునంతా తెచ్చి సోషల్ మీడియాలో ప్రదర్శిస్తారు. ఊహా లోకంలో జీవిస్తూ ఎదుటి వారిపై అక్కసు వెళ్లగక్కేకంటే నిజ జీవితంలో అందరం కలివిడిగా ఉండటం ఉత్తమం. అయినా ద్వేషపూరిత మనస్తత్త్వం కలిగిన వారి గురించి నేనైతే అస్సలు పట్టించుకోను. నన్ను మా నాన్నా ఎలా పెంచాడో నేను కూడా నా పిల్లల విషయంలో అలాగే ఉన్నాను. వారిద్దరు తమ కెరీర్లో సొంతంగా నిర్ణయాలు తీసుకోగలిగేలా తీర్చిదిద్దాను’ అని పేర్కొన్నాడు -
పంత్.. ఇంకా పోరడబ్బా!
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరిగిన నాల్గో వన్డేలో భారత్ భారీ స్కోరు చేసినా ఓటమి చెందడానికి ప్రధాన కారణం ఫీల్డింగ్ వైఫల్యమే. అందులోనూ మ్యాచ్‌ను ఆసీస్ వైపు లాగేసుకున్న ఆస్టన్ టర్నర్‌ను స్టంపింగ్ చేసే విషయంలో భారత యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ చేసిన పొరపాట్లే హాట్ టాపిక్‌గా మారాయి. ఆస్టన్ టర్నర్‌ను రెండు సార్లు స్టంపింగ్ చేసే అవకాశం వచ్చినా రిషభ్ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ప్రధానంగా ఒక స్టంపింగ్ విషయంలో ధోనిని అనుకరించి విఫలం కావడం అభిమానులకు మరింత ఆగ్రహం తెప్పించింది. దాంతో స్టేడియం మొత్తం ‘ధోని-ధోని’ అంటూ మార్మోగిపోయింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో సైతం రిషభ్ పంత్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు నెటిజన్లు. ప్రతీ ఒక్కరూ ఎంఎస్ ధోనిలు కాలేరబ్బా అంటూ పంత్‌ను ఒక ఆట ఆడేసుకున్నారు. అయితే తాజాగా పంత్‌కు ఊహించని మద్దతు లభించింది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టితో పాటు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రాలు పంత్‌కు బాసటగా నిలిచారు. ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్న పంత్‌ను ధోనితో పోల్చడం సరికాదని అంటున్నారు. ‘ 21 ఏళ్ల వయసుకే భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో పంత్ ఆడుతున్నాడు. అతనొక యువ క్రికెటర్. అతని వయసులో మనం ఏం చేశామో ఒక్కసారి పరిశీలించుకుందాం. అతనికి ఒక చాన్స్ ఇవ్వండి. పంత్‌లో టాలెంట్ ఉంది. విమర్శలను పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టమని పంత్‌ను కోరుతున్నా’ అని సునీల్ శెట్టి ట్వీట్ చేశాడు. ఇక ఆకాశ్ చోప్రా మరొక అడుగు ముందుకేసి.. ‘పంత్‌లో ధోని వెతకడం ఆపండి’ అంటూ మండిపడ్డాడు. ‘అతని ఆట ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. అప్పుడే పంత్‌ను ధోనితో పోలుస్తారెందుకు. పంత్ విలువైన ఆటగాడా అని అడిగితే కచ్చితంగా అవుననే సమాధానం చెబుతా’ అని చోప్రా ట్వీట్ చేశాడు. (ఇక్కడ చదవండి: ధోని లేకపోవడం వల్లనే ఓటమి: మాజీ క్రికెటర్) He’s just 21 and represents India in all 3 formats. Let’s introspect and see what we were doing at that age. Give him a chance. @RishabPant777 u are pure talent keep the focus, you got this ! pic.twitter.com/GDySpRgiGU — Suniel Shetty (@SunielVShetty) 11 March 2019 Stop searching Dhoni-the keeper in Rishabh Pant. He’s work in progress. The question should be—Is he worth investing in? My answer—YES. #IndvAus — Aakash Chopra (@cricketaakash) 10 March 2019 -
మరో వారసుడు వచ్చాడు..
ముంబై: బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కొడుకు అహన్ తెరంగేట్రం చేయబోతున్నాడంటూ వచ్చిన వార్తలు నిజమయ్యాయి. తనకింకా చిన్నవయసేనని, ఇప్పుడే సినిమాల్లోకి రానని చెబుతూ వచ్చిన అహన్ తండ్రి బాటలో నడవాలని నిర్ణయించుకున్నాడు. బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియాడ్వాలా.. అహన్తో సినిమా నిర్మించనున్నాడు. ప్రముఖ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. అహన్‌కు విషెష్ చెబుతూ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. మొత్తానికి బాలీవుడ్లో మరో వారసుడు తెరంగేట్రం చేయబోతున్నాడు. సునీల్ శెట్టి కూతురు, అహన్ సోదరి అథియా శెట్టి ఇదివరకే బాలీవుడ్లో అరంగేట్రం చేసింది. తొలి సినిమాలోనే ఆమె అవార్డు అందుకుంది. అథియా మాదిరిగా అహన్ కూడా గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వనున్నాడు. -
మరో వారసుడు వస్తున్నాడు..!
ముంబై: బాలీవుడ్లో మరో వారసుడు తెరంగేట్రం చేయబోతున్నాడు. హీరో సునీల్ శెట్టి కొడుకు 21 ఏళ్ల అహన్ సినిమాల్లోకి రాబోతున్నాడు. వచ్చే ఏడాది ఓ యాక్షన్-రొమాన్స్ సినిమాలో అహన్ హీరోగా నటించనున్నట్టు సమాచారం. కాగా అహన్ మాత్రం తనకింకా చిన్నవయసేనని, ఇప్పుడే సినిమాల్లోకి రానని ఇటీవల చెప్పాడు. బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియాడ్వాలా.. అహన్తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. సునీల్ శెట్టి కూతురు, అహన్ సోదరి అథియా శెట్టి బాలీవుడ్లో అరంగేట్రం చేసింది. తొలి సినిమాలోనే ఆమె అవార్డు అందుకుంది. అథియా మాదిరిగా అహన్ కూడా గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వనున్నాడు. -
'ఈసారి దక్షిణాఫ్రికాదే వరల్డ్ కప్'
ముంబై: ప్రపంచకప్ కు ఎంపిక చేసిన భారత క్రికెట్ జట్టులో సీనియర్లకు చోటు కల్పించకపోవడాన్ని బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ షెట్టి తప్పుబట్టాడు. సీనియర్లను పక్కన పెట్ట డం తనకెంతో అసంతృప్తి, ఆగ్రహం కలిగించిందన్నాడు. జట్టుకు సీనియర్ ఆటగాళ్లు ఎన్నో సేవలు అందించారని, వారికిప్పుడు టీమ్ లో లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. 2011 ప్రపంచకప్ లో కీలక భూమిక పోషించిన యువరాజ్ సింగ్ ను తప్పించడం దారుణమన్నాడు. సెలక్షన్ కమిటీ సభ్యుల లాజిక్ తనకు అర్థం కాలేదన్నారు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడాన్ని తాను తప్పుబట్టడం లేదని, మరింత అనుభవం వచ్చిన తర్వాత వారిని ప్రపంచకప్ పోరుకు పంపితే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లికి మంచి భవిష్యత్ ఉందని పేర్కొన్నాడు. టీమిండియా ప్రపంచకప్ ఫైనల్ కు చేరకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. ఈసారి దక్షిణాఫ్రికా వరల్డ్ కప్ గెలుచుకునే అవకాశముందని సునీల్ షెట్టి అంచనా వేశాడు. -
నిర్మాతను మోసం చేసిన సునీల్ శెట్టి?
సినిమా నిర్మాత ఒకరిని మోసం చేసిన కేసులో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టిపై పోలీసు కేసు నమోదైంది. గత సంవత్సరం జూన్ నెలలో తాను సునీల్‌శెట్టితో ఒప్పందం కుదుర్చుకున్నానని, 'ముంబై కిస్కీ' అనే చిత్రంలో నటించేందుకు ఆయన 70 లక్షల రూపాయలు అడిగాడని హేమేంద్ర సింగ్ అనే నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనవద్ద నుంచి ముందుగానే అడ్వాన్సుగా 21 లక్షలు తీసుకున్నాడని, కానీ, ఆ తర్వాత తాను మాట్లాడదామంటే అస్సలు దొరకలేదని, అలాగే అడ్వాన్సు డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. చివరకు తన సినిమాలో నటించేది లేదని కూడా చెప్పేశాడన్నాడు. దీంతో ఐపీసీ సెక్షన్లు 420 (మోసం), 406 (విశ్వాసఘాతుకం) కింద సునీల్ శెట్టిపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. నగదు లావాదేవీలకు సంబంధించిన వివరాలను బ్యాంకు నుంచి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
డబ్బులు గుంజేందుకే..
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సునీల్శెట్టిపై దాఖలైన పరువునష్టం కేసు విచారణను నిలిపివేస్తున్నట్లు ఢిల్లీ కోర్టు సోమవారం ప్రకటించింది. దురుద్దేశంతోనే శెట్టిపై కేసు పెట్టారని, సమాజంలో పరపతి ఉన్న వ్యక్తి కావడంతో ఆయన నుంచి డబ్బు వసూలు చేసేందుకే ఈ పనిచేశారని, ఇలా చేయడం చట్టాలను దుర్వినియోగపర్చడమేనని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటిదాకా జరిగిన విచారణలో శెట్టి, ఆయన తరఫు న్యాయవాది వినీత్ ధండా ఎక్కడా ఎదుటివారి పరువుకు నష్టం కలిగేలా వ్యవహరించలేదనే విషయం తేలిందని, కేవలం డబ్బులు గుంజేందుకు మాత్రమే ఈ పని చేసినట్లు స్పష్టమవుతోందని, ఆరోపణలు చేసిన వ్యక్తులు వారి పరువుకు నష్టం కలిగినట్లుగా శెట్టి, ధండాలు వ్యవహరించినట్లు ఎక్కడా నిరూపించలేకపోయారని, అందుకే విచారణను నిలిపివేస్తున్నట్లు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సావిత్రి తీర్పునిచ్చారు. సునీల్ శెట్టిపై ఆరోపణలు రావడంతో ఆయనపై అభియోగాలు నమోదు చేయాల్సిందిగా గతంలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీకి చెందిన స్టంట్‌మేన్ పూరణ్ చౌహాన్ దాఖలు చేసిన ఈ కేసులో సునీల్ శెట్టి కూడా స్వయంగా కోర్టుకు హాజరై విచారణను ఎదుర్కొన్నారు. గతంలో ఓ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు విచారణకు హాజరైన సునీల్‌శెట్టి, అతని తరఫు న్యాయవాది ధండా తనను కోర్టు ఆవరణలోని వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్లి చితకబాదారని చౌహాన్ ఆరోపించారు. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే పోలీసుల విచారణలో.. ఎక్కడా ఇటువంటి ఘటన జరిగినట్లు రుజువు కాలేదు. దీంతో శెట్టి పరపతిని దెబ్బతీసేందుకే చౌహాన్ ఈ కుయుక్తి పన్నినట్లు గుర్తించిన కోర్టు అతణ్ని మందలిస్తూ విచారణను నిలిపివేసింది.