మరో వారసుడు వచ్చాడు.. | Suniel Shetty's son Ahan Shetty to be launched by Sajid Nadiadwala | Sakshi
Sakshi News home page

మరో వారసుడు వచ్చాడు..

Published Mon, Nov 28 2016 11:52 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

మరో వారసుడు వచ్చాడు.. - Sakshi

మరో వారసుడు వచ్చాడు..

ముంబై: బాలీవుడ్‌ హీరో సునీల్ శెట్టి కొడుకు అహన్ తెరంగేట్రం చేయబోతున్నాడంటూ వచ్చిన వార్తలు నిజమయ్యాయి. తనకింకా చిన్నవయసేనని, ఇప్పుడే సినిమాల్లోకి రానని చెబుతూ వచ్చిన అహన్‌ తండ్రి బాటలో నడవాలని నిర్ణయించుకున్నాడు. బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియాడ్వాలా.. అహన్తో సినిమా నిర్మించనున్నాడు.

ప్రముఖ ట్రేడ్‌ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. అహన్‌కు విషెష్‌ చెబుతూ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశాడు. మొత్తానికి బాలీవుడ్‌లో మరో వారసుడు తెరంగేట్రం చేయబోతున్నాడు. సునీల్ శెట్టి కూతురు, అహన్ సోదరి అథియా శెట్టి ఇదివరకే బాలీవుడ్లో అరంగేట్రం చేసింది. తొలి సినిమాలోనే ఆమె అవార్డు అందుకుంది. అథియా మాదిరిగా అహన్ కూడా గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement