మరో వారసుడు వస్తున్నాడు..! | Suniel Shetty's son Ahan to make his Bollywood debut | Sakshi
Sakshi News home page

మరో వారసుడు వస్తున్నాడు..!

Published Sat, Nov 5 2016 9:57 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

మరో వారసుడు వస్తున్నాడు..! - Sakshi

మరో వారసుడు వస్తున్నాడు..!

ముంబై: బాలీవుడ్లో మరో వారసుడు తెరంగేట్రం చేయబోతున్నాడు. హీరో సునీల్ శెట్టి కొడుకు 21 ఏళ్ల అహన్ సినిమాల్లోకి రాబోతున్నాడు. వచ్చే ఏడాది ఓ యాక్షన్-రొమాన్స్ సినిమాలో అహన్ హీరోగా నటించనున్నట్టు సమాచారం.

కాగా అహన్ మాత్రం తనకింకా చిన్నవయసేనని, ఇప్పుడే సినిమాల్లోకి రానని ఇటీవల చెప్పాడు. బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియాడ్వాలా.. అహన్తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. సునీల్ శెట్టి కూతురు, అహన్ సోదరి అథియా శెట్టి బాలీవుడ్లో అరంగేట్రం చేసింది. తొలి సినిమాలోనే ఆమె అవార్డు అందుకుంది. అథియా మాదిరిగా అహన్ కూడా గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వనున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement