సాక్షి, ముంబై: బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి ఊహించని పరిణామం ఎదురైంది. ముంబైలో ఆయన నివాసం ఉంటున్న భవనాన్ని ముంబై మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. కరోనా నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీఎంసీ అధికారులు సోమవారం ప్రకటించారు.
దక్షిణ ముంబై, ఆల్టమౌంట్ రోడ్‌లోని పృథ్వీ అపార్ట్‌మెంట్స్‌లోని 18వ అంతస్తులో సునీల్ శెట్టి నివసిస్తున్నారు. అయితే ఇక్కడ కరోనా వైరస్ కేసులు పెరగడంతో ఆ భవనానికి అధికారులు శనివారం సీల్ చేశారు. ఈ విషయాన్ని బీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ ప్రశాంత్ గైక్వాడ్ (డీవార్డ్) ధృవీకరించారు. కేసుల విస్తరణను అడ్డుకునే క్రమంలో ఇక్కడ రాక పోకలపై ఆంక్షలున్నాయని తెలిపారు. అలాగే భవనం వెలుపల పోలీసులను మోహరిస్తామని కూడా వెల్లడించారు. అయితే సునీల్ శెట్టి, ఆయన కుటుంబం మొత్తం ప్రస్తుతం సురక్షితంగా ఉందన్నారు. కాగా బీఎంసీ నిబంధనల ప్రకారం ఏదైనా బిల్డింగ్‌లో 5 లేదా అంతకుమించి కోవిడ్ కేసులు నమోదైతే, ఆ బిల్డింగ్‌ను కంటోన్మెంట్ ఏరియాగా పరిగణిస్తారు. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment