BMC Alleged Kareena Kapoor Family Not Cooperating Contact Tracing: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కుటుంబ కాంటాక్ట్ ట్రెసింగ్‌కు సహకరించడం లేదని బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు ఆరోపిస్తున్నారు. కరీనా ఇటీవల మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. నిర్మాత కరణ్ జోహార్ ఇంట్లో ఏర్పాటు చేసిన విందు పార్టీకి కరీనాతో పాటు హజరైన పలువురికి సైతం పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన బీఎంసీ కరోనా పరీక్షలు చేయిస్తుంది. ఈ నేపథ్యంలో కరీనా ఇంటిని సీజ్ చేసి శానిటైజ్ చేయించారు.
చదవండి: Corona Virus: బాలీవుడ్‌లో కరోనా కలకలం, కరోనా బారిన వరసగా సెలబ్రెటీలు
ఇక కాంటాక్ట్ ట్రెసింగ్‌తో ఎవరెవరూ పార్టీకి వచ్చారు వారంత ఎక్కడ ఉన్నారో తెలుసుకునే పనిలో పడ్డారు బీఎంసీ అధికారులు. అయితే దీనికి కరీనా కుటుంబం సహకరించడం లేదని బీఎంసీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరీనా భర్త సైఫ్ అలీఖాన్ ఎక్కడున్నారన్న విషయాన్ని చెప్పడం లేదని, ఎన్నిసార్లు అడిగినా ముంబైలో లేరనే చెబుతున్నారని, ఎక్కడున్నారన్న విషయాన్ని మాత్రం చెప్పడం లేదని అన్నారు. ప్రస్తుతం కాంటాక్ట్ ట్రేసింగ్ జరుగుతోందని, సేకరించిన నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిస్తామని చెప్పారు.
చదవండి: నుదిటిన సింధూరం.. తాలిబొట్టుతో చూడ ముచ్చటగా కత్రినా, ఫొటోలు వైరల్
కరీనా కపూర్ నిబంధనలు ఉల్లంఘించారని వస్తున్న వార్తలపై ఆమె అధికార ప్రతినిధి స్పందించారు. ఆమె చాలా బాధ్యతాయుతమైన పౌరురాలని, లాక్‌డౌన్ సమయంలో ఎంతో బాధ్యతగా వ్యవహరించారని పేర్కొన్నారు. కరణ్ జోహార్ ఈ నెల 8న తన ఇంట్లో ఇచ్చిన పార్టీలో ఓ వ్యక్తి దగ్గుతూ కనిపించాడని, అతడు రాకుండా ఉండాల్సిందని అన్నారు. తనకు కరోనా సోకిన విషయం తెలిసిన వెంటనే కరీనా క్వారంటైన్‌కు వెళ్లిపోయినట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment