బాలీవుడ్ జంట కరీనా కపూర్- సైఫ్ అలీ ఖాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు చిన్నారులు జన్మించారు. పెళ్లి తర్వాత తాను ఎంతగానో మారిపోయానంటోంది కరీనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'వివాహం నన్ను మార్చివేసింది. బాధ్యతగా ఉండటం తెలిసొచ్చింది. మేము ఒకరికొకరం తినిపించుకునేవాళ్లం. పోట్లాడుకునేవాళ్లం. కానీ మాకంటూ పెద్దగా సమయం కేటాయించుకోకపోయేవాళ్లం.
ఒకే ఇంట్లో ఉన్నా..
సైఫ్ ఒక్కోసారి ఉదయం 4.30 గంటలకు వచ్చి నిద్రపోయేవాడు. తను లేచేసరికి నేను షూట్‌కు వెళ్లిపోయేదాన్ని. నేనొచ్చేసరికి తను ఉండేవాడు కాదు. ఒకే ఇంట్లో ఉన్నా ఇద్దరం మాట్లాడుకునే పరిస్థితి లేకపోయేది. ఒక ఇంట్లో ఇద్దరు నటులు ఉంటే ఇలాగే ఉంటుంది. నేను తన సినిమాలన్నీ చూస్తాను. కానీ ఆయన మాత్రం నేను నటించిన క్రూ మూవీ కూడా ఇంతవరకు చూడలేదు. ఎప్పుడూ షూటింగ్స్ అంటూ తిరుగుతూనే ఉంటాడు.
ఏసీ దగ్గరే గొడవ
మా ఇద్దరికీ ఏసీ గురించే గొడవలవుతుంటాయి. తనకేమో కూలింగ్ ఎక్కువ కావాలంటాడు. నేనేమో 20 డిగ్రీలు చాలంటాను. ఇద్దరి మాటా కాదని 19 డిగ్రీల టెంపరేచర్ సెట్ చేస్తాడు. నా సోదరి కరిష్మా వచ్చినప్పుడు ఏసీ 25 డిగ్రీల నెంబర్‌లో పెట్టేస్తాం. అప్పుడైతే.. తనకంటే నేనే నయమని ఫీలవుతాడు. అలాగే టైం విషయంలో గొడవడపతాం. డబ్బు, వస్తువుల కోసం మేము పోట్లాడుకోం. ఇద్దరం కలిసి కాసేపు సరదాగా మాట్లాడుకుంటే చాలని భావిస్తాం. కాస్త సమయం దొరికితే కలిసుండాలని ఆరాటపడతాం' అని చెప్పుకొచ్చింది.
సినిమా..
కాగా సైఫ్ అలీ ఖాన్ గతంలో అమృత సింగ్‌ను పెళ్లాడగా వీరికి సారా అనే కూతురు, ఇబ్రహీం అనే కుమారుడు సంతానం. అమృతకు విడాకులిచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత 2012లో కరీనాను పెళ్లాడాడు. ఇకపోతే సైఫ్ ప్రస్తుతం 'దేవర' సినిమాలో నటిస్తుండగా కరీనా 'ద బకింగ్‌హామ్ మర్డర్స్' మూవీ చేస్తోంది.
చదవండి: ఆ హీరోయిన్‌కు యాక్టింగ్ రాదు, తీసుకోవద్దన్నారు: డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment