Kareena Kapoor
-
కరీనా కపూర్ కజిన్ ఆదార్ జైన్ మెహందీ ఫంక్షన్ (ఫోటోలు)
-
'ఎమోషన్స్ అప్పటి వరకు ఎవరికీ అర్థం కావు'.. కరీనా కపూర్ ఆసక్తికర పోస్ట్
బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు. హీరో సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లాడిన ముద్దుగుమ్మ.. తాజాగా చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. కుటుంబంలో ఉండే రిలేషన్స్‌ను ఉద్దేశించి కరీనా కపూర్ చేసింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. సమయంతో పాటు ఎవరికైనా నిర్ణయాలు మారవచ్చని తెలిపింది. సైఫ్ అలీ ఖాన్‌పై దాడి తర్వాత చేసిన పోస్ట్ కావడంతో అభిమానుల్లో చర్చ మొదలైంది. ఇంతకీ ఆ పోస్ట్‌లో ఏముందో ఓసారి చూసేద్దాం.కరీనా కపూర్ తన పోస్ట్‌లో రాస్తూ.. " వివాహాలు, విడాకులు, ఆందోళనలు, పిల్లలు పుట్టడం, ఇష్టమైన వ్యక్తి మరణం, పేరెంటింగ్ గురించి సంఘటనలు నిజంగా అర్థం చేసుకోలేరు. ఇది మీ జీవితంలో నిజంగా జరిగే వరకు మీకు ఇలాంటి విషయాలు అర్థం కావు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలోని పరిస్థితులు, సిద్ధాంతాలు, ఊహలు వాస్తవాలు కావు. జీవితంలో మీరు ఎన్ని ఇబ్బందులు పడితే అంత తెలివైన వారిగా ఎదుగుతారు" అంటూ రాసుకొచ్చింది.కాగా.. ఇటీవల ఆమె భర్త సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ముంబయిలోని బాంద్రాలో ఉన్నఇంట్లోకి ఒక ఆగంతకుడు చోరీకి యత్నించాడు. అదే క్రమంలో అడ్డుకునేందుకు వచ్చిన సైఫ్‌ను కత్తితో దాడి చేశాడు. దీంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. సినిమాల విషయానికొస్తే కరీనా కపూర్ చివరిసారిగా హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన ది బకింగ్‌హామ్ మర్డర్స్ చిత్రంలో కనిపించింది. -
సైఫ్‌ను ఆవేశంతో పొడిచాడు.. నా నగల జోలికి వెళ్లలేదు: కరీనా
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి (Saif Ali Khan Attack) ఘటనలో ఆయన సతీమణి, హీరోయిన్ కరీనా కపూర్ (Kareena Kapoor) స్టేట్మెంట్ను బాంద్రా పోలీసులు రికార్డు చేశారు. ఈ ఘటన గురించి కరీనా పోలీసులతో మాట్లాడుతూ.. దొంగతనానికి వచ్చిన వ్యక్తి ఎంతో ఆవేశంగా ఉన్నాడంది. అతడిని సైఫ్ అడ్డుకోవడంతో కోపంతో పలుమార్లు కత్తితో పొడిచాడని పేర్కొంది. తన నగలు బయటే ఉన్నప్పటికీ వాటిని తీసుకునేందుకు ప్రయత్నించలేదని తెలిపింది. ఈ దాడి తర్వాత సోదరి కరిష్మా వచ్చి తన ఇంటికి తీసుకెళ్లిందని వివరించింది.ఏం జరిగిందంటే? ముంబైలోని బాంద్రాలో నివాసముంటున్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గురువారం తెల్లవారుజామున ఓ దుండగుడు చోరీకి ప్రయత్నించాడు. సైఫ్ చిన్నకుమారుడు జెహ్ గదిలో నక్కిన అతడిని పనిమనిషి గుర్తించి కేకలు వేయడంతో సైఫ్ పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. దుండగుడిని అడ్డుకునే క్రమంలో అతడు విచక్షణారహితంగా సైఫ్‌ను కత్తితో పొడిచి మెట్లమార్గం గుండా పరారయ్యాడు.సమయానికి కారు కూడా అందుబాటులో లేకపోవడంతో ఓ ఆటోలో సైఫ్ అలీఖాన్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడిని పరిశీలించిన వైద్యులు రెండు లోతైన కత్తిపోట్లు సహా మొత్తం ఆరు కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. వెన్నెముకలో 2.5 అంగుళాల కత్తి మొన విరిగినట్లు గుర్తించి ఆపరేషన్ ద్వారా తొలగించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉంది.నిందితుడి కోసం గాలింపుసైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి ఘటనపై పోలీసులు 20 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలిస్తున్నారు. మొదట నిందితుడు దొరికాడని, అతడు దొంగతనం కోసమే నటుడి ఇంట్లోకి చొరబడినట్లు వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదని పోలీసులు స్పష్టతనిచ్చారు. దాడి జరగడానికి రెండు రోజుల క్రితం సైఫ్ ఇంట్లో పని చేసిన కార్పెంటర్‌ను విచారించి వదిలేశామని తెలిపారు. ఇక విచారణలో భాగంగా ఇప్పటికే 30 మంది స్టేట్మెంట్స్ను పోలీసులు రికార్డు చేశారు. శుక్రవారం ఒక్కరోజే 15 మందిని విచారించారు. శనివారం నాడు మధ్యప్రదేశ్‌లోని ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.సినిమాసైఫ్ అలీఖాన్ హిందీలో అనేక సినిమాలు చేశాడు. హీరోగా, విలన్‌గా మెప్పించాడు. పలు సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించాడు. తెలుగులోనూ రెండు సినిమాలు చేశాడు. ప్రభాస్ 'ఆదిపురుష్'లో లంకేశ్‌గా నటించాడు. గతేడాది వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ 'దేవర మూవీ'లో విలన్‌గా మెప్పించాడు.చదవండి: Saif Ali Khan: హైప్రొఫైల్ కేసులో ఇంత అలసత్వమా? -
Saif Ali Khan: హైప్రొఫైల్ కేసులో ఇంత అలసత్వమా?
ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో ముంబై పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగి రెండ్రోజులు గడిచినప్పటికీ.. ఇప్పటికీ నిందితుడి ఆచూకీ కనిపెట్టలేకపోయారు. మరోవైపు.. నిందితుడు మాత్రం పక్కాగా తప్పించుకుంటూ తిరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై దాడి కేసులో ముంబై పోలీసుల(Mumbai Police)పై ఇటు సినీవర్గాల, అటు రాజకీయ వర్గాల నుంచి విపరీతమైన ఒత్తిడి నెలకొంది. ఘటన జరిగి 50 గంటలు దాటిపోయినా.. నిందితుడిని, అతనితో సంబంధం ఉన్నవాళ్లెవరినీ పోలీసులు ట్రేస్ చేయలేకపోయారు. సెలబ్రిటీల విషయంలోనే ఇలా ఉంటే.. మా పరిస్థితి ఏంటని? సాధారణ ప్రజలు సైతం ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు సోషల్‌మీడియాలో ముంబై పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. మరోవైపు నిందితుడు తప్పించుకుంటున్న తీరూ పోలీసులను మరింత ఇబ్బందికి గురి చేస్తోంది.తాజాగా సైఫ్‌పై దాడి చేసిన దుండగుడి(Saif Attacker)కి సంబంధించిన మరో ఫొటో బయటకు వచ్చింది. దాడి జరిగిన రోజు.. తల కవర్ అయ్యేలా బ్లాక్ టీ షర్ట్ వేసుకున్నట్లుగా ఫొటోలను తొలుత మీడియాకు పోలీసులు విడుదల చేశారు. ఆపై కొన్నిగంటల వ్యవధిలో విడుదల చేసిన ఫుటేజీలో బ్లూ షర్ట్ కనిపించింది. ఇప్పుడు తాజాగా రిలీజ్చేసిన ఫొటోల్లో పసుపు రంగు దుస్తుల్లో కనిపించాడు. బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలోని దొరికిన సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలుగా తెలుస్తోంది. దీంతో.. అక్కడ రైలెక్కి నగరంలోని మరో చోటుకి నిందితుడు పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఘటన జరిగిన కొన్ని గంటలకు ఓ దుకాణానికి వెళ్లి హెడ్‌ఫోన్స్ కొన్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.Mumbai, Maharashtra: Officers from the Crime Branch visited the Kabutarkhana area in Dadar and collected CCTV footage from a mobile shop named "Iqra" from where he purchased headphones after attacking actor Saif Ali Khan pic.twitter.com/ILxBjsD7eZ— IANS (@ians_india) January 18, 2025ఈ క్రమంలో ముంబైలోని అన్ని రైల్వే స్టేషన్ల వెంట సీసీకెమెరాలను జల్లెడ పడుతున్నారు. ప్రస్తుతానికి నిందితుడి కోసం గాలింపు చేపడుతున్న బృందాల సంఖ్యను 35కి పెంచారు.ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం.. దుండగుడ్ని తొలిగా చూసింది సైఫ్ ఇంట పని చేసేవాళ్లు. దీంతో బాంద్రా పోలీసులు వాళ్ల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. నిందితుడి గురించి ఆనవాళ్లను వాళ్ల నుంచి సేకరించారు. సుమారు 35-40 ఏళ్ల మధ్య వయసు ఉండొచ్చని, ఐదున్నర అడుగుల ఎత్తు, ఛామనఛాయ రంగు ఉన్నట్లు వెల్లడించారు. ఇక.. దాడిపై సైఫ్ భార్య కరీనా కపూర్(Kareena Kapoor)తో పాటు ఇతర కుటుంబ సభ్యుల నుంచి కూడా పోలీసులు వాంగ్మూలం సేకరించారు. అది అరెస్ట్ కాదు!సైఫ్‌పై దాడి ఘటన కేసులో ముంబై పోలీసులు ఇప్పటికే వందకుపైగా మందిని విచారించారు. క్రిమినల్ రికార్డులు ఉన్న మరికొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఓ కార్పెంటర్‌ను పోలీసులు విచారణ కోసం తీసుకొచ్చారు. అయితే సైఫ్ కేసులో నిందితుడు అరెస్ట్ అయ్యాడంటూ.. మీడియా హడావిడి చేసింది. అయితే అతను కేవలం అనుమానితుడు మాత్రమేనని, కేవలం విచారణ జరిపి వదిలేశామని, ఈ కేసులో ఇంతదాకా ఎలాంటి అరెస్ట్ చేయలేదని, అలాంటిది ఏమైనా ఉంటే తామే స్వయంగా ప్రకటిస్తామని ముంబై పోలీసులు స్పష్టత ఇచ్చారు. మరోవైపు ఈ కేసులో వస్తున్న విమర్శలను సీఎం దేవంద్ర ఫడ్నవీస్ ఖండించారు. పోలీసులు అన్నికోణాల్లో.. అన్నివిధాలుగా దర్యాప్తు చేస్తున్నారని, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.FIR ప్రకారం..ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్(54)పై బుధవారం అర్ధరాత్రి దాటాక 2గం.30ని. ప్రాంతంలో ఆయన నివాసంలోనే దాడి జరిగింది. ఈ ఘటనపై ఆయన కుటుంబం బాంద్రా పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఎఫ్ఆర్లో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.దుండగుడు ఆ రాత్రి సైఫ్ చిన్నకొడుకు జెహ్ గదిలోకి ప్రవేశించాడు. వెంటనే.. ఆ చిన్నారి సహాయకురాలు సాయం కోసం కేకలు వేసింది. ఆ అరుపులతో గదిలోకి వచ్చిన సైఫ్‌కి దుండగుడికి మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో తన దగ్గర ఉన్న పదునైన కత్తితో సైఫ్‌ను ఆరుసార్లు పొడిచాడు. ఆ వెంటనే మరో ఇద్దరు సహాయకులపైనా దుండగుడు హాక్సా బ్లేడ్‌తో దాడి చేసి పారిపోయాడు.రక్తస్రావం అయిన సైఫ్‌ను తనయుడు ఇబ్రహీం, ఇతర కుటుంబ సభ్యులు ఓ ఆటోను పిలిపించి.. లీలావతి ఆస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి 3గం. టైంలో సైఫ్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. వెన్నెముకకు దగ్గరగా కత్తి ముక్క దిగడంతో సర్జరీ చేసి దానిని తొలగించారు. ఆయనకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు ప్రకటించారు.ఇదీ చదవండి: ముంబైలో దాడులకు గురైన సెలబ్రిటీలు వీళ్లే! -
సైఫ్అలీఖాన్కు కత్తిపోట్లు: కరీనా, సైఫ్ లగ్జరీ బంగ్లా ఇదే (ఫోటోలు)
-
'షో చేస్తున్నావేంటి? నీ కంటికి మా హీరోయిన్ ఎలా కనిపిస్తోంది?'
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్లలో కరీనా కపూర్ ఒకరు. ఈ ఏడాది క్రూ, సింగం అగైన్ వంటి హిట్ చిత్రాలతో అలరించింది. ఓ పక్క స్టార్ హీరోలతో జత కడుతూనే మరోపక్క క్రూ, ద బకింగ్‌హామ్ మర్డర్స్ వంటి మహిళా ప్రాధాన్యత సినిమాలు చేస్తోంది. 44 ఏళ్ల వయసులోనూ పడుచు హీరోయిన్లకు గట్టి పోటీనిస్తోంది. అయితే ఓ పాకిస్తాన్ నటుడు మాత్రం ఆమెకు వయసు పెరిగిపోయిందంటున్నాడు. ఆమెకు కుమారుడిగా మాత్రమే నటిస్తాపాక్ నటుడు ఖాఖన్ షానవాజ్ ఓ టీవీ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని.. మీరు కరీనా కపూర్‌తో నటిస్తే చూడాలనుందని మనసులో మాట బయటపెట్టాడు. అందుకతడు.. అవునా.. సరే, నేను ఆమెకు కుమారుడిలా నటిస్తాను. అలాంటి ఆఫర్ వస్తే తప్పకుండా చేస్తాను. కరీనా వయసులో చాలా పెద్దది. కాబట్టి నేను కేవలం ఆమె కుమారుడిగా మాత్రమే నటించగలను అని చెప్పాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా బెబో (కరీనా కపూర్) ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నటుడిపై ట్రోలింగ్'నువ్వు ఆమెతో కనీసం స్టేజీ కూడా పంచుకోలేవు. అలాంటిది ఏకంగా తనతో సినిమా చేస్తాననుకుంటున్నావా? ఇంకో విషయం తనకు కేవలం 44 ఏళ్లు మాత్రమే..', 'తనతో నటించే ఛాన్స్ నీకెవరు ఇస్తారు?', 'పెద్ద గొప్పలు పోతున్నావ్ కానీ ఆ భ్రమలో నుంచి బయటకు వచ్చేయ్..', 'ఏజ్ షేమింగ్ చేస్తున్నావేంటి? ఒకసారి కరీనా కుమారుడిని చూసి నీ ముఖం అద్దంలో చూసుకోపో.',.' ఫ్లాప్ హీరోయిన్స్ కూడా నీతో కలిసి పని చేయాలనుకోరు' అంటూ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.చదవండి: 'పుష్ప2' ఘటన.. వాళ్లకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్లాన్: విజయశాంతి -
మా ఇంటిదేవతకు హ్యాపీ బర్త్‌డే : బాలీవుడ్ బ్యూటీ సంబరాలు (ఫొటోలు)
-
రెడ్ సీ ఫిలిం ఇంటర్నేషనల్ ఫెస్టివల్: కరీనా ఫ్యాషన్ లుక్స్ (ఫోటోలు)
-
ఓ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రా జెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం ‘ది బకింగ్‌హామ్ మర్డర్స్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.నేరం ఎక్కడ జరిగినా నేరస్తుడి కోణంలో పరిశోధన జరిపితే నేరస్తుడు సులభంగా దొరుకుతాడు అని చెప్పే సినిమా ‘ది బకింగ్‌హామ్ మర్డర్స్’. ఇదో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకొని అల్లుకున్న కథ ఇది. 2023 అక్టోబర్ 14న జరిగిన 67వ లండన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. ఈ సినిమాని దర్శకులు హన్సల్ మెహతా రూ΄÷ందించారు. ఇందులో ముఖ్య పాత్రధారి అయిన జస్మీత్ భమ్రా పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ నటించారు.ఇక ఈ సినిమా కథాంశానికొస్తే... జస్మీత్ ఓ బ్రిటీష్ ఇండియన్ డిటెక్టివ్. తన కొడుకు ఓ డ్రగ్ అడిక్ట్ చేతిలో చనిపోతాడు. ఆ విషయాన్ని తట్టుకోలేక జస్మీత్ బకింగ్‌హామ్ నగరానికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటుంది. బకింగ్హామ్కు రావడంతోనే ఓ కేసు తనకు తానే కావాలని తీసుకుంటుంది. బకింగ్హామ్లో నివాసం ఉంటున్న దల్జీత్, ప్రీతి కొల్లి దత్తపుత్రుడు ఇష్ ప్రీత్ కనబడడం లేదన్నది ఆ కేసు సారాంశం. ఈ కేసు జస్మీత్ తీసుకోవడానికి కారణం తప్పిపోయిన ఇష్ ప్రీత్ సరిగ్గా తన కొడుకు వయసు వాడవడం ఒకటయితే ఈ కేసులో డ్రగ్స్ పాత్ర ఉండడం రెండో కారణం. ఓ పక్క కొడుకును పోగొట్టుకున్న బాధతో మరో పక్క కనబడని బిడ్డ కోసం తల్లిదండ్రులకు తోడుగా ఈ కేసును జస్మీత్ ఎలా పరిష్కరించింది అన్నదే మిగతా సినిమా. సాధారణంగా క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ సినిమాలంటే అందరూ ఇష్టపడరు. కానీ ఈ సినిమా చూసే కొద్దీ చూస్తున్నవాళ్లు బాగా ఇన్వాల్వ్ అవుతారు. ఇక సినిమా స్క్రీన్‌ప్లే ఊహకందని ట్విస్టులతో ఉత్కంఠ రేపుతుంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఓ హైలైట్ అనే చెప్పాలి. జస్మీత్ భమ్రా పాత్రలో కరీనా కపూర్ జీవించారనే చెప్పాలి. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా దాదాపు మూడు వారాల నుండి టాప్ 10లో నిలిచింది. వర్తఫుల్ మూవీ ఫర్ దిస్ వీకెండ్ వాచిట్. – హరికృష్ణ ఇంటూరు -
OTT: ‘ది బకింగ్ హామ్ మర్డర్స్’ మూవీ రివ్యూ
నేరం ఎక్కడ జరిగినా నేరస్తుడి కోణం లో పరిశోధన జరిపితే నేరస్తుడు సులభంగా దొరుకుతాడు అని చెప్పే సినిమా ది బకింగ్ హామ్ మర్డర్స్. ఇదో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. కొన్ని యదార్ధ సంఘటనలను ఆధారంగా చేసుకొని అల్లుకున్న కథ ఇది. 2023సంవత్సరం అక్టోబర్ 14వ తేదీ నాడు జరిగిన 67వ లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. ఈ సినిమాని దర్శకులు హన్సల్ మెహతా రూపొందించారు. ఈ సినిమాలో ముఖ్య పాత్రధారి అయిన జస్మీత్ భమ్రా పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ నటించడం విశేషం. ఇక ఈ సినిమా కథాంశానికొస్తే.. జస్మీత్ ఓ బ్రిటీష్ ఇండియన్ డిటెక్టివ్. తన కొడుకు ఓ డ్రగ్ అడిక్ట్ చేతిలో చనిపోతాడు. ఆ విషయాన్ని తట్టుకోలేక జస్మీత్ బకింగ్ హామ్ నగరానికి కు ట్రాన్సఫర్ చేయించుకుంటుంది. బకింగ్ హామ్ కు రావడం తోనే ఓ కేసు తనకు తానే కావాలని తీసుకుంటుంది. బకింగ్ హామ్ లో నివాసం వుంటున్న దల్జీత్, ప్రీతి కొల్లి దత్తపుత్రుడు ఇష్ ప్రీత కనబడడం లేదని ఆ కేసు సారాంశం. ఈ కేసు జస్మీత్ తీసుకోవడానికి కారణం తప్పిపోయిన ఇష్ ప్రీత్ సరిగ్గా తన కొడుకు వయసు వాడవడం ఒకటయితే ఈ కేసు లో డ్రగ్స్ పాత్ర ఉండడం రెండవ కారణం. ఓ పక్క కొడుకును పోగొట్టుకున్న బాధతో మరో పక్క కనబడని బిడ్డ కోసం తల్లిదండ్రులకు తోడుగా ఈ కేసును జస్మీత్ ఎలా సాల్వ్ చేస్తున్నదే మిగతా సినిమా. సాధారణంగా క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ సినిమాలంటే అందరూ ఇష్టపడరు. కాని ఈ సినిమా చూసేకొద్దీ చూస్తున్నవాళ్ళు బాగా ఇన్వాల్వ్ అవుతారు. ఇక సినిమా స్క్రీన్ ప్లే ఊహకందని ట్విస్టులతో ఉత్కంఠ రేపుతుంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఓ హైలైట్ అనే చెప్పాలి. కరీనాకపూర్ ఈ పాత్రలో జీవించందనే చెప్పాలి. నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా దాదాపు మూడు వారాల నుండి టాప్ 10 లో నిలిచింది. వర్తఫుల్ మూవీ ఫర్ దిస్ వీకెండ్ వాచిట్. -
సాయి ధరమ్ తేజ్, కలర్స్ స్వాతిలకు అవార్డ్స్ (ఫోటోలు)
-
వైభవంగా నటుడి రోకా వేడుక, రణబీర్, కరీనా,సైఫ్, సందడి (ఫొటోలు)
-
‘తిర ఫ్లాగ్షిప్’ స్టోర్ ప్రారంభోత్సవంలో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
‘ఇంతకీ నువ్వు కట్టుకుంది నన్నా? మీ అక్కనా?’
బాలీవుడ్లో కరీనా కపూర్ ఖాన్‌కి గాసిప్ క్వీన్ అనే పేరుంది. అక్క కరిశ్మా కపూర్‌తో ఫోన్లో గంటలు గంటలు కబుర్లు చెబుతూ ఉంటుందట. అందులో సగం గాసిప్సే ఉంటాయని ఆ ఇద్దరి సన్నిహితుల కామెంట్! అదటుంచితే.. ఈ అక్కాచెల్లెళ్ల ఎడతెగని ఫోన్ సంభాషణలతో కరీనా కపూర్ ఖాన్ హజ్బెండ్, నటుడు.. సైఫ్ అలీ ఖాన్ తెగ ఉడుక్కుంటాడట. ‘ఇంతకీ నువ్వు కట్టుకుంది నన్నా? మీ అక్కనా?’ అంటూ ఆ ఉడుకుమోత్తనాన్ని చూపిస్తాడట కూడా! -
ఓటీటీలో డిటెక్టివ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్
బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ‘ది బకింగ్హమ్ మర్డర్స్’ ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారిక ప్రకటన వెలువడింది. హన్సల్ మెహతా దర్శకత్వం వహంచిన ఈ చిత్రం సెప్టెంబరు 13న రిలీజ్ అయింది. '1992 స్కామ్' వంటి వెబ్ సిరీస్‌తో దర్శకుడు తన మార్క్ చూపించిన హన్సల్ మెహతా ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. అయితే, ఊహించినంతగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మెప్పించలేదు.బ్రిటిష్– ఇండియన్ డిటెక్టివ్ జస్మిత్ భామ్రా పాత్రలో కరీనా మెప్పించింది. క్రైమ్ థ్రిల్లర్‌గా పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. నవంబర్ 8న స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. హిందీ, ఇంగ్లీష్‌లో మాత్రమే ప్రస్తుతం అందుబాటులోకి రానుంది. తెలుగు వర్షన్ గురించి మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.ది బకింగ్‌హామ్ మర్డర్స్ రన్‌టైమ్ కేవలం 90 నిమిషాలు మాత్రమే ఉంటుంది. రూ. 50 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం రూ. 15 కోట్లు మాత్రమే రాబట్టింది. క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీస్‌ను ఇష్టపడే ప్రేక్షకులు మాత్రం ఓటీటీలో తప్పకుండా ఈ మూవీని ఇష్టపడుతారని చెప్పవచ్చు. -
'సింగం అగైన్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో జిగేల్మన్న కరీనా కపూర్ (ఫోటోలు)
-
బనారసీ చీర గౌనులో కరీనా స్టన్నింగ్ లుక్స్..! (ఫోటోలు)
-
అటు ప్రభాస్.. ఇటు మహేశ్.. కరీనాకి డబుల్ చాన్స్!
హీరో ప్రభాస్, హీరోయిన్ కరీనా కపూర్ జోడీ కట్టనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు ప్రభాస్. ప్రస్తుతం ‘స్పిరిట్’ సినిమాకు చెందిన ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో ‘స్పిరిట్’ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారట. (చదవండి: ప్రేమకథ బయటపెట్టిన సోనియా.. బూతులందుకున్న పృథ్వి)ఈ లోపు ఈ సినిమాకు చెందిన నటీనటుల ఎంపికపై సందీప్ రెడ్డి దృష్టి పెట్టారట. ఈ క్రమంలోనే హీరోయిన్ పాత్ర కోసం కరీనా కపూర్‌ను సంప్రదించారని సమాచారం. అంతేకాదు... కరీనా భర్త, నటుడు సైఫ్ అలీఖాన్ కూడా ‘స్పిరిట్’ చిత్రంలో కనిపిస్తారని, సైఫ్‌ది విలన్ పాత్ర అని బాలీవుడ్ భోగట్టా. (చదవండి: సూపర్‌స్టార్ కాళ్లకు నమస్కరించిన ఐశ్వర్య కూతురు..!)మరోవైపు మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారట రాజమౌళి. ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం కరీనాను సంప్రదించారనే ప్రచారం టాలీవుడ్లో వినిపిస్తోంది. మరి... ప్రభాస్ ‘స్పిరిట్’కు కరీనా ఫైనల్ అవుతారా? మహేశ్‌బాబు చిత్రంలోనూ నటిస్తారా? లేదా ఈ రెండు భారీ చిత్రాల్లో భాగమయ్యేలా డబుల్ చాన్స్ దక్కించుకుంటారా? అనేది చూడాలి. -
గణపతి బప్పా మోరియా : స్టార్ కిడ్ రాహా ఎంత ముద్దుగా ఉందో!
వినాయకవి చవితి పండుగను చిన్నా, పెద్దా అంతా దేశవ్యాప్తంగా అత్యంత ఉత్సాహంగా నిర్వహించు కుంటున్నారు. ఇప్పటికే చాలాచోట్ల గణేష్ నిమజ్జన కార్యక్రమాలు పూర్తయ్యాయి కూడా. తాజాగా గణేష్ చతుర్థి వేడుకల ఫోటోలను బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ షేర్ చేసింది. ఈ ఫోటోలో కపూర్ కుటుంబానికి చెందిన మూడు తరాల వారు నిండుగా కనిపించడం విశేషంగా నిలిచింది. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ కపుల్, రణబీర్ కపూర్, అలియాభట్ ముద్దుల తనయ రాహా తండ్రి ఒడిలో మరింత ముద్దుగా కనిపించింది. ఇంకా స్టార్ కిడ్స్ ఆదార్ జైన్, అలేఖా అద్వానీ, కరీనా కపూర్ కుమారులు జెహ్ అలీ ఖాన్, తైమూర్ అలీ ఖాన్ కూడా అందంగా ఉన్నారు. View this post on Instagram A post shared by Karisma Kapoor (@therealkarismakapoor) తమ ఇంట్లో జరిగిన గణనాధుడి వేడుకలకు సంబంధించిన ఫోటోలను (సెప్టెంబర్ 15) ఆదివారం కరిష్మా ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇందులో రణధీర్ కపూర్, బబితా కపూర్ కరిష్మా కపూర్, కరీనా కపూర్, జెహ్ అలీ ఖాన్, తైమూర్ అలీ ఖాన్, రణబీర్ కపూర్, రాహా కపూర్ , ఇతరులున్నారు. "గణపతి బప్పా మోరియా", అంటూ అంతా కలిసి గణపతి బప్పాకు పూజలు అనంతరం ఫ్యామిలీ ఫోటో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. అయితే కపూర్ కుటుంబంలో రాహా తల్లి అలియా భట్ , కరీనా భర్త సైఫ్ అలీ ఖాన్ మిస్ అయ్యారు.అలాగే నానమ్మ నీతా కపూర్‌తో, చిన్నారి రాహా క్యూట్ ఇంటరాక్షన్ వీడియో కూడా నెట్టింట సందడి చేస్తోంది. ఎయిర్‌పోర్ట్‌లో అమ్మ చంకలో ఒదిగిపోయిన రాహా, నానమ్మను చూసి లిటిల్ ప్రిన్సెస్ తెగ సంతోష పడింది. సోమవారం ఉదయం వీరు ముంబై విమానాశ్రయంలో కనిపించారు. View this post on Instagram A post shared by yogen shah (@yogenshah_s) తన రాబోయే చిత్రం జిగ్రా ప్రమోషన్లో అలియా బిజీగా ఉంది. ఈ మూవీ అక్టోబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది. సందీప్ రెడ్డి వంగా సెన్సేషనల్ మూవీ యానిమల్ చిత్రంలో రణ్‌బీర్ స్టార్డం అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం నితీష్ తివారీ రామాయణంలో శ్రీరాముని పాత్రలో నటిస్తున్నాడు. ఇదీ చదవండి: వాకింగ్ : జంటగానా? ఒంటరిగానా? ఎపుడైనా ఆలోచించారా? -
స్టార్ హీరోయిన్ క్రేజీ థ్రిల్లర్ సినిమా.. రిలీజైన ట్రైలర్
థ్రిల్లర్ సినిమాలకు ఉండే డిమాండ్ వేరు. సరిగా తీయాలే గానీ అద్భుతమైన సక్సెస్ అవుతాయి. అలా ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ లీడ్ రోల్ చేసిన సినిమా 'ద బకింగ్‌హామ్ మర్డర్స్'. బీఎఫ్ఐ ఫిల్మ్ ఫెస్టివల్లో గతేడాది ఈ మూవీని ప్రదర్శించారు. దీన్ని ఇప్పుడు సెప్టెంబరు 13న థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ట్రైలర్ విడుదల చేశారు.(ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ భారీ సాయం)ట్రైలర్ బట్టి చూస్తే బకింగ్‌హామ్ షైర్ ప్రాంతంలో ఓ పిల్లాడు హత్యకు గురవుతాడు. అది కూడా పిల్లల దినోత్సవం అయిన నవంబరు 14న. దీంతో ఇండో-బ్రిటీష్ డిటెక్టివ్ తన పరిశోధన మొదలుపెడుతుంది. ఐదుగురిని అనుమానిస్తుంది. ఇంతకీ ఆ పిల్లాడ్ని ఎవరు చంపారు? చివరకు ఏమైందనేదే స్టోరీ. దీన్ని ప్రెజెంట్ చేసేలానే ట్రైలర్ కట్ చేశారు.'1992 స్కామ్' సినిమాతో దర్శకుడు తన మార్క్ చూపించిన హన్సల్ మెహతా.. 'ద బకింగ్‌హామ్ మర్డర్స్' మూవీకి దర్శకుడు. ట్రైలర్ చూస్తుంటే ప్రామిసింగ్‌గా అనిపించింది. మరి మూవీ ఎలా ఉంటుందనేది వచ్చే వారానికి తెలిసిపోతుంది.(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 8'లో కుక్కర్ పంచాయతీ.. ఆమెకి ఎలిమినేషన్ గండం?) -
ఆ రోజు ఏం జరిగింది?
డిటెక్టివ్‌గా ఓ మర్డర్ కేసును పరిష్కరించే పనిలో పడ్డారు హీరోయిన్ కరీనా కపూర్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన హిందీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ది బకింగ్హమ్ మర్డర్స్’. హన్సల్ మెహతా దర్శకత్వం వహంచిన ఈ చిత్రం సెప్టెంబరు 13న రిలీజ్ కానుంది. ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. విదేశాల్లో నివసిస్తున్న ఓ భారతీయుడి కుటుంబంలోని ఓ చిన్నారి హత్య నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, ఇందులో బ్రిటిష్– ఇండియన్ డిటెక్టివ్ జస్మిత్ భామ్రా పాత్రలో కరీనా నటిస్తున్నారని తెలుస్తోంది. ‘‘ఆ రోజు పార్కులో ఏం జరిగింది?, నువ్వు అతన్ని ఎలా చంపావ్?’...., ‘నువ్వు డిటెక్టివ్ కదా.. తెలుసుకో...!’ అనే డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. ఏక్తా కపూర్, శోభా కపూర్లతో కలిసి ఈ సినిమాను కరీనా కపూర్ నిర్మించడం విశేషం. -
ముంబై : ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం (ఫొటోలు)
-
ఆ విషయంలోనే మాకు తరచూ గొడవలు: కరీనా
బాలీవుడ్ జంట కరీనా కపూర్- సైఫ్ అలీ ఖాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు చిన్నారులు జన్మించారు. పెళ్లి తర్వాత తాను ఎంతగానో మారిపోయానంటోంది కరీనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'వివాహం నన్ను మార్చివేసింది. బాధ్యతగా ఉండటం తెలిసొచ్చింది. మేము ఒకరికొకరం తినిపించుకునేవాళ్లం. పోట్లాడుకునేవాళ్లం. కానీ మాకంటూ పెద్దగా సమయం కేటాయించుకోకపోయేవాళ్లం. ఒకే ఇంట్లో ఉన్నా..సైఫ్ ఒక్కోసారి ఉదయం 4.30 గంటలకు వచ్చి నిద్రపోయేవాడు. తను లేచేసరికి నేను షూట్‌కు వెళ్లిపోయేదాన్ని. నేనొచ్చేసరికి తను ఉండేవాడు కాదు. ఒకే ఇంట్లో ఉన్నా ఇద్దరం మాట్లాడుకునే పరిస్థితి లేకపోయేది. ఒక ఇంట్లో ఇద్దరు నటులు ఉంటే ఇలాగే ఉంటుంది. నేను తన సినిమాలన్నీ చూస్తాను. కానీ ఆయన మాత్రం నేను నటించిన క్రూ మూవీ కూడా ఇంతవరకు చూడలేదు. ఎప్పుడూ షూటింగ్స్ అంటూ తిరుగుతూనే ఉంటాడు.ఏసీ దగ్గరే గొడవమా ఇద్దరికీ ఏసీ గురించే గొడవలవుతుంటాయి. తనకేమో కూలింగ్ ఎక్కువ కావాలంటాడు. నేనేమో 20 డిగ్రీలు చాలంటాను. ఇద్దరి మాటా కాదని 19 డిగ్రీల టెంపరేచర్ సెట్ చేస్తాడు. నా సోదరి కరిష్మా వచ్చినప్పుడు ఏసీ 25 డిగ్రీల నెంబర్లో పెట్టేస్తాం. అప్పుడైతే.. తనకంటే నేనే నయమని ఫీలవుతాడు. అలాగే టైం విషయంలో గొడవడపతాం. డబ్బు, వస్తువుల కోసం మేము పోట్లాడుకోం. ఇద్దరం కలిసి కాసేపు సరదాగా మాట్లాడుకుంటే చాలని భావిస్తాం. కాస్త సమయం దొరికితే కలిసుండాలని ఆరాటపడతాం' అని చెప్పుకొచ్చింది. సినిమా..కాగా సైఫ్ అలీ ఖాన్ గతంలో అమృత సింగ్‌ను పెళ్లాడగా వీరికి సారా అనే కూతురు, ఇబ్రహీం అనే కుమారుడు సంతానం. అమృతకు విడాకులిచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత 2012లో కరీనాను పెళ్లాడాడు. ఇకపోతే సైఫ్ ప్రస్తుతం 'దేవర' సినిమాలో నటిస్తుండగా కరీనా 'ద బకింగ్‌హామ్ మర్డర్స్' మూవీ చేస్తోంది.చదవండి: ఆ హీరోయిన్‌కు యాక్టింగ్ రాదు, తీసుకోవద్దన్నారు: డైరెక్టర్ -
హాలీవుడ్ నటుడి మృతికి సమంత, కరీనా సంతాపం
హాలీవుడ్లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న డొనాల్డ్ సదర్లాండ్ (88) కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మియామీలో చికిత్స పొందుతూ మరణించారు. కెనడాకు చెందిన డొనాల్డ్ సదర్లాండ్ సుమారు 60 ఏళ్ల పాటు చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించారు. ఆయన మరణించడంతో హాలీవుడ్‌లోని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అయితే, ఇండియన్ సినిమా నుంచి సమంత, కరీనా కపూర్ ఖాన్లు కూడా నివాళులర్పించారు.డొనాల్డ్ సదర్లాండ్ మరణంతో ఇన్స్టాగ్రామ్ ద్వారా సమంత సంతాపం తెలిపింది. ఇదే క్రమంలో కరీనా కపూర్ కూడా సోషల్ మీడియాలో డొనాల్డ్ సదర్లాండ్ ఫోటోను పంచుకుంది. ది డర్టీ డజన్ (1967) చిత్రం ద్వారా మొదలైన ఆయన ప్రయాణంలో అనేక అవార్డులను అందుకున్నారు. ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డ్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్, అకాడమీ అవార్డ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డ్స్‌ను ఆయన సొంతం చేసుకున్నాురు. ఆర్డినరీ పీపుల్, M*A*S*H,యానిమల్ హౌస్, ది హంగర్ గేమ్స్ ఫ్రాంచైజీ, మూన్ ఫాల్ వంటి సినిమాలతో బాలీవుడ్లో ఆయన ప్రసిద్ధి చెందారు. చివరిగా 2023లో ది హంగర్ గేమ్స్ చిత్రంలో ఆయన నటించారు. -
హైదరాబాద్ ఘటనతో సినిమా
నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ శివార్లలో జరిగిన ఒక హత్యాచార ఘటన వెండితెరపైకి రానుందని టాక్. హిందీలో ఈ ఘటన నేపథ్యంలో సినిమా తీయడానికి దర్శకురాలు మేఘనా గుల్జార్ సన్నాహాలు మొదలుపెట్టారట. పోలీసులు బాధితురాలి పేరుని వెల్లడించకుండా ‘దిశ’ అని పేర్కొన్న ఆ ఘటన చాలామందికి గుర్తుండే ఉంటుంది.ఈ చిత్రానికి ముఖ్య తారలుగా కరీనా కపూర్, ఆయుష్మాన్ ఖురానాలను ఎంపిక చేశారట మేఘన. కరీనా, ఆయుష్ స్క్రిప్ట్ చదివి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ‘తల్వార్, రాజీ, చపాక్, సామ్ బహదూర్’ వంటి చిత్రాలతో మంచి దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు మేఘన. దిశ ఘటనపై ఆమె తెరకెక్కించనున్న చిత్రం గురించి త్వరలో అధికారక ప్రకటన రానుందట. -
యశ్ ‘ టాక్సిక్ ’లో ముగ్గురు భామలు.. కరీనా ప్లేస్‌లో నయనతార!
తమిళసినిమా: కేజీఎఫ్ చిత్రం తరువాత ఆ చిత్ర కథానాయకుడు నటించే చిత్రం అంటే ఆ రేంజ్‌కు ఏమాత్రం తగ్గకూడదు. ఎందుకంటే అంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మరి. నటుడు యష్ అలాంటి జాగ్రత్తలే తీసుకుంటున్నారనిపిస్తోంది. కేజీఎఫ్ 1, 2 చిత్రాల తరువాత ఈయన టాక్సిక్ అనే చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందనున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి మహిళా దర్శకురాలు గీతు మోహన్‌దాస్ తెరకెక్కించనున్నారు. దీంతో చిత్రంలో మల్టీ భాషలకు చెందిన ప్రముఖ తారాగణం నటించనున్నారు. ముఖ్యంగా బీబీసీ సీరీస్ పిక్కీ బ్లైండర్స్ తరహాలో తెరకెక్కనున్న ఈ గ్యాంగ్స్టర్స్ కథా చిత్రంలో యష్ సరసన కియారా అద్వానీ నాయకిగా నటించనున్నారు. మరో ప్రధాన పాత్రలో కరీనాకపూర్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆమె పాత్రలో నయనతార వచ్చి చేరినట్లు తెలిసింది. ఇందులో ఈమె యష్‌కు సిస్టర్‌గా నటించనున్నట్లు సమాచారం. అదేవిధంగా మరో బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషి కీలక పాత్రను పోషించనున్నారని తెలిసింది. మరో విషయం ఏమిటంటే దర్శకురాలు ఈ చిత్ర షూటింగ్‌ను 200 రోజుల్లో పూర్తిచేయడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. అందులో 150 రోజులు లండన్ పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించనున్నట్లు సమాచారం. అందుకోసం చిత్ర యూనిట్ త్వరలో యూకేకు బయలుదేరనున్నట్లు తెలిసింది. ఇకపోతే ఈ చిత్రాన్ని 2025, ఏప్రిల్ 10వ తేదీన తెరపైకి తీసుకురావాలని నిర్ణయించనట్లు తెలిసింది. -
ఓటీటీకి వందకోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ హీరోయిన్స్ టబు, కరీనా కపూర్ ఖాన్, కృతి సనన్ నటించిన చిత్రం 'క్రూ'. ఇటీవల థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. రాజేశ్ ఏ కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల వసూళ్లు సాధించింది.అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయింది. ఈ నెల 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ చిత్రంలో ముగ్గురు స్టార్ హీరోయిన్స్ ఎయిర్ హోస్టెస్ పాత్రల్లో కనిపించారు.అసలు కథేంటంటే?పని ఎక్కువ, జీతాలు తక్కువ, మరోవైపు ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందోనన్న భయం. ఈ ముగ్గురూ ఉన్న ఫ్లయిట్లో ఓరోజు సడన్‌గా ఓ పెద్దాయన కుప్పకూలిపోతాడు. తన చొక్కా కింద బంగారు కడ్డీలు కనిపిస్తాయి. అవి కొట్టేసి జీవితంలో సెటిలైపోవాలనేది వారి ఆశ. తరువాత ఏమైందన్నదే కథ. ముగ్గురు హీరోయిన్ల మధ్య కామెడీ బాగా వర్కవుట్ అయింది. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
స్టార్ హీరోయిన్‌కి హైకోర్టు నుంచి నోటీసులు.. కారణం ఏంటంటే?
కొన్నిసార్లు ఊహించని విధంగా చిక్కులు ఎదురవుతుంటాయి. అలా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్‌కి మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఓ విషయంలో చిన్న పదం ఉపయోగించినందుకుగానూ ఈ పరిస్థితి ఎదురైంది. ఇప్పుడీ విషయం కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది?(ఇదీ చదవండి: చిక్కుల్లో హీరో శింబు.. కమల్ హాసన్ మూవీలో నటించడానికి వీల్లేదంటూ..)బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కరీనా కపూర్ ఒకరు. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లయింది. ఈ క్రమంలోనే తన ప్రెగ్నెన్సీ అనుభవాలతో 'కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్' పేరుతో ఓ పుస్తకం రాసింది. అయితే ఈ బుక్ టైటిల్లో 'బైబిల్' పదాన్ని ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ లాయర్ క్రిస్టోఫర్ ఆంథోని కోర్టుని ఆశ్రయించారు. జస్టిస్ గురుపాల్ సింగ్ అహ్లువాలియా నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ కరీనాకు నోటీసు జారీ చేసింది. ఆ పదం వాడటానికి గల కారణమేంటని ప్రశ్నించింది.కరీనా కపూర్‌పై కేసు కూడా నమోదు చేయాలని క్రిస్టోపర్ పిటిషన్ వేశారు. ఈ పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. బుక్ టైటిల్లోని 'బైబిల్' పదం వల్ల క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసినట్లు అవుతుందని ఆంథోనీ తన పిటీషన్లో పేర్కొన్నారు. క్రైస్తవులకు బైబిల్ అనేది పవిత్ర గ్రంథం అని, కరీనా కపూర్ తన ప్రెగ్నెన్సీని బైబిల్‌తో పోల్చడం సరికాదు అని ఆయన చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: వైఎస్సార్సీపీ అభ్యర్థి కోసం ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్.. ఇదెక్కడి క్రేజ్ రా మావ) -
యూనిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్‌గా కరీనా : భావోద్వేగం
2014 నుండి యూనిసెఫ్ ఇండియాతో అనుబంధం కలిగి ఉంది బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్. ఇద్దరు బిడ్డల తల్లిగా బాల్య అభివృద్ధి, ఆరోగ్యం, విద్య మరియు లింగ సమానత్వం కోసం ప్రతి పిల్లల హక్కును పెంపొందించడంలో సంస్థకు మద్దతు ఇస్తుంది. తాజాగా యునిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్‌గా కరీనా కపూర్ ఎంపికైంది. ఈ సందర్బంగా ఆమె భావోద్వేగానికి లోనైంది.కరీనా కపూర్ అనగానే రంగుల ప్రపంచం కళ్ల ముందు ఆవిష్కారం అవుతుంది.అయితే ఈ అందాల నటికి మరో ప్రపంచం కూడా తెలుసు.స్త్రీ సాధికారత నుంచి మెన్స్ట్రువల్ హైజీన్ వరకు ఎన్నో అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటోంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలకు వెళుతోంది. పేదింటి బిడ్డలతో మాట్లాడుతోంది.తాజాగా యూనిసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా నియామకం అయిన కరీనా కపూర్‌లో ఫ్యాషన్ డిజైనర్, రైటర్, మోటివేషనల్ స్పీకర్, సోషల్ యాక్టివిస్ట్ ఉన్నారు...ఉత్తమనటిగా సుపరిచితమైన కరీనా కపూర్ సృజనాత్మకమైన డిజైనర్ కూడా. క్లాతింగ్ రిటైలర్ ‘గ్లోబస్’తో కలిసి పనిచేసింది. న్యూట్రిషనిస్ట్ రుజుత దివాకర్‌తో కలిసి తీసుకు వచ్చిన ‘డోంట్ లూజ్ యువర్ మైండ్, లూజ్ యువర్ వెయిట్’ పుస్తకం అమ్మకాల్లో రికార్డ్ సృష్టించింది. కరీనా కపూర్ వాయిస్‌తో ఈ పుస్తకం ఆడియో బుక్‌గా రావడం మరో విశేషం. ‘ది స్టైల్ డైరీ ఆఫ్ బాలీవుడ్ దివా’ పేరుతో తన జ్ఞాపకాల పుస్తకాన్ని తీసుకువచ్చింది. అదితి షా బీమ్జానీతో కలసి ప్రెగ్నెన్సీపై రాసిన పుస్తకం కమర్షియల్‌గా సక్సెస్ అయింది. రుజుత దివాకర్‌తో కలిసి న్యూట్రిషన్‌కు సంబంధించి ‘ది ఇండియన్ ఫుడ్ విజ్డమ్ అండ్ ది ఆర్ట్ ఆఫ్ ఈటింగ్ రైట్’ డాక్యుమెంటరీపై పనిచేసింది. ఉమెన్ ఎంపవర్మెంట్పై వచ్చిన ‘గర్ల్ రైజింగ్’ అనే డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్‌కు వాయిస్–వోవర్ ఇచ్చింది.ఒకవైపు సినిమాల్లో బిజిగా ఉన్నప్పటికీ... పిల్లల విద్య, మహిళల భద్రతకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. మహిళలపై హింసను నిరో«ధించడానికి ఎన్డీ టీవి ప్రారంభించిన శక్తి క్యాంపెయిన్‌కు అంబాసిడర్‌గా పనిచేసింది. 2014 నుంచి బాలికల విద్యకు సంబంధించి యూనిసెఫ్‌తో కలిసి పనిచేయడం మొదలుపెట్టింది. రాజస్థాన్, మహారాష్ట్రలోని పాఠశాలలకు వెళ్లి అక్కడి విద్యార్థులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకునేది. జాల్నా జిల్లాలో కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయం నిర్వహించిన నిధుల సేకరణ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంది.నిరుపేద పిల్లల చదువు కోసం షర్మిలా ఠాగుర్‌తో కలిసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. చైల్డ్–ఫ్రెండ్లీ స్కూల్ అండ్ సిస్టమ్స్ (సీఎఫ్ఎస్ఎస్) యాకేజీని లాంచ్ చేసింది. చత్తీస్‌ఘడ్‌లో చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ వీక్ çసందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బాగా చదివే పిల్లలు, పాఠాలు బాగా చెప్పే టీచర్లకు పురస్కారాలు అందజేసింది. మెన్స్ట్రువల్ హైజీన్‌పై యూనిసెఫ్ లక్నోలో నిర్వహించిన సమావేశంలో ప్రసంగించింది. ‘నవజాత శిశువులను కాపాడుకుందాం’ పేరుతో కరీనా రాసిన వ్యాసానికి మంచి స్పందన వచ్చింది. నవజాత శిశువులు, తల్లుల క్వాలిటీ హెల్త్ కేర్‌కు సంబంధించి ‘ఎవ్రీ చైల్డ్ అలైవ్’ అనే క్యాంపెయిన్‌ను నిర్వహించింది. మదర్స్ డే సందర్భంగా యూనిసెఫ్ దిల్లీలో నిర్వహించిన సమావేశంలో కరీనా ప్రధాన వక్త.ప్రకృతి వైపరీత్య బాధితుల కోసం, ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థల కోసం నిధుల సేకరణ కార్యక్రమాల్లో పాల్గొంది కరీన. పిల్లల రోగనిరోధక శక్తి పెరుగుదలకు సంబంధించిన అంశాలపై పనిచేసే స్వస్థ్ ఇమ్యునైజేషన్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసింది.తాజా విషయానికి వస్తే.. ‘నేషనల్ అంబాసిడర్‌గా యూనిసెఫ్‌తో నా అనుబంధం కొనసాగడం గౌరవంగా భావిస్తున్నాను. పిల్లల చదువు, హక్కుల కోసం నా గొంతు వినిపిస్తాను’ అంటుంది కరీనా కపూర్.‘కరీనా కపూర్ ఎక్స్లెంట్ కమ్యూనికేటర్’ అని కితాబు ఇచ్చింది యూనిసెఫ్. చిన్న విజయం చాలు... పెద్ద సంతోషానికిసోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ‘నేను ఎలా సాధించానంటే’లాంటి స్టోరీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రేస్ మొదలైంది. ఆ రేస్‌లో భాగంగా యువతరం ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఈ రేసులో మెంటల్ హెల్త్ అనేది వెనక్కి వెళ్లిపోయింది. రేస్ అనేది శాంతి, సంతోషాల కోసం ఉండాలి. విద్యార్థులు తమ మానసిక శాంతిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. చిన్న విజయాన్ని కూడా పెద్ద విజయంగా భావించుకోవాలి. ‘ఇదీ ఒక విజయమేనా!’ అనుకున్నప్పుడు అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తి నుంచి అశాంతి జనిస్తుంది –కరీనా కపూర్ -
ఎప్పుడూ పనీపనీ.. మాతో ఉండవా? అని నా కుమారుడు నిలదీశాడు
హీరోయిన్ కరీనా కపూర్ ఇప్పుడు యునిసెఫ్ (యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్) జాతీయ బ్రాండ్ అంబాసిడర్. ఈ అరుదైన ఘనత అందుకున్న కరీనా తాజాగా ఢిల్లీలోని ఈవెంట్లో పిల్లల గురించి మాట్లాడింది. 'పిల్లలు తండ్రి గురించే కాదు తల్లి చేసే పని గురించి కూడా ఆలోచిస్తారు. నీతో ఉండాలనుందమ్మాఅంతేకాదు అమ్మ ఎప్పుడూ ఏదో ఒక పనితో బిజీగా ఉంటోందని ఒకింత గౌరవమిస్తారు. ఈ రోజు నా పిల్లలకు హాలీడే.. నేను కూడా వారితో కలిసుండాలని కోరుకున్నారు. కానీ నాకు పనుందని చెప్పి వచ్చేశాను. పెద్దబ్బాయి తైమూర్ అయితే.. నువ్వెప్పుడూ పనీపనీ అంటూ ఢిల్లీ, దుబాయ్ వెళ్తూ ఉంటావు.. నాకు నీతో ఉండాలనుందమ్మా అన్నాడు. మనసు చివుక్కుమంది. పని కూడా ముఖ్యమైనదే కాబట్టి వెళ్లక తప్పడం లేదని చెప్పాను. మాటిచ్చానుత్వరగా వచ్చేస్తానని, ఎక్కువ సమయం తనతో గడుపుతానని మాటిచ్చాను. అది నెరవేరుస్తాను కూడా.. అందుకే పిల్లలు వాళ్లను నిర్లక్ష్యం చేసినట్లుగా భావించరు. పేరెంట్స్ ఇద్దరూ వర్క్ చేసుకుని ఇంటికి వచ్చేస్తారని తైమూర్ అర్థం చేసుకుంటాడు. అలాగే పేరెంట్స్ నుంచే కొన్ని లక్షణాలు నేర్చుకుంటారు. చివగా సూపర్ హిట్ మూవీలో..సైఫ్ ఎప్పుడూ పిల్లల ముందు మనం ప్రేమగా, ఆప్యాయంగా మెదలాలని, అంతే ప్రేమగా మాట్లాడాలని చెప్తుంటాడు. మనల్ని చూసే వాళ్లు నేర్చుకుంటారన్నాడు. అందుకే మాలాగే నా పిల్లలిద్దరు కూడా ఎంతో ఆప్యాయంగా, గౌరవంగా మెదులుతారు అని చెప్పుకొచ్చింది. కరీనా చివరగా క్రూ సినిమాలో కనిపించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.చదవండి: 'హీరోయిన్' సెట్లో అదృశ్యం.. స్నేహితులే శరీరాన్ని ముక్కలు చేసి..! -
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా 'కరీనా కపూర్'
ఢిల్లీ: యూనీసెఫ్ ఇండియా (యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్) తన కొత్త జాతీయ అంబాసిడర్‌గా బాలీవుడ్ స్టార్ 'కరీనా కపూర్'ను ప్రకటించింది. 2014 నుంచి యునిసెఫ్ ఇండియాతో సంబంధం కలిగి ఉన్న ఈమె ఆరోగ్యం, విద్య, లింగ సమానత్వం కోసం ప్రతి పిల్లల హక్కును పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.కరీనా ఇంతకు ముందు యునిసెఫ్ ఇండియాకు సెలబ్రిటీ అడ్వకేట్‌గా పనిచేశారు. కాగా ఇప్పుడు నూతన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు భారత జాతీయ రాయబారిగా యునిసెఫ్‌తో నా అనుబంధాన్ని కొనసాగించడం నాకు గౌరవంగా ఉంది కరీనా పేర్కొన్నారు. ప్రతి బిడ్డకు బాల్యం, సమానమైన అవకాశం, భవిష్యత్తు అవసరం అని ఆమె పేర్కొన్నారు.#WATCH | Delhi: Actress Kareena Kapoor Khan appointed as UNICEF India's National Ambassador. pic.twitter.com/tglRjOtyPU— ANI (@ANI) May 4, 2024 -
టాక్సిక్‌లో..?
యశ్ ‘టాక్సిక్’ సినిమాలో నయనతార భాగం కానున్నారా? అంటే అవుననే టాక్ కన్నడ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. యశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్’. మలయాళ నటి–దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ, శ్రుతీహాసన్ వంటి స్టార్స్ పేర్లు వినిపించాయి. అలాగే యశ్‌కు సోదరి పాత్రలో కరీనా కపూర్ నటిస్తారనే ప్రచారం జరిగింది.దీనికి తోడు తాను సౌత్ సినిమా అంగీకరించినట్లు ఆ మధ్య కరీనా స్వయంగా వెల్లడించారు. అది ‘టాక్సిక్’ సినిమానే అనే ప్రచారం సాగింది. అయితే తాజాగా షూటింగ్ కాల్షీట్స్ సర్దుబాటు చేయలేని కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి కరీనా కపూర్ తప్పుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్లేస్‌లో నయనతారను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. 2010లో ఉపేంద్ర నటించిన ‘సూపర్’ కన్నడలో నయనతారకు తొలి సినిమా. వార్తల్లో ఉన్న ప్రకారం నయనతార ‘టాక్సిక్’ సినిమా చేస్తే.. పద్నాలుగేళ్ల తర్వాత ఆమె కన్నడ సినిమా చేసినట్లవుతుంది. -
Singham Again: 400 మంది డ్యాన్సర్లతో మాస్ డ్యాన్స్!
అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్‌లతో కలిసి మాస్ డ్యాన్స్ చేసేద్దాం అంటూ కరీనా కపూర్ సందడి చేస్తున్నా రట. అజయ్ దేవగన్, కరీనా కపూర్ జంటగా అక్షయ్ కుమార్, రణ్వీర్, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్, దీపికా పదుకోన్ కీలక పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘సింగమ్ ఎగైన్’. ‘సింగమ్ ఫ్రాంచైజీ చిత్రాలకు దర్శకత్వం వహించిన రోహిత్ శెట్టి ‘సింగమ్ ఎగైన్’కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని ముఖ్య తారాగణం పాల్గొనగా భారీ ఓ మాస్ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ నృత్యదర్శకుడు గణేశ్ ఆచార్య ఆధ్వర్యంలో ఈ పాట చిత్రీకరణ జరుగుతోందని టాక్. కీలక తారాగణంతో పాటు దాదాపు నాలుగు వందల మంది డ్యాన్సర్లు పాల్గొంటున్నారని భోగట్టా. కాగా ప్రస్తుతం దీపికా పదుకోన్ గర్భవతి కావడంతో ఆమె ఈ పాటలో కనిపించే చాన్స్ లేదని బాలీవుడ్ అంటోంది. -
ఇక్కడ టిల్లు స్క్వేర్.. అక్కడ క్రూ.. రెండింట్లో ఒకటి కామన్!
కంటెంట్ బాగుంటే చాలు.. బడ్జెట్, తారాగణం.. ప్రమోషన్స్.. ఇవేవీ పట్టించుకోరు జనాలు. ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనిపించిందా.. అది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా లెక్క చేయకుండా పోలోమని థియేటర్లకు వెళ్లిపోతుంటారు. అలా ఈ మధ్య ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచాయి. తెలుగులో డీజే టిల్లుకు సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్ సైతం సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. రేపటితో వంద కోట్ల క్లబ్బులో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఓన్లీ మ్యాజిక్ టిల్లు స్క్వేర్‌లో కథ అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు.. ఓన్లీ మ్యాజిక్ అంతే! పంచులు, కామెడీ డైలాగులు పటాసుల్లా పేలుతాయి. అలాంటి మ్యాజిక్‌తోనే బాలీవుడ్లో ఓ సినిమా వచ్చింది.. అదే క్రూ. ఇందులో పెద్దగా ఎమోషన్స్ ఉండవు, సీరియస్ సినిమా కానే కాదు.. కామెడీ ఎంటర్టైనర్. ముగ్గురు ఫ్లయిట్ అటెండెట్లు.. కరీనా, టబు, కృతి పని చేసే ఎయిర్‌లైన్స్ త్వరలో దివాలా తీస్తుందని ఓ రూమర్. కథేంటంటే? పని ఎక్కువ, జీతాలు తక్కువ, మరోవైపు ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందోనన్న భయం. ఈ ముగ్గురూ ఉన్న ఫ్లయిట్లో ఓరోజు సడన్‌గా ఓ పెద్దాయన కుప్పకూలిపోతాడు. తన చొక్కా కింద బంగారు కడ్డీలు కనిపిస్తాయి. అవి కొట్టేసి జీవితంలో సెటిలైపోవాలనేది వారి ఆశ. తరువాత ఏమైందన్నదే కథ. ముగ్గురు హీరోయిన్ల మధ్య కామెడీ బాగా వర్కవుట్ అయింది. కలెక్షన్స్ ఎంతంటే? మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు హిందీ బాక్సాఫీస్ వద్ద పోటీ లేకపోవడంతో దూసుకుపోతోంది. రాజేశ్ ఏ కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.87 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. చూస్తుంటే త్వరలోనే రూ.100 కోట్లు దాటేసేలా కనిపిస్తోంది. అక్షయ్ కుమార్- టైగర్ ష్రాఫ్‌ల బడే మియా చోటే మియా, అజయ్ దేవ్‌గణ్ మైదాన్ ఈ నెల 10న రిలీజ్ కానుంది. అప్పటివరకు క్రూ మూవీ కలెక్షన్స్‌కు ఎలాంటి ఢోకా లేనట్లే! CREW is flying high with a strong start at the box office with a solid week 1 collection! 🛫#CrewInCinemasNow Book your tickets now: https://t.co/jAZNn6fYMR#Tabu #KareenaKapoorKhan @kritisanon @diljitdosanjh and a special appearance by @KapilSharmaK9 pic.twitter.com/IZJnvt9QIC — BalajiMotionPictures (@balajimotionpic) April 5, 2024 చదవండి: మలయాళంలో రూ.200 కోట్లు వసూలు చేసిన మంజుమ్మల్ బాయ్స్ ఎలా ఉంది? -
‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్‌కు సిస్టర్‌గా కరీనా కపూర్?
‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్ హీరోగా మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కరీనా కపూర్ ఓ హీరోయిన్గా నటించనున్నారన్న వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ సినిమాలో కరీనాది హీరోయిన్ పాత్ర కాదని, యశ్‌కు అక్క పాత్రలో ఆమె కనిపించనున్నారనే టాక్ తాజాగా తెరపైకి వచ్చింది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం గతంలో శ్రుతీహాసన్, సాయిపల్లవి వంటి వార్ల పేర్లు తెరపైకి రాగా, తాజాగా కియారా అద్వానీ పేరు వినిపిస్తోంది. మరి.. యశ్‌కు సిస్టర్ పాత్రలో కరీనా కనిపిస్తారా? యశ్‌తో కియారా జోడీ కడతారా? అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. -
కరీనా కపూర్ ఖాన్ KGF స్టార్ యష్ తో స్క్రీన్ షేర్ చేసుకోనుంది
-
సౌత్ ఎంట్రీపై రూమర్స్.. హింట్ ఇచ్చిన కరీనా
ఉత్తరాది హీరోయిన్లు శిల్పా శెట్టి, ప్రీతీ జింతా, రవీనా టాండన్, కత్రినా కైఫ్ వంటివారు గతంలో సౌత్‌లో సినిమాలు చేశారు. ఆ తర్వాత కంగనా రనౌత్, ఈ రెండు మూడేళ్లల్లో శ్రద్ధా కపూర్, అలియా భట్ వంటి వారు దక్షిణాదిలో.. మరీ ముఖ్యంగా తెలుగు చిత్రాల్లో నటించారు. తాజాగా ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’తో దీపికా పదుకోన్, ఎన్టీఆర్ ‘దేవర’తో జాన్వీ కపూర్ తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. ఇక మరో బాలీవుడ్ ప్రముఖ తార కరీనా కపూర్ సౌత్ సినిమాకి సై అన్నారని తెలుస్తోంది. ‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్ హీరోగా రూపొందుతున్న కన్నడ చిత్రం ‘టాక్సిక్’లో కరీనా ఓ కీలక పాత్ర చేయనున్నారట. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న కరీనా.. యశ్‌తో నటించాలనుంది అన్నారు. అలాగే సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో ‘‘దక్షిణాదిలోని ఓ స్టార్ హీరో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో నటించనున్నాను. సౌత్‌లో నాకిది ఫస్ట్ మూవీ. షూటింగ్లో పాల్గొనే టైమ్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’’ అని కరీనా చెప్పారు. దాంతో ‘టాక్సిక్’ చిత్రాన్ని ఉద్దేశించే ఆమె ఈ విధంగా పేర్కొన్నారనే ఊహాగానాలు ఉన్నాయి. -
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
‘మీ ఎట్ 21’ వైరల్ ట్రెండ్
ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు ‘మీ ఎట్ 21’ వైరల్ ట్రెండ్ నడుస్తోంది. ఈ ట్రెండ్‌లో భాగంగా 21 ఏళ్ల వయసులోని తమ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో యూజర్లు పోస్ట్ చేస్తున్నారు. ఆ వయసులో తమ తీపి, చేదు జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటున్నారు. అరిజోనా (యూఎస్) కు చెందిన 43 ఏళ్ల డామిన్ రఫ్ ఈ ట్రెండ్‌కు కారణం. మెక్సికోలో జరిగిన తన 21 వ బర్త్‌డే ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.ఈ ఫోటో ‘ఇంతింతై... అంతంతై’ చివరికి వైరల్ ట్రెండ్‌గా మారింది. కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, కాజల్‌లు కూడా ఈ వైరల్ ట్రెండ్‌లో భాగం అయ్యారు. కరీనా కపూర్ తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘అశోక’ సినిమాలో షారుఖ్‌ఖాన్ పక్కన ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ‘ఫీలింగ్ 21 దిస్ మార్నింగ్’ అనే కాప్షన్ ఇచ్చింది. మరో ఫోటోకు ‘21’ అని కాప్షన్ ఇచ్చి రెడ్ హార్ట్ ఇమోజీ జోడించింది. ప్రియాంక చోప్రా మోడలింగ్ రోజుల నాటి ఫోటోలను షేర్ చేసి ‘లెర్న్ ఏ లాట్ సిన్స్ దెన్’ అని కాప్షన్ ఇచ్చింది. బైక్‌పై కూర్చున్న తన ఫోటో షేర్ చేస్తూ ‘ఉయ్ డిడ్ వెల్. ప్యాట్ ఆన్ ది బ్యాక్ ఫర్ ది యంగర్ మీ’ అని కాప్షన్ ఇచ్చింది కాజల్. -
'కరీనాతో డేటింగ్.. ఆ హీరోయిన్ అలా చేయమని సలహా ఇచ్చింది'
బాలీవుడ్ స్టార్ జంట సైఫ్ అలీ ఖాన్- కరీనా కపూర్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటికే సైఫ్ ఇద్దరు పిల్లల తండ్రి అయినప్పటికీ అతడిని మనసారా ప్రేమించింది కరీనా. 2004లో మొదటి భార్య అమృత సింగ్‌కు విడాకులిచ్చాడు సైఫ్. ఆ మరుసటి ఏడాది కరీనా కపూర్‌తో తొలిసారి ఫోటోషూట్‌లో పాల్గొన్నాడు. అప్పటినుంచి వీరి మధ్య చనువు పెరిగింది. ఎల్ఓసీ: కార్గిల్, ఓంకార, తషాన్, కుర్బాన్, ఏజెంట్ వినోద్.. తదితర చిత్రాల్లో వీరు జంటగా నటించడగా ఆ సమయంలో వీరి మధ్య స్నేహం ప్రేమగా మారి అది మరింత బలపడుతూ వచ్చింది. అలా వీరు 2012లో పెళ్లి చేసుకోగా తైమూర్, జెహంగీర్ అని ఇద్దరు కుమారులు జన్మించారు. షూటింగ్లో నాకో సలహా ఇచ్చింది అయితే కరీనాతో డేటింగ్లో ఉన్నప్పుడు బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ తనకో సలహా ఇచ్చిందట. అది తనకెంతో ఉపయోగపడిందంటున్నాడు హీరో. ఆ సలహా గురించి, దాన్ని సూచించిన వ్యక్తి గురించి సైఫ్ మాట్లాడుతూ.. 'రాణి చాలా అద్భుతమైన వ్యక్తి. సినిమాలు చేసేకొద్దీ మా మధ్య స్నేహబంధం మరింత పటిష్టంగా మారింది. ఓసారి రాణి షూటింగ్లో నాకో సలహా ఇచ్చింది. నువ్వు కరీనాను ప్రేమిస్తున్నావు.. అందుకు సంతోషం.. అయితే ఒక్కటి మాత్రం గుర్తుపట్టుకో.. మీ ఇంట్లో ఇద్దరు హీరోలు ఉంటారన్నది ఎన్నటికీ మర్చిపోకు అని చెప్పింది. ఇంట్లో సమానత్వం తన మాటలు ఇప్పటికీ నా మెదడులో తిరుగుతూనే ఉన్నాయి. ఇంతకీ తను చెప్పిన వాక్యానికి అర్థమేంటంటే.. ఇంటి కోసం ఇద్దరూ కష్టపడుతారు. ఒకరు పని చేసినప్పుడు మరొకరు పిల్లల బాధ్యతను చూసుకోవాలి అని! నువ్వు ఆడ, నేను మగ అన్న అహంకారం లేకుండా ఇద్దరూ అన్నిరకాల పనులు చేసుకోవాలని సలహా ఇచ్చింది. భార్య ఉద్యోగానికి వెళ్తే అప్పుడు భర్త ఇంటిని చూసుకోవాలని.. లింగబేధాలు లేకుండా సమానత్వం ఉండాలన్నదే ఆమె భావన. దాన్ని నేను ఇప్పటికీ ఆచరిస్తున్నాను' అని చెప్పుకొచ్చాడు. కాగా సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ చిత్రీకరణలో ఇటీవలే సైఫ్‌కు గాయమవగా సర్జరీ చేయించుకున్నాడు. ఇప్పుడిప్పుడే ఆ గాయం నుంచి కోలుకుంటున్నాడు. చదవండి: గతేడాది థియేటర్లలో రిలీజ్.. ఇప్పుడు ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ -
Sharmila Tagore Celebrates 79th Birthday: హీరో సైఫ్ అలీ ఖాన్ తల్లి 79వ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
మీ సవతి కూతురితో నటిస్తారా?.. కరీనా సమాధానం ఇదే!
బాలీవుడ్ భామ కరీనాకపూర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవలే బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ షోలో ఆమె పాల్గొంది. మరో స్టార్ హీరోయిన్ ఆలియా భట్‌తో కలిసి హాజరైంది. ఈ సందర్భంగా కరణ్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ముఖ్యంగా తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకుంది. దక్షిణాది స్టార్ హీరోతో నటించాలని ఉందంటూ తన మనసులోని మాటను బయటకు పెట్టేసింది ముద్దుగుమ్మ. సారా అలీఖాన్ (కరీనా భర్త, నటుడు సైఫ్ అలీఖాన్ మొదటి భార్య కుమార్తె)కు తల్లిగా నటించే అవకాశం వస్తే నటిస్తావా? అంటూ కరణ్ జోహార్ ప్రశ్నించారు. దీనికి కరీనా స్పందిస్తూ నేను ముందుగా నటిని.. అన్ని వయసుల వారితో నటించగలను. ఎప్పుడైనా సారాకు తల్లిగా నటించే అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తా' అని తెలిపింది. సారా అలీ ఖాన్.. సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య కుమార్తె. కరీనాతో పెళ్లికి ముందే సైఫ్ అమృతా సింగ్‌ను వివాహమాడారు. ఆమెతో 2004లో విడిపోయారు. సైఫ్, అమృతలకు సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ జన్మించారు. ఆ తర్వాత మీరు సౌత్‌లో ఏ హీరోతో నటించాలని కోరుకుంటున్నారు? అని కరణ్ మరో ప్రశ్న వేశారు. వీరిలో ప్రభాస్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, యశ్‌లో ఎవరితో ఎంచుకుంటారు? అని ప్రశ్నించారు. దీనిపై స్పందిస్తూ దక్షిణాదికి చెందిన కేజీఎఫ్ హీరో యశ్ యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. ఆయన పక్కన నటించాలని ఉంది. కేజీయఫ్ సినిమా చూశా. చాలా బాగుంది.' అని చెప్పారు. అయితే గతంలో కరీనా తాను సినిమాలు చూడనని.. రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీని కూడా అందుకే చూడలేదని కరీనా చెప్పింది. కేజీఎఫ్ సినిమా చూశానని చెప్పడంతో కరణ్ షాక్ అయ్యాడు. కాగా.. అక్టోబర్ 2012లో కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు తైమూర్ అలీ ఖాన్, జహంగీర్ అలీ ఖాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఏడాది కరీనా జానే జాన్‌తో ఓటీటీలో అరంగేట్రం చేసింది. సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 21న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ప్రస్తుతం కరీనా ది క్రూని అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ మార్చి 22, 2024న రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) -
పిల్లలు కావాలని హీరోను పెళ్లి చేసుకున్నా: స్టార్ హీరోయిన్
స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఇద్దరు పిల్ల తల్లి.. ఓ పక్క కుటుంబ వ్యవహారాలు చూసుకుంటూనే మరో పక్క సినిమాలు చేస్తోంది. అటు నిర్మాతగా, ఇటు హీరోయిన్గా రాణిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. 'ఈ కాలంలో పిల్లల్ని కనడం కోసమే పెళ్లి చేసుకుంటున్నారు. అంతే కదా! పిల్లల గురించి ఆలోచించకపోతే వివాహ బంధంలో అడుగుపెట్టకుండా సహజీవనం చేయొచ్చు. నేను, సైఫ్ అలీ ఖాన్ చేసిందదే.. మేమిద్దరం ఐదేళ్లపాటు సహజీవనం చేశాం. పిల్లలు కావాలనుకున్నప్పుడే పెళ్లి చేసుకున్నాం' అని చెప్పుకొచ్చింది. కొంతకాలం డేటింగ్.. తర్వాతే పెళ్లి కాగా సైఫ్ అలీ ఖాన్ గతంలో అమృత సింగ్‌ను పెళ్లాడాడు. వీరికి సారా అలీ ఖాన్, ఇబ్రహీమ్ అలీ ఖాన్ సంతానం. దంపతుల మధ్య పొరపచ్చాలు రావడంతో వీరు 2004లో విడిపోయారు. తర్వాత హీరోయిన్ కరీనాతో ప్రేమలో పడ్డాడు సైఫ్. కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్న ఈ లవ్ బర్డ్స్ 2012 అక్టోబర్‌లో పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా మారారు. వీరికి 2016లో తైమూర్, 2021లో జహంగీర్ జన్మించారు. ఓటీటీలోనూ ఎంట్రీ ఇక సినిమాల విషయానికి వస్తే కరీనా కపూర్ ఇటీవలే ఓటీటీలోనూ అడుగుపెట్టింది. సస్పెక్ట్ ఎక్స్ అనే జపనీస్ నవల ఆధారంగా తెరకెక్కిన జానే జాన్ సినిమాలో నటించింది. సుజయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో విజయ్ వర్మ, జైదీప్ అహ్లావత్ కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఆమె చేతిలో ద క్య్రూ, సింగం అగైన్ అనే సినిమాలున్నాయి. View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) చదవండి: సినీ రచయిత కన్నుమూత.. పాఠశాల దశలోనే చదువు ఆగిపోయినా.. -
ఆ హీరోయిన్ ఉందంటే బాక్సాఫీస్ బద్దలే.. ఆమెకు దరిదాపుల్లో కూడా లేరు!
ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ హోదా రావాలంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో అంతా ఈజీ కాదు. ఒక్క సూపర్ హిట్ పడినా.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాంటే అదృష్టం కూడా ఉండాలి. అలా బాలీవుడ్లో స్టార్స్ హీరోయిన్స్ ఎందరో ఉన్నారు. అంతే కాకుండా బాలీవుడ్లో అగ్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా రెమ్యునరేషన్ అందుకున్న వారు చాలా తక్కువమందే ఉంటారు. కానీ ఇలాంటి అరుదైన ఘనత దక్కించుకున్న నటీమణుల్లో మొదట వినిపించే పేరు ఆమెదే. హిందీ చిత్రసీమలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన హీరోయిన్ కరీనా కపూర్. ఆమె సాధించిన ఘనతలపై ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: డైరెక్టర్ ముద్దుపై తొలిసారి రియాక్ట్ అయిన మన్నారా చోప్రా) ఆమె చిత్రాలే టాప్ బాలీవుడ్లో కరీనా కపూర్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయనడంలో ఎలాంటి సందేహం లేదు. బాలీవుడ్ చరిత్రలో మరే ఇతర హీరోయిన్ల సినిమాలు ఆమెను అధిగమింలేకపోయాయి. అంతలా ఆమె చిత్రాలు సక్సెస్ సాధించాయి. కరీనా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రూ.4 వేల కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాయంటే ఆ రేంజ్ ఏంటో అర్థమవుతోంది. ఆమె నటించిన 23 సూపర్ హిట్ సినిమాల కలెక్షన్స్ చూస్తే బాలీవుడ్ స్టార్స్ కరిష్మా, కత్రినా, రాణి ముఖర్జీ, కాజోల్, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, దీపికా పదుకొనే సైతం దారిదాపుల్లో కూడా లేరు. అత్యధిక వసూళ్లు సాధించిన హీరోయిన్గా... కరీనా నటించిన 23 చిత్రాల్లో బజరంగీ భాయిజాన్, 3 ఇడియట్స్ ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. బజరంగీ భాయిజాన్ ఒక్కటే ప్రపంచ వ్యాప్తంగా రూ.918 కోట్లు వసూలు చేసింది. అలాగే కభీ ఖుషీ కభీ ఘమ్, ఐత్రాజ్, జబ్ వి మెట్, బాడీగార్డ్, గుడ్ న్యూజ్ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని సూపర్ హిట్స్ కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.4000 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టాయి. దక్షిణాదిలో హీరోయిన్లతో పోలిస్తే సమంత, నయనతార, అనుష్క శెట్టి సినిమాలకు సైతం ఈ రేంజ్లో కలెక్షన్స్ రాలేదు. (ఇది చదవండి: పెళ్లి గురించి హింట్ ఇచ్చిన అనుష్క.. కానీ!) ఆ లిస్ట్‌లోని హీరోయిన్స్ వీళ్లే అయితే కరీనా తర్వాత రూ. 3000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన హీరోయిన్లలో దీపికా పదుకొణె, అనుష్క శర్మ ఉన్నారు. దక్షిణాదిలో అయితే అనుష్క శెట్టి, తమన్నా భాటియా బాహుబలి చిత్రంతో ఈ జాబితాలోకి వచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 2400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత రూ.2000 కోట్లకు పైగా లిస్ట్‌లో ఐశ్వర్య రాయ్, అలియా భట్, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, నయనతార నిలిచారు. అంతే కాకుండా ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా కూ.2024 కోట్ల రూపాయలు వసూలు చేసిన దంగల్ చిత్రం ద్వారా ఈ జాబితాలోకి వచ్చారు. -
కరీనా కపూర్ కనీసం పట్టించుకోలేదు: నారాయణ మూర్తి వీడియో వైరల్
ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సాఫ్ట్వేర్ రంగంలో గొప్ప వ్యాపారవేత్తగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తాజాగా నారాయణ మూర్తి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్‌పై చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. అభిమానులను కరీనా పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. అయితే ఇది పాత వీడియో అయినప్పటికీ దీనిని తాజాగా ఓ ఇన్‌స్టా పేజీలో షేర్ చేయడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఏడాది ప్రారంభంలో ఐఐటీ కాన్పూర్ చర్చా కార్యక్రమంలో నారాయణ మూర్తి దంపతులు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఇన్ఫోసిస్ కో ఫౌండర్ మాట్లాడుతూ.. గతంలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించి కరీనా కపూర్ ప్రస్తావన తీసుకొచ్చారు. అభిమానుల పట్ల ఆమె వ్యవహరించిన తీరును నారాయణ మూర్తి తీవ్రంగా తప్పుబట్టారు. అయితే మధ్యలో ఆయన సతీమణి సుధామూర్తి కల్పించుకొని నారాయణ మాటలను వ్యతిరేకిస్తూ నటికి మద్దతుగా నిలిచారు. అయినప్పటికీ నారాయణ మూర్తి ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను తెలిపారు. ‘నేను ఓసారి లండన్ నుంచి వస్తుండగా విమానంలో నా పక్క సీట్లో నటి కరీనా కపూర్ కూర్చున్నారు. ఆమెను చూసి చాలా మంది అక్కడకు వచ్చి హాయ్ అంటూ పలకరించారు. కానీ, ఆమె కనీసం స్పందించలేదు. అది చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఎవరైనా మన దగ్గరకు వచ్చి పలకరిస్తే కనీసం లేచి నిల్చొని నిమిషమో, అర నిమిషమో మాట్లాడుతాం. మననుంచి వాళ్లు కోరుకునేది కూడా అంతే’నన్నారు నారాయణ మూర్తి. చదవండి: సుధామూర్తిని ఏడిపించిన అలియా భట్.. కారణం ఇదే! ఇంతలో సుధామూర్తి కల్పించుకొని.. కరీనాకు కోట్లలో అభిమానులుంటారు. బహుశా ఆమె విసిగిపోయి ఉంటుందని అన్నారు. ‘నారాయణ మూర్తి ఓ సాఫ్ట్వేర్ వ్యక్తి, కంపెనీ ఫౌండర్.. నీకు 10వేల మంది అభిమానులు ఉంటారేమో.. కానీ, సినీ నటికి కోట్ల మంది ఫ్యాన్స్ ఉంటారు కదా’’ అని అన్నారు. సుధామూర్తి మాటలకు అక్కడున్న వారంతా నవ్వులు చిందించారు. ఆమెను ప్రశంసిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టారు. అయినప్పటికీ నారాయణ మూర్తి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ఇక్కడ సమస్య అది కాదు. ఎవరైనా మనపై అభిమానం చూపించినప్పుడు.. మనం కూడా ఆ ప్రేమను తిరిగి ప్రదర్శించాలి. ఏ రూపంలోనైనా సరే.. అది చాలా ముఖ్యమని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ మనలోని అహాన్ని తగ్గించే మార్గాలు అంతే’ నని అన్నారు. చదవండి: 20 ఏళ్ల తర్వాత తొలిసారి మహిళను ఉరితీయనున్న సింగపూర్ View this post on Instagram A post shared by ENTREPRENEURS OF INDIA (@eoindia) -
రూ.500కోసం హీరోహీరోయిన్ల వీడియో లీక్ చేశారు!
షాహిద్ కపూర్, కరీనా కపూర్.. ఒకప్పుడు వీరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. బాలీవుడ్లో క్యూట్ లవ్ బర్డ్స్‌గా పేరు తెచ్చుకున్నారు. కానీ ఎన్నో ప్రేమకథల్లాగే వీరి కథ కూడా సుఖాంతం కాలేదు. 2000 సంవత్సరం ప్రారంభంలో మొదలైన వీరి లవ్ కహానీ 2006లో బ్రేకప్‌తో ముగిసింది. అయితే 2004 సంవత్సరంలో వీరి ప్రైవేట్ వీడియో లీకైంది. ఓ క్లబ్బులో షాహిద్, కరీనా ఈ లోకాన్నే మర్చిపోతూ ముద్దులాటలో మునిగిపోయారు. అయితే ఈ వీడియో నెట్టింట లీకై అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. కానీ ఆ సమయంలో ఇద్దరూ దీనిపై స్పందించనేలేదు. దాదాపు 19 ఏళ్ల తర్వాత ఈ ఘటనపై స్పందించాడు షాహిద్. 'అప్పుడు నా వయసు 24 ఏళ్లు. ఆ ఫోటోలు, వీడియో లీక్ అయ్యేసరికి.. ఏంటి? ఏం జరుగుతోంది? అని షాక్‌లో ఉన్నాను. అంతా అయిపోయినట్లే అనుకున్నాను. మన చుట్టూ జరుగుతున్న పరిణామాలు మనల్ని ఎంతగానో ఇబ్బందిపెడతాయి. ఆ వయసులో మరీనూ! ఆ కుర్ర ఏజ్‌లో మన ఫీలింగ్స్ మనకే సరిగా అర్థం కావు. ఒక అమ్మాయితో ఎలా నడుచుకోవాలో కూడా తెలియదు. పైగా అప్పుడు డేటింగ్లో ఉంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు నాకు పెళ్లైంది కాబట్టి అటువంటి విషయాలు ఎవరూ పట్టించుకోరు' అని షాహిద్ చెప్పుకొచ్చాడు. అతడిని ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి మాట్లాడుతూ.. 'ముగ్గురు పిల్లలు మాజీ ప్రేయసితో మీ ముద్దు వీడియోతో ఆఫీసుకు వచ్చారు. రూ.500 ఇచ్చాకే ఈ వీడియో మా చేతికిచ్చారు' అని చెప్పుకొచ్చాడు. కాగా కరీనా కపూర్ 2012లో హీరో సైఫ్ అలీఖాన్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి తైమూర్ అలీ ఖాన్, జే అలీ ఖాన్ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. షాహిద్ కపూర్ పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు. 2015లో మీరా రాజ్‌పుత్‌తో వివాహం జరగ్గా వీరికి మిషా, జైన్ అని ఇద్దరు సంతానం. చదవండి: పార్టీలో పూటుగా తాగారు, తెల్లారేసరికి ఆమిర్ చేతికి బ్రేస్లెట్ -
స్టన్నింగ్ డ్రెస్‌తో మెస్మరైజ్ చేసిందిగా: ధరెంతో తెలిస్తే ఔరా అంటారు!
బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ గ్లామర్ ప్రపంచంలో తన స్టైల్‌ను చాటుకుంటూనే ఉంటుంది. చాలా క్యాజువల్‌గా, ఎలాంటి మేకప్ లేకుండా కూడా తన స్టన్నింగ్ లుక్స్‌తో అభిమానులను మెస్మరైజ్ చేయడంలో తగ్గేదేలే అన్నట్టు ఉంటుంది. కేవలం స్టైలిష్‌గా ఉండటమే కాదు అప్ టూ మార్క్‌గా తనకంటూ ఒక ట్రెండ్ క్రియేట్ చేసుకుంటుంది. బ్లాక్ కలర్స్ అండ్ ప్రింట్స్ ఇష్టపడే కరీనా ఇటీవలి ఔటింగ్‌లో సమ్మర్‌కు తగ్గినట్టు ప్రింటెడ్ ఓవర్సైజ్డ్ జిమ్మెర్మాన్ కో-ఆర్డ్ సెట్‌తో మెరిసింది. ఇలా స్పెషల్ లుక్‌లో అలరించిన కరీనా వేసుకున్న డ్రెస్ ఎంత అని ఇంటర్నెట్లో వెదికిన ఫ్యాన్స్ ఔరా అంటున్నారు. ఇంతకీ దీని ధర ఎంతంటే అక్షరాలు 75వేల రూపాయలు. ప్రింటెడ్ సిల్క్ షర్ట్ , ప్యాచ్‌వర్క్‌తో కూడిన వైబ్రెంట్ కలర్స్ వైలెట్, పింక్, గ్రీన్ పీచ్ రంగులలో పలాజోను ధరించింది కరీనా.దీనికి మ్యాచింగ్‌గా ఆస్ట్రేలియన్ ఫ్యాషన్ లేబుల్ జిమ్మెర్మాన్ చెందిన సిల్క్ కో-ఆర్డ్ సెట్లో ఫ్లవర్ పైస్లీ ప్రింట్ టాప్, ఏవియేటర్-శైలి సన్ గ్లాసెస్ ఆమె లుక్ మరింత ఎలివేట్ చేసింది. కరీనా కపూర్ ఖాన్ స్టైలిష్ ఔటింగ్స్ గత ఏడాది సెప్టెంబరులో తన 42వ పుట్టినరోజు సందర్భంగా, కరీనా కపూర్ సెక్సీ జిమ్మెర్మాన్ ర్యాప్ డ్రెస్‌లో ఆకట్టుకుంది. రూ. 59,999 విలువైన ఈ ర్యాప్ డ్రెస్‌కు తోడు మినీ బ్లాక్ బకెట్ బ్యాగ్‌తో స్టైలిష్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. (రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు) -
తండ్రైన అసిస్టెంట్ డైరెక్టర్.. కంగ్రాట్స్ చెప్పిన స్టార్ హీరోయిన్!
బాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్, నటుడు అర్మాన్ జైన్ తండ్రి అయ్యారు. ఆయన భార్య అనిస్సా మల్హోత్రా ఇవాళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నటుడు సోషల్ మీడియాలో పంచుకున్నారు. కరీనా కపూర్ బంధువు అయిన అర్మాన్ జైన్ పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ విషయం తెలుసుకున్న కరీనా కపూర్, నీతూ కపూర్ తమ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతూ వారితో ఉన్న ఫోటోలను పంచుకున్నారు. ఈ శుభవార్త విన్న పలువురు బాలీవుడ్ తారలు ఈ జంటకు అభినందనలు తెలిపారు. కాగా.. నీతూ కపూర్‌కు ఆర్మాన్ జైన్ మేనల్లుడు. అర్మాన్, అనిస్సా ఫిబ్రవరి 2020లో వివాహం చేసుకున్నారు. ఇటీవలే సన్నిహితులు, కుటుంబ సభ్యులు సమక్షంలో బేబీ షవర్‌ను నిర్వహించారు. View this post on Instagram A post shared by Anissa Malhotra Jain (@stylebyanissa) -
‘నాటు నాటు సాంగ్ పెడితేనే జెహ్ తింటున్నాడు, అది కూడా తెలుగులోనే’
దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. విశ్వ వేదికలపై పలు ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకుంది. ఇక ఈ చిత్రంలోని నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్‌నే గెలుచుకుంది. నాటు నాటుకు ఆస్కార్ రావడంతో యావత్ ప్రపంచం ఈ పాటకు ఫిదా అయ్యింది. ఎక్కడ చూసినా నాటు నాటు కాలు కదుపుతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఈ పాట క్రేజ్ నెక్ట్స్ లెవల్లో ఉంది. సామాన్యుల నుంచి సినీ సెలబ్రెటీల వరకు నాటు నాటుకు స్టెప్పులు వేస్తున్నారు. చదవండి: ‘అసహనంతో పుష్ప 2 సెట్ వీడిన రష్మిక!’ బన్నీనే కారణమంటూ ట్వీట్ అంతగా క్రేజ్ సంపాదించుకున్న నాటు నాటు పాట గురించి తాజాగా బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె హోస్ట్ చేస్తున్న ‘వాట్ ఉమెన్ వాంట్’ నాలుగ సీజన్లో ప్రస్తుతం స్ట్రీమ్ అవుతోంది. ఈ షోకి సంబంధించిన తాజా ఎపిసోడ్ రిలీజ్ అయ్యింది. ఇందులో కరీనా మాట్లాడుతూ ఆస్కార్ విన్నింగ్ నాటు నాటు పాట గురించి ప్రస్తావించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాటు నాటు పాట చరిత్ర సృష్టించిందని, ఇది రెండేళ్ల పిల్లాడి మనసుని సైతం కొల్లగొట్టిందన్నారు. చదవండి: ఓ ఇంటివాడైన చై! నాగార్జున ఇంటికి సమీపంలోనే మకాం? తన చిన్న కుమారుడు జెహ్ నాటు నాటు పాట పెడితే కానీ అన్నం తినడం లేదని, అది కూడా తెలుగులో వినడానికే ఇష్టపడుతున్నాడని చెప్పింది. ‘జెహ్‌కి నాటు నాటు పాట బాగా నచ్చింది. ఆ పాట వచ్చినప్పుడల్లా జెహ్ ఆనందంతో గత్తులు వేస్తున్నాడు. ఆ పాట పెడితే కానీ అన్నం తినడం లేదు. ఆస్కార్ గెలిచిన ఈ పాట.. ఆర్ఆర్ఆర్ మూవీ ఎంతటి మ్యాజిక్ క్రియేట్ చేసిందో చెప్పడానికి ఇదే ఉదాహరణ’ అంటూ కరీనా చెప్పుకొచ్చింది. కాగా కరీనా-సైఫ్ దంపతులకు ఇద్దరు కుమారులు అనే విషయం తెలిసిందే. పెద్ద కుమారుడు పేరు తైమూర్ కాగా చిన్న కుమారుడు పేరు జెహ్. -
35 ఏళ్ల క్రితం విడిపోయారు, ఇన్నాళ్లకు మళ్లీ ఒక్కటైన బాలీవుడ్ జంట
బాలీవుడ్ దిగ్గజ నటుడు రణ్‌ధీర్ కపూర్, సీనియర్ నటి బబితా కపూర్లు విడిపోయి 30 ఏళ్లకు పైనే అవుతోంది. ఇద్దరూ ఇండస్ట్రీలో రాణిస్తున్న సమయంలోనే పెళ్లి పీటలెక్కారు. 1971లో వీరి వివాహం జరగ్గా కరిష్మా కపూర్, కరీనా కపూర్ జన్మించారు. ఇంతలో ఏమైందో ఏమో కానీ 1988లో రణ్‌ధీర్, బబితా విడిపోయారు. అప్పటి నుంచి ఇద్దరూ వేర్వేరుగానే నివసిస్తున్నారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత వీరిద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు. భర్త కొత్తగా షిఫ్ట్ అయిన బాంద్రాలోని ఇంటికి తన సామానంతా సర్దేసుకుని మరీ వచ్చేసింది బబిత. ఇకపోతే రణ్‌ధీర్ కొంతకాలం క్రితమే చెంబూర్‌లోని ఇంటి నుంచి బాంద్రాకు షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే! అదే సమయంలో బబితా కూడా తన భర్తతో కలిసి కొత్తింట్లోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. నిజానికి 2007లోనే రణ్‌ధీర్‌తో కలిసి ఉందామని అనుకుందట నటి. కానీ అనివార్య కారణాల వల్ల అది వీలు కాలేదట. ఇకపోతే భర్త నుంచి విడిపోయినప్పుడు బబిత తన ఇద్దరు కూతుర్లను తీసుకుని చెంబూర్‌లోని ఆర్కే బంగ్లా నుంచి బయటకు వచ్చేసింది. లోఖండ్‌వాలాలోని ఓ అపార్ట్మెంట్లో పిల్లలతో కలిసి నివసించింది. రణ్‌ధీర్, బబితా విడిపోయినప్పటికీ వీళ్ల మధ్య ఎలాంటి శత్రుత్వం ఉండేది కాదట. పైగా కపూర్ ఇంట్లో ఏ అవసరం వచ్చినా బబితా అందుబాటులో ఉండేదట! ఎట్టకేలకు వీళ్లిద్దరూ ఒక్కటవడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. -
ఇంకెందుకు? మా బెడ్రూమ్లోకి వచ్చేయండి: బాలీవుడ్ హీరో
సెలబ్రిటీలు కనిపిస్తే చాలు కెమెరాలు క్లిక్‌మనిపించకుండా ఉండలేరు. వారినే ఫాలో అవుతూ ప్రతి కదలికను క్యాప్చర్ చేయాలనుకుంటారు. కొన్నిసార్లు తారలకు ఇది విసుగు పుట్టిస్తుంది. స్వేచ్ఛగా ఉండనివ్వడం లేదని విసుక్కుంటారు కూడా! సహనం నశించినప్పుడైతే ఇక చాలు అని నిర్మొహమాటంగా హెచ్చరిస్తారు. వారి లుక్స్‌ను కెమెరాల్లో బంధించే పనిలో బిజీగా ఉండే కెమెరామన్లు వాళ్ల మాటను పెద్దగా పట్టించుకోరు. ఇది తరచూ జరిగే వ్యవహారమే! తాజాగా బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఓ పార్టీకి వెళ్లారు. మలైకా అరారో తల్లి జోయ్సీ 70వ పుట్టినరోజు వేడుకలకు వీరు జంటగా హాజరయ్యారు. అనంతరం పార్టీ నుంచి తిరిగి ఇంటికి వచ్చేసిన వీళ్లను కెమెరామన్లు వెంబడిస్తూ ఫోటోలు తీశారు. దీంతో విసుగెత్తిన సైఫ్.. 'ఓ పని చేయండి, మా బెడ్రూమ్లోకి కూడా వచ్చేయండి' అని సరదాగా వ్యాఖ్యానించాడు. అది విని కరీనా చిన్నగా ఓ నవ్వు నవ్వింది. వెంటనే అక్కడున్న ఓ ఫోటోగ్రాఫర్ 'సైఫ్ సర్, మీరంటే మాకెంతో ఇష్టం' అని అరిచాడు. దీనికి సైఫ్ 'మాకూ మీరంటే ఎంతో ఇష్టం' అని రిప్లై ఇస్తూ హడావుడిగా లోనికి వెళ్లిపోయాడు. ఇక సైఫ్ సినిమాల విషయానికి వస్తే.. అతడు చివరగా విక్రమ్ వేద సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం ఆయన దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్‌లో రావణుడిగా నటిస్తున్నాడు. కరీనా కపూర్ విషయానికి వస్తే ఆమె చేతిలో ద డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్, ద క్య్రూ చిత్రాలున్నాయి. అలాగే హన్సల్ మెహతా డైరెక్షన్లో పని చేయనుంది. #saifalikhan #KareenaKapoorKhan Ek Kaam Kariyega Hamare Bedroom me Aaiye ❤️ @viralbhayani77 pic.twitter.com/XXJVhSz4kP — Viral Bhayani (@viralbhayani77) March 3, 2023 -
సినిమాలు లేకపోతే మీ పరిస్థితేంటి?.. కరీనా కపూర్
బాయ్‌కాట్ బాలీవుడ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇటీవల బాలీవుడ్ సినిమాలపై వరుసగా వివాదాలు తలెత్తుతున్నాయి. రెండేళ్లుగా వస్తున్న బాయ్‌కాట్ వివాదం మరోసారి షారుక్ ఖాన్ మూవీ పఠాన్‌తో ట్రెండ్ అవుతోంది. ఈ అంశంపై ఏకంగా ప్రధాని మోదీ దృష్టికి వెళ్లిందంటే దీని ప్రభావం ఏమేరకు ఉందో అర్థమవుతోంది. బాలీవుడ్‌ను కుదిపేస్తున్న ఈ వివాదంపై తాజాగా స్టార్ నటి, సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్ స్పందించారు. సినిమాలు లేకపోతే ప్రేక్షకులకు వినోదం ఎక్కడ లభిస్తుందని కరీనా ప్రశ్నించారు. ఇటీవల కోల్‌కతాలో ఓ కార్యక్రమానికి హాజరైన నటి ఈ వ్యాఖ్యలు చేశారు. కరీనా కపూర్ మాట్లాడుతూ.. 'బాయ్‌కాట్ బాలీవుడ్ ట్రెండ్‌ను ఏమాత్రం ఒప్పుకోను. ఒకవేళ సినిమాలపై నిషేధం విధిస్తే.. మీకు ఎంటర్టైన్మెంట్ ఎలా దొరుకుతుంది. మీ జీవితంలో ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? వినోదం ప్రతి ఒక్కరికీ అవసరం.' అని అన్నారు. రెండేళ్లుగా ఈ వివాదం బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. తాజాగా మరోసారి ట్విట్టర్లో ట్రెండ్ పెరిగింది. 2020లో నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానంతరం మరింత పుంజుకుంది.షారుఖ్ ఖాన్ పఠాన్, అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా, అక్షయ్ కుమార్ రక్షా బంధన్, రణబీర్ కపూర్, అలియా భట్ బ్రహ్మాస్త్ర వంటి అనేక పెద్ద చిత్రాలు బాయ్‌కాట్‌ను ఎదుర్కొన్నాయి. మొదట నటీనటులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన నెటిజన్లు.. ఆ తర్వాత సినిమాలు విడుదలయ్యే సమయంలో నిషేధించాలంటూ ట్రెండింగ్ చేస్తున్నారు. సినిమాలపై ఈ విధమైన ద్వేషాన్ని ప్రదర్శించడం కరెక్ట్ కాదని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు సినీ ప్రముఖులు ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కూడా కలిశారు. కరీనా కపూర్ దర్శకుడు సుజోయ్ ఘోష్ 'ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్' తెరకెక్కిస్తున్న థ్రిల్లర్‌లో కనిపించనుంది. ఇందులో విజయ్ వర్మ, జైదీప్ అహ్లావత్ కూడా నటిస్తున్నారు. అంతే కాకుండా, దర్శకుడు హన్సల్ మెహతా చిత్రంలో కనిపించనుంది. -
పిల్లాడు ఏడుస్తుంటే ఫోటో పిచ్చేంటి.. బాలీవుడ్ జంటపై ఫ్యాన్స్ ఫైర్
బాలీవుడ్ జంట సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ దీపావళి సందర్భంగా అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ వేళ ఈ బాలీవుడ్ జంట సంప్రదాయ దుస్తులు ధరించి ఫోటోకు ఫోజులిచ్చారు. అంతా బాగానే ఉన్నా ఆ ఫోటో దిగిన సందర్భాన్ని కొందరు ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. ఎందుకంటే అందులో వారిద్దరి కుమారుల్లో ఒకరు కిందపడి ఏడుస్తూ కనిపించారు. అయినప్పటికీ ఈ జంట అవేం పట్టించుకోకుండానే నవ్వుతూ ఫోటోకు ఫోజులిచ్చారు. దీంతో వీరిద్దరి వ్యవహారంపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఏది ఏమైనా సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ఆ విధంగా చేయకూడదన్నది కొందరి అభిమానుల వాదన. మరి కొందరేమో పండగ వేళ సంతోషంలో అలా చేసి ఉంటారని సమర్థిస్తున్నారు. మరీ చిన్న పిల్లాడు ఏడుస్తుంటే అంత ఫోటో పిచ్చి ఏంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా చిన్నపిల్లలను అలా వదిలేసి మనం ఆనందంలో మునిగిపోవడం ఎంతవరకు సమంజసం అని సగటు అభిమాని మండిపడుతున్నారు. View this post on Instagram A post shared by kareena kapoor 💕💖❤❤❤ (@kareena_kapoor_khan_fanpage) -
ముద్దు వద్దు.. ఆ హీరోలతో మాత్రమే నటిస్తా: స్టార్ హీరోయిన్ల డిమాండ్
క్రియేటివ్ ఫీల్డ్‌లోని క్రేజీనెస్ ఎంత హైలో ఉంటుందో.. ఆ రంగాన్ని ఏలుతున్న సెలెబ్రిటీల డిమాండ్స్ కూడా అంతే హెచ్చుగా ఉంటాయి. స్క్రీన్ మీద స్క్రిప్ట్‌ను.. సెట్స్‌లో ప్రొడ్యూసర్స్నూ అంతే బ్యాలెన్స్డ్గా డిమాండ్ చేస్తూంటారు. ఆ జాబితాలో సోనాక్షీ సిన్హా, కరీనా కపూర్ ఉన్నారు.. దబాంగ్ నాయిక సోనాక్షీ సిన్హా.. వైవిధ్యమైన పాత్రలు పోషించి మంచి నటిగా పేరు తెచ్చుకుంది. తాను సినిమాల్లోకి వచ్చేముందే ఓ నిర్ణయం తీసుకుందట.. ఎంత అద్భుతమైన సినిమా అవనీ.. ఎంతలా స్క్రిప్ట్ డిమాండ్ చేయనీ.. ముద్దు సన్నివేశంలో నటించకూడదని. తన దగ్గరకు సినిమా ఆఫర్లతో వచ్చిన నిర్మాత, దర్శకులు అందరికీ ఆ నిర్ణయాన్ని చెప్పి.. ముద్దు సన్నివేశాలు లేకుండా ముందే జాగ్రత్తపడుతుందట. ఇప్పటి వరకైతే ఇలా సాగుతోంది.. మున్ముందు ముద్దు డిమాండ్ చేస్తే సినిమా వద్దనుకుంటుందో.. తన నిర్ణయాన్ని మూట కడుతుందో తెలీదు అంటారు బాలీవుడ్ వర్గీయులు. రాజ్‌కపూర్ మనవరాలు అనే ప్రివిలేజ్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినా.. తన నటనాకౌశలాన్ని నిరూపించుకుంటూ కొనసాగుతున్న నటి కరీనా కపూర్. తమ సినిమాల్లో కథానాయికగా కరీనాయే కావాలి అని హీరోలు పట్టుబట్టే స్థాయికి రాగానే తానూ ఓ డిమాండ్ లిస్ట్‌ను ప్రొడ్యూసర్స్‌కు పంపడం మొదలుపెట్టింది కరీనా. ‘ఏ గ్రేడ్ ఆర్టిస్ట్‌ల సరసనే నటిస్తా.. బి గ్రేడ్ ఆర్టిస్ట్‌ల సరసన నటించను. సో నన్ను తమ సినిమాల్లో హీరోయిన్గా కావాలి అనుకుంటున్న హీరోల రేంజ్ చూసుకున్నాకే నాకు చెప్పండి’ అంటూ. దాంతో మంచి మంచి సినిమాలెన్నింటిలోనో నటించే చాన్స్‌ను కోల్పోయిందట కరీనా. అయినా నో రిగ్రెట్స్.. గ్రేడ్ ఓన్లీ మ్యాటర్స్ అంటూ ముందుకెళ్లిపోతోంది ఇప్పటికీ! చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే చిత్రాలివే మా నాన్న కల నిజం అయినందుకు హ్యాపీ: కేతికా శర్మ -
నా వల్లే భారతీయ రైల్వేస్‌కు ఆదాయం పెరిగింది: కరీనా కపూర్
Kareena Kapoor Says Indian Railways Income Increased By Geet Role: బాలీవుడ్ దివా కరీనా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందం, అభినయంతో బీటౌన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన బ్యూటీ కరీనా. ఆమెను అభిమానులంతా ముద్దుగా బెబో అని కూడా పిలుచుకుంటారు. కభీ ఖుషీ కభీ ఘమ్, జబ్ వి మెట్, ఉడ్తా పంజాబ్, తషాన్, భజరంగీ భాయిజాన్, 3 ఇడియట్స్, హీరోయిన్ వంటి చిత్రాలతో అలరించింది. సినిమాలకు చాలా దూరంగా ఉన్న ఈ భామ ఇటీవల అమీర్ ఖాన్‌కు జోడీగా లాల్ సింగ్ చద్ధా సినిమాలో నటించింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కుదేలైంది. ఇదిలా ఉంటే కరీనా కపూర్ తాజాగా ఓ రియాలిటీ షోలో పాల్గొని ఆసక్తికర విషయాలు తెలిపింది. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్, వరుణ్ శర్మ లాయర్లుగా వ్యవహరిస్తున్న రియాలిటీ షో 'కేస్‌తో బన్ తా హై'. ఈ షోలో పాల్గొన్న జబ్ వి మెట్ సినిమాలోని గీత్ అనే పాత్ర వల్లే రైల్వేస్‌కు ఆదాయం పెరిగిందని తెలిపింది. ''నేను చేసిన గీత్ పాత్ర వల్లే ప్యాంట్స్ అమ్మకాలు, భారతీయ రైల్వేలకు ఆదాయం పెరిగింది'' అని కరీనా కపూర్ చెప్పుకొచ్చింది. కాగా కరీనా కపూర్, షాహిద్ కపూర్ జోడిగా కలిసి నటించిన చిత్రం జబ్ వి మెట్. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గీత్‌గా కరీనా కపూర్ అలరించింది. ఇదిలా ఉంటే కరీనా కపూర్ త్వరలో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. సుజయ్ ఘోష్ డైరెక్షన్లో విజయ్ వర్మ, జైదీప్ అహ్లవత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చదవండి: ప్రభాస్ అంటే చాలా ఇష్టం, మేము ఫ్రెండ్స్ కూడా: పీవీ సింధు View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) -
కరీనాకు ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ చురక, ఆమె కామెంట్స్‌పై ఘాటు స్పందన
‘బాయ్‌కాట్ లాల్ సింగ్ చడ్డా’ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ విషయంలో ఆమిర్ ఖాన్‌కు మద్ధతు తెలిపేందుకు ముందుకు వస్తున్న హీరోలకు సైతం బాయ్‌కాట్ సెగ తాకుతోంది. అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్లు ఆమిర్‌కు సపోర్ట్ చేయడంతో వారి సినిమాలను కూడా బహిష్కరించాలంటూ నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే లాల్ సింగ్ చడ్డాకు వసూళ్లు పడిపోవడంపై ఇటీవల ఓ ఇంటర్య్వూలో కరీనా ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘లాల్ సింగ్ చడ్డా’ మంచి సినిమా అని, ఇలాంటి చిత్రాన్ని ఎందుకు బహిష్కరిస్తున్నారో అర్థం కావడం లేదంది. చదవండి: ఇప్పటికీ నాతో వారు నటించేందుకు సంకోచిస్తున్నారు: నటి ఆవేదన అంతేకాదు మూడేళ్ల పాటు 250 మంది ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని వాపోయింది కరీనా. అయితే ఆమె వ్యాఖ్యలపై ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి స్పందించాడు. బాలీవుడ్ డాన్లుగా నటులు వ్యవహరించి, హిందూ ఫోబియాతో చిన్న సినిమాలు రిలీజ్ కాకుండా ఆగిపోయినప్పుడు మీరెక్కడికెళ్లారు అని ప్రశ్నించాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘చిన్న సినిమాలు, మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను బాలీవుడ్ డాన్లుగా పిలవబడే నటులు అడ్డుకున్నప్పుడు, ఆ చిత్రాలకు థియేటర్లకు ఇవ్వకుండా ఆపేసినప్పుడు మీరెందుకు స్పందించలేదు. Why nobody from Bollywood raises voice when the Kings of Bollywood boycott, ban & destroy careers of so many outsider actors, directors, writers? The day common Indians get to know the ARROGANCE, FASCISM & HINDUPHOBIA of the Dons of Bollywood, they’ll drown them in hot coffee. — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) August 13, 2022 దానివల్ల ఎందరో ప్రతిభ కలిగిన నటులు, దర్శకులు, రచయితల జీవితాలు నాశమయ్యాయి కదా! ఆ సినిమాలకు పని చేసింది కూడా 250 మంది పేద ప్రజలే’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. అలాగే మరొ ట్వీట్లో ‘బాలీవుడ్ డాన్ల ఆహంకారం, హిందూ ఫోబియా గురించి భారతీయులకు తెలిసినప్పుడు వారిని వేడి కాఫీ ముంచేస్తారు’ అంటూ ఘాటూ వివేక్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా అమీర్ ఖాన్, కరీనా కపూర్లు హీరోహీరోయిన్లుగా నటించిన ‘లాల్‌సింగ్ చడ్డా’ ఆగష్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్ హీరో నాగా చైతన్య కీ రోల్ పోషించాడు. భారీ అంచనాల మధ్య విడుదలై ఈ చిత్రం అశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. చదవండి: సల్మాన్‌పై మరోసారి విరుచుకుపడ్డ మాజీ ప్రేయసి When Good Content Small films are sabotaged, boycotted by the Dons of Bollywood, when their shows are taken away by Multiplexes, when critics gang up against small films… nobody thinks of 250 poor people who worked hard on that film. #Bollywood — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) August 13, 2022 -
కావాలనే టార్గెట్ చేశారు.. అందుకే ఓపెనింగ్స్ తగ్గాయి: కరీనా కపూర్
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం 'లాల్‌సింగ్ చడ్డా'. కరీనా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో నాగచైతన్య కీలక పాత్రలో నటించారు. అద్వెత్ చందన్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. తాజాగా ఈ వ్యవహారంపై కరీనా కపూర్ స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో లాల్ సింగ్ చడ్డా ఓపెనింగ్స్‌పై ఆమె మాట్లాడుతూ.. 'కొందరు కావాలనే ఈ సినిమాను టార్గెట్ చేశారని ఆరోపించింది. కేవలం ఒక్కశాతం ప్రేక్షకులే ఇలా చేస్తున్నారు. విడుదలకు ముందే ‘బాయ్‌కాట్ లాల్ సింగ్ చద్దా’ అంటూ దుష్ప్రచారం చేశారు. ఆ వ్యతిరేక ప్రచారం వల్లే ఓపెనింగ్స్ తగ్గాయి. ఈ సినిమాను బహిష్కరిస్తే మంచి సినిమాను దూరం చేసినవారవుతారు. మూడేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డాం. దయచేసి మా సినిమాను బహిష్కరించకండి' అంటూ కరీనా విఙ్ఞప్తి చేసింది. -
‘లాల్‌సింగ్ చడ్డా’ మూవీ రివ్యూ
టైటిల్ : లాల్‌సింగ్ చడ్డా నటీనటులు : ఆమిర్ ఖాన్, కరీనా కపూర్, నాగచైతన్య, మోనా సింగ్ తదితరులు నిర్మాణ సంస్థలు: వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మాతలు:ఆమిర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే దర్శకత్వం: అద్వెత్ చందన్ సంగీతం : ప్రీతమ్ సినిమాటోగ్రఫీ: సేతు విడుదల తేది:ఆగస్ట్ 11,2022 దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ నటించిన తాజా చిత్రం ‘లాల్‌సింగ్ చడ్డా’. కరీనా కపూర్, అక్కినేని నాగ చైతన్య కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కు హిందీ రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి అద్వెత్ చందన్ దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి సమర్పించడం.. నాగచైతన్య కీలక పాత్ర పోషించడంతో టాలీవుడ్లో కూడా ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై అసక్తిని పెంచేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘లాల్‌సింగ్ చడ్డా’మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘లాల్‌సింగ్ చడ్డా’ కథేంటంటే.. ఈ కథంతా 1975 నుంచి మొదలవుతుంది. లాల్‌సింగ్ చడ్డా(ఆమిర్ ఖాన్)..అంగవైకల్యంతో పుడతాడు. సరిగా నడవలేడు. అతనికి ఐక్యూ(IQ) కూడా తక్కువే. కానీ అతని తల్లి (మోనా సింగ్)మాత్రం కొడుకుని అందరి పిల్లలా పెంచాలనుకుంటుంది. ప్రత్యేకమైన పాఠశాలకు పంపకుండా సాధారణ పిల్లలు చదువుకునే స్కూల్‌కే పంపుతుంది. అక్కడ అందరూ హేళన చేస్తు అతనితో దూరంగా ఉంటే..రూప(కరీనా కపూర్) మాత్రం అతనితో స్నేహం చేస్తుంది. తల్లి చెప్పే మాటలు.. రూప ప్రోత్సాహంతో లాల్ సాధారణ వ్యక్తిలాగే ఉంటాడు. తనకు అంగవైకల్యం ఉన్నదన్న విషయాన్నే మర్చిపోతాడు. ఓ సందర్భంలో రూప చెప్పే మాటలతో పరుగెత్తడం మొదలుపెడతాడు. ఎంతలా అంటే.. ప్రతి రన్నింగ్ రేస్‌లో విజయం సాధించేలా. అలాగే కాలేజీ విద్యను పూర్తి చేసి తన తండ్రి, తాత, ముత్తాతల మాదిరే ఆయన కూడా ఆర్మీలో జాయిన్ అవుతాడు. జవాన్‌గా లాల్ దేశానికి చేసిన సేవ ఏంటి? యుద్దంలో ప్రాణాలు కోల్పోయిన తన స్నేహితుడు బాలు అలియాస్ బాలరాజు(నాగచైతన్య)చివరి కోరిక ఏంటి? ఆ కోరికను లాల్ నెరవేర్చాడా లేదా? చిన్ననాటి స్నేహితురాలు రూప పెద్దయ్యాక పడిన కష్టాలేంటి? ఆపదలో ఉన్న సయమంలో లాల్ ఆమెకు ఎలా తోడుగా నిలిచాడు? తన అమాయకత్వంతో పాకిస్తాన్ ఉగ్రవాది మహ్మద్బాయ్ని ఎలా మంచి వాడిగా మార్చాడు? లాల్ తన జీవిత ప్రయాణంలో నేర్చుకున్న సత్యాలు ఏంటి? అనేదే తెలియాలంటే థియేటర్స్‌లో లాల్‌సింగ్ చడ్డా’సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కు హిందీ రీమేకే ‘లాల్‌సింగ్ చడ్డా’. మాతృకకు ఎలాంటి భంగం కలకుండా..భారతీయ నేటివిటికి తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు అద్వెత్ చందన్. అయితే అది తెరపై వర్కౌట్ కాలేదు. స్క్రీన్‌ప్లే, నిడివి సినిమాకు పెద్ద మైనస్. కథంతా ఒకే మూడ్‌లో సింపుల్‌గా సాగుతుంది. 1975 నుంచి 2018 వరకు భారత్‌లో జరిగిన కొన్ని సంఘటలను గుర్తు చేస్తూ కథనాన్ని నడిపించాడు. సినిమా ప్రారంభం నుంచే నెమ్మదిగా సాగుతుంది. లాల్ ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత కొంచెం ఆసక్తిగా సాగుతుంది. బాలరాజుతో పరిచయం.. బనియన్, చెడ్డి బిజినెస్ అంటూ ఇద్దరు చెప్పుకునే కబుర్లు కొంచెం కామెడీని పండిస్తాయి. కార్గిల్ వార్ సన్నివేశాలు మినహా మిగతావేవి అంతగా ఆకట్టుకోలేవు. ఎమోషనల్ సీన్‌తో ఇంటర్వెల్ పడుతుంది. ఇక సెకండాఫ్‌లో కూడా కథనం నెమ్మదిగా సాగడం, ఎమోషనల్ సీన్స్గా తేలిపోవడంతో ప్రేక్షకులు బోరింగ్ ఫీలవుతారు. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు అయితే చిరాకు తెప్పిస్తాయి. రొటీన్ స్టోరీకి రొటీన్ క్లైమాక్స్ మరింత మైనస్. స్క్రిప్ట్ రైటర్‌గా అతుల్ కులకర్ణి మాతృకకు ఎలాంటి భంగం కలగకుండా మన దేశ చరిత్రని, సంస్కృతిని సీన్స్ లో నింపే ప్రయత్నం చేసి సక్సెస్ అయితే.. దానిని తెరకెక్కించడంలో దర్శకుడిగా అద్వైత్ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఎవరెలా చేశారంటే.. ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేయడం ఆమిర్‌కు అలవాటు. ఈ చిత్రంలో కూడా ఆమిర్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. లాల్‌సింగ్ చడ్డా పాత్రలో జీవించేశాడు. కథనంతా తన భుజాన వేసుకొని ముందుకు నడిపించాడు. అయితే ఈ చిత్రంలో ఆయన పోషించిన పాత్ర ‘పీకే’సినిమాను గుర్తుచేస్తుంది. రూప పాత్రలో కరీనా కపూర్ ఒదిగిపోయింది. అయితే.. ఆమె పాత్ర పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. మధ్య మధ్యలో ఇలా వచ్చి అలా వెళ్తుంది. ఇక జవాన్ బాలరాజు పాత్రతో నాగచైతన్య ఒదిగిపోయాడు. నటుడిగా మరింత ఇప్రూవ్ అయ్యాడనే చెప్పాలి. ఇక లాల్ తల్లి పాత్రలో మోనాసింగ్ తనదైన నటనతో ఆకట్టుకుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ప్రీతమ్ పాటలు బాగున్నాయి. తనూజ్ టికు నేపథ్య సంగీతం జస్ట్ ఓకే.సత్యజిత్ పాండే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాప్లో కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. మొత్తంగా ‘ఫారెస్ట్ గంప్’ చిత్రాన్ని చూడకుండా, ఆమిర్ నటనని ఇష్టపడేవారికి మాత్రం ఈ చిత్రం కాస్తో కూస్తో నచ్చే అవకాశం ఉంది. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘లాల్‌సింగ్ చడ్డా’ ట్విటర్ రివ్యూ
ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లాల్‌సింగ్ చడ్డా’. కరీనా కపూర్, అక్కినేని నాగ చైతన్య కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కు హిందీ రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి అద్వెత్ చందన్ దర్శకత్వం వహించారు. వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆమిర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తుండటంతో టాలీవుడ్లో కూడా ‘లాల్‌సింగ్ చడ్డా’పై క్యూరియాసిటి పెరిగింది. దానికి తోడు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్ 11) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. లాల్‌సింగ్ చడ్డా స్టోరీ ఏంటి? ఎలా ఉంది? లాల్సింగ్గా ఆమిర్ ఏ మేరకు ఆకట్టుకున్నాడు తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. #LaalSinghChadda.What a Beautiful film. You get sucked in and taken on a wonderful journey.This HAS to be watched in a theatre to experience it. #AamirKhan best performance to date. #KareenaKapoor #MonaSingh top notch.Beautifully directed by #AdvaitChandan.Must watch ! pic.twitter.com/8MOJteQSY7 — Jaaved Jaaferi (@jaavedjaaferi) August 10, 2022 ‘లాల్‌సింగ్ చడ్డా’ బ్యూటీఫుల్ ఫిల్మ్. థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా ఇది. ప్రేక్షకులు ఓ అందమైన ప్రయాణంలో మునిగిపోతారు. లాల్సింగ్గా ఆమిర్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అద్వెత్ చందన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. #LaalSinghChaddha is all sorts of wonderful! Watched a proper Hindi motion picchar after a long time. Advait Chandan’s craft is commendable, and Atul Kulkarni’s adaptation of #ForrestGump hits all the right notes. Lump in throat, many smiles guaranteed. It’s all heart. ♥️ #LSC pic.twitter.com/N64r3UUYp8 — Aniruddha Guha (@AniGuha) August 10, 2022 చాలా రోజుల తరువాత హిందీలో ఓ మంచి సినిమా చూశామంటూ నెటిజన్స్ చెబుతున్నారు. హృదయాన్ని హత్తుకునేలా లాల్ సింగ్ చడ్డా మూవీ ఉందంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఫస్టాఫ్ ఫ్లాట్‌గా ఉందని, ఇంటర్వెల్ సీన్ కూడా అందరిని ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. ఇక సెకండ్ హాఫ్ మొత్తం మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషనల్ టచ్ తో ఆకట్టు కున్నారంటూ కామెంట్ చేస్తున్నారు. Review #LaalSinghChaddha : BLOCKBUSTER!!! I have no words to express the beauty of this heart touching film. One of the very best films of Aamir after 3 Idiots. The screenplay is significantly enhanced as per taste of Indian audience and it will be loved Rating: 4.5(Must Watch) — Amit Lalwani (@AmitLal98119576) August 10, 2022 all my love and support to aamir khan, kareena kapoor khan & all the cast of #laalsinghchadda, really wish you only the best and hope you will have a very positive answer from the audience ❤🙏 good luck ! pic.twitter.com/iwRWHfxo9Q — Ashh-Loove ♡♡♡ (@AishRanliaLoove) August 10, 2022 Loved #LaalSinghChaddha #KareenaKapoorKhan is brilliant. #aamirKhan outstanding. Advait has made a superb film. Don’t miss this one guys. pic.twitter.com/rdn5aGC0Fm — kunal kohli (@kunalkohli) August 10, 2022 Thinking of watching #LalSinghChadha because Amir's acting is phenomenal — Alec (@alec_lakra) August 10, 2022 I will watch #LalSinghChadha bcz I want to ensure the hate mongers stands defeated .. India had made some of the finest and boldest subjects but wht we see today everyone is scared to pick relevant subjects. — نورالدین🇮🇳 (@MeMumbaikar42) August 10, 2022 -
ఇలాంటి రూమర్స్ ఎలా వస్తాయో అర్థం కావట్లేదు: హీరోయిన్
స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ నటించిన సినిమా 'లాల్ సింగ్ చద్దా' ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీ అయ్యింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరీనా కపూర్ తనపై వచ్చిన పుకార్లపై స్పందించింది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న రామాయణం సినిమాలో కరీనా సీత పాత్రకు ఎంపికయ్యిందని, అయితే ఈ పాత్ర కోసం ఆమె అక్షరాలా రూ. 12కోట్లు డిమాండ్ చేసిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రూమర్స్‌పై కరీనా స్పందిస్తూ.. నాకు ఎలాంటి ఆఫర్ రాలేదు. అలాంటప్పుడు నేనెలా డిమాండ్ చేస్తా? ఇలాంటి వార్తలు ఎలా బయటకు వస్తాయో కూడా అర్థం కావడం లేదు. సోషల్ మీడియా వచ్చాక ఎవరికి నచ్చింది వాళ్లు రాసేసుకుంటున్నారు. కాస్త నిజాలు తెలుసుకొని రాస్తే బావుంటుంది అంటూ ఘాటుగా బదులిచ్చింది. -
మీ మాజీ భర్త షాహిద్ అంటూ ప్రశ్న.. కరీనా రియాక్షన్ చూశారా?
బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’. ఈ షో ఎంతటి క్రేజీ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోకు వచ్చిన సినీ సెలబ్రెటీలను తనదైన స్టైల్లో చిక్కు ప్రశ్నలు అడిగి ఇబ్బందుల్లో పడేస్తుంటాడు కరణ్. అలా వారి నుంచి ఆసక్తిర విషయాలను బయటపెట్టిస్తూ ఈ టాక్ షోను సక్సెస్ ఫుల్‌గా రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఈ షో 6వ సీజన్‌ను జరుపుకుంటోంది. ఈ సీజన్లో తొలిసారి మన తెలుగు హీరోయిన్ సమంత, హీరో విజయ్ దేవరకొండలు సందడి చేశారు. చదవండి: బింబిసార మూవీపై జూ. ఎన్టీఆర్ రివ్యూ.. ఏమన్నాడంటే దీంతో కాఫీ విత్ కరణ్ 6వ సీజన్‌కు నార్త్‌లోనే కాదు సౌత్‌లోనూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ క్రమంలో లెటేస్ట్ ఎపిసోడ్లో లాల్ సింగ్ చద్దా హీరోహీరోయిన్లు అయిన ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ సందడి చేశారు. ఈ సందర్భంగా కరణ్ జోహార్, కరీనాను అడిగిన ఓ ప్రశ్న ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. రాపిడ్ ఫైర్ రౌండ్లో హోస్ట్ కరణ్ కరీనాను కజిన్ రణ్‌బిర్ కపూర్, షాహిద్ కపూర్ పార్టీ చేసుకుంటే ఎవరు మిమ్మల్ని ఆహ్వానించరు అని అడగ్గా.. ‘రణ్‌బిర్ కజిన్ కాబట్టి ఆహ్వానిస్తాడు. కానీ షాహిద్ కపూర్ మాత్రం ఆహ్వానించకపోవచ్చు’ అని వివరించింది. చదవండి: పసి పిల్లలను సైతం చంపే రాక్షస చక్రవర్తి 'బింబిసార'.. మూవీ రివ్యూ ఆ తర్వాత గతంలో ఈ షోలో బేబో ఎన్నోసార్లు పాల్గొంందని, పెళ్లికి ముందు ఒకసారి, పెళ్ల అనంతరం తన భర్త సైఫ్‌తో.. మాజీ భర్త షాహిద్.. అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో షోకు వచ్చినవారంత ఒక్కసారిగా షాకయ్యారు. కరణ్ మాటలకు కరీనా సైతం అవాక్కైంది. తన తప్పును వెంటనే సవరించుకున్న కరణ్.. కరీనాను క్షమాపణలు కోరాడు. కాగా కరీనా, షాహిద్లు జంటగా నటించిన జబ్ వి మెట్ మూవీ సమయంలో వీరిద్దరు పీకల్లోతూ ప్రేమలో మునిగితేలిన సంగతి తెలిసిందే. కొన్నేళ్లకు ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్న వీరిద్దరు. ఆ తర్వాత కరీనా.. సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకోగా.. షాహిద్ మిరా రాజ్‌పుత్‌ను వివాహమాడాడు. -
శృంగారంపై ప్రశ్న.. హీరోయిన్ సమాధానం ఏంటంటే?
Koffee With Karan 7: Kareena Kapoor Answer To Karan Johar Question: బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా సక్సెస్ అయిన షో 'కాఫీ విత్ కరణ్' టాక్ షో. ఇప్పటికీ ఈ షో 6 సీజన్లు పూర్తి చేసుకుని ప్రస్తుతం ఏడో సీజన్‌తో దూసుకుపోతోంది. ఈ సీజన్లో పార్టిస్పేట్ చేసిన సెలబ్రిటీలతో అనేక రహస్యాలను బయటపెడుతున్నాడు ఈ స్టార్ ప్రోడ్యూసర్. ఇటీవలిటీ ఎపిసోడ్లో జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ అన్నదమ్ములతో డేటింగ్ చేయడం, విజయ్ దేవరకొండ కారులో శృంగారం చేయడం వంటి విషయాలతోపాటు సమంత, అక్షయ్ కుమార్ వ్యాఖ్యలు ఆసక్తిరేపాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో ఐదో ఎపిసోడ్ ప్రొమోను బయటకు వదిలారు. ఈ ఎపిసోడ్లో 'లాల్ సింగ్ చద్దా' హీరోహీరోయిన్లు అమీర్ ఖాన్, కరీనా కపూర్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా 'పిల్లలు పుట్టాక సంతృప్తికర లైంగిక జీవితం అనేది నిజమా? కల్పితమా?' అని కరణ్ జోహర్ అడిగిన ప్రశ్నకు 'మీకు తెలియదా?' అని కరీనా కపూర్ ధీటుగా సమాధానమిచ్చింది. దీంతో 'మా అమ్మ ఈ షో చూస్తారు. ఇలా నా లైంగిక జీవితం గురించి మాట్లాడటం బాగుండదేమో?' అని కరణ్ చెప్పగా వెంటనే 'మీరు ఇతరుల లైంగిక జీవితం గురించి మాట్లాడటాన్ని మాత్రం మీ అమ్మగారు పట్టించుకోవడం లేదు కదా' అని అమీర్ అనడంతో షోలో నవ్వులు కురిశాయి. చదవండి: హీరోయిన్ మేనకోడలు, కాంగ్రెస్ నాయకుడి కుమార్తె మృతి.. హీరోయిన్‌కు ముద్దు పెట్టిన హీరో.. కంట్రోల్ చేసుకోవాలని ట్వీట్ కాగా అమీర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'లాల్ సింగ్ చద్దా'లో నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. హాలీవుడ్ సూపర్ హిట్ అయిన 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. చదవండి: నాగార్జునతో 'విక్రమ్' లాంటి సినిమా చేయాలని ఉంది: డైరెక్టర్ బికినీ దుస్తుల్లో వేదిక రచ్చ.. సినిమా అవకాశాల కోసమేనా? -
తన సినిమానే చూస్తూ నిద్రపోయిన స్టార్ హీరోయిన్..
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ 57 ఏళ్ల వయసులో లీడ్ రోల్లో నటించిన చిత్రం 'లాల్‌సింగ్ చద్దా'. హాలీవుడ్ మూవీ 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ బెబో కరీనా కపూర్ హీరోయిన్గా అలరించనున్న ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆగస్టు 11న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండగా ప్రీమియర్ షోలు రన్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ప్రీమియర్ షోకు అమీర్ ఖాన్, ఆయన మాజీ భార్య కిరణ్ రావుతోపాటు కరీనా కపూర్ కూడా హాజరైంది. అయితే లాల్ సింగ్ చద్దా సినిమాను అమీర్ ఖాన్, కిరణ్ రావు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తుంటే కరీనా కపూర్ మాత్రం నిద్రపోతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలో అమీర్ ఖాన్ మధ్యలో కూర్చోగా, ఆయన ఎడమ వైపు కిరణ్ రావు, కుడివైపు కరీనా కపూర్ కూర్చొని ఉన్నారు. ఈ పిక్లోనే కరీనా కపూర్ నిద్రపోవడం చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. 'లాల్ సింగ్ చద్ధా చిత్రం చాలా బోరింగ్‌గా ఉన్నట్లుంది. అందుకే కరీనా నిద్రపోతోంది', 'ఫారెస్ట్ గంప్ సినిమాను అమీర్ చూడలేదేమో.. అందుకే బాగా ఎమోషనల్ అవుతున్నాడు' అంటూ ట్రోల్ చేస్తున్నారు. చదవండి: నూలుపోగు లేకుండా రణ్వీర్ సింగ్.. మానసిక రోగి అంటూ బ్యానర్లు శ్రీదేవి చెప్పిన బ్యూటీ టిప్.. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్న జాన్వీ and kareena kapoor slept because of her own screentime in the film — Saharsh (@whysaharsh) July 21, 2022 చదవండి: చిరంజీవికి పానీపూరి తినిపించిన అమీర్ ఖాన్.. -
కరీనా కపూర్ మళ్లీ ప్రెగ్నెంట్ !.. అతను ఇప్పటికే చాలా చేశాడని పోస్ట్
Kareena Kapoor Denies Pregnancy Rumours: బాలీవుడ్ దివా కరీనా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందం, అభినయంతో బీటౌన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన బ్యూటీ కరీనా. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌తో కరీనా కపూర్‌కు 2012 అక్టోబర్ 16న ముంబైలోని బాంద్రాలో వివాహమైన విషయం తెలిసిందే. కరీనా-సైఫ్ దంపతులకు తైమూర్ అలీ ఖాన్, జహంగీర్ అలీ ఖాన్ (జేహ్) ఇద్దరు కుమారులు. అయితే తాజాగా కరీనా కపూర్ మరోసారి ప్రెగ్నెంట్ అయిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై స్పందించిన కరీనా ఆసక్తికరమైన పోస్ట్‌తో సమాధానమిచ్చింది. ప్రస్తుతం సైఫ్, ఇద్దరి పిల్లలతో వెకేషన్లో ఉంది కరీనా. ఈ వెకెషన్‌కు సంబంధించిన ఒక ఫొటోను ఇటీవల పోస్ట్ చేసింది. ఆమె పోస్ట్ చేసిన అతికొద్ది సమయంలోనే ఆ ఫొటో నెట్టింట తెగ వైరల్ అయింది. అందుకు కారణం ఆ ఫొటోలో కరీనా పొట్ట కొంచెం ఉబ్బుగా కనిపించడమే. దీంతో కరీనా మళ్లీ గర్భవతి అయిందని పుకార్లు చెలరేగాయి. ఈ వార్తలపై కరీనా స్పందిస్తూ 'ఇది కేవలం పాస్తా, వైన్ వల్లే. ప్రశాంతంగా ఉండండి అబ్బాయిలు. నేను గర్భవతిని కాదు. మన దేశ జనాభా కోసం అతను ఇప్పటికే చాలా ఎక్కువ చేశాను అని సైఫ్ చెప్పాడు' అని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. దీంతో కరీనా ప్రెగ్నెంట్ రూమర్స్‌కు చెక్ పడినట్లయింది. కాగా కరీనా కపూర్ తాజాగా అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' సినిమాలో 'రూప'గా నటించిన విషయం తెలిసిందే. చదవండి: చిక్కుల్లో సింగర్ శ్రావణ భార్గవి.. కోర్టుకు వెళతానని అన్నమయ్య వంశస్తుల హెచ్చరిక సైబర్ నేరగాళ్ల ఉచ్చులో బుల్లితెర నటి.. చివరికి.. అతని ప్రేయసి గురించి చెప్పేసిన చిరంజీవి.. Kareena and Saif spotted in London with friends pic.twitter.com/HBhGOQvKtm — Kareena Kapoor Khan (@KareenaK_FC) July 15, 2022 చదవండి: ఆ వార్త నన్ను కలిచివేసింది: సుష్మితా సేన్ తమ్ముడు -
అతని ప్రేయసి గురించి చెప్పేసిన చిరంజీవి..
Chiranjeevi Introduces Kareena Kapoor As Roopa: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ 57 ఏళ్ల వయసులోనూ విభిన్న పాత్రల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం 'లాల్‌సింగ్ చద్దా'. హాలీవుడ్ మూవీ 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 11న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను చిరంజీవి సమర్పణలో తెలుగు వెర్షన్లో కూడా రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది బాలీవుడ్ దివా కరీనా కపూర్. తాజాగా కరీనా పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. 'లాల్‌సింగ్ చద్దా' ప్రేయసి 'రూప'గా కరీనాను పరిచయం చేశారు చిరంజీవి. ''‘లాల్ సింగ్ చడ్డా’ ప్రేయసి ‘రూప’ని మీకు పరిచయం చేస్తున్నాను.. వీళ్లిద్దరి బంధం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘ముద్దపప్పు-ఆవకాయ’'' అని ట్విటర్ వేదికగా తెలిపారు. ఈ పోస్టర్లో అమీర్ ఖాన్‌ను కరీనా కపూర్ హగ్ చేసుకుని ఉండటం చూడముచ్చటగా ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. చదవండి: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో బుల్లితెర నటి.. చివరికీ.. ఆ వార్త నన్ను కలిచివేసింది: సుష్మితా సేన్ తమ్ముడు బాయ్‌ఫ్రెండ్ నుంచి కాల్.. తర్వాత మోడల్ ఆత్మహత్య ‘లాల్ సింగ్ చడ్డా’ ప్రేయసి ‘రూప’ని మీకు పరిచయం చేస్తున్నాను...వీళ్లిద్దరి బంధం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘ముద్దపప్పు-ఆవకాయ’. Introducing Rupa from #LaalSinghChaddha #Rupa #KareenaKapoorKhan #AamirKhan @AKPPL_Official @Viacom18Studios @chay_akkineni #11August22Release pic.twitter.com/fcKUJ4QTy3 — Chiranjeevi Konidela (@KChiruTweets) July 18, 2022 -
బాత్రూమ్లో లైబ్రరీ ఏర్పాటు చేయించుకున్న హీరో
సెలబ్రిటీల జీవన శైలి అంటే ఆసక్తి చూపనిదెవరు? అందునా పాపులర్ పర్సన్స్ అలవాట్లు, అభిరుచుల పట్ల చెవి రిక్కించని వారెవరు? ఆ గుంపులో మేమూ ఉన్నాం. అందుకే ఈ వివరాలు పోగేసుకొచ్చాం..! శారీ సుందరి.. తెలుసు మీకర్థమైందని! విద్యా బాలనే. ఇక్కడ చెప్పబోయేది కూడా ఆమెకున్న చీరల పిచ్చి గురించే. ఎక్కడ ఏ కొత్త రంగు.. డిజైన్.. నేతలో చీర కనిపించినా అది తన క్లాజెట్‌లో క్లోజ్ చేసుకునేదాకా నిద్రపోదట విద్యాబాలన్. నిద్రంటే గుర్తొచ్చింది.. రాత్రి కలలో కూడా తను చీరలోనే కనిపించాలని నిద్రపోయేప్పుడూ చీర కట్టుకునే నిద్రకుపక్రమిస్తుందని ఆమె సన్నిహితుల ఉవాచ. అన్నట్టు విద్యాబాలన్ లీస్ట్ బాదర్డ్ థింగ్ ఈజ్ సెల్ ఫోన్. అభిమానులూ.. ఆమె నంబర్ సంపాదించి ఆమెకు మెసేజ్ పెట్టేరూ..! ఆర్నెల్లయినా చూసుకోదట. ఫ్యాన్స్ సందేశాలే కాదు.. ఆమెకు పనిచ్చేవాళ్ల సమాచారాలను కూడా. అలా విద్యా చాలా ముఖ్యమైన భూమికలను, అత్యంత ప్రధానమైన ఈవెంట్లనూ మిస్ అయిన సందర్భాలు బోలెడట. అయినా సెల్ ఫోన్‌ను అక్కున చేర్చుకోదట. అదేమంటే ఫోన్లో తల దూర్చడం కంటే మనుషులతో మాటలు కలపడమే నాకిష్టం అంటుంది. వాటే టైమింగ్.. కూలీ సినిమా షూటింగ్ సమయంలో అమితాబ్ బచ్చన్‌కు యాక్సిడెంట్ అయిన విషయం తెలుసు కదా! ఆ ప్రమాదంలో అతని కుడిచేతిక్కూడా గాయమై కొన్నాళ్లపాటు అది కదలకుండా ఉందట. అప్పుడు అన్ని పనులను ఎడమ చేత్తో చేయడం అలవాటు చేసుకున్నాడు అమితాబ్.. రాయడం సహా. ఇప్పుడు కుడిచేత్తో ఎంత స్పీడ్‌గా .. సౌకర్యంగా రాయగలడో ఎడమచేత్తోనూ అంతే స్పీడ్‌గా సౌకర్యంగా రాయగలడు ఆ హీరో. సో వాట్.. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారా? అవును ఆ ప్రాక్టీస్ ఆ మ్యాన్ని ఎంత ఎక్స్‌పర్ట్‌ను చేసిందంటే రెండు వేర్వేరు విషయాలను ఏకకాలంలో రెండు చేతులతో రాసేంతగా! దటీజ్ బిగ్ బి.. అంటూ అభిమానులంతా ఆయనకు బిగ్ హ్యాండ్ ఇవ్వడం మొదలెట్టేశారా! గోర్లు బలి ఆందోళన, కంగారు, ఒత్తిడి వగైరాను ఎదుర్కోవడంలో ఒక్కొక్కరిదీ ఒక్కోతరహా. కానీ చాలామందిది ఒకే తరహా. ఏ కాస్త టెన్షన్.. స్ట్రెస్ ఫీలైనా వేలి గోళ్లను కరచుకుని కొరికేస్తుంటారు. ఆ లిస్ట్‌లో కరీనా కపూర్ కూడా ఉంది. అవును.. పాపం.. ఏ కాస్త కంగారు కలిగినా వేలి గోళ్లను దానికి బలిచ్చేస్తూంటుందట. హమ్మయ్య.. సెలబ్రిటీలూ సామాన్యులే ఈ విషయంలో అని సారూప్యత వెదుక్కోవచ్చు. ఇట్స్ నాటే లై వాష్‌రూమ్‌లో వార్తా పత్రికలు చదవడం చాలామందికి అనుభవం. కానీ పుస్తకాలు చదవడం చాలా మందికి కొత్తే! కానీ సైఫ్ అలీఖాన్‌కు చాలా చాలా పాత అలవాటు. అతను చిన్నప్పటి నుంచీ బాత్రూమ్లోనే పుస్తకాలు చదివేవాడట. సో పెద్దయ్యాకా.. అంటే నటుడిగా స్థిరపడ్డాక.. ఏకంగా బాత్రూమ్లోనే లైబ్రరీని ఏర్పాటు చేయించుకున్నాడు. చదవాలనిపించినప్పుడల్లా వాష్‌రూమ్‌లోకి దూరుతున్నాడని కరీనా కపూర్ కంప్లయింట్ చేస్తుందేమో! స్టాంప్సా? కాదు.. .. మరేంటి? సోప్స్! ఊప్స్..! ఎస్.. సల్మాన్ ఖాన్ ఏ కొత్త చోటుకి వెళ్లినా అక్కడ కనిపించిన సోప్స్‌ను తీసి బ్యాగ్‌లో వేసుకుంటాడట. ఏంటయ్యా అది? అని అంటే.. సోప్స్ కలెక్షన్ అని ఆన్సర్ చేస్తాడట. అలా తెచ్చుకున్న సోప్స్‌తో షవర్ ఎక్స్పరిమెంట్స్ చేస్తాడని బాలీవుడ్లో బ్యాడ్ టాక్. చదవండి: చిరు ఇంట్లో విక్రమ్ టీంకు గ్రాండ్ పార్టీ, సల్మాన్ ఖాన్ సందడి 16 ఏళ్ల తర్వాత వెబ్‌సిరీస్‌తో నటి రీ ఎంట్రీ, స్ట్రీమింగ్ ఎప్పుడంటే? -
ఒక్క టీ షర్ట్‌కు రూ.40 వేలు, నీ టేస్ట్ ఏడ్చినట్లుంది
ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా ఫ్యాషన్‌కు ఎప్పుడూ పెద్ద పీట వేస్తుంటారు సెలబ్రిటీలు. మరీ ముఖ్యంగా హీరోయిన్స్ కెమెరా ముందుకు వెళ్లినప్పుడు మాత్రమే కాకుండా వాకింగ్, జాగింగ్, పార్టీ, డిన్నర్ డేట్, టూర్.. ఇలా ఏం చేసినా, ఎక్కడికి వెళ్లినా స్పెషల్‌గా కనిపించేలా జాగ్రత్తపడుతుంటారు. ఈ క్రమంలో వారి స్టయిల్‌పై కొన్నిసార్లు విమర్శలు సైతం వ్యక్తమవుతుంటాయి. తాజాగా కరీనా కపూర్ కూడా ఈ విమర్శల బారిన పడింది. ఇటీవల ఆమె గుస్సీ ఎల్లో టీషర్ట్‌తో బయట కనిపించింది. ఇంకేముందీ, అక్కడున్న ఫొటోగ్రాఫర్లు వెంటనే కెమెరాలకు పని చెప్పి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో వదిలారు. నెట్టింట అవి కాస్తా వైరల్‌గా మారగా ఆ టీషర్ట్ దరిద్రంగా ఉంటూ కామెంట్లు చేస్తున్నారు పలువురు నెటిజన్లు. కరీనా రూ.40 వేలు పెట్టి కొనుకున్న టీ షర్ట్ అష్ట దరిద్రంగా ఉందని పెదవి విరుస్తున్నారు. 'నీ టేస్ట్ ఏడ్చినట్లుంది, మేము రూ.150 పెడితే మూడు టీషర్ట్స్ వచ్చాయి. నువ్వు వేసుకున్నదానికంటే అవే చాలా బాగున్నాయి' అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా కరీనా వార్డ్‌రోబ్‌లో గుస్సీ టీషర్ట్స్ 50 కంటే ఎక్కువే ఉన్నట్లు సమాచారం. చదవండి: నాన్న టార్చర్ పెడుతున్నాడు.. అభిమాని కష్టాలకు చలించిపోయిన హీరో ఫ్యాన్స్ అత్యుత్సాహం! విక్రమ్ థియేటర్లో చెలరేగిన మంటలు -
Laal Singh Chaddha Trailer: తలరాతను ఎలా రాస్తారు ?
Aamir Khan's Laal Singh Chaddha Trailer: ఆమిర్‌ఖాన్ హీరోగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’. కరీనా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో నాగచైతన్య ఓ కీలక పాత్రలో నటించారు. ‘ఎక్స్‌పీరియన్స్‌ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ఏ సింపుల్మేన్’ అంటూ ‘లాల్ సింగ్ చద్దా’ హిందీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే పోస్టర్లు, పాటలతో సినిమా ఆసక్తిని పెంచిన చిత్ర యూనిట్ ఉత్కంఠంగా సాగుతున్న టీ20 ఫైనల్ మ్యాచ్‌లో ఈ ట్రైలర్‌ను ప్రదర్శించింది. అనంతరం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ఆద్యంతం ఆసక్తింగా సాగిన ఈ ట్రైలర్లో ఆమీర్ ఖాన్, నాగ చైతన్య లుక్ కొత్తగా ఉంది. ఈ సినిమాలో అభిమానులకు కోరుకున్నట్లు అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ హిందీతోపాటు దక్షిణాది భాషల్లో ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్‌గంప్’కు హిందీ రీమేక్‌గా రూపొందింది. Experience the extraordinary journey of #LaalSinghChaddha, a simple man whose heart is filled with love, hope and warmth.#LaalSinghChaddhaTrailer out now! Releasing in cinemas worldwide on 11th Aug.https://t.co/yahghWFhJA — Aamir Khan Productions (@AKPPL_Official) May 29, 2022 -
షాకింగ్: కెమెరామెన్‌పై తైమూర్ ఎలా అరిచాడో చూడండి
Kareena Kapoor Son Taimur Ali Khan Fire On paparazzi: బాలీవుడ్ జంట కరీనా కపూర్- సైఫ్ అలీఖాన్ పెద్ద కుమారుడు తైమూర్ అలీఖాన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుట్టిన నాటి నుంచి స్టార్కిడ్ గుర్తింపు పొందిన తైమూర్ ఎంతో మందికి ఫేవరెట్ కిడ్‌గా మారిపోయాడు. ఇక ఈ బుడ్డోడు బయట కనిపిస్తే చాలు పాపరాజీలకు(కెమెరామెన్) పండుగే. తమ కెమెరాలకు పని చెబుతూ వెంటవెంటనే తైమూర్ ఫొటోలను క్లిక్ మనిపిస్తారు. ఇక చిన్నతనంలో దీనిపై పెద్దగా అవగాహన లేని తైమూర్ పాపరాజీలను చూస్తూ క్యూట్‌గా స్మైల్ ఇచ్చేవాడు. అలా తైమూర్ ఫొటోలు నిత్యం వార్తల్లో నిలిచేవి. చదవండి: Vishwak Sen: అంతా ఓకే అనుకునేసరికి ఆమె నన్ను వదిలేసిన విషయం తెలిసింది ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి తైమూర్ వారి కంటపడ్డాడు. తల్లి కరీనాతో పాటు సోదరుడు జైహ్తో ఇంటీ బయట కనిపించాడు. వారి వెంట కేర్ టేకర్స్ కూడా ఉన్నారు. బయటకు వచ్చిన తైమూర్‌ను పాపరాలజీలు గ్యాప్ లేకుండా ఫొటోలు తీస్తున్నారు. ఇది చూసి నీ బుడ్డోడు రియాక్ట్ అయిన తీరు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఎప్పుడు నవ్వుతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చే ఈ బుల్లి పటౌడి ఈసారి మాత్రం ఫైర్ అయ్యాడు. కెమెరామెన్‌ను చూస్తూ ‘ఇక ఆపండి’ అంటూ గట్టిగా అరిచాడు. పక్కనే తల్లి కరీనా కూడా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: ఓటీటీకి ఆచార్య మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే! మరోవైపు కరీనా రెండో కుమార్ జెహ్ మాత్రం కారుతో ఆడుతూ కనిపించాడు. ఇక తైమూర్ రియాక్షన్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఏంటీ ఈ బుడ్డోడు అంత మాట అనేశాడంటూ నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అలాగే ‘తల్లిదండ్రులు ఎలా మాట్లాడితే పిల్లలు అలా మాట్లాడుతారు. అతడి అమ్మనాన్న మాట్లాడటం చూసి తైమూర్ నేర్చుకున్నాడు’, ‘అతడి తల్లిదండ్రులు(కరీనా-సైఫ్) నేర్పించే సంస్కారం ఇదేనా?’ అంటూ కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరూ పాపరాజీలకు చురకులు అట్టిస్తున్నారు. ఓ చిన్న పిల్లాడి చేత కూడా చెప్పించుకుంటున్నారు.. మీకంటూ ఓ సెల్ఫ్ రెస్పాక్ట్ లేదా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వ్యాధి గురించి బయటపెట్టిన రణ్‌బీర్ కపూర్
కరీనా కపూర్ తండ్రి, బాలీవుడ్ నటుడు రణ్‌ధీర్ కపూర్ ప్రస్తుతం మతిమరుపుతో బాధపడుతున్నట్లు హీరో రణ్‌బీర్ కపూర్ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఈ వ్యాధి ప్రారంభ దశలో ఉన్నారని పేర్కొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రణ్‌బీర్ మాట్లాడుతూ.. షర్మాజీ నమ్కిమ్ సినిమా చూసిన తర్వాత రణ్‌ధీర్ అంకుల్ నా దగ్గరకు వచ్చి, ఆ సినిమాలో మీ నాన్న అద్భుతంగా నటించాడు. అతను ఎక్కడ ఉన్నాడు? నేను అతడితో మాట్లాడాలి ఫోన్ చెయ్ అని అడిగాడు. నాన్న చనిపోయారన్న సంగతి అంకుల్ మర్చిపోయారు. ఇప్పుడిప్పుడే ఆయనకు వ్యాధి ప్రారంభమైంది అంటూ వివరించాడు. కాగా దిగ్గజ నటుడు రాజ్‌కపూర్‌కు రణ్‌ధీర్, రాజీవ్, రిషి కపూర్లు కుమారులన్న సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం రణ్‌బీర్ తండ్రి, రిషి కపూర్ చనిపోయారు. -
Kareena Kapoor: ఏంటీ ఆ పీలికల డ్రెస్ ధర 70 వేలా? ఎందుకిలా?
లక్ష్మీ లెహర్.. బాలీవుడ్ సెలబ్రిటీలకు అత్యంత ఇష్టమైన స్టైలిస్ట్. టాప్ హీరోలు, హీరోయిన్లు ఆమె కస్టమర్ల జాబితాలో ఉంటారు. కరీనా కపూర్, సారా అలీ ఖాన్, అలియా భట్, కత్రినా కైఫ్, జాన్వీ కపూర్, కియారా అద్వానీ, అనన్య పాండే సహా హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ వంటి స్టార్లు లక్ష్మీతో స్టైలింగ్ చేయించుకున్న వాళ్లే!. బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ కరీనా కపూర్ న్యూ లుక్ కోసం రంగంలోకి దిగిందామె! ఎల్లో కలర్ కో- ఆర్డ్(పై నుంచి కింది దాకా ఒకే రకమైన ఫ్యాబ్రిక్, కలర్‌తో ఉండే కో ఆర్డినేట్ డ్రెస్) సెట్లో మెరిసేలా చేసింది!. ఫ్లోరల్ ప్రింట్‌తో ఉండే ఈ బీచ్ వేర్‌కు చిక్ బెల్ట్ జత చేసింది. సింపుల్ ఇయర్ రింగ్స్, చైన్‌తో సరిపెట్టేసింది. అన్నట్లు కరీనా ధరించిన ఈ బస్టియర్ టాప్ ధర 30, 599 రూపాయలు కాగా.. నడుము పై భాగం వరకు ఉన్న షార్ట్స్ ధర రూ. 39,599. ఈ డ్రెస్ ధరించిన బెబో ఫొటోను లక్ష్మి తన ఇన్‌స్టా అకౌంట్లో సమ్మర్ రెడీ అన్న క్యాప్షన్‌తో షేర్ చేసింది. అయితే, నెటిజన్లు ఈ ఫొటోపై మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది డ్రెస్ బాగుందంటూ పొగడగా.. మరికొందరు మాత్రం.. 70 వేలు పోసి ఈ పీలికల డ్రెస్ కొనాలా? అయినా కరీనా అంటే ఈ మాత్రం ఉంటుందిలే! ఏదేమైనా ఆమె టేస్టుకు సరిగ్గా సరిపోయిందంటూ సెటైరికల్ కామెంట్లతో ట్రోల్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Lakshmi Lehr (@lakshmilehr) View this post on Instagram A post shared by Lakshmi Lehr (@lakshmilehr) View this post on Instagram A post shared by Lakshmi Lehr (@lakshmilehr) -
కరీనా కొడుకు పూర్తి పేరేంటి? విద్యార్థులను అడిగే ప్రశ్నలు ఇవా?
సైఫ్ అలీఖాన్- కరీనా కపూర్ దంపతుల కొడుకు పూర్తి పేరు ఏమిటి? ఇంతకీ ఫస్టా? సెకండా? అని అడగకండి. ఎందుకంటే ఈ ప్రశ్న అడిగింది మేము కాదు మధ్యప్రదేశ్‌లోని ఓ స్కూల్. ఆరవ తరగతి విద్యార్థులకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో పై ప్రశ్న ఉంది. దాన్ని కొందరు స్క్రీన్షాట్లు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. ఆ పిల్లల తల్లిదండ్రులు మాత్రం ఇవేం పిచ్చిప్రశ్నలని స్కూల్ యాజమాన్యంపై ఫైర్ అవుతున్నారు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే కరీనా కొడుకు పేరేంటి? అన్న పాఠశాల యాజమాన్యం ఆమెకు ఇద్దరు సంతానం అన్న సంగతి కూడా మరిచింది. కాగా బాలీవుడ్ జంట సైఫ్ - కరీనా దంపతులకు తైమూర్ అలీ ఖాన్, జెహ్‌లు సంతానం. జెహ్ పూర్తి పేరు జెహంగీర్ అలీ ఖాన్. A private school in Khandwa asked the name of film actor Kareena Kapoor Khan and Saif Ali Khan's son in the examination paper of class 6th. The DEO said a show cause notice will be issued to the school @ndtv @ndtvindia @GargiRawat @manishndtv pic.twitter.com/YkERwGYeMB — Anurag Dwary (@Anurag_Dwary) December 24, 2021 -
కరీనా కుటుంబంపై బీఎంసీ అధికారులు ఆగ్రహం
BMC Alleged Kareena Kapoor Family Not Cooperating Contact Tracing: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కుటుంబ కాంటాక్ట్ ట్రెసింగ్కు సహకరించడం లేదని బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు ఆరోపిస్తున్నారు. కరీనా ఇటీవల మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. నిర్మాత కరణ్ జోహార్ ఇంట్లో ఏర్పాటు చేసిన విందు పార్టీకి కరీనాతో పాటు హజరైన పలువురికి సైతం పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన బీఎంసీ కరోనా పరీక్షలు చేయిస్తుంది. ఈ నేపథ్యంలో కరీనా ఇంటిని సీజ్ చేసి శానిటైజ్ చేయించారు. చదవండి: Corona Virus: బాలీవుడ్లో కరోనా కలకలం, కరోనా బారిన వరసగా సెలబ్రెటీలు ఇక కాంటాక్ట్ ట్రెసింగ్తో ఎవరెవరూ పార్టీకి వచ్చారు వారంత ఎక్కడ ఉన్నారో తెలుసుకునే పనిలో పడ్డారు బీఎంసీ అధికారులు. అయితే దీనికి కరీనా కుటుంబం సహకరించడం లేదని బీఎంసీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరీనా భర్త సైఫ్ అలీఖాన్ ఎక్కడున్నారన్న విషయాన్ని చెప్పడం లేదని, ఎన్నిసార్లు అడిగినా ముంబైలో లేరనే చెబుతున్నారని, ఎక్కడున్నారన్న విషయాన్ని మాత్రం చెప్పడం లేదని అన్నారు. ప్రస్తుతం కాంటాక్ట్ ట్రేసింగ్ జరుగుతోందని, సేకరించిన నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిస్తామని చెప్పారు. చదవండి: నుదిటిన సింధూరం.. తాలిబొట్టుతో చూడ ముచ్చటగా కత్రినా, ఫొటోలు వైరల్ కరీనా కపూర్ నిబంధనలు ఉల్లంఘించారని వస్తున్న వార్తలపై ఆమె అధికార ప్రతినిధి స్పందించారు. ఆమె చాలా బాధ్యతాయుతమైన పౌరురాలని, లాక్డౌన్ సమయంలో ఎంతో బాధ్యతగా వ్యవహరించారని పేర్కొన్నారు. కరణ్ జోహార్ ఈ నెల 8న తన ఇంట్లో ఇచ్చిన పార్టీలో ఓ వ్యక్తి దగ్గుతూ కనిపించాడని, అతడు రాకుండా ఉండాల్సిందని అన్నారు. తనకు కరోనా సోకిన విషయం తెలిసిన వెంటనే కరీనా క్వారంటైన్‌కు వెళ్లిపోయినట్టు చెప్పారు. -
బీ-టౌన్లో కరోనా కలకలం, కరోనా బారిన వరసగా సెలబ్రెటీలు, బీఎంసీ అలర్ట్
థర్డ్‌వేవ్‌పై ప్రజలంతా ఆందోళన చెందుతున్న తరుణంలో బాలీవుడ్లో కరోనా కలకలం రేపుతోంది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ విందు పార్టీ కొవిడ్ హాట్‌స్పాట్‌గా మారింది. కరణ్ హౌస్ పార్టీకి హాజరైన నలుగురు సెలబ్రిటీలకు వైరస్ పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. కే3జీ(K3G) సినిమాకు 20ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో కరణ్ జోహార్ డిసెంబర్ 8న తన ఇంట్లో డిన్నర్ పార్టీ ఇచ్చాడు. ఆ తెల్లారే నటుడు సౌహైల్ ఖాన్ భార్య సీమా ఖాన్‌కు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఇదే పార్టీకి హాజరైన కరీనా కపూర్‌ఖాన్, అమృతా అరోరా కూడా పరీక్షలు చేయించుకున్నారు. వారికి కూడా వైరస్ సోకినట్టు నిర్థారణ అయ్యింది. చదవండి: భార్యభర్తలుగా తొలిసారి మీడియా ముందుకు కత్రినా-విక్కీ, వీడియో వైరల్ వీరితోపాటు పార్టీలో పాల్గొన్న సంజయ్ కపూర్ భార్య మహీప్ కపూర్ కూడా వైరస్ బారిన పడ్డారు. కరణ్ నివాసంలో డిన్నర్ పార్టీకి హాజరైన వాళ్లలో అలియా భట్, కరిష్మా కపూర్, మలైకా అరోరా, అర్జున్‌కపూర్, డిజైనర్ మసాబా గుప్తా సహా పలువురు సెలబ్రిటీలు ఉన్నారు. దీంతో వీరు కూడా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ పార్టీ జరిగిన మరుసటి రోజే కరీనా కపూర్, అమృత అరోరా అనిల్ కపూర్ పెద్దకూతురు రియా కపూర్ నివాసంలో జరిగిన క్రిస్మస్ పార్టీలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రియా హౌస్ పార్టీకి హాజరైన సెలబ్రిటీలు కూడా సెల్ఫ్ ఐసోలేట్ అయినట్టు తెలుస్తోంది. అయితే కరణ్ జోహార్‌కు మాత్రం కొవిడ్ నెగెటివ్ వచ్చినట్టు సమాచారం. చదవండి: పార్టీలతో హల్చల్.. బీటౌన్‌లో కరో(రీ)నా టెన్షన్ ఇక బాలీవుడ్ సెలబ్రెటీలు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడటంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) అప్రమత్తమైంది. పాజిటివ్ వచ్చిన వారికి ఎవరెవరూ క్లోజ్‌గా కాంటాక్ట్స్ అయ్యారో వారిని వెంటనే కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని తెలిపింది. ఈ మేరకు కరీనా అపార్ట్మెంట్లో బీఎంసీ అధికారులు కరోనా పరీక్షలు చేస్తున్నారు. సైఫ్ అలీఖాన్, కరిష్మా కపూర్ సహా పలువురికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసినట్టు తెలిసింది. అలాగే కరణ్ జోహార్, కరీనా కపూర్, అమృతా అరోరా నివాసాలను బీఎంసీ సిబ్బంది శానిటైజ్ చేశారు. వాటిని కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటుచేసి పాజిటివ్ వచ్చిన వారిని ఎవరూ కాంటాక్ట్ అయ్యారో వారిని ట్రెసింగ్ చేసే పనిలో బీఎంసీ పడింది. -
పార్టీలతో హల్చల్.. బీటౌన్‌లో కరో(రీ)నా టెన్షన్
Kareena Kapoor And Amrita Arora Tested Covid Positive: హీరోయిన్ కరీనా కపూర్, నటి అమృతా అరోరా కరోనా బారిన పడ్డారు. గత కొన్ని రోజులుగా కరీనా, అమృత వరుసగా ముంబైలోని పాలు పార్టీలకు హాజరవుతున్నారు. అయితే కోవిడ్ నిబంధనలు మాత్రం పాటించలేదని తెలుస్తుంది. ఇటీవలె ముంబైలో అనిల్ కపూర్ కుమార్తె రియా కపూర్ నిర్వహించిన ఓ పార్టీకి సైతం వీరు హాజరయ్యారు. వీరితో పాటు కరిష్మా కపూర్, మలైకా అరోరా, మసాబా సహా పలువురు ఈ పార్టీకి అటెండ్ అయినట్లు సమాచారం. కాగా మలైకా అరోరాకు స్వయానా చెల్లెలే అమృతా అరోరా. కరీనాకు బీటౌన్‌లో మలైకా, అమృత బెస్ట్‌ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. ఇక కరీనా, అమృతా అరోరాలకు కరోనా పాజిటివ్ అని తేలడంతో గత కొన్ని రోజులుగా వీళ్లను కలిసిన వాళ్లంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) సూచించింది. -
నైటీపైనే బయటకొచ్చిన హీరోయిన్, ట్రోల్ చేస్తూ ఆడేసుకుంటున్న నెటిజన్లు
Netizens Trolls Kareena Kapoor Over Her Dressing: సెలబ్రిటీలు ఏం చేసిన అది వార్తల్లో నిలుస్తోంది. ఇక తారలు వారి తీరు, వస్త్రధారణపై సోషల్ మీడియాలో తరచూ ట్రోల్స్‌కు గురవుతారు. ఏ సందర్భంలో అయినా హీరోయిన్లు వస్త్రధారణ కాస్తా భిన్నంగా కనిపిస్తే చాలు ఇక వారిని ఆడేసుకుంటారు నెటిజన్లు. ఇప్పటికే జాన్వి కపూర్ తన యాటిటూడ్తో విమర్శలు ఎదుర్కొగా తాజాగా మరో స్టార్ హీరోయిన్ నెటజన్ల ట్రోల్స్‌కు బలైంది. ఎప్పుడూ ట్రెండీ లుక్‌తో అందరిని ఆకర్శించే కరీనా తాజాగా భర్త సైఫ్ అలీ ఖాన్‌తో బయటకు వచ్చిన ఆమె ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్ దర్శనమిచ్చింది. బ్లాక్ జీన్స్, నెక్లెస్ ఓపెన్ టాప్‌తో ఇలా కరీనాను చూసిన మీడియా తమ కెమెరాలకు పని చెప్పారు. చదవండి: ట్రైలర్ విడుదలపై క్లారిటీ ఇచ్చిన జక్కన్న, విడుదల తేదీ ప్రకటన ఇక ఫొటోలు బయటకు కావడంతో నెటిజన్లు కరీనాపై విమర్శలు గుప్పిస్తున్నారు. కొంతమంది ‘ఏంటి కరీనా నైటీతో బయటకి వచ్చావు’ అని, కొంతమంది ‘ఈ స్టార్స్ అంతా బాగా డబ్బున్న వాళ్ళు కానీ వారికి బట్టలు ఉండవు. ఇలా నైటీలు వేసుకొస్తారు’ అని, కొంతమంది ‘ఇంట్లో నైటీలు వేసుకోవట్లేదా ఇలా బయటకు నైటీలు వేసుకొచ్చావు’ అని కరీనాని ట్రోల్ చేస్తున్నారు. నైటీ వేసుకుని బయటకు వచ్చింది. ఈ దుస్తులతో ఆమెకు ఉన్న స్టైలిష్ బ్రాండ్ అనే ఇమేజ్ మొత్తం పోయింది. హే భగవాన్ ఇంకా ఏమేం చూడాల్సి వస్తుందో’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండిష: అత్యంత డేంజర్ లుక్‌లో అనసూయ.. భర్తనే చంపేస్తుందట, ఇదిగో ప్రూఫ్ View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
'లాల్ సింగ్ చద్దా' విడుదల మళ్లీ వాయిదా.. ఎప్పుడంటే..?
Aamir Khan Laal Sing Chaddha New Release Date Out: బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' ఇప్పుడు ప్రేమికుల దినోత్సవానికి బదులు ఏప్రిల్ 14, 2022న థియేటర్లలోకి రానుంది. ఈ విషయమై మేకర్స్ శనివారం ప్రకటించారు. ఈ చిత్రం టామ్ హాంక్స్ నటించిన 1994 హాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'ఫారెస్ట్ గంప్'కి రీమేక్. ఇంతకుముందు అమీర్‌తో కలిసి 'సీక్రెట్ సూపర్‌స్టార్' (2017) తీసిన అద్వైత్ చందన్ ఈ హిందీ వెర్షన్‌కు దర్శకత్వం వహించారు. ఈ సినిమా అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్‌లో బ్యానర్లో రానుంది. అమీర్ ఖాన్, కరీనా కపూర్‌తో ఉన్న కొత్త పోస్టర్‌ను ట్విటర్లో షేర్ చేసింది ప్రొడక్షన్ బ్యానర్. We are happy to share our new poster and our new release date :) #LaalSinghOnBaisakhi#AamirKhan #KareenaKapoorKhan #AdvaitChandan @atul_kulkarni @ipritamofficial @OfficialAMITABH #KiranRao @Viacom18Studios @chay_akkineni #MonaSingh #ManavVij #SatyajitPande #HemantiSarkar pic.twitter.com/VOz3RBjHZz — Aamir Khan Productions (@AKPPL_Official) November 20, 2021 'మా కొత్త పోస్టర్, మా కొత్త విడుదల తేదిని ప్రకటించడం మాకు సంతోషంగా ఉంది' అని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ ట్వీట్ చేసింది. కరోనా వైరస్ కారణంగా లాల్ సింగ్ చద్దా చాలా సార్లు వాయిదా పడింది. ఈ చిత్రం 2021 క్రిస్మస్కు విడుదల కావాల్సింది. అయితే కొవిడ్ వల్ల షూటింగ్ నిలిపివేయడంతో ఆలస్యమైంది. టీమ్ ప్రొడక్షన్ సెప్టెంబర్‌లో పూర్తైంది. విన్స్టన్ గ్రూమ్ 1986 నవల ఆధారంగా 'ఫారెస్ట్ గంప్' ని తెరకెక్కించారు. 'లాల్ సింగ్ చద్దా' సినిమాకు ఎరిక్ రోత్, రచయిత అతుల్ కులకర్ణి స్క్రీన్‌ప్లే అందించారు. ఈ చిత్రంలో నాగ చైతన్య, మోనా సింగ్ తదితరులు కూడా నటించారు. -
ప్రభాస్-సందీప్ వంగ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 25వ చిత్రం అర్జున్‌రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘స్పిరిట్’ అనే పేరును ఖరారు చేసి ఇటీవల అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు మేకర్స్. టీ సిరీస్, వంగా పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాయి. భారీ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా 8 భాషల్లో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతుండటం విశేషం. చదవండి: Prabhas25: 'అర్జున్‌రెడ్డి' డైరెక్టర్‌తోనే ప్రభాస్ 25వ చిత్రం ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ ‘బెబో’ కరీనా కపూర్ నటిస్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కరీనా ప్రభాస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోందట. తొలి చిత్రంలోనే బెబో నెగిటివ్ షేడ్‌లో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోందట. ఇందులో ఆమె లేడీ విలన్‌గా కనిపించనుందని చెబుతున్నారు. చదవండి: కోర్టును ఆశ్రయించిన సమంత ఈ చిత్రంలో హీరో పాత్రకు ధీటుగా శక్తివంతంగా కరీనా పాత్ర ఉండబోతుందట. కాగా ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీసు పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, చైనీస్, కొరియన్, జపాన్ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల కానుంది.ఇప్పటికే బాహుబలి చిత్రంలో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ ఈసారి పాన్ వరల్డ్ స్టార్‌గా మారనున్నారు. ఇలాంటి అరుదైన రికార్డ్‌ను సాధించిన తొలి తెలుగు హీరోగా ప్రభాస్ నిలవనున్నారు. చదవండి: ఘనంగా ముక్కు అవినాష్ పెళ్లి, ‘బ్లండర్ మిస్టేక్’ అంటూ వీడియో బయటికి! -
హీరోయిన్‌పై ట్రోలింగ్: 'వయసు ఎక్కువైంది, అంగీకరించండి'
సోషల్ మీడియా వచ్చాక ప్రశంసించడం, విమర్శించడం రెండూ ఈజీ అయ్యాయి. ఒకరిని మెచ్చుకోవాలన్నా, దుమ్మెత్తిపోయాలన్నా సోషల్ మీడియానే అస్త్రంగా వాడుతున్నారు. మరీ ముఖ్యంగా నచ్చిన సెలబ్రిటీలను ఆకాశానికెత్తేయడం లేదంటే వారిని ట్రోలింగ్ చేయడం సర్వసాధారాణమైపోయాయి. తాజాగా నెట్టింట్లో బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్‌ను ట్రోల్ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే... బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ అక్టోబర్ 10న లాక్మే ఫ్యాషన్ వీక్ గ్రాండ్ ఫినాలేలో పాల్గొని సందడి చేసింది. రెండో సంతానం పుట్టిన 7 నెలలకే ర్యాంప్ వాక్‌పై హొయలొలికించింది. గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన తెల్ల గౌనును ధరించి స్టేజీపై మెరిసిపోయింది. అయితే ఆమె వేసుకున్న డ్రెస్సు చాలామంది నెటిజన్లకు నచ్చలేదు. దీంతో సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. 'ముసలిదానివైపోయావు', 'మీకు వయసు ఎక్కువపైపోయింది, దాన్ని అంగీకరించండి', 'లావయ్యావు నాయనమ్మ', 'వయసు పైబడిన ఆంటీ' అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Lakmé Fashion Week (@lakmefashionwk) -
కరీనాకు ఏ విషయంలోనూ సలహాలు ఇవ్వను: సైఫ్
బాలీవుడ్‌లోని సెటబ్రిటీ కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్లు ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంటకి ఇద్దరు కుమారులు తైమూర్, జెహ్. సినిమాలతో ఇద్దరూ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితానికి సమయాన్ని కేటాయిస్తుంటారు. అయితే వ్యక్తిగత విషయాన్ని, ఫ్యామిలీ ఫొటోలను షేర్ చేస్తూ కరీనా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుండగా, సైఫ్ మాత్రం సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు. ఇటీవల సైఫ్ ఓ ఇంటర్వూలో కరీనా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండటం, పోస్టుల పెట్టడంపై హోస్ట్ అడగ్గా.. సైఫ్ దానికి ఇలా సమాధానం ఇచ్చాడు. ‘స్వచ్చమైన పెళ్లి బంధంలో ఒకరిని ఒకరు కంట్రోల్ చేసుకోవడం ఉండదు. ఇద్దరూ ఎవరికి నచ్చింది వారు చేయొచ్చు. కరీనా మల్టీ టాస్కర్. అందుకే తన ఏం చేయాలకుంటుందో అది చేస్తుంది. అందుకే నేను తనకు అంతగా సలహాలు ఇవ్వను. చదవండి: బిగ్‌బాస్‌లోకి సుశాంత్ ప్రేయసి?.. వామ్మో! వారానికి అన్ని లక్షలా.. ఒక్క సోషల్ మీడియా విషయంలోనే కాదు.. మామూలుగా విషయాల్లోనైనా బెబోకు సలహాలు ఇవ్వను. ఏం చేయాలో తనకి బాగా తెలుసు’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా కరీనా చివరిగా అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’లో నటించింది. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరపుకుంటుంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సైఫ్ ప్రసుత్తం ప్రభాస్ హీరోగా చేస్తున్న ‘ఆదిపురుష్’లో రావణ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: ఆ గాట్లు పెట్టినవి కాదు.. ఆ సినిమా సమయంలో నిజంగా అయ్యాయి: యంగ్ హీరో