
కరీనా కపూర్ రెండో బిడ్డకి జన్మనివ్వబోతున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే ఆమె ఈ తీపి వార్తను పంచుకున్నారు. వచ్చే ఏడాది మార్చి–ఏప్రిల్ మధ్యకాలంలో ఆమె బిడ్డకు జన్మనివ్వనున్నారు. అందుకే ‘లాల్‌సింగ్ చద్దా’ సినిమా టీమ్ ఓ నిర్ణయం తీసుకుందట. ఆమిర్ ఖాన్ సరసన కరీనా నటిస్తున్న చిత్రం ఇది. కరీనా శరీరాకృతిలో బాగా మార్పు వచ్చేలోపు ఆమె పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. దాదాపు 100 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉండటంతో సెప్టెంబర్ మొదటి వారంనుండే ఆరంభించాలనుకుంటున్నారని సమాచారం. అయినా నెలలు గడిచేకొద్దీ కరీనా బరువు పెరుగుతారు కాబట్టి, బేబీ బంప్ (పొట్ట ఎత్తుగా) కనబడకుండా వీఎఫ్‌ఎక్స్ టెక్నాలజీని వాడాలనుకుంటున్నారని టాక్. ప్రస్తుతం కరీనా చేతిలో ‘లాల్‌సింగ్ చద్దా’ చిత్రంతో పాటు ‘వీరే ది వెడ్డింగ్’ సీక్వెల్, ‘తక్త్’ కూడా ఉన్నాయి. మరి.. ఈ చిత్రాల షెడ్యూల్స్‌ని ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment