బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి (Saif Ali Khan Attack) ఘటనలో ఆయన సతీమణి, హీరోయిన్ కరీనా కపూర్ (Kareena Kapoor) స్టేట్‌మెంట్‌ను బాంద్రా పోలీసులు రికార్డు చేశారు. ఈ ఘటన గురించి కరీనా పోలీసులతో మాట్లాడుతూ.. దొంగతనానికి వచ్చిన వ్యక్తి ఎంతో ఆవేశంగా ఉన్నాడంది. అతడిని సైఫ్ అడ్డుకోవడంతో కోపంతో పలుమార్లు కత్తితో పొడిచాడని పేర్కొంది. తన నగలు బయటే ఉన్నప్పటికీ వాటిని తీసుకునేందుకు ప్రయత్నించలేదని తెలిపింది. ఈ దాడి తర్వాత సోదరి కరిష్మా వచ్చి తన ఇంటికి తీసుకెళ్లిందని వివరించింది.
ఏం జరిగిందంటే?
ముంబైలోని బాంద్రాలో నివాసముంటున్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గురువారం తెల్లవారుజామున ఓ దుండగుడు చోరీకి ప్రయత్నించాడు. సైఫ్ చిన్నకుమారుడు జెహ్ గదిలో నక్కిన అతడిని పనిమనిషి గుర్తించి కేకలు వేయడంతో సైఫ్ పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. దుండగుడిని అడ్డుకునే క్రమంలో అతడు విచక్షణారహితంగా సైఫ్‌ను కత్తితో పొడిచి మెట్లమార్గం గుండా పరారయ్యాడు.
సమయానికి కారు కూడా అందుబాటులో లేకపోవడంతో ఓ ఆటోలో సైఫ్ అలీఖాన్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడిని పరిశీలించిన వైద్యులు రెండు లోతైన కత్తిపోట్లు సహా మొత్తం ఆరు కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. వెన్నెముకలో 2.5 అంగుళాల కత్తి మొన విరిగినట్లు గుర్తించి ఆపరేషన్ ద్వారా తొలగించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉంది.
నిందితుడి కోసం గాలింపు
సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి ఘటనపై పోలీసులు 20 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలిస్తున్నారు. మొదట నిందితుడు దొరికాడని, అతడు దొంగతనం కోసమే నటుడి ఇంట్లోకి చొరబడినట్లు వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదని పోలీసులు స్పష్టతనిచ్చారు. దాడి జరగడానికి రెండు రోజుల క్రితం సైఫ్ ఇంట్లో పని చేసిన కార్పెంటర్‌ను విచారించి వదిలేశామని తెలిపారు. ఇక విచారణలో భాగంగా ఇప్పటికే 30 మంది స్టేట్‌మెంట్స్‌ను పోలీసులు రికార్డు చేశారు. శుక్రవారం ఒక్కరోజే 15 మందిని విచారించారు. శనివారం నాడు మధ్యప్రదేశ్‌లోని ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
సినిమా
సైఫ్ అలీఖాన్ హిందీలో అనేక సినిమాలు చేశాడు. హీరోగా, విలన్‌గా మెప్పించాడు. పలు సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించాడు. తెలుగులోనూ రెండు సినిమాలు చేశాడు. ప్రభాస్ 'ఆదిపురుష్'లో లంకేశ్‌గా నటించాడు. గతేడాది వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ 'దేవర మూవీ'లో విలన్‌గా మెప్పించాడు.
Comments
Please login to add a commentAdd a comment