Kareena Kapoor Khan
-
కత్తితో దాడి.. నా కుమారుడి మాటలకు కన్నీళ్లు వచ్చాయి: సైఫ్ అలీఖాన్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) దుండగుడి చేతిలో తీవ్రంగా గాయపడిన రోజు ఏం జరిగిందో మొదటిసారి ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. దొంగతనం కోసం వచ్చిన వ్యక్తితో తనను కత్తితో పొడిచిన సమయంలో తాను పెద్దగా కంగారుపడలేదని చెప్పారు. అయితే, కొంత సమయం తర్వాత ఎక్కువ నొప్పి రావడంతో ఆ గాయం తీవ్రత ఎంతో తెలిసింది. ఆ సమయంలో తన కుమారుడు తైమూర్ మాటలను సైఫ్ గుర్తు చేసుకున్నారు.'నాపై దాడి జరిగిన తర్వాత తీవ్రమైన నొప్పితో బాధపడ్డాను. నా వెన్నులో బలమైన కత్తితో దాడి చేశాడని తెలిసింది. ఆ సమయంలో కరీనా చాలా కంగారు పడింది. ఏం చేయాలో తనకు కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. మా కుటుంబ సభ్యలకు అందరికీ కాల్స్ చేస్తూ ఉంది. కానీ, అర్ధరాత్రి కావడంతో ఎవరూ రెస్పాన్స్ కావడం లేదు. అప్పుడు ఇద్దరం ఒకరినొకరం చూసుకున్నాం. వెంటనే ఆసుపత్రికి బయలుదేరాలని ఆమె పిచ్చిగా కాల్స్ చేస్తూ ఉంది. కరీనా పరిస్థితి గమనించే నేనే తనకు ధైర్యం చెప్పాను. నాకు ఏం కాదని తెలిపాను. ఆ సమయంలో తైమూర్ నా దగ్గరకు వచ్చి.. నాన్నా.. నువ్వు చనిపోతావా..? అని అడిగాడు. అప్పుడు నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. అలాంటిది ఏమీ జరగదు అమ్మ ఉంది కదా అని చెప్పాను. చికిత్స కోసం వెళ్తుండగా నేనూ వస్తానంటూ తైమూర్ కూడా ఆసుపత్రికి వచ్చాడు. ఆ సమయంలో నేను కూడా వాడిని తీసుకొని వెళ్లాలని అనుకున్నాను. నాకు ఏమైనా జరిగితే నా కుమారుడు నా పక్కనే ఉండాలని ఆ సమయంలో అనిపించింది.' అని ఆయన అన్నారు.ముంబై బాంద్రాలోని సైఫ్ అలీఖాన్ నివాసంలో జనవరి 16న తెల్లవారుజామున 2.30 గంటలకు ఆయనపై దాడి జరిగింది. దుండగుడు సైఫ్ చిన్న కుమారుడు జేహ్ గదిలోకి వెళ్లడం గమనించిన కేర్‌టేకర్ కేకలు వేయగా సైఫ్ అక్కడికి చేరుకున్నాడు. ఆ సమయంలో పెనుగులాట జరిగింది. ఈక్రమంలోనే సైఫ్ గాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న సైఫ్.. బిల్ ఎంతో తెలుసా..?
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) ఆసుపత్రి నుంచి నేడు డిశ్చార్జ్ కానున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నాడని లీలావతి ఆసుపత్రి(Lilavati Hospital) వైద్యులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 2 తర్వాత ఆయన డిశ్చార్జ్ అవుతారని వారు తెలిపారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయని తెలిపారు. దాడిలో భాగంగా సైఫ్ వెన్నెముకకు తీవ్రగాయం అయింది. దీంతో సర్జరీ చేసిన వైద్యులు వెన్నెముక నుంచి కత్తిని తొలగించారు.సైఫ్‌పై దాడి కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ప్రధాన నిందితుడైన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను విచారించిన పోలీసులు క్రైమ్‌సీన్ రీక్రియేషన్ కోసం నిందితుడిని సైఫ్ ఇంటి వద్దకు తీసుకెళ్లారు. నిందితుడి వేలిముద్రలను కూడా తీసుకున్నారు. ఫోరెన్సిక్ అధికారులు కూడా సైఫ్ ఇంటికి వెళ్లి దాడి జరిగిన ప్రదేశంలో నిందితుడి వేలిముద్రలు గుర్తించారు. ఇదే విషయాన్ని ఒక అధికారి కూడా ప్రకటించారు. ఇంట్లోని కిటికీలతో పాటు లోపలికి వచ్చేందుకు ఉపయోగించిన నిచ్చెనపై కూడా నిందితుడి వేలిముద్రలు ఉన్నాయన్నారు.(ఇదీ చదవండి: ప్రియురాలిని పెళ్లి చేసుకున్న ప్రముఖ దర్శకుడు)ఈ నెల 16న సైఫ్ ఇంటికి చోరీకి వెళ్లిన నిందితుడు మహ్మద్ షరీఫుల్ బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు ప్రకటించారు. దాడి తర్వాత తమ దేశానికి పారిపోయే ప్లాన్‌లో ఉండగా పట్టుకున్నట్లు వారు తెలిపారు. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో సైఫ్ చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సైఫ్ పూర్తి ఆసుపత్రి బిల్ రూ. 40 లక్షలు దాటినట్లు తెలుస్తోంది. అయితే, ఆయనకు ఇన్సూరెన్స్ ఉండటం వల్ల సదరు కంపెనీ వాళ్లు ఇప్పటి వరకు రూ.25 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది.సైఫ్‌పై దాడి జరిగిన సమయంలో అతన్ని ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయన కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ కూడా ఆ సమయంలో తండ్రితో పాటు ఉన్నాడు. అయితే, ఆటో డ్రైవర్ వారి నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని తెలిపారు. కానీ, సైఫ్‌ను రక్షించినందుకు అతనికి ముంబయిలోని ఓ సంస్థ రూ.11 వేల రివార్డ్ ప్రకటించింది. సైఫ్ నేడు డిశ్చార్జ్ అయిన తర్వాత తనకు ఏమైనా సాయం చేయవచ్చని తెలుస్తోంది. -
దయచేసి ఇలాంటివి ఆపండి.. కరీనా కపూర్ ఆవేదన
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటనలో ఆయన సతీమణి కరీనా కపూర్(Kareena Kapoor Khan) ఆవేదనతో ఒక పోస్ట్ చేశారు. ఈ ఘటనలో చాలామంది పూర్తి విషయాలు తెలుసుకోకుండానే అసత్యప్రచారాలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటన గురించి ప్రధాన మీడియాతో పాటు సోషల్‌మీడియాలో క్రియేట్ చేసిన వీడియోను ఓ బాలీవుడ్ నటుడు షేర్ చేయడంతో కరీనా తాజాగా రియాక్ట్ అయ్యారు.బాలీవుడ్ మీడియాలో సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) గురించి చాలా కథనాలతో పాటు పలు వీడియోలు ప్రసారం చేస్తున్నారు. కొందరైతే ఏకంగా సైఫ్ ఇంటి చుట్టూ నిత్యం కెమెరాలతో తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఆయన కుటుంబం గురించి ఉన్నవీలేనివి కల్పించి ప్రచారాలు చేస్తున్నారు. తన కుమారులు తైమూర్, జెహ్ కోసం ఆయన కొత్త బొమ్మలు తెచ్చారని, చాలా సంతోషంగా పిల్లలతో సైఫ్ అలీఖాన్ ఆడుకుంటున్న ఫోటోలు ఇవిగో అంటూ షేర్ చేశారు. (ఇదీ చదవండి: త్రిష,టొవినో యాక్షన్ థ్రిల్లర్ సినిమా తెలుగులో విడుదల)ఈ వార్తలు చూసిన కరీనా కపూర్ ఆవేదనతో ఒక పోస్ట్ చేసింది. 'దయచేసి ఇలాంటివి ఆపండి. మమ్మల్ని వదిలేయండి' అంటూ వేడుకుంది. అయితే, కొన్ని క్షణాల్లోనే ఆమె దాన్ని డిలీట్ చేయడం గమనార్హం. ఇప్పటికే మీడియా వర్గాలు, ఫ్రీలాన్సర్లు సంయమనం పాటించాలని కరీనా కోరింది. తమ ప్రకటన లేకుండా ఊహాజనిత కథనాలకు దూరంగా ఉండాలని ఆమె కోరింది. ప్రస్తుతం తామె ఎంతో కఠినమైన రోజులను ఎదుర్కొంటున్నామని పరిస్థితిని అర్థం చేసుకుంటారని రిక్వెస్ట్ చేసింది. ఆ ఘటన నుంచి తేరుకునేందుకు వీలుగా తమ కుటుంబానికి కొంత సమయం ఇవ్వాలని ఆమె కోరింది.ఈ నెల 16న సైఫ్ ఇంటికి చోరీకి వెళ్లిన షరీఫుల్ ఇస్లాం షెహ్జాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫరీగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన అతను తమ దేశానికి పారిపోయే ప్లాన్‌లో ఉండగా పోలీసులు పట్టుకున్నారు. దాడిలో గాయపడిన సైఫ్ స్వల్ప శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న విషయం తెల్సిందే. -
సైఫ్‌ను ఆవేశంతో పొడిచాడు.. నా నగల జోలికి వెళ్లలేదు: కరీనా
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి (Saif Ali Khan Attack) ఘటనలో ఆయన సతీమణి, హీరోయిన్ కరీనా కపూర్ (Kareena Kapoor) స్టేట్మెంట్ను బాంద్రా పోలీసులు రికార్డు చేశారు. ఈ ఘటన గురించి కరీనా పోలీసులతో మాట్లాడుతూ.. దొంగతనానికి వచ్చిన వ్యక్తి ఎంతో ఆవేశంగా ఉన్నాడంది. అతడిని సైఫ్ అడ్డుకోవడంతో కోపంతో పలుమార్లు కత్తితో పొడిచాడని పేర్కొంది. తన నగలు బయటే ఉన్నప్పటికీ వాటిని తీసుకునేందుకు ప్రయత్నించలేదని తెలిపింది. ఈ దాడి తర్వాత సోదరి కరిష్మా వచ్చి తన ఇంటికి తీసుకెళ్లిందని వివరించింది.ఏం జరిగిందంటే? ముంబైలోని బాంద్రాలో నివాసముంటున్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గురువారం తెల్లవారుజామున ఓ దుండగుడు చోరీకి ప్రయత్నించాడు. సైఫ్ చిన్నకుమారుడు జెహ్ గదిలో నక్కిన అతడిని పనిమనిషి గుర్తించి కేకలు వేయడంతో సైఫ్ పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. దుండగుడిని అడ్డుకునే క్రమంలో అతడు విచక్షణారహితంగా సైఫ్‌ను కత్తితో పొడిచి మెట్లమార్గం గుండా పరారయ్యాడు.సమయానికి కారు కూడా అందుబాటులో లేకపోవడంతో ఓ ఆటోలో సైఫ్ అలీఖాన్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడిని పరిశీలించిన వైద్యులు రెండు లోతైన కత్తిపోట్లు సహా మొత్తం ఆరు కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. వెన్నెముకలో 2.5 అంగుళాల కత్తి మొన విరిగినట్లు గుర్తించి ఆపరేషన్ ద్వారా తొలగించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉంది.నిందితుడి కోసం గాలింపుసైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి ఘటనపై పోలీసులు 20 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలిస్తున్నారు. మొదట నిందితుడు దొరికాడని, అతడు దొంగతనం కోసమే నటుడి ఇంట్లోకి చొరబడినట్లు వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదని పోలీసులు స్పష్టతనిచ్చారు. దాడి జరగడానికి రెండు రోజుల క్రితం సైఫ్ ఇంట్లో పని చేసిన కార్పెంటర్‌ను విచారించి వదిలేశామని తెలిపారు. ఇక విచారణలో భాగంగా ఇప్పటికే 30 మంది స్టేట్మెంట్స్ను పోలీసులు రికార్డు చేశారు. శుక్రవారం ఒక్కరోజే 15 మందిని విచారించారు. శనివారం నాడు మధ్యప్రదేశ్‌లోని ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.సినిమాసైఫ్ అలీఖాన్ హిందీలో అనేక సినిమాలు చేశాడు. హీరోగా, విలన్‌గా మెప్పించాడు. పలు సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించాడు. తెలుగులోనూ రెండు సినిమాలు చేశాడు. ప్రభాస్ 'ఆదిపురుష్'లో లంకేశ్‌గా నటించాడు. గతేడాది వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ 'దేవర మూవీ'లో విలన్‌గా మెప్పించాడు.చదవండి: Saif Ali Khan: హైప్రొఫైల్ కేసులో ఇంత అలసత్వమా? -
ఓటీటీలో సడన్ సర్ప్రైజ్ 'సింగం అగైన్' తెలుగు వర్షన్ స్ట్రీమింగ్
బాలీవుడ్ భారీ యాక్షన్ సినిమా 'సింగం అగైన్'(Singham Again). ఇది సింగం మూవీ బ్లాక్‌బస్టర్ సిరీస్‌లో మూడో భాగంగా గతేడాదిలో విడుదలైంది. భారీ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం ఇప్పటికే ఓటీటీలో హిందీ వర్షన్ రన్ అవుతుంది. అయితే, తాజాగా తెలుగు వర్షన్ కూడా సడెన్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అజయ్ దేవ్‌గణ్(Ajay Devgn), అక్షయ్ కుమార్(Akshay Kumar), రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్, దీపికా పదుకొణె, అర్జున్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 2024 నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సింగం అగైన్ దాదాపు రూ.372 కోట్లు రాబట్టింది.సింగమ్, సింగమ్ రిటర్న్స్, సింబా, సూర్యవన్షీ వంటి పోలీస్ కాప్ చిత్రాలతో దర్శకుడు రోహిత్‌శెట్టి ( Rohit Shetty) హిట్స్ కొట్టాడు. ఇప్పుడు అదే ఊపులో సింగం అగైన్ తెరకెక్కించాడు. అయితే, ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో కూడా మంచి ఆదరణ లభించింది. సడెన్‌గా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగుతో పాటు తమిళ్ వర్షన్‌ను మేకర్స్ విడుదల చేశారు. 2011లో సింగం సినిమా రాగా దానికి సీక్వెల్‌గా 2014లో సింగం రిటర్న్స్ వచ్చింది. దశాబ్దకాలం తర్వాత దీనికి కొనసాగింపుగా సింగం అగైన్ తెరకెక్కించారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రవి బర్సూర్,థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ వర్ధంతి.. ఘాట్ వద్ద జూ. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళి)బాలీవుడ్ అగ్ర దర్శకుడు రోహిత్ శెట్టి... కాప్ యూనివర్స్‌లో పోలీసు బ్యాక్‌డ్రాప్ చిత్రాలను తెరకెక్కించాలంటే ఆయన తర్వాతే ఎవరైనా అనే ట్యాగ్ ఉంది. ఈ క్రమంలో ఆయన నుంచి వచ్చిన సింగమ్, సింగమ్ రిటర్న్స్, సింబా, సూర్యవన్షీ వంటి చిత్రాలే అని చెప్పవచ్చు. తన చిత్రాలలోని పాత్రలకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ‘సింగమ్ అగైన్’లో దీపికా పదుకొణెని (Deepika Padukone) డి.సి.పి శక్తి శెట్టిగా అతిథి పాత్రలో ఆయన చూపించారు. కానీ లేడీ సింగమ్‌తో పూర్తిస్థాయి ప్రాధాన్య ఉన్న ఒక చిత్రం చేయాలనే ఆలోచన ఉన్నట్లు రోహిత్ చెప్పారు. చాలా రోజులుగా ఇదే విషయంపై ఆయన పలు వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే, అది పట్టాలెక్కడం లేదు. కానీ, సింగం అగైన్ విడుదల తర్వాత దీపిక పదుకొణెతో లేడీ సింగమ్ తరహా సినిమాకచ్చితంగా ఉంటుందన క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఆ కథకు సంబంధించిన బలమైన ఆలోచన ఉందని పేర్కొన్నారు. కానీ దాన్ని స్క్రిప్ట్‌గా మార్చడానికే కుదర లేదని చెప్పారు. ఏది ఏమైనా లేడీ సింగమ్ సినిమా అయితే కచ్చితంగా ఉంటుందని చెప్పడంతో ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. -
రాజ్ కపూర్ 100వ జన్మదినోత్సవం కార్యక్రమంలో బాలీవుడ్ తారలు సందడి (ఫొటోలు)
-
బాలీవుడ్ హీరోయిన్ ఫ్యాషన్ లుక్ : నెక్ట్స్ లెవల్ అంతే! (ఫోటోలు)
-
అవార్డ్స్ వేడుక కోసం చీర కట్టిన స్టార్ హీరోయిన్.. ప్రెగ్నెంటా అంటూ కామెంట్లు
-
ఈ వయసులో షార్ట్స్ ఎందుకు?.. సీనియర్ నటి అదిరిపోయే సమాధానం!
బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా పేరు అందరికీ పరిచయమే. గతేడాది లస్ట్ స్టోరీస్-2తో అలరించిన నీనా.. తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో కనిపించింది. మలయాళంలో తెరకెక్కించిన 1000 బేబీస్ సిరిస్‌లో నటించింది. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.అయితే ఇటీవల ఆమె టాక్ షోలో పాల్గొన్నారు. కరీనా కపూర్ ఖాన్ చాట్ షో రాబోయే ఎపిసోడ్లో కనిపించనుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో ఈ వయసులో మీరు ఎందుకు షార్ట్స్ వేసుకుంటారని చాలామంది అడుగుతున్నారని కరీనా ప్రశ్నించింది. దీనికి నీనా గుప్తా స్పందిస్తూ.. మీ నాన్న డబ్బులతో అయితే వేసుకోవడం లేదు కదా? అంటూ ఘాటుగా సమాధానమిచ్చింది. ఈ షోకు సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ త్వరలోనే ప్రసారం కానుంది. కాగా.. నీనా గుప్తా ఇటీవలే ఉంచాయి మూవీలో తన నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది. -
హీరోయిన్ కరీనా కపూర్ పై సీరియస్ !..నోటీసులు జారీ చేసిన కోర్టు..
-
ఎప్పుడూ పనీపనీ.. మాతో ఉండవా? అని నా కుమారుడు నిలదీశాడు
హీరోయిన్ కరీనా కపూర్ ఇప్పుడు యునిసెఫ్ (యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్) జాతీయ బ్రాండ్ అంబాసిడర్. ఈ అరుదైన ఘనత అందుకున్న కరీనా తాజాగా ఢిల్లీలోని ఈవెంట్లో పిల్లల గురించి మాట్లాడింది. 'పిల్లలు తండ్రి గురించే కాదు తల్లి చేసే పని గురించి కూడా ఆలోచిస్తారు. నీతో ఉండాలనుందమ్మాఅంతేకాదు అమ్మ ఎప్పుడూ ఏదో ఒక పనితో బిజీగా ఉంటోందని ఒకింత గౌరవమిస్తారు. ఈ రోజు నా పిల్లలకు హాలీడే.. నేను కూడా వారితో కలిసుండాలని కోరుకున్నారు. కానీ నాకు పనుందని చెప్పి వచ్చేశాను. పెద్దబ్బాయి తైమూర్ అయితే.. నువ్వెప్పుడూ పనీపనీ అంటూ ఢిల్లీ, దుబాయ్ వెళ్తూ ఉంటావు.. నాకు నీతో ఉండాలనుందమ్మా అన్నాడు. మనసు చివుక్కుమంది. పని కూడా ముఖ్యమైనదే కాబట్టి వెళ్లక తప్పడం లేదని చెప్పాను. మాటిచ్చానుత్వరగా వచ్చేస్తానని, ఎక్కువ సమయం తనతో గడుపుతానని మాటిచ్చాను. అది నెరవేరుస్తాను కూడా.. అందుకే పిల్లలు వాళ్లను నిర్లక్ష్యం చేసినట్లుగా భావించరు. పేరెంట్స్ ఇద్దరూ వర్క్ చేసుకుని ఇంటికి వచ్చేస్తారని తైమూర్ అర్థం చేసుకుంటాడు. అలాగే పేరెంట్స్ నుంచే కొన్ని లక్షణాలు నేర్చుకుంటారు. చివగా సూపర్ హిట్ మూవీలో..సైఫ్ ఎప్పుడూ పిల్లల ముందు మనం ప్రేమగా, ఆప్యాయంగా మెదలాలని, అంతే ప్రేమగా మాట్లాడాలని చెప్తుంటాడు. మనల్ని చూసే వాళ్లు నేర్చుకుంటారన్నాడు. అందుకే మాలాగే నా పిల్లలిద్దరు కూడా ఎంతో ఆప్యాయంగా, గౌరవంగా మెదులుతారు అని చెప్పుకొచ్చింది. కరీనా చివరగా క్రూ సినిమాలో కనిపించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.చదవండి: 'హీరోయిన్' సెట్లో అదృశ్యం.. స్నేహితులే శరీరాన్ని ముక్కలు చేసి..! -
పైజామా పార్టీలో కరీనా కపూర్ ధరించి డ్రెస్ ధర వింటే..నోరెళ్లబెట్టాల్సిందే
బాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ గా ఒకప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న వారిలో కరీనా కపూర్ ఒకరు. 42 ఏళ్ళ వయసులో ఉన్నా కూడా ఇంకా తన ఫిట్నెస్ తో ఆశ్చర్యపరిస్తూనే ఉంటుంది. తన అందంతో ఎప్పటికప్పుడు ఫాలోవర్స్‌ను ఆకట్టుకునేలా ఫొటోలను షేర్ చేస్తుంటుంది. ఇక ఆమె వ్యక్తిగత జీవితానికి వస్తే..సైఫ్ అలీ ఖాన్ని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లకు జన్మనిచ్చింది. అయినప్పటికి.. కుర్ర హీరోయిన్లకు తీసుపోని విధంగా గ్లామరస్ లుక్‌ని మెయింటెయిన్ చేయడం విశేషం. ఇక ఆమె నటించిన గర్ల్స్ గ్యాంగ్ ఆన్ గర్ల్‌ఫ్రెండ్స్ మూవీ మంచి సక్సెస్‌ని అందుకుని కరీనా కపూర్‌కి మంచి పేరుని తెచ్చిపెట్టింది. ఈ సినిమా సక్సెస్‌తో ఆమె ఖాతాలో మరో బ్లాక్ బాస్టర్ మూవీగా చేరడం విశేషం. ఈ నేపథ్యంలో కరీనా కపూర్ తన మూవీ సిబ్బందితో మూవీ సక్సెస్‌ని జరుపుకుంది. అందుకోసం జరిగిన పైజామా పార్టీలో కరీనా ప్రసిద్ధ కఫ్తాన్ గర్ల్ ఫర్ లైఫ్ బ్రాండ్‌డ్ పైజామాలో మెరిసింది. రాత్రి సమయంలో ధరించే సౌకర్యవంతమైన పైజామా ఇది. అందులో ఆమె ముఖానికి మేకప్ లేకుండా నేచురల్‌గా, వదులుగా ఉన్న జుట్టుతో ఆకర్షించింది. ఈ పైజామాలో ఆమె లుక్ అత్యంత నేచురల్‌గా మతిపోగొట్టేలా ఉంది. ఆమె తోపాటు కరిష్మా కపూర్, మలైకా అరోరా, అమృతా అరోరా మరియు మాలికా భట్లు కూడా తమదైన డిజైన్ వేర్లలో సందడి చేశారు. కానీ అంతమంది అందాల భామల్లో కరీనా దుస్తులు హైలెట్‌గా నిలవడమే గాక ప్రధాన ఆకర్షణగా ఆమె లుక్ కనిపించింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక కరీనా ధరించిన ఆ డ్రెస్ ధర ఏకంగా రూ. 1,78,006 పలుకుతుందట. ఈ డిజైన్వేర్ని ప్రింటెడ్ సిల్క్ క్రేప్ డి చైన్ కఫ్తాన్ అని పిలుస్తారట. నైట్ టైంలో సౌకర్యవంతంగా ధరించే పైజామా అంత ఖరీదా?.. అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయినా కరీనా అంటే ఆ మాత్రం రేంజ్లో ధర ఉండాల్సిందే అని మరి కొందరూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Karisma Kapoor (@therealkarismakapoor) (చదవండి: ఐశ్వర్య అందమంతా చీరలోనే.. ధరెంతో తెలుసా?) -
విమానంలో చోరీ
టబు, కరీనా కపూర్, కృతీసనన్ ప్రధాన పాత్రల్లో, దిల్జీత్ సింగ్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ది క్రూ’. కార్పొరేట్ ఏవియేషన్ బిజినెస్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో టబు, కరీనా, కృతీ ఎయిర్‌హోస్టెస్‌గా నటించారు. ఓ విమానం హైజాకింగ్, దొంగతనం నేపథ్యంలో ‘ది క్రూ’ సినిమా కథనం ఉంటుందని బీ టౌన్ టాక్ . ఇక బాలీవుడ్లో ‘లూట్కేస్’ సినిమా తీసిన రాజేష్ కృష్ణన్ ఈ సినిమాకు దర్శకుడు. ‘వీరే ది వెడ్డింగ్ (2018)’, ‘థ్యాంక్యూ ఫర్ కమింగ్(2023)’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ నిర్మించిన రేఖా కపూర్, ఏక్తా కపూర్ ‘ది క్రూ’ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ సినిమాలోని ప్రధాన తారాగణం అయిన టబు, కరీనా, కృతీసనన్ల కొత్త పోస్టర్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. తొలుత ఈ సినిమాను మార్చి 22న రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత మార్చి 29కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. -
మీ సవతి కూతురితో నటిస్తారా?.. కరీనా సమాధానం ఇదే!
బాలీవుడ్ భామ కరీనాకపూర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవలే బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ షోలో ఆమె పాల్గొంది. మరో స్టార్ హీరోయిన్ ఆలియా భట్‌తో కలిసి హాజరైంది. ఈ సందర్భంగా కరణ్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ముఖ్యంగా తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకుంది. దక్షిణాది స్టార్ హీరోతో నటించాలని ఉందంటూ తన మనసులోని మాటను బయటకు పెట్టేసింది ముద్దుగుమ్మ. సారా అలీఖాన్ (కరీనా భర్త, నటుడు సైఫ్ అలీఖాన్ మొదటి భార్య కుమార్తె)కు తల్లిగా నటించే అవకాశం వస్తే నటిస్తావా? అంటూ కరణ్ జోహార్ ప్రశ్నించారు. దీనికి కరీనా స్పందిస్తూ నేను ముందుగా నటిని.. అన్ని వయసుల వారితో నటించగలను. ఎప్పుడైనా సారాకు తల్లిగా నటించే అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తా' అని తెలిపింది. సారా అలీ ఖాన్.. సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య కుమార్తె. కరీనాతో పెళ్లికి ముందే సైఫ్ అమృతా సింగ్‌ను వివాహమాడారు. ఆమెతో 2004లో విడిపోయారు. సైఫ్, అమృతలకు సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ జన్మించారు. ఆ తర్వాత మీరు సౌత్‌లో ఏ హీరోతో నటించాలని కోరుకుంటున్నారు? అని కరణ్ మరో ప్రశ్న వేశారు. వీరిలో ప్రభాస్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, యశ్‌లో ఎవరితో ఎంచుకుంటారు? అని ప్రశ్నించారు. దీనిపై స్పందిస్తూ దక్షిణాదికి చెందిన కేజీఎఫ్ హీరో యశ్ యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. ఆయన పక్కన నటించాలని ఉంది. కేజీయఫ్ సినిమా చూశా. చాలా బాగుంది.' అని చెప్పారు. అయితే గతంలో కరీనా తాను సినిమాలు చూడనని.. రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీని కూడా అందుకే చూడలేదని కరీనా చెప్పింది. కేజీఎఫ్ సినిమా చూశానని చెప్పడంతో కరణ్ షాక్ అయ్యాడు. కాగా.. అక్టోబర్ 2012లో కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు తైమూర్ అలీ ఖాన్, జహంగీర్ అలీ ఖాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఏడాది కరీనా జానే జాన్‌తో ఓటీటీలో అరంగేట్రం చేసింది. సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 21న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ప్రస్తుతం కరీనా ది క్రూని అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ మార్చి 22, 2024న రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) -
స్టన్నింగ్ డ్రెస్‌తో మెస్మరైజ్ చేసిందిగా: ధరెంతో తెలిస్తే ఔరా అంటారు!
బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ గ్లామర్ ప్రపంచంలో తన స్టైల్‌ను చాటుకుంటూనే ఉంటుంది. చాలా క్యాజువల్‌గా, ఎలాంటి మేకప్ లేకుండా కూడా తన స్టన్నింగ్ లుక్స్‌తో అభిమానులను మెస్మరైజ్ చేయడంలో తగ్గేదేలే అన్నట్టు ఉంటుంది. కేవలం స్టైలిష్‌గా ఉండటమే కాదు అప్ టూ మార్క్‌గా తనకంటూ ఒక ట్రెండ్ క్రియేట్ చేసుకుంటుంది. బ్లాక్ కలర్స్ అండ్ ప్రింట్స్ ఇష్టపడే కరీనా ఇటీవలి ఔటింగ్‌లో సమ్మర్‌కు తగ్గినట్టు ప్రింటెడ్ ఓవర్సైజ్డ్ జిమ్మెర్మాన్ కో-ఆర్డ్ సెట్‌తో మెరిసింది. ఇలా స్పెషల్ లుక్‌లో అలరించిన కరీనా వేసుకున్న డ్రెస్ ఎంత అని ఇంటర్నెట్లో వెదికిన ఫ్యాన్స్ ఔరా అంటున్నారు. ఇంతకీ దీని ధర ఎంతంటే అక్షరాలు 75వేల రూపాయలు. ప్రింటెడ్ సిల్క్ షర్ట్ , ప్యాచ్‌వర్క్‌తో కూడిన వైబ్రెంట్ కలర్స్ వైలెట్, పింక్, గ్రీన్ పీచ్ రంగులలో పలాజోను ధరించింది కరీనా.దీనికి మ్యాచింగ్‌గా ఆస్ట్రేలియన్ ఫ్యాషన్ లేబుల్ జిమ్మెర్మాన్ చెందిన సిల్క్ కో-ఆర్డ్ సెట్లో ఫ్లవర్ పైస్లీ ప్రింట్ టాప్, ఏవియేటర్-శైలి సన్ గ్లాసెస్ ఆమె లుక్ మరింత ఎలివేట్ చేసింది. కరీనా కపూర్ ఖాన్ స్టైలిష్ ఔటింగ్స్ గత ఏడాది సెప్టెంబరులో తన 42వ పుట్టినరోజు సందర్భంగా, కరీనా కపూర్ సెక్సీ జిమ్మెర్మాన్ ర్యాప్ డ్రెస్‌లో ఆకట్టుకుంది. రూ. 59,999 విలువైన ఈ ర్యాప్ డ్రెస్‌కు తోడు మినీ బ్లాక్ బకెట్ బ్యాగ్‌తో స్టైలిష్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. (రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు) -
బుక్ లాంచ్ ఈవెంట్లో సందడి చేసిన సైఫ్ అలీఖాన్ దంపతులు
-
తెరపై గర్బిణీలుగా మెప్పించిన నటీమణులు వీళ్లే..
Top 5 Actresses Who Played Pregnant Women Role: ప్రయోగాత్మక పాత్రల్లో నటించేందుకు బాలీవుడ్ హీరోయిన్స్ ఎప్పుడూ ముందుంటారు. పలు ప్రయోగాత్మక పాత్రల్లో నటిస్తూ బీటౌన్ నటీమణులు తమ సొంత బ్యాంకింగ్‌ను ఏర్పర్చుకుంటున్నారు. మహిళా ప్రాధాన్యత చిత్రాల నుంచి బోల్డ్ క్యారెక్టర్ల వరకు పేరు తెచ్చుకుంటున్నారు. సినిమాల్లో కేవలం ఒక భాగం, సహాయక పాత్రలకు పరిమితం కాకుండా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా చాలా మంది నటీమణులు తల్లి పాత్రను పోషించారు. ఏ సంకోచం లేకుండా గర్భిణీ పాత్రలకు సైతం మొగ్గు చూపారు. ఈ గర్భిణీ స్త్రీలుగా తెరపై నటించిన బాలీవుడ్ నటీమణులు ఎవరెవరో ఓసారి చూద్దామా ! 1. నుష్రత్ భరుచ్చా (ఛోరీ) హిందీలో వస్తున్న హార్రర్ మూవీ 'ఛోరీ'లో నుష్రత్ భరుచ్చా గర్భిణీగా నటించారు. ఈ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేందుకు ఎంతో కష్టపడ్డారు. సినిమా షూటింగ్‌కు సుమారు 25 రోజుల ముందు 'గర్భిణీ బాడీసూట్'ను ధరించడం ప్రారంభించారు. ఈ విషయంపై ఆమె 'ఇప్పుడు నిజ జీవితంలో నేను గర్భివతిని కాలేను. కాబట్టి, ఒక బిడ్డను మోసే స్త్రీ ఎలా ఉంటుంది. ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఏం అనుభవిస్తుందో తెలుసుకోడానికే ఆ బాడీసూట్‌ను తయారు చేసుకున్నాను. గర్భిణీలకు వచ్చే సమస్యలను తెలుసుకోడానికి సినిమా షూటింగ్ ప్రారంభానికి 20-25 రోజుల ముందు ఆ బాడీసూట్‌ను ధరించాను. దాంతోనే తినడం, పడుకోవడం, బాత్రూమ్కు వెళ్లడం, చుట్టూ తిరగడం చేశాను.' అని తెలిపారు. 2. విద్యా బాలన్ (కహానీ) భారతీయ చలనచిత్ర రంగంలో మహిళల చిత్రీకరణలో మార్పు తీసుకురావడానికి పేరుగాంచిన నటి విద్యా బాలన్. 'కహానీ' చిత్రంలో గర్భిణీగా నటించి.. అందరి మెప్పు పొందారు. ఇందులో ప్రొస్తెటిక్ బేబీ బంప్‌ను ధరించి నటించారు విద్యా బాలన్. ఆమె ఎంతో చక్కగా, పరిపూర్ణతో ఆ పాత్రను పోషించారు. ప్రేక్షకులను కంటతడి పెట్టించి, విమర్శకుల ప్రశంసలు పొందారు. ప్రజల నుంచి మంచి ఆదరణ కూడా పొందారు. దీనికి రీమెక్‌గా తెలుగులో నయనతార హీరోయిన్గా 'అనామిక' రూపొందించారు. కానీ అందులో ఆమెను గర్భిణీ పాత్రలో చేయలేదు. 3. నీనా గుప్తా (బధాయి హో) 2018లో నటి నీనా గుప్తా, అమిత్ శర్మతో కలిసి 'బధాయి హో' సినిమాలో యాక్ట్ చేశారు. ఈ చిత్రంలో ఆమె 50 ఏళ్ల గర్భిణీ పాత్రను పోషించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాల్లో ఒకటిగా మంచి గుర్తింపు వచ్చింది ఈ సినిమాకు. 'పూర్తి వినోదాత్మకంగా అత్యంత ప్రజాధారణ పొందిన ఉత్తమ చిత్రం' విభాగంలో జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. 4. కరీనా కపూర్ ఖాన్ (గుడ్ న్యూస్) గుడ్ న్యూస్ సినిమాలో దీప్తి బాత్రాగా కరీనా కపూర్ పాత్ర 21వ శతాబ్దపు మహిళలకు చాలా దగ్గరగా ఉంటుంది. ఆమె ఒక స్వతంత్ర, స్వయం సమృద్ధి గల వ్యక్తి పాత్రను పోషించారు. ఆమె కూడా బిడ్డను కలిగి ఉండాలని కోరుకునే అమ్మాయి కథ. తెరపై గర్భిణీ స్త్రీ పాత్రను వివరిస్తూ, గర్భధారణ సమయంలో స్త్రీ పడే కష్టాలు, ప్రభావాలు తెలిసేలా చక్కగా నటించారు. అందులో కియారా అద్వానీ కూడా గర్భిణీ పాత్రలో కనిపించారు. 5. కృతి సనన్ (మిమి) 'మిమి' చిత్రంలో కృతి సనన్ ఒక సరోగసి తల్లి పాత్రలో నటించారు. ఈ పాత్రతో ఆమె నటనకు మంచి బ్రేక్ వచ్చింది. ఎంతో పరిణితీ ఉన్న నటిగా ఆమె నిరూపించుకుంది. ఆ పాత్ర కోసం కృతి సనన్ సుమారు 15 కిలోల బరువు పెరగాల్సి వచ్చింది. -
ట్రోలింగ్‌పై కరీనా మండిపాటు
బాలీవుడ్ జంట కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ ఎక్కువగా కాంట్రవర్సీస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న విషయం తెలిసిందే. వివాహం నుంచి సంతానం వరకూ వ్యక్తిగత జీవితంలో ‘సైఫీనా’గా గుర్తింపు పొందిన ఈ దంపతులు తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాలకు కేంద్రబిందువుగా మారాయి. తాజాగా ఈ కపుల్‌కి పుట్టిన రెండో సంతానానికి సంబంధించి కూడా నెట్టిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. దీంతో పిల్లలకు పేర్లు పెట్టే హక్కు తల్లిదండ్రులకి మాత్రమే ఉంటుందని కరీనా సోషల్ మీడియా వేదికగా మండిపడింది కరీనా. ఈ జంటకు 2016లో ఓ కుమారుడు జన్మించగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో కుమారుడు పుట్టాడు. అయితే మొదటి సంతానాకి ‘తైమూర్ అలీఖాన్’ అని పెట్టగా వివాదాలకు కారణమయినా విషయం తెలిసిందే. అది 1398లో భారతదేశంపై దండెత్తిన పర్షియన్ చక్రవర్తి తైమూర్‌ని గుర్తు చేస్తోందని నెటిజన్లు అప్పట్లో విమర్శలు చేశారు. కాగా రెండో కుమారుడికి ‘జహంగీర్ అలీఖాన్’ అని పెట్టారు. అదీసైతం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. దీంతో సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. దీంతో కాంట్రవర్సీ ఎందుకని ‘సైఫీనా’ జంట బాబు పేరు ‘జెహ్’గా మార్చారు. దీనిపై స్పందిస్తూ కరీనా ఇన్‌స్టాలో రెండో కుమారుడితో ఉన్న ఫోటోని తాజాగా పోస్ట్ చేసింది. ‘పిల్లలను కనిపెంచే తల్లిదండ్రులకి మాత్రమే వారి జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. మరెవరీకి ఉండదు. ఇతర కుటుంబ సభ్యులకి కూడా లేదు. అందరూ దీన్ని గుర్తుంచుకోవాలని’ అందులో రాసుకొచ్చింది. అంతేకాకుండా ఇటీవల ఓ ఇంటర్వూలో ట్రోల్‌పై స్పందించిన కరీనా మాకు నచ్చిన పేర్లను, బావుంటాయని పిల్లలకి పెట్టామని వెల్లడించింది. అంతేకానీ మరేంకాదని తెలిపింది. పిల్లలని భయంకరంగా ఇలా ఎలా ట్రోల్ చేస్తారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంలో సైఫ్ అలీఖాన్ సోదరి సభా పటౌడి కరీనాకు మద్దతుగా నిలిచింది. View this post on Instagram A post shared by Saba (@sabapataudi) -
వివాదంలో కరీనా కపూర్ పుస్తకం, నటిపై ఫిర్యాదు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె తన ప్రగ్నెన్సీ అనుభవాన్ని పుస్తకం రూపంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ బుక్కు ఆమె ‘కరీనా కపూర్ ఖాన్స్ ప్రగ్నెన్సీ బైబిల్’ అనే టైటిల్‌తో విడుదల చేసింది. దీంతో మహారాష్ట్రకు చెందిన పలు క్రిస్టియన్ సంఘాలు కరీనా బుక్ టైటిల్‌ను వ్యతిరేకిస్తూ శివాజీ నగర్ పోలీసులను ఆశ్రయించారు. కరీనాతో పాటు మరో ఇద్దరిపై కూడా వారు ఫిర్యాదు చేశారు. అల్ఫా, ఒమెగా క్రిస్టియన్ మహాసంగ్ అధ్యక్షుడు ఆశిష్ షిండే కరీనాపై ఫిర్యాదు చేసినట్లు బీడ్‌లోని శివాజీ నగర్ పోలీసు స్టేషన్ ఇంచార్జ్ శ్రీనాథ్ తంభోర్ మీడియాకు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. కరీనాతో పాటు ఈ బుక్ రాసిన మరో రచయిత అదితి షా భీమ్జని, బుక్ పబ్లిషర్ సంస్థ జాగ్గర్ నట్ బుక్‌పై కూడా ఫిర్యాదు చేశారు. ఆశిష్ షిండే తన ఫిర్యాదులో కరీనా కపూర్ బుక్ టైటిల్ క్రిస్టియన్ల పవిత్ర గ్రంథమైన బైబిల్‌ను అవమానించేలా ఉందని, ఇది క్రిస్టియన్ మనోభవాలను దెబ్బతీస్తుందని పేర్కొన్నట్లు చెప్పారు. అంతేగాక కరీనాతో పాటు మరో ఇద్దరిపై ఐపీసీ సెక్షన్ 295-ఏ కింద కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారన్నారు. అయితే దీనిపై కంప్లైట్ తీసుకున్నాము కానీ, ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆయన అన్నారు. ఇది ముంబై పరిధిలోకి వస్తుందని, తమ స్టేషన్ పరిధిలోకి రాదని ఆయనకు స్పష్టం చేసినట్లు సదరు అధికారి అన్నారు. దీంతో షిండే ముంబైలో కేసు నమోదు చేయాల్సిందిగా ఆయనకు సలహా ఇచ్చామన్నారు. కాగా కరీనా తను రాసిన బుక్‌ను జులై 9న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ బుక్‌ను విడుదల సందర్భంగా కరీనా మాట్లాడుతూ.. ఈ బుక్ తనకు బిడ్డతో సమానం అని, ఇది తన మూడవ బిడ్డ అంటూ వ్యాఖ్యానించింది. అంతేగాక ఈ బుక్‌ను సోషల్ మీడియా ప్రమోట్ చేస్తూ ఇందులో తను గర్భవతిగా ఉన్నప్పుడు భౌతికంగా, మానసికంగా ఎలాంటి అనుభవాన్ని ఎదుర్కొందో వివరిస్తూ భావోద్వేగానికి లోనయ్యింది. కాగా ఇటీవల కరీనా రెండవ బిడ్డకు జన్మినించిన సంగతి తెలిసిందే. -
తొలిసారి కొడుకు ఫొటో షేర్ చేసిన కరీనా కపూర్!
బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్‌కు కొడుకు పుట్టి రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు అతడి ముఖాన్ని అభిమానులకు చూపించనేలేదు. దీంతో కరీనా ఎప్పుడెప్పుడు ఆ బుడతడిని పరిచయం చేస్తుందా? అని ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో అందరినీ సర్ప్రైజ్ చేస్తూ ఈ హీరోయిన్ పిల్లాడిని ఎత్తుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. "మహిళకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.." అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోలో కరీనా చంటోడిని తన భుజాలపై పడుకోబెట్టింది. దీంతో అతడి ముఖం కనిపించకపోవడంతో ఆమె ఫ్యాన్స్ కొంత నిరుత్సాహపడుతున్నారు. నీ రెండో కొడుకును ఇంకెప్పుడు చూపిస్తావంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) కాగా 2012లో కరీనా కపూర్-సైఫ్ అలీఖాన్ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఈ దంపతులకు 2016 డిసెంబర్లో తైమూర్ జన్మించాడు. సుమారు ఐదేళ్ల గ్యాప్ తర్వాత ఫిబ్రవరి 21న కరీనా మరోసారి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో పలువురు సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా వుంటే కరీనా చేతిలో 'లాల్‌సింగ్ చద్దా', 'తాకత్' సినిమాలున్నాయి. ఇక సైఫ్ విషయానికొస్తే అతడు 'ఆదిపురుష్' చిత్రంలో రావణాసురుడిగా కనిపించనున్నాడు. అలాగే హిందీలో 'భూత్ పోలీస్'లో నటిస్తున్నాడు. చదవండి: కరీనా కపూర్ ఇంటి గోడెక్కిన ఫొటోగ్రాఫర్ అవును షాకింగే, వీడ్కోలు పలుకుతున్నా: నటి -
ప్రియాంక అవుట్.. కరీనా ఇన్..!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం భరత్. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి ఫిలిం సర్కిల్స్‌లో హల్చల్ చేస్తోంది. సినిమా ప్రకంటించిన సమయంలో సల్మాన్ కు జోడిగా ప్రియాంక చోప్రా నటిస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. ప్రియాంక కూడా హాలీవుడ్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసుకొని భరత్ షూటింగ్ కోసం ఇండియాకు తిరిగి వచ్చారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి ప్రియాంక చోప్రా తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలుగా ప్రియాంక తప్పుకోవటంతో మరో హీరోయిన్కోసం వేట ప్రారంభించారు చిత్రయూనిట్. ముందుగా సల్మాన్‌తో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న కత్రినా కైఫ్‌ను హీరోయిన్గా తీసుకోవాలని భావించినా.. క్యారెక్టర్ పరంగా కరీనా అయితేనే కరెక్ట్ అని భావిస్తున్నారట. ప్రస్తుతానికి అధికారికంగా ప్రకటించకపోయినా.. కరీనానే ఫైనల్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. -
ట్రంప్ ఓ పిచ్చోడు: హీరోయిన్
న్యూ ఢిల్లీ : ముక్కుసూటిగా మాట్లాడుతూ వివాదాల్లో నిలవడం హీరోయిన్ సోనమ్ కపూర్‌కు కొత్తేంకాదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ‘పిచ్చివాడు’ అని వార్తల్లో నిలిచింది. ఇంతకు సోనమ్... ట్రంప్‌ను ఇలా అనడానికి కారణం అమెరికాకు చెందిన ప్రముఖ హాస్యనటి, టీవీ కార్యక్రమాల వ్యాఖ్యాత ఎలెన్ డిజెనెరస్ చేసిన ట్విట్. ఎలెన్ తన ట్విటర్ అకౌంట్లో ఒక ఫోటోను పోస్టు చేసింది. అందులో ‘మన అధ్యక్షుడు ఏనుగులు, మిగతా జంతువుల వేటకు అనుమతిచ్చాడు. ఇది భయానకమైన విషయం, మనందరం కలసికట్టుగా దీన్ని వ్యతిరేకిద్దాం’ అని ఉంది. అంతేకాక ‘ఏనుగుల పట్ల దయగా ఉండండి’ అనే సందేశాన్ని వ్యాప్తి చేయాల్సిందిగా ఆమె తన అభిమానులందరిని కోరింది. అందుకు సోనమ్ స్పందిస్తూ ‘వేటాడటం భారతదేశంలో చట్టవిరుద్ధమైనది, ఈ విషయంలో ప్రపంచం మమ్మల్ని చూసి నేర్చుకోవాల్సి ఉంది. వేటను అనుమతించిన ట్రంప్ ఒక పిచ్చివాడు’ అని ట్విట్ చేసింది. ఇప్పుడే కాదు గతంలోనూ ట్రంప్ మెరిల్ స్ట్రీప్‌ని ‘ఓవర్ రేటెడ్ నటి’ అన్నందుకు ట్రంప్‌ను తీవ్రంగా విమర్శించింది. ట్రంప్‌ను ఉద్దేశిస్తూ ‘మన నాయకులకు కనీసం తెలివి అనే రూపం అయినా ఉంటుంది, కానీ ఇతడు మాత్రం జోకర్’ అంటూ ట్విట్ చేసింది. ప్రస్తుతం సోనమ్ కపూర్ ‘వీరే ది వెడ్డింగ్’ చిత్రంలో నటిస్తుంది. ఇందులో సోనమ్‌తో పాటు కరీనా కపూర్ ఖాన్, స్వర భాస్కర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'ఆ ఇద్దరూ బెస్ట్ గర్ల్‌ఫ్రెండ్స్ కాదు'
ముంబై: మనసులో ఉన్నది ఉన్నట్లుగా ఏ భయం లేకుండా చెప్పేసే ఆర్టిస్టులలో కరీనాకపూర్ ఒకరు. ఆమె ఇటీవల ఓ కార్యక్రమంలో తన సోదరుడు రణబీర్‌కపూర్ వ్యవహారంపై స్పందించింది. అతడి మాజీ గర్ల్‌ఫ్రెండ్స్ పై సెటైర్ వేసింది. అసలు విషయం ఏంటంటే.. నో ఫిల్టర్ నేహ కార్యక్రమంలో కరీనాకపూర్ ఖాన్ పాల్గొన్నది. ఆ ఈవెంట్ హెస్ట్ కరీనాను ఓ ప్రశ్న అడిగారు. బాలీవుడ్ నటుడు, సోదరుడు రణబీర్ గర్ల్‌ఫ్రెండ్స్ అయిన కత్రినాకైఫ్, దీపికా పదుకొనేలలో ఎవరంటే ఇష్టమని, ఏ కాంభినేషన్ బాగుంటుందని అడిగారు. ఆ ప్రశ్నపై వెంటనే స్పందించిన కరీనా మాట్లాడుతూ.. ఆ ఇద్దరు హీరోయిన్లలో ఎవరూ తన సోదరుడు రణబీర్‌కు మంచి గర్ల్‌ఫ్రెండ్ కారని పిడుగులాంటి వార్త పేల్చేసింది. కత్రినా, రణబీర్ బ్రేకప్ వార్తలు రాకముందు వరకూ కరీనాకు కూడా ఆమె అంటే ఎంతో ఇష్టంగా మెలిగింది. రణబీర్ పేరేంట్స్ కత్రినాతో పెళ్లికి ఒప్పుకోలేదని గతంలో కథనాలు ప్రచారం అయ్యాయి. దీన్ని బట్టి చూస్తే కత్రినా పరిస్థితులకు తగ్గట్లుగా మాట్లాడేస్తుందని బాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రణబీర్‌తో బ్రేకప్ తర్వాత రణవీర్ సింగ్‌తో దీపికా ప్రేమాయణం కొనసాగించిన విషయం తెలిసిందే. -
హీరోయిన్ అకౌంట్ హ్యాక్
ముంబై: బాలీవుడ్ నటీ కరీనా కపూర్ ఖాన్ ఇన్‌కం ట్యాక్స్ చెల్లింపుల అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ఈ మేరకు ఆమె గత శుక్రవారం ముంబై సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీనా అకౌంట్ ను హ్యాక్ చేసిన హ్యాకర్ ఆమె చెల్లించాల్సిన ట్యాక్స్ మొత్తాన్ని కూడా చెల్లించినట్లు తెలిసింది. ట్యాక్స్ చెల్లింపు కోసం అకౌంట్ ను ఓపెన్ చేయడానికి కరీనా చార్టెడ్ అకౌంటెంట్ ప్రయత్నించగా లాగిన్ కాకపోవడంతో సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీనా పాన్ కార్డు నంబర్ తెలుసుకున్న హ్యాకర్ దానిని ఉపయోగించి ఆమె అకౌంట్ ను హ్యాక్ చేశాడని పోలీసులు నిర్ధారించారు. హ్యాకింగ్ తర్వాత ఈ-ఫైలింగ్ పాస్ వర్డ్ ను కూడా హ్యాకర్ మార్చినట్లు తెలిసింది. ఐటీ అకౌంట్ ను హ్యాక్ చేయడం తీవ్రమైన నేరమని సైబర్ పోలీసులు తెలిపారు. ఐటీ అకౌంట్ ను హ్యాక్ చేయడం ద్వారా తప్పుడు స్టేట్ మెంట్లు ఇచ్చి సదరు వ్యక్తి ఎక్కువ ట్యాక్స్ లు కట్టేలా చేసే అవకాశం ఉందని వెల్లడించారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే అకౌంట్ ను తిరిగి ఆధీనంలోకి తీసుకున్నామని చెప్పారు. నేరస్తుడి కోసం దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. -
తండ్రీకొడుకులు అక్కడే ప్రపోజ్ చేశారు!
ముంబై: బాలీవుడ్ లో ఎలాంటి కలహాలు లేకుండా జీవితాన్ని హాయిగా గడుపుతున్న దంపతులలో సైఫ్ అలీ ఖాన్, కరీనాకపూర్ జంట ఒకటని చెప్పవచ్చు. అయితే రాజుల కుటుంబానికి చెందిన వాడైనా.. ప్రేమ అనే విషయంలో కాస్త తగ్గాల్సి వస్తుందనేది సైఫ్ విషయంలోనూ నిజమైంది. ఎందుకంటే పారిస్ టూర్ లో ఉన్న సమయంలో తొలిసారి రిట్జ్ హోటల్ వద్ద సైఫ్ తనకు ప్రపోజ్ చేశాడని 'బెబో' కరీనా చెప్పింది. అయితే అందుకు తాను నో చెప్పినట్లు అప్పటి విషయాలను గుర్తుచేసుకుంది. రెండోసారి పారిస్ లో ఉన్నప్పుడే.. ఓ చర్చ్ వద్ద మరోసారి తనను ప్రేమిస్తున్న్టట్లు సైఫ్ చెప్పగా రెండు రోజులు టైం తీసుకుని ఓకే చెప్పినట్లు కరీనా వివరించింది. మరో విశేషమేమంటే.. తన మామగారు, క్రికెటర్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ(సైఫ్ తండ్రి) కూడా ఇక్కడే తన ప్రేమను పరీక్షించుకున్నాడట. తన అత్త, నటి షర్మిలా ఠాకూర్ వద్దకు వెళ్లి 'టైగర్' పటౌడీ ప్రేమ ప్రతిపాదన తీసుకొచ్చారని, చివరికి కథ సుఖాంతమైందని కరీనా చెప్పింది. కరీనా, సైఫ్ 2012లో వివాహం చేసుకోగా, ప్రస్తుతం కరీనా గర్భవతిగా ఉన్న విషయం తెలిసిందే. -
కడుపులోని బిడ్డకు పేరు పెట్టిన హీరో!
బాలీవుడ్ జంట షాహిద్ కపూర్, మీరా రాజ్పుట్ బాటలో మరో జోడీ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ నడుస్తున్నారు. షాహిద్, మీరా.. ఇటీవల ఓ ఆడబిడ్డకు జన్మనివ్వడం, ఇద్దరి పేర్లూ కలసి వచ్చేలా ఇద్దరి పేర్లలోని తొలి అక్షరాలను కలపి పాపకు మిషా అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రెగ్నెన్సీతో ఉన్న కరీన డిసెంబర్లో బిడ్డకు జన్మ ఇవ్వనుంది. సైఫ్, కరీనా తమకు పుట్టబోయే బిడ్డకు ముందుగా పేరు నిర్ణయించినట్టు సమాచారం. షాహిద్, మీరా దంపతుల మాదిరే.. సైఫ్, కరీనాలు ఇద్దరి పేర్లు కలసి వచ్చేలా కడుపులోని బిడ్డకు సైఫీనా అనే పేరు పెట్టాలని భావిస్తున్నారు. ఈ పేరును సైఫ్ ఎంపిక చేసినట్టు కరీనా ఓ చాటింగ్‌లో వెల్లడించింది. సైఫ్, కరీనా డేటింగ్ చేయడం మొదలు పెట్టాక మీడియా, అభిమానులు వారిని సైఫీనాగా పిలిచేవారు. ఇదే పేరును తమ బిడ్డకు పెట్టాలని సైఫ్ భావిస్తున్నాడు. ఈ పేరు కరీనాకు కూడా నచ్చినట్టు సమాచారం. కరీనా ప్రెగ్నెన్సీపై వార్తలు వస్తూనే ఉన్నాయి. త్వరలో ఓ బిడ్డకు జన్మ ఇవ్వనున్నట్టు సైఫ్, కరీనా సంయుక్తంగా ఓ ప్రకటనలో తెలిపారు. సైఫ్, కరీనా త్వరలో దుబాయ్ వెళ్లనున్నారు. అక్కడ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని అక్టోబర్‌లో తిరిగిరానున్నారు. -
డెలివరీ కోసం హీరోయిన్ లండన్‌కు
బాలీవుడ్ దంపతులు కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్‌లు డిసెంబర్లో మొదటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఈ జంట డెలివరీ కోసం ముంబైలోగాక లండన్‌కు వెళ్లనున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ముంబైలో అయితే మీడియా ఫోకస్ ఎక్కువగా ఉంటుందని, కరీనాకు జన్మించే బిడ్డకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారని ఈ దంపతులు ఆందోళన చెందుతున్నట్టు వారి సన్నిహితులు చెప్పారు. లండన్‌లో మీడియాకు దూరంగా కరీనా, సైఫ్ ఉండనున్నట్టు సమాచారం. కరీనా డెలివరీ సమయంలో పటౌడీ కుటుంబం ఆమె వద్దే గడపనుంది. సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్, అతని సోదరి సోహా అలీఖాన్ ఎక్కువ సమయం కరీనాతో ఉండనున్నారు. కరీనా ప్రెగ్నెన్సీకి సంబంధించి ఇప్పటికే పలు వదంతులు వచ్చాయి. లండన్‌లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారని, ఆమెకు జన్మించేది మగబిడ్డేనని మీడియాలో వార్తలురాగా.. కరీనా, సైఫ్ వీటిని ఖండించారు. అంతేగాక ప్రెగ్నెన్సీతో ఉన్న కరీనా ఫొటోలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. -
ఆ హీరోయిన్‌కు స్పెషల్ ట్రీట్మెంట్
ప్రెగ్నెన్సీతో ఉన్న బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ సెట్స్‌పై స్పెషల్ ట్రీట్మెంట్ పొందనుంది. షూటింగ్ సందర్భంగా ఆమెకు ఎలాంటి ఒత్తిడి, శ్రమ కలగకుండా, మధ్యలో రిలాక్స్ అయ్యేలా దర్శక, నిర్మాతలు ప్లాన్ చేశారు. సోనమ్ కపూర్‌తో కలసి ఓ సినిమాలో నటిస్తున్న కరీనా ఈ ప్రాజెక్టు పూర్తి చేసి, మెటర్నిటీ లీవ్ తీసుకోవాలని భావిస్తోంది. ఆమె ప్రస్తుతం హరియాణాలోని పటౌడీ ప్యాలెస్‌లో విశ్రాంతి తీసుకుంటోంది. ఇటీవల ఈ సినిమా నిర్మాత రియా కపూర్, దర్శకుడు శశంకా ఘోష్ అక్కడకు వెళ్లి కరీనాతో షూటింగ్ షెడ్యూల్, డేట్స్ గురించి మాట్లాడినట్టు ఆమె సన్నిహితులు తెలిపారు. ఈ సినిమా షూటింగ్‌కు కరీనా డేట్స్ ఇచ్చినట్టు చెప్పారు. ఆగస్టు మొదటి వారంలో బ్యాంకాక్‌లో, ఆ తర్వాత ఢిల్లీలో షూటింగ్ జరపనున్నారు. కరీనా అభిప్రాయం తీసుకుని దర్శక, నిర్మాతలు షూటింగ్ లోకేషన్స్ ఎంపిక చేశారు. ఆమెకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. షూటింగ్ మధ్యలో రిలాక్స్ కావడానికి ఏర్పాట్లు చేయనున్నారు. సైఫ్, కరీనాలు 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. తన భార్య గర్భవతి అని, డిసెంబరులో తొలి సంతానాన్ని పొందుతామంటూ ఇటీవల సైఫ్ ప్రకటించాడు. -
కరీనాకు ఆ పరీక్షలు చేయించలేదు
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ తన గర్భంలో ఉన్న బిడ్డకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించలేదని ఆమె ప్రతినిధి వివరణ ఇచ్చాడు. సైఫ్ అలీఖాన్, కరీనా దంపతులకు మగబిడ్డ జన్మించనున్నాడని, ఇటీవల లండన్ వెళ్లినపుడు లింగనిర్ధారణ పరీక్షలు చేయించారంటూ మీడియాలో వచ్చిన కథనాలను ఆయన తోసిపుచ్చాడు. 'మీడియాలో వచ్చిన వార్తలన్నీ ఊహాజనితం. నిరాధారమైనవి. కరీనా, సైఫ్ వీటిని ఖండించారు. లండన్‌లో కరీనా, సైఫ్ దంపతులు ఏ డాక్టర్‌నూ సంప్రదించలేదు. ఇది వ్యక్తిగత విషయం. అనవసరంగా సంచలనం చేయవద్దని అందరినీ కోరుతున్నా' అని కరీనా ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపాడు. కరీనా గర్భవతి అని ఇటీవల సైఫ్ చెప్పాడు. డిసెంబర్లో తమకు తొలిబిడ్డ జన్మించవచ్చని భావిస్తున్నట్టు తెలిపాడు. కాగా సైఫ్‌కు తొలి భార్య అమృతా సింగ్‌తో ఇద్దరు పిల్లలున్నారు. -
కావాలనే మాజీ లవర్‌తో ఫొటో దిగలేదు!
'ఉడ్తా పంజాబ్' సినిమాతో మళ్లీ వెండితెర మీద కనిపించబోతున్నారు షాహిద్ కపూర్, కరీనా కపూర్. చాలాకాలం కిందటే విడిపోయిన ఈ మాజీ ప్రేమజంట.. గతంలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా విలేకరులు ఎంత కోరినా.. కలిసి ఫొటో దిగేందుకు ఒప్పుకోలేదు. ఇందుకు కారణం ఏమిటంటే.. తాజాగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ వెల్లడించాడు. కావాలనే తామిద్దరం కలిసి ఫొటో దిగలేదని, ఒకవేళ ఫొటో దిగితే అప్పట్లో మీడియా మొత్తం దీనిపైనే మాట్లాడేదని, అందుకే మేం కలిసి ఫొటో దిగకూడదని తాను భావించానని షాహిద్ చెప్పాడు. ఎన్నో ఏళ్ల గ్యాప్ తర్వాత షాహిద్, కరీనా.. అభిషేక్ చుబే తెరకెక్కించిన 'ఉడ్తా పంజాబ్'లో నటించారు. నిజానికి ఒకే సినిమాలో నటిస్తున్నారనే మాటే కానీ.. ఈ ఇద్దరు కలిసి కనిపించే సీన్ ఒక్కటి కూడా ఈ చిత్రంలో లేదట. అంతేకాకుండా మీ ఇద్దరు భవిష్యత్తులో కలిసి నటించే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు వీరు సమాధానం దాటేశారు. సహ నటులు ఆలియా భట్, డైరెక్టర్ అభిషేక్ చుబే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నా ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో షాహిద్, కరీన చాలా ఇబ్బందిగా కనిపించారని అప్పట్లో కథనాలు వచ్చాయి. ఈ కథనాలపై స్పందిస్తూ 'మేం ఇబ్బందిగా ఫీలైనట్టు మీరు ఎలా నిర్ణయిస్తారు? మేం అలా కనిపించామా? అలా ఎలా రాస్తారు?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
మాజీ లవర్స్ మాట దాటేశారు!!
ముంబై: షాహిద్ కపూర్, కరీనా కపూర్.. చాలాకాలం తర్వాత ఈ మాజీ ప్రేమజంట వెండితెరపై ఒకే సినిమాలో కనిపించబోతున్నది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'ఉడ్తా పంజాబ్' చిత్రంలో ఈ ఇద్దరూ కనిపించనున్నారు. ఒకప్పుడు బాలీవుడ్లో గాఢమైన ప్రేమపక్షులుగా పేరొందిన షాహిద్, కరీన ఆ తర్వాత వేరయ్యారు. ఎవరి తోడును వారు వెతుక్కున్నారు. ఈ ఇద్దరు కలిసి చివరిసారి నటించిన చిత్రం 'జబ్ వుయ్ మెట్'. ఆ సినిమా సమయంలోనే ఇద్దరికి బ్రేకప్ అయింది. ఎన్నో ఏళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు ఈ మాజీ లవర్స్.. అభిషేక్ చుబే తీసిన 'ఉడ్తా పంజాబ్'లో దర్శనమివ్వబోతున్నారు. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఈ జంట ఒకే వేదికపై కనిపించింది. నిజానికి ఒకే సినిమాలో నటిస్తున్నారనే మాటే కానీ.. ఈ ఇద్దరు కలిసి కనిపించే సీన్ ఒక్కటి కూడా ఈ చిత్రంలో లేదు. ఈ విషయమై ప్రశ్నించగా షాహిద్, కరీన మాట దాటేశారు. భవిష్యత్‌లో మీరిద్దరూ కలిసి నటించే అవకాశముందా? అన్న ప్రశ్నకు కూడా డొంక తిరుగుడు సమాధానమిచ్చారు. 'ఉడ్తా పంజాబ్' సినిమాలో మీరిద్దరు కలిసి నటించే దృశ్యం ఒక్కటి కూడా లేనందుకు బాధాపడ్డారా? అని ప్రశ్నించగా 'గతంలో జరిగిన దాని గురించి మీరు బాధపడుతున్నారా? అన్నట్టుగా ఉంది మీ ప్రశ్న' అని షాహిద్ బదులిచ్చాడు. 'జబ్ వుయ్ మెట్' సినిమా డీవీడీలు ఉన్నాయిగా? ఇంక కలిసి నటించడమెందుకు? అన్న తరహాలో కరీన బదులిచ్చింది. అంటే 'జబ్ వుయ్ మెట్' సినిమా తరహాలో మీరిద్దరు కలిసి నటించే అవకాశం భవిష్యత్తులో లేదన్నమాట? అని విలేకరులు ప్రశ్నించగా.. 'ఆ విషయం ఇంతియాజ్ అలీ (ఆ చిత్ర డైరెక్టర్) చెప్తారు' అంటూ కరీన జవాబు దాటేసింది. 'జబ్ వుయ్ మెట్'కు సీక్వెల్ వచ్చేది ఉంటే ఎప్పుడో వచ్చేదని, ఇప్పుడు ఇంతియాజ్ ఆ సినిమా నుంచి ఎంతో ముందుకెళ్లిపోయారని షాహిద్ వివరణ ఇచ్చాడు. ఇక కలిసి ఫొటోలకు పోజు ఇవ్వొచ్చుగా అని విలేకరులు కోరినా.. ఈ జంట అందుకు సుమఖత వ్యక్తం చేయలేదు. సహ నటులు అలియా భట్, దిల్జిత్ దుసాంజ్లను తమమధ్యకు పిలిపించుకొని ఫొటొలు దిగారు కానీ, పక్కపక్కన ఉండి ఫొటోలు దిగేందుకు నిరాకరించారు. -
మా అక్కకు ఇది కష్టకాలం: కరీనా
కరిష్మాకపూర్ విడాకుల వ్యవహారం గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకున్నారు గానీ, ఆమె జీవితానికి సంబంధించిన నిజం ఏంటో ఎవరికీ తెలియదని ఆమె సోదరి, బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరీనాకపూర్ ఖాన్ చెబుతోంది. అయితే ఇది పూర్తిగా ఆమె వ్యక్తిగత వ్యవహారం కాబట్టి తాను మాత్రం దీని మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనంది. ఇది కరిష్మాకు చాలా కష్టకాలమని మాత్రం ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటివరకు ఆమెకు మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. నిజానికి కరిష్మాకపూర్ విడాకుల వ్యవహారం చినికి చినికి గాలివానగా మారింది. పరస్పర అంగీకారంతో సంజయ్ కపూర్ నుంచి విడాకులు తీసుకుంటుందని అందరూ భావించినా, కరిష్మా మాత్రం కేసు పోరాడతానంటూ ముందుకెళ్లింది. సుదీర్ఘకాలం వాదనల తర్వాత మళ్లీ చివరకు పరస్పర అంగీకారంతోనే విడాకులు మంజూరయ్యాయి. అంతకుముందు సంజయ్ కపూర్ నుంచి విడిపోయిన తర్వాత సందీప్ తోష్నివాల్ అనే వ్యక్తితో కొన్నాళ్లు డేటింగ్ చేసినట్లు కథనాలు వచ్చాయి. కానీ సందీప్‌కు అప్పటికే పెళ్లి అయిపోవడం, అతడికి ఇంకా విడాకులు రాకముందే కరిష్మాతో తిరిగితే ఇబ్బంది అవుతుందని న్యాయవాదులు చెప్పడంతో అతడు కూడా ఆమెకు కొంతకాలం దూరమయ్యాడు. అతడికి కూడా విడాకులు వస్తే ఆ తర్వాత వీళ్లిద్దరి బంధం ఎటు తిరుగుతుందో స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. -
మూడు రోజుల్లో 25 కోట్లు!
ఈ రోజుల్లో మొదటి వారంలో ఎంత కలెక్షన్లు వచ్చాయన్నదాన్ని బట్టే సినిమాలు విజయవంతం అవుతున్నాయో లేదోనన్న విషయాన్ని లెక్కపెడుతున్నారు. అందులోనూ చాలావరకు సినిమాలు శుక్రవారం విడుదల అవుతాయి కాబట్టి ఆరోజు, శని ఆదివారాలు కలిపి మొదటి మూడు రోజుల్లో ఎంత కలెక్షన్ ఉందో చూసుకుంటున్నారు. కరీనా కపూర్ ఖాన్, అర్జున్ కపూర్ జంటగా వచ్చిన విచిత్ర వైవాహిక జీవిత చిత్రం 'కి అండ్ కా'. మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా కలెక్షన్లు రూ. 25 కోట్లు దాటేశాయి. ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. తొలిరోజు శుక్రవారం నాడు రూ. 7.30 కోట్లు, శనివారం రూ. 8.41 కోట్లు, ఆదివారం రూ. 9.52 కోట్లు.. మొత్తం మొదటి వీకెండ్లో రూ. 25.23 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు చెప్పారు. ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయని, అర్బన్ సెంటర్లలోని అన్ని మల్టీప్లెక్సులలోను కలెక్షన్లు బాగున్నాయని తెలిపారు. 2016లో ఇప్పటివరకు విడుదలైన అన్ని సినిమాల్లోనూ ఇది మూడో అత్యధిక ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్ అని కూడా తరణ్ అన్నారు. ఇక ఈ సినిమా విజయాన్ని కపూర్ హౌస్‌లో అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నట్లు అర్జున్ కపూర్ ట్వీట్ చేశాడు. తాము అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుక్కపిల్ల వీడియోను అర్జున్ కపూర్ అందులో పెట్టాడు. That's how we celebrate the success of #KiAndKa at the Kapoor house !!! Maximus got the moves I say !!! pic.twitter.com/q9A07hVwAc — Arjun Kapoor (@arjunk26) 4 April 2016 -
ఆ సిన్మా తొలిరోజు కలెక్షన్లలో దుమ్మురేపింది!
ముంబై: అర్జున్ కపూర్, కరీనా కపూర్ ఖాన్ జంటగా నటించిన 'కి అండ్ కా' భారీ అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రియోటివ్ డైరెక్టర్ ఆర్ బాల్కీ తెరకెక్కించిన ఈ సినిమాపై రివ్యూలు పెదవి విరిచినప్పటికీ, కలెక్షన్లు మాత్రం అదరగొట్టేశాయి. తొలిరోజే ఈ సినిమా ఏడు కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో తొలి రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రం ఇదే. తొలిరోజు 40-50శాతం ఆక్యూపెన్సీతో ఈ సినిమా థియేటర్లు కళకళలాడాయి. మొదటి వీకెండ్లో ఈ ట్రెండ్ మరింతగా కొనసాగి.. ఈ చిత్రం తొలివారం భారీగా కలెక్షన్లు రాబట్టే సూచనలు కనిపిస్తున్నాయి. 'కి అండ్ కా'లో కబీర్‌గా అర్జున్, 'కియా' కరీనా నటించింది. ఈ సినిమాలో ఇంటి బాధ్యతలు చూసుకొనే భర్తగా అర్జున్, కెరీరే ముఖ్యమనుకునే దృక్పథంతో జాబ్ చేసే మహిళగా కరీనా నటించారు. ఇల్లాలిలా ఇంటి పనులు చూసుకొనే భర్త.. ఇంటి యాజమానిగా ఉద్యోగం చేసే భార్య కథతో న్యూ ఏజ్ సినిమాగా 'కి అండ్ కా'కు భారీ ప్రచారమే లభించింది. -
ఆ కండిషన్‌తోనే పెళ్లి చేసుకున్నా: హీరోయిన్
బాలీవుడ్ సెలబ్రిటీ దంపతుల్లో మొదటి వరుసలో వినిపించే పేరు కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీఖాన్. కొంతకాలంగా అన్యోన్యంగా ఉంటూ వైవాహిక జీవితాన్ని ఆనందిస్తోంది ఈ జంట. అయితే తాజాగా తమ పెళ్లి గురించి ఆసక్తికరమైన సంగతిని కరీనా వెల్లడించింది. ఒకే ఒక కండిషన్‌తో తాను సైఫ్‌ను పెళ్లాడానని, తాను జీవితాంతం పనిచేస్తానని, అందుకు ఆయన మద్దతు ఇవ్వాలని కండిషన్ పెట్టానని, అందుకు సైఫ్ ఒప్పుకోవడంతో తాము ఆనందంగా పెళ్లి చేసుకున్నామని ఈ బ్యూటీ తెలిపింది. క్రియేటివ్ డైరెక్టర్ ఆర్ బాల్కీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కి అండ్ కా' సినిమాలో కరీనా కెరీర్‌కు ఇంపార్టెన్స్ ఇచ్చే మహిళ పాత్రలో కనిపిస్తుండగా.. ఆమె భర్తగా ఇంటిదగ్గరే ఉండి అన్ని పన్నులు చేసే హౌస్ హజ్బెండ్‌గా అర్జున్ కపూర్ నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా కరీనా విలేకరులతో మాట్లాడుతూ 'మహిళను భూమాతతో పోలుస్తారు. మహిళలకు అధిక శక్తిసామర్థ్యాలు ఉన్నాయి. వాళ్లు ఎన్నో పనులను ఏకకాలంలో చక్కబెట్టగలరు' అంటూ కీర్తించింది. ఇప్పటికే సినీ ప్రియుల్లో ఆసక్తి రేపుతున్న 'కి అండ్ కా' సినిమా ట్రైలర్లో అర్జున్ కపూర్ మెడలో కరీనా తాళి కడుతూ కనిపించడం గమనార్హం. ఇలా భర్తకు భార్య తాళి కట్టడం గురించి కరీనాను అడిగితే.. 'ఇలాంటిదైతే గతంలో ఎప్పుడూ చూడలేదు. ఇది నిజంగా గొప్ప ఐడియా. (సినిమాలో) అతను తాళిని గర్వంగా ధరించడమే కాదు ఎంతో సెక్సీగా కూడా కనిపించాడు' అంటూ నవ్వులు రువ్వింది. అమితాబ్ బచ్చన్, ఆయన భార్య జయాబచ్చన్ కూడా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అబ్బ.. ఎంత బాగున్నాడో: కరీనా
పుణెలోని ఎరవాడ జైలు నుంచి శిక్ష ముగించుకుని బయటకు వచ్చిన సంజయ్‌దత్ చాలా అద్భుతంగా ఉన్నాడని బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ చెప్పింది. ఆయన బయటకు వచ్చినందుకు తామంతా చాలా సంతోషంగా ఉన్నామని, ఎవరో ఫొటో చూపిస్తే చూశానని, చాలా బాగున్నాడని తెలిపింది. తాను దత్‌కు పెద్ద ఫ్యాన్ అని, వెండితెర మీద మళ్లీ ఎప్పుడు చూస్తానా అని ఆసక్తిగా ఉందని చెప్పింది. 'ఎల్ఓసీ కార్గిల్' అనే సినిమాలో కరీనా - సంజయ్‌దత్ కలిసి నటించగా, ఆమె సోదరి కరిష్మా కపూర్ మాత్రం అతడితో కలిసి చాలా సినిమాలు చేసింది. ఆయుధాల చట్టం ఉల్లఘించిన కేసులో సంజయ్‌దత్ శిక్ష అనుభవించాడు. కోర్టు అతడికి ఐదేళ్ల శిక్ష విధించినా, అప్పటికే కొంత శిక్షాకాలం పూర్తి కావడం.. సత్ప్రవర్తన కారణంగా కొంత ముందుగానే గురువారం విడుదలయ్యాడు. బాలీవుడ్ చిత్రపరిశ్రమ సంజయ్‌దత్‌ను సాదరంగా ఆహ్వానించింది. -
హాట్ హాట్ కరీనా.. అభిమానులు ఫిదా!
ముంబై: సాధారణంగా మగువలు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే.. పురుషులు ఇట్టే ఫిదా అయిపోతారు. ఎరుపులోనే ఆ మెరుపు ఉంది. బాలీవుడ్ ప్రౌఢ సుందరి కరీనా కపూర్ ఖాన్ కూడా తాజాగా రెడ్ ఔట్‌ఫిట్స్‌తో ఫొటోషూట్ చేసి.. అభిమానుల హృదయాల్లో గుబులు రేపుతోంది. బార్సిలోనాలో కరీనా కపూర్ తాజా ఫొటోషూట్ చిత్రాలను ఆమె హెయిర్ స్టైలిస్ట్ పంపీ హన్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. గాఢమైన ఎరుపు రంగు దుస్తుల్లో హాట్‌హాట్‌గా పోజిస్తూ ఈ ఫొటోల్లో కరీనా కనువిందు చేస్తోంది. 'బజరంగీ భాయ్‌జాన్' చిత్రంతో తన కరిష్మా తగ్గలేదని చాటిన కరీన తాజాగా 'కి అండ్ కా' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో వయసులో తనకన్నా చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో జోడీ కట్టిన ఈ భామ తన అందచందాలు ఏమాత్రం తగ్గలేదని తాజా ఫొటోషూట్‌తో నిరూపించిందంటున్నారు బాలీవుడ్ జనాలు. -
మా ఆయన మారాలని ఎప్పుడూ కోరుకోలేదు
న్యూఢిల్లీ: తన జీవితంలో వివాహం ఎలాంటి మార్పులు తేలేదని బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ చెబుతోంది. వైవాహిక జీవితంలో తామిద్దరం చాలా అన్యోన్యంగా ఉన్నామని, తమ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా చాలా హ్యాపీగా ఉన్నామని తెలిపింది. సైఫ్ అలీఖాన్‌తో పెళ్లి అనంతరం.. మీ జీవితంలో ఏవైనా మార్పులు వచ్చాయా అని మీడియా ప్రశ్నించినపుడు ఈ బాలీవుడ్ బ్యూటీ ఇలా స్పందించింది. పెళ్ళి చేసుకొని మూడేళ్ళు అవుతున్నా తమ మధ్య చిన్నపాటి సమస్య కూడా తలెత్తలేదని పెళ్లికి ముందు తన భర్త, సైఫ్ ఎలా వున్నాడో పెళ్లి తర్వాత కూడా అలాగే ఉన్నాడని చెప్పింది. తన వ్యక్తిత్వాన్ని, ఇష్టాలను మార్చుకోమని ఎపుడూ కోరలేదని, భవిష్యత్తులో కూడా అలా కోరనని కరీనా తెలిపింది. హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ సందర్భంగా కరీనా కపూర్ ఖాన్.. . మీడియాతో తన మనసులోని భావాలను ఇలా వ్యక్తం చేసింది. 'మా ఆయన మారాలని నేను ఎపుడూ కోరుకోలేదు...కోరను కూడా.. నేను తనని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. పెళ్లి నా జీవితంలో మార్పులు తేవాలని అనుకోలేదు. నేను కూడా పెళ్లికి ముందు ఎలా వున్నానో ఇపుడూ అలాగే ఉన్నాను.. ఉంటాను కూడా... అంటూ వైవాహితక జీవితం గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన భర్తకు ఏ రోజూ ... ఎలాంటి షరతులు పెట్టలేదని, తనని సాధ్యమైనంత వరకు అర్ధం చేసుకోడానికే ప్రయత్నిస్తానని ఈ అమ్మడు పేర్కొంది. ఈ మూడేళ్ళలో సైఫ్ లో ఎలాంటి మార్పులు తను చూడలేదని, పెళ్లికి ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడని పేర్కొంది. భవిష్యత్ లో కూడా ఆ అవసరం రాకుండా చూసుకుంటానంటూ కరీనా వెల్లడించింది . కాగా కపూర్ కుటుంబం నుంచి వచ్చిన కరీనా 2012 లో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పెళ్లాడిన విషయం తెలిసిందే. -
'నా భార్యను ఆ క్యారెక్టర్లలో చూడాలనుంది'
ముంబయి : రొమాంటిక్ క్యారెక్టర్లలో తన భార్య కరీనాకపూర్ ఖాన్ ను చూడాలని ఉన్నట్లు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తెలిపాడు. మరిన్ని విషయాలను మీడియాతో సైఫ్ పంచుకున్నాడు. 2007లో విడుదలైన 'జబ్ వి మెట్' లో కరీనా పోషించిన పాత్ర తనకెంతో ఇష్టమని అన్నాడు. తండ్రిని కావాలని తనకు అంతగా తొందర లేదని అన్నాడు. సంతానం కోసం తాము ఆరాటపడటం లేదని తెలిపాడు. తన భార్య, హీరోయిన్ కరీనాకపూర్ కోరుకున్నప్పుడే తమ దంపతులు సంతానం గురించి ఆలోచిస్తామని సైఫ్ చెప్పాడు. భారీ బడ్జెట్ సినిమాలతో పాటు, చిన్న చిన్న బ్యానర్లలో నటించేందుకు కరీనా సిద్ధంగా ఉంటుందన్నాడు. ఇటీవలే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మరో రెండు, మూడేళ్ల వరకు తాను తల్లిని అవ్వడానికి ఇష్టపడటం లేదన్నట్లు కరీనాకపూర్ చెప్పింది. సైఫ్, అమృతా సింగ్ దంపతులకు సారా, ఇబ్రహీం అనే ఇద్దరు సంతానం అన్న విషయం అందరికీ విదితమే. అమృతతో విడాకులు తీసుకున్న తర్వాత కరీనాను 2012లో రెండో వివాహం చేసుకున్నాడు. అయితే కరీనా కూడా సినిమాలతో బిజీగా ఉండటంతో సైఫ్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వివాహం తర్వాత కరీనా కెరీర్ చాలా గొప్పగా ఉందని చెప్పుకొచ్చాడు. అత్త బబితకు తాను నటించిన రొమాంటిక్, కామేడీ సినిమాలు 'కాక్టెయిల్', 'లవ్ ఆజ్ కల్' అంటే చాలా ఇష్టమంటూ సైఫ్ తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. తన పిల్లలు డిగ్రీ చేసిన తర్వాత వారికి నచ్చిన రంగాల్లోకి వారిని పంపిస్తానని చెప్పాడు. -
యూట్యూబ్‌లో కరీనా ఐటెం సాంగ్
'మేరా నామ్ మేరీ' అంటూ వెండిరంగు దుస్తులతో కరీనా కపూర్ ఖాన్ హొయలొలికించిన పాట టీజర్ యూట్యూబ్‌లో విడుదలైంది. అక్షయ్ కుమార్ హీరోగా వస్తున్న 'బ్రదర్స్' సినిమా కోసం ఈ పాటలో కరీనా నర్తించింది. ఇంతకుముందు కూడా కరీనా కొన్ని ఐటెం సాంగ్స్‌లో మెరిసి మురిపించిన విషయం తెలిసిందే. తాజాగా మేరీ ఐటెం సాంగ్ టీజర్‌ను హీరో అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానుల కోసం షేర్ చేశాడు. 30 సెకండ్ల పాటు ఉన్న ఈ టీజర్లో ఎక్కడా కరీనా ముఖం కనపడదు. వీపు భాగం మాత్రమే కనిపిస్తుంది. ''బ్రదర్స్ 2015 సినిమా కోసం మేరానామ్ మేరీ పాట ఎక్స్‌క్లూజివ్ టీజర్ మీకోసం అందిస్తున్నా.. ఎంజాయ్ చెయ్యండి'' అని అక్షయ్ ట్వీట్ చేశాడు. కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన బ్రదర్స్ సినిమా.. 2011లో విడుదలైన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'వారియర్' సినిమాకు రీమేక్. ఇందులో సిద్దార్థ మల్హోత్రా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, జాకీ ష్రాఫ్ తదితరులు నటించారు. సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. Here's the exclusive teaser of #MeraNaamMary from @Brothers2015. Enjoy! http://t.co/Vcf3Q27ZQI — Akshay Kumar (@akshaykumar) July 6, 2015 -
'ఆ సినిమా నుంచి నన్ను తరిమేశారు'
కరణ్ జోహార్ రూపొందిస్తున్న 'శుద్ధి' సినిమా నుంచి తనను తరిమేశారని బాలీవుడ్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ చెబుతున్నాడు. ఇంతకుముందు ఆ సినిమాలో హృతిక్ రోషన్, కరీనా కపూర్ జంటగా నటిస్తారని చెప్పారు. అయితే తర్వాత హృతిక్ బదులు సల్మాన్ హీరో అన్నారు. కానీ ఇప్పుడు సల్లూభాయ్ బదులు వరుణ్ ధావన్‌ను తీసుకొచ్చారు. సల్మాన్ ఖాన్ తాను నటించిన 'బజరంగీ భాయీజాన్' సినిమా ట్రైలర్ విడుదల చేసిన తర్వాత శుద్ధి సినిమా గురించి మాట్లాడాడు. తననైతే సినిమా నుంచి తరిమేశారని, మరి నువ్వు ఆ సినిమాలో ఎందుకు లేవంటూ కరీనా కపూర్‌ను ప్రశ్నించాడు. హృతిక్ ఉన్నాడు కాబట్టి ఆ సినిమాకు తాను అంగీకరించానని, ఇప్పుడు లేడు కాబట్టి తానూ చేయట్లేదని కరీనా చెప్పింది. అయితే.. తాను హీరోగా వచ్చేసరికే కరీనా ఆ సినిమా నుంచి బయటకు వచ్చేసిన విషయం సల్మాన్‌కు అప్పుడు తెలిసొచ్చింది. ప్రస్తుతం శుద్ధి సినిమాలో వరుణ్ ధావన్ సరసన ఆలియా భట్ హీరోయిన్గా చేస్తోంది. -
రూ.100 కోట్ల క్లబ్ లో సింగమ్ రిటర్న్స్!
ముంబై: అజయ్ దేవగన్, కరీనా కపూర్ లు జంటగా నటించిన 'సింగమ్ రిటర్న్స్' భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రం వసూళ్లలో సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. తొలి రోజే రూ.30 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సింగమ్ రిటర్న్స్ రూ.100 కోట్ల క్లబ్ లో చేరడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం రూ. 92 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి 2014లో విడుదలై అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన జాబితాలో చోటు సంపాదించింది. తమిళ నటుడు సూర్య చేసిన సింగం 2 కి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే భారీ వసూళ్లతో డిస్ట్రిబ్యూటర్లకు కాసుల పంటపండిస్తోంది. ఒక స్టార్ హీరో, ఒక స్టార్ హీరోయిన్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రంపై ఆది నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. -
కన్నీళ్లు పెట్టుకున్నహీరో!
ముంబై:ప్రతీ ఒక్కరి జీవితంలో కన్నీళ్లు పెట్టుకునే సందర్భాలు రావంటే అది అతిశయోక్తే అవుతుంది. కన్నీళ్లు పెట్టుకోవడానికి రియల్ హీరో-రీల్ హీరో అనే తారతమ్యం కూడా ఏమీ ఉండదు. అటువంటి సందర్భమే ఒకటి బాలీవుడ్ ప్రముఖ హీరో అజయ్ దేవగన్ జీవితంలో కూడా తాజాగా చోటు చేసుకుంది. సింగమ్ రిటర్న్స్ విజయాన్ని ఆకాంక్షిస్తూ తన స్నేహితుడు, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రాసిన లెటర్ చూసి అజయ్ కన్నీళ్లు పెట్టుకున్నాడట. ప్రస్తుతం పుణేలోని యర్రవాడ సెంట్రల్ జైల్లో ఉంటున్న సంజయ్ దత్ రాసిన ఉత్తరం అజయ్ ను మనసును కదిలించిందట. ఒక తెల్లటి రూల్ పేపర్ మీద బ్లూ -ఇంక్ తో సంజయ్ రాసిన లెటర్ లో సింగమ్ రిటర్న్స్ సందర్భంగా అజయ్ దేవగన్ కు అభినందనలు తెలియజేస్తూ తన పాత జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకున్నాడు. ఇదే సందర్భంలో 2008లో వీరిద్దరూ కలిసి నటించిన 'మెహ్ బూబా' సినిమా సందర్భంలో వారు కలిసి డ్యాన్స్ చేసిన సన్నివేశాలను నెమరవేసుకున్నాడు. 'రాజు(అజయ్ ను సంజయ్ పిలుచుకునే పేరు) మనం తిరిగి కలిసినప్పుడు మన చేతి రాతతో రాసుకున్న పుస్తకాలను మార్చుకుందాం. ముందుగా ఈ లెటర్ రాస్తున్నాను. నువ్వు హీరోగా చేసిన సింగమ్ రిటర్న్స్ విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని లెటర్ లో తెలిపాడు. ఇక్కడ నువ్వు సంతోషించాల్సిన విషయం ఒకటి ఉంది. నేను 11 కిలోల బరువు తగ్గాను. జైల్లో క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తున్నాను.నేను చొక్కా వేసుకోకుండా ఉన్నప్పుడు 8 ప్యాక్స్ కనిపిస్తుందని' సంజయ్ తెలిపాడు. ఈ లెటర్ చూసిన అనంతరం తనకు కన్నీళ్లు ఆగలేదని స్వయంగా అజయ్ దేవగన్ పేర్కొన్నాడు. అంతకుముందు ఆ హీరోల తండ్రులు సునీల్ దత్, వీరూ దేవగన్ లు మధ్య ఉండే సాన్నిహిత్యాన్నే ఈ ఇద్దరూ కంటిన్యూ చేస్తుండటం నిజంగా గర్వించదగ్గ విషయమే. తమిళ హీరో సూర్య నటించిన సింగం-2 రీమేక్ గా వస్తున్న సింగమ్ రిటర్న్స్ లో అజయ్ దేవగన్, కరీనా కపూర్ లు జంటగా నటిస్తున్నారు. రిలయన్స్ ఎంటర్ టైనమెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
రోహిత్ శెట్టి మన్మోహన్ అంతటివాడు..
ముంబై: రోహిత్ శెట్టి తాజా సినిమా సింగమ్ రిటర్న్స్‌లో నటిస్తున్న కరీనా కపూర్ అతడిపై ప్రశంసలు జల్లు కురిపించింది. ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలు తీసిన నిన్నటితరం దర్శకుడు మన్మోహన్ దేశాయ్‌తో రోహిత్ పోటీపడగలడని కితాబిచ్చింది. ‘రోహిత్.. నేటితరం మన్మోహన్ దేశాయ్ వంటివాడు. అతణ్ని నేను ఇదే పేరుతో పిలుస్తాను. ప్రతి ఒక్క హీరోయిన్ ఇతని దగ్గర పనిచేయాలని కోరుకుంటుంది. నాకు గతంలోనూ మంచి అవకాశాలు ఇచ్చాడు’ అని వివరించింది. సింగమ్‌లో కాజల్ హీరోయిన్గా నటించినా, దీని సీక్వెల్లో మాత్రం బెబోకు అవకాశం వచ్చింది. రోహిత్‌కు తాను పెద్ద అభిమానిని కాబట్టే ఈ రెండో భాగంలో నటించేందుకు సంతోషంగా ఒప్పుకున్నానని వివరించింది. ‘ఇంతకుముందు కూడా అజయ్ దేవ్‌గణ్‌తోపాటు నటించాను కాబట్టి షూటింగ్ సెట్లు మా ఇల్లులాగే అనిపించాయి. ఇందులో హీరోయిన్ పాత్రకు కూడా చాలా ప్రాధాన్యం ఉంటుంది’ అని కరీనా వివరించింది. సింగమ్ రిటర్న్స్ వచ్చే నెల 15న విడుదలవుతోంది. -
‘డర్టీ పిక్చర్’ చేయలేను
డర్టీ పిక్చర్ వంటి సినిమా చేసే ధైర్యం తనకు లేదంది బెబో. ఆ సినిమాలో విద్యాబాలన్ చక్కగా చేసిందని కితాబునిచ్చింది బాలీవుడ్ జీరో సైజ్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్. అయినా కమర్షియల్ సినిమాలంటేనే తనకు చాలా ఇష్టమంది. కెరీర్లో ‘దేవ్’, ‘చమేలీ’, ‘ఓంకార’ వంటి సినిమాలు చేశాను కదా అని చెప్పింది. తన అత్తగారు షర్మిలా ఠాగూర్ కూడా ‘అమర్ ప్రేమ్’, ‘మౌసమ్’ చిత్రాల్లో వేశ్య పాత్ర పోషించిన సంగతి గుర్తు చేసింది. -
ముద్దుగుమ్మకు 33 ఏళ్లు
సైఫ్ అలీఖాన్ అమృతాసింగ్‌ను తొలిసారి పెళ్లి చేసుకున్నప్పుడు.. అప్పటికి పదేళ్ల వయసున్న కరీనా కపూర్ వెళ్లి, 'కంగ్రాచ్యులేషన్స్ అంకుల్' అని చెప్పింది. తర్వాత కొంత కాలానికి.. అదే 'అంకుల్'ను పెళ్లి చేసుకుంది. హృతిక్ రోషన్‌ను లాంచ్ చేస్తూ భారీ స్థాయిలో 'కహో నా ప్యార్ హై' సినిమాలో అమీషా పటేల్‌కు బదులు.. కరీనా కపూర్‌ను హీరోయిన్గా లాంచ్ చేద్దామనుకున్నారు. కానీ, అందులో తాను చేస్తే.. తనకు పేరు రాదని, మొత్తం క్రెడిట్ అంతా హృతిక్ రోషన్కే వెళ్లిపోతుందని, అలాగే ఆ సినిమా తర్వాత తనకు పెద్దగా అవకాశాలు కూడా ఉండవని భావించి, అంత పెద్ద లాంచింగ్‌కు 'నో' చెప్పేసింది. అంతటి ధైర్యం ఆమె సొంతం. నటన ఆమె రక్తంలోనే ఉంది. తాత ముత్తాతల దగ్గర్నుంచి ప్రతి ఒక్కళ్లూ నటీనటులే. అలాంటి వంశంలో పుట్టి, స్వయంగా అక్క కరిష్మా కపూర్ నుంచి కూడా నట వారసత్వాన్ని అందిపుచ్చుకుని తెరంగేట్రం చేసిన కరీనా కపూర్.. అదే ప్రస్తుతం చెప్పుకోవాలంటే కరీనా కపూర్ ఖాన్ 33వ పుట్టిన రోజు చేసుకుంటోంది. 'జబ్ వుయ్ మెట్' లాంటి సినిమాల్లో అయితే.. అల్లరి అల్లరిగా తిరిగే చలాకీ పిల్లగా ఎంత అద్భుతంగా నటిస్తుందో.. పూర్తి స్థాయి పరిణతి సాధించి, ప్రేమలో విఫలమైన తర్వాత కళ్లతోనే సమస్త భావాలు పలికించే ఆరిందాలా కూడా అంతే అద్భుత ప్రదర్శన చూపించడం ఆమెకే సొంతం. కరీనా నటించిన మరికొన్ని చిత్రాల వివరాలివీ.. రెఫ్యూజీ (2000): కరీనాను అత్యంత అందంగా, అద్భుతమైన వ్యక్తిత్వంతో చూపించిన సినిమా.. రెఫ్యూజీ. దర్శకుడు జేపీ దత్తా తన స్నేహితుడు రణధీర్ కపూర్‌కు మాట ఇచ్చి.. కరీనాను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని విధంగా తెరముందుకు తీసుకొస్తానన్నారు. తన హామీ నిలబెట్టుకున్నారు. మొట్టమొదటి సీన్లో అభిషేక్ బచ్చన్ ఆమె ముఖం మీద నీళ్లు చల్లుతాడు. పాకిస్థాన్ సరిహద్దు నుంచి కుటుంబంతో వచ్చిన అమ్మాయి పాత్రలో కరీనా మళ్లీ అలనాటి నటీమణులు నూతన్, మధుబాల, నర్గీస్ లాంటి వాళ్ల నటనను గుర్తుచేసింది. నాటి నుంచి నేటి వరకు అప్రతిహతంగా 14 ఏళ్లుగా నటిస్తూనే ఉంది. అశోక (2001): రెఫ్యూజీ తర్వాత కరీనా నటించిన చిత్రమిది. సంతోష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెండి తెర మీద యుద్ధవీరగా కనిపిస్తుంది. షారుక్ ఖాన్‌తో నటించిన ప్రతి ఒక్క సీన్లోను తనలోని ఫైర్ మొత్తాన్ని రంగరించి చూపింది. చమేలీ (2004): రోడ్డుమీద నడుచుకుంటూ వర్షంలో నృత్యం చేస్తూ.. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తుల్లో అతిలోక సుందరిగా దర్శనమిచ్చే సినిమా ఇది. తనమీద తాను ఏమాత్రం జాలి చూపించకుండా.. అద్భుతాలు రంగరించి చూపే చిత్రం. దర్శకుడు సుధీర్ మిశ్రా ఈ చిత్రంలో కరీనా నటన చూసి ఎంతగా పడిపోయారంటే, మళ్లీ ఇదే చమేలీతో చేస్తానని ఎదురుచూశారు. యువ (2004): మణిరత్నం అంటేనే ప్రతి ఒక్కళ్ల దగ్గర్నుంచి నటనను పూర్తిస్థాయిలో పిండుకుంటాడు. భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచనలు లేకుండా.. సరదాగా, ఆడుతూ పాడుతూ తిరిగేసే అమ్మాయిగా నవరసాలను ఒలికించింది కరీనా. ఈ చిత్రంలో ఆమెలోని నటనా చాతుర్యం మొత్తం బయటపడిందంటారు. జయాబచ్చన్ ఈ చిత్రంలో కరీనా నటనకు ఫిదా అయిపోయారు. దేవ్ (2004): గోవింద నిహ్లానీ తీసిన ఈ చిత్రంలో 2002 గుజారత్ అల్లర్ల సమయంలో ఓ బేకరీలో 14 మంది మరణాన్ని కళ్లారా చూసిన జహీరా షేక్ పాత్రతో స్ఫూర్తి పొందిన పాత్రను కరీనా పోషించింది. జరా మరణాలకు సంబంధించి అత్యంత క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పాత్రలో జీవించింది. ఏమాత్రం మేకప్ వేసుకోకుండా.. కృత్రిమత్వానికి చాలా దూరంగా.. కెమెరా ముందు సజీవంగా నిలబడి చూపించింది. ఫిదా (2004): ఒకే సంవత్సరంలో వచ్చిన మూడో మణిపూస ఇది. ఇప్పటివరకు కరీనా తన నట జీవితంలో చేసిన ఏకైక నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర ఇది. కెన్ ఘోష్ తీసిన ఈ థ్రిల్లర్ చిత్రంతో కరీనా తన సరదాను తీర్చేసుకుంది. ఫర్దీన్ ఖాన్‌తో కలిసి.. షాహిద్ కపూర్‌ను ఆడుకునే సినిమా ఇది. కరీనాను నెగెటివ్ పాత్రలో ఊహించుకోవడం కష్టమే అయినా.. ఆ పనిని ఆమె సమర్థంగా నిర్వర్తించింది. ఓంకారా (2006): బాధితురాలి పాత్రలు కరీనాకు అంత సులభంగా రావు. షేక్స్పియర్ నాటకం 'ఒథెల్లో'లోని డెస్డెమోనా పాత్రను కరీనా పోషించిన తీరు నభూతో అని చెప్పుకోవాలి. అనుమానం భర్తకు భార్యగా ఆమె ఇందులో నటించింది. చిన్న వయసులోనే చాలా పెద్ద బాద్యతలను తలకెత్తుకుని చూపించింది. జబ్ వుయ్ మెట్ (2007): అసలు ఈ ఒక్క సినిమా చూస్తే చాలు.. కరీనా అంటే ఏంటో అర్థమైపోతుంది. పూర్తిగా మనసు పెట్టి చేస్తే కరీనా ఎంత గొప్ప నటి అన్న విషయం ఇందులో తెలిసిపోతుంది. ఓంకారా చిత్రంలో తన మౌనంతోనే అన్నీ పలికిస్తే.. ఈ సినిమాలో సుడిగాలిలా అందరినీ చుట్టేస్తుంది. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ యువకుడిని వ్యాపార సామ్రాజ్యాధినేతగా తన మాటలతో మార్చేస్తుంది. అలాంటి అమ్మాయి పక్కనుంటే చాలు.. ప్రపంచాన్నే జయించేస్తామని ప్రతి ఒక్కరూ అనుకుంటారు!! హీరోయిన్ (2012): మధుర్ భండార్కర్ తీసిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టి ఉండొచ్చు గాక.. కానీ పరిశ్రమలో ఒక హీరోయిన్ పరిస్థితి ఎలా ఉంటుందో.. కెరీర్లో ఎత్తు పల్లాలు మనిషిని ఎలా మార్చేస్తాయో, ఎంతకు దిగజారుస్తాయో, చివరికి ఏం చేస్తాయో ఎవరూ ఎప్పటికీ మర్చిపోలేనంతగా కరీనా చూపించింది. టాప్‌లో ఉన్నప్పటి పొగరు, అవకాశాల కోసం పరుగులు.. అన్నీ ఇందులో కనిపిస్తాయి. తలాష్ (2012): ఇన్ని రకాల పాత్రలు పోషించిన తర్వాత.. కరీనా అంతటి అందమైన అమ్మాయి దెయ్యం పాత్ర పోషించకపోతే ఎలా మరి? ఆ సరదా కూడా తలాష్ చిత్రంతో తీర్చేసుకుంది. విషాదభరితమైన గతం ఉన్న ఓ అమ్మాయి చనిపోయి దెయ్యం అయితే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. -
సైఫ్ ఖాన్ తో కరీనా మళ్లీ...
కార్గిల్, తషన్, ఖుర్పాన్, ఏజెంట్ వినోద్ చిత్రాల్లో సైఫ్, కరీనాల కెమిస్ట్రీ అభిమానులకు విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే మళ్లీ అదే ఊపును బాలీవుడ్ తెరపై కొనసాగించేందుకు కరీనా కపూర్ ఖాన్, సైఫ్ ఆలీ ఖాన్ జంట మళ్లీ ఓ ప్రత్యేక పాటలో కనిపించనున్నారు. బాలీవుడ్ లో సైఫీనాల మధ్య కెమిస్ట్రీకి మంచి డిమాండ్ ఉన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ ప్రత్యేక పాత్రకు ప్లాన్ చేస్తున్నారు. కరీనా, సైఫ్ ఆలీ ఖాన్ లు కలిసి మళ్లీ ఓ పాటలో నర్తించేందుకు సిద్దమయ్యారు. సైఫ్ ఆలీ ఖాన్ నటిస్తున్న హ్యాప్పీ ఎండింగ్ చిత్రంలో కరీనా ఓ ప్రత్యేక పాటలో నటించేందుకు ఓకే చెప్పిందట! ఈ చిత్రంలో కరీనాను ఓ పాటలో నటింపచేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఎలాంటి పాటలో కరీనాను చూపించాలనే విషయంపై ఇంకా ఓ అవగాహనకు రాలేదు. త్వరలోనే కరీనా పాట గురించి వివరాలు అందిస్తాం అని హ్యాపీ ఎండింగ్ దర్శకుడు రాజ్ నిడిమోరు తెలిపారు. ఇదిలా ఉండగా సైఫ్ ఆలీ ఖాన్, దినేష్ విజన్ సంయుక్తంగా నిర్మించే మరో చిత్రంలో కూడా కరీనా కపూర్ ప్రత్యేక పాత్రలో దర్శనమివ్వనున్నారు. ఇప్పటికే యూఎస్ లో జరిగిన షూటింగ్ లో కరీనా పాత్రను కొంత భాగం పూర్తి చేసినట్టు తెలిసింది.