
మూడు రోజుల్లో 25 కోట్లు!
ఈ రోజుల్లో మొదటి వారంలో ఎంత కలెక్షన్లు వచ్చాయన్నదాన్ని బట్టే సినిమాలు విజయవంతం అవుతున్నాయో లేదోనన్న విషయాన్ని లెక్కపెడుతున్నారు. అందులోనూ చాలావరకు సినిమాలు శుక్రవారం విడుదల అవుతాయి కాబట్టి ఆరోజు, శని ఆదివారాలు కలిపి మొదటి మూడు రోజుల్లో ఎంత కలెక్షన్ ఉందో చూసుకుంటున్నారు. కరీనా కపూర్ ఖాన్, అర్జున్ కపూర్ జంటగా వచ్చిన విచిత్ర వైవాహిక జీవిత చిత్రం 'కి అండ్ కా'. మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా కలెక్షన్లు రూ. 25 కోట్లు దాటేశాయి.
ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. తొలిరోజు శుక్రవారం నాడు రూ. 7.30 కోట్లు, శనివారం రూ. 8.41 కోట్లు, ఆదివారం రూ. 9.52 కోట్లు.. మొత్తం మొదటి వీకెండ్‌లో రూ. 25.23 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు చెప్పారు. ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయని, అర్బన్ సెంటర్లలోని అన్ని మల్టీప్లెక్సులలోను కలెక్షన్లు బాగున్నాయని తెలిపారు. 2016లో ఇప్పటివరకు విడుదలైన అన్ని సినిమాల్లోనూ ఇది మూడో అత్యధిక ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్ అని కూడా తరణ్ అన్నారు.
ఇక ఈ సినిమా విజయాన్ని కపూర్ హౌస్‌లో అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నట్లు అర్జున్ కపూర్ ట్వీట్ చేశాడు. తాము అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుక్కపిల్ల వీడియోను అర్జున్ కపూర్ అందులో పెట్టాడు.
That's how we celebrate the success of #KiAndKa at the Kapoor house !!! Maximus got the moves I say !!! pic.twitter.com/q9A07hVwAc
— Arjun Kapoor (@arjunk26) 4 April 2016