హీరోయిన్ కరీనా కపూర్ ఇప్పుడు యునిసెఫ్ (యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్) జాతీయ బ్రాండ్ అంబాసిడర్. ఈ అరుదైన ఘనత అందుకున్న కరీనా తాజాగా ఢిల్లీలోని ఈవెంట్‌లో పిల్లల గురించి మాట్లాడింది. 'పిల్లలు తండ్రి గురించే కాదు తల్లి చేసే పని గురించి కూడా ఆలోచిస్తారు.
నీతో ఉండాలనుందమ్మా
అంతేకాదు అమ్మ ఎప్పుడూ ఏదో ఒక పనితో బిజీగా ఉంటోందని ఒకింత గౌరవమిస్తారు. ఈ రోజు నా పిల్లలకు హాలీడే.. నేను కూడా వారితో కలిసుండాలని కోరుకున్నారు. కానీ నాకు పనుందని చెప్పి వచ్చేశాను. పెద్దబ్బాయి తైమూర్ అయితే.. నువ్వెప్పుడూ పనీపనీ అంటూ ఢిల్లీ, దుబాయ్ వెళ్తూ ఉంటావు.. నాకు నీతో ఉండాలనుందమ్మా అన్నాడు. మనసు చివుక్కుమంది. పని కూడా ముఖ్యమైనదే కాబట్టి వెళ్లక తప్పడం లేదని చెప్పాను.
మాటిచ్చాను
త్వరగా వచ్చేస్తానని, ఎక్కువ సమయం తనతో గడుపుతానని మాటిచ్చాను. అది నెరవేరుస్తాను కూడా.. అందుకే పిల్లలు వాళ్లను నిర్లక్ష్యం చేసినట్లుగా భావించరు. పేరెంట్స్ ఇద్దరూ వర్క్ చేసుకుని ఇంటికి వచ్చేస్తారని తైమూర్ అర్థం చేసుకుంటాడు. అలాగే పేరెంట్స్ నుంచే కొన్ని లక్షణాలు నేర్చుకుంటారు.
చివగా సూపర్ హిట్ మూవీలో..
సైఫ్ ఎప్పుడూ పిల్లల ముందు మనం ప్రేమగా, ఆప్యాయంగా మెదలాలని, అంతే ప్రేమగా మాట్లాడాలని చెప్తుంటాడు. మనల్ని చూసే వాళ్లు నేర్చుకుంటారన్నాడు. అందుకే మాలాగే నా పిల్లలిద్దరు కూడా ఎంతో ఆప్యాయంగా, గౌరవంగా మెదులుతారు అని చెప్పుకొచ్చింది. కరీనా చివరగా క్రూ సినిమాలో కనిపించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.
చదవండి: 'హీరోయిన్' సెట్‌లో అదృశ్యం.. స్నేహితులే శరీరాన్ని ముక్కలు చేసి..!
Comments
Please login to add a commentAdd a comment